15-12-2021 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఇల్లు గూలిన కష్టము లేలఁ గలుగు”(లేదా...)“కాపురమందుఁ గష్టము లిఁకన్ దరిజేరునె యిల్లు గూలినన్”
ఆరుబయటనువిశ్రాంతిహానికాదుమంచిగాలికిరోగముమాయమగునువేయివెలుగులఱేఁడులువెంటనుండ్రుఇల్లుగూలినకష్టములేలఁగలుగు
బాపురె! యేమి చెప్పుదును బాయకవచ్చుచు నుండె బాధలున్పాపుచు వచ్చుచున్న నవి పట్టియుపీడ యొనర్చుచుండె నీచీకటి యెట్లు మాయమయి చింతలుదీరు నటంచునెంచు నాకాపురమందు కష్టములికన్ దరిజేరునేయిల్లు గూలినన్.
నూతన గృహమున్ నిర్మింప పాతదైనయింటినిక కూల్చ దలచుచు నిచ్ఛతోడకూలివాండ్రను పిలిపించి కూల్చి వేయనిల్లుగూలిన గష్టము లేల కలుగు.
పాపపు కార్యముల్ సలుపు వారలు కారు పరస్పరమ్ము జాయాపతు లిర్వురున్ గలిసి హాయిగ నుండెడి కాలమందునన్ శాపమదేమొ చేరె నగచాటులు వెల్లువ రూపమందునన్ గాపుర మందు కష్టమునికన్ జేరునె యిల్లుగూలినన్.
వాస్తు దోషము గలదని పండితు డన గ్రొత్త గృహమును నిర్మించు గోర్కె తోడ పాత యింటిని పడగొట్ట వలసి నపుడు నిల్లు గూలిన గష్టము లేల గలుగు?
తాపసులైనదంపతులుదైవముకోరగలేదుభాగ్యముల్ఆపగపాపచింతలనుహంగులునడ్డమువచ్చునంచుగాకోపములేకనత్రిమునికోమలిగూడునుకోరలేదులేకాపురమందుఁగష్టములిఁకన్దరిణజేరునెయిల్లుగూలినన్అత్రిమహాముని, అనసూయలుదైవమువరమిచ్చిననునివాసమునుకోరలేదు. తపస్సునకుఇల్లుఆటంకమగుననివారిఅభిప్రాయముకాపురమందుఁగష్టములిఁకన్దరిఁజేరునెయిల్
వానలతిగ కురియ నేలుబడి యిడినవరద హెచ్చరికల విని వసతి మార్చ ,కొలది దినముల లోపల గ్రుంగు పాతయిల్లు గూలిన , కష్టము లేలఁ గలుగు
ఎన్నికష్టములెదురైన నింటియందునందరొకటిగనున్నచో నదియె మేలుకలతలన్నవి లేనట్టి కాపురమునఇల్లు గూలిన కష్టము లేలఁ గలుగు
గోపనమున్న గేహమున గూడి వశించును శాంతి సౌఖ్యముల్కోపము తాపముల్విడచి కూరిమి మీరగ నెల్ల వేళలన్ప్రాపుగనొండొరుల్మసల పండుగయేకద యింటియందు నాకాపురమందుఁ గష్టము లిఁకన్ దరిజేరునె యిల్లు గూలినన్
సర్వసంగపరిత్యాగి సాధుజనుడుపూటకొకచోటబసచేయుపుంగవునకుభిక్షపాత్రతో తారాడుభిక్షువునకుఇల్లు గూలిన కష్టము లేలఁ గలుగు
1.శకుని సుయోధనునితో.... తేటగీతిపాండవుల తుదముట్టింప పన్నినట్టివ్యూహమన్నది రారాజ! పొల్లుపోకకంబుధరుని కెరుకలేక కాలి లక్కయిల్లు గూలిన కష్టము లేలఁ గలుగు?2.రామాయణ పరంగా... ఉత్పలమాలచేపడి రామచంద్రునకు శ్రీహనుమంతుడు సీతజాడకైకోపము నందు వ్యూహమనఁ గ్రుంగగ ముఖ్య గృహాల ద్రొక్కుచున్పోపడ గాల్చినన్ బిదప పోరుకు నెంచుచుఁ జేరినంత లంకాపురమందుఁ, గష్టము లిఁకన్ దరిజేరునె యిల్లు గూలినన్!
అకట!భూకంపములు “టీ.వి”యందుఁజూచిభయముఁజెందుచు పడుకొనె శయనమందువాని భీతికిఁదగినట్లు స్వప్న మందుఇల్లు కూలిన,కష్టము లేల కలుగు.ప్రాపుగ నుండు నాయకుఁడె పాలనఁజేయుచు నుండెగాదె,యెన్నో పథకాలు వెట్టుచు నొహో!యని పేదలు మెచ్చు నట్టు,లక్కా!పురమందు కష్టము లిఁకన్ దరిఁజేరునె?యిల్లు కూలినన్బాపురె! కట్టియిచ్చునట!బాగుగ మెచ్చమె యీ ప్రభుత్వమున్ .
ఉత్పలమాల:నాపతి కష్టజీవి తను నాలుగురాళ్ళను వెన్క వేసి యే యాపద వచ్చినన్ సుతులు నాలియు దీనత చెందకుండ వీధిన్ బడకుండ జేసె, మగధీరుడు దక్షుడు వానిమ్రొక్కెదన్. “కాపురమందుఁ గష్టము లిఁకన్ దరిజేరునె యిల్లు గూలినన్”--కటకం వేంకటరామశర్మ.
ఓపని వర్షమందు, చలి యుగ్గడువై యసియాడ, గ్రీష్మసంతాపము లందు కుంది మొగి తాల్మి వహించుచు పూరిగీములోప్రాపు నొసంగు నీ నవనివాసము గట్టితిమట్లు నిప్పు, డాకాపురమందుఁ గష్టము లికన్ దరిజేరునె యిల్లు గూలినన్.కంజర్ల రామాచార్య.
తేటగీతి:కల్లుద్రావుచు ముప్రొద్దు నిల్లు విడచినాలి పుస్తెలు సొమ్ముల నమ్మివేసి వీధి యరుగుల దొర్లెడి 'బీరు'బలుని “కిల్లు గూలిన కష్టము లేలఁ గలుగు”--కటకం వేంకటరామశర్మ.
ఊపగ గాలివాన పెను యుప్పెన ముట్టిన కారణమ్ముతోరూపఱ నిల్లు గ్రామమున రోయుచు నుండ వసించు చోటుకైచూపుచు ప్రేమమున్ ప్రభుత సుందర మైన గృహమ్మునియ్యగాకాపురమందుఁ గష్టము లిఁకన్ దరిజేరునె యిల్లు గూలినన్
తేటగీతిచెల్లు చీటి నిచ్చి కుటుంబ జీవితముకుకల్లు ముంతలు త్రాగుచు కైపు నూగువానికి వడగళ్ల వఱద బాఱి ముంచఇల్లు గూలిన కష్టము లేల గలుగు.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
క్రొత్త భవనము లోనికి గూర్మి జేరిసుఖముగ బ్రదుకు సాగించు చుండ,పాతయిల్లు గూలిన కష్టము లేల గలుగుజింత జేయుడు సోదర శ్రేష్ఠులార!
నెమ్మి నుండుమ నీ వింక నిర్భయముగఁ గష్టములు తీరినవి నీకు దుష్టు వలన నీకు నీ వారి కిప్పుడు నీ విరోధి యిల్లు గూలిన కష్టము లేలఁ గలుగువే పుర మొండుఁ జేర వలెఁ బృథ్విని నవ్య గృహమ్ము నందఁగా నాపెడు వారు లేక నిర తాతత దారుణ దుష్ట కృత్యముల్ పాపులు సేయు చుండఁ బరిపాటిగ నిత్యము వెక్కసమ్ముగం గాపుర మందుఁ గష్టము లిఁకన్ దరిఁ జేరునె యిల్లు గూలినన్ [కా పురము = చెడ్డ పురము]
రేపులు మాపులున్ననక రెక్కలు ముక్కలు సేసిగట్టగా బ్రాపును నొంది బిట్టుగను భద్రత లేకను గూలిపోవగా గాపురమందు గష్టములికన్ దరిజేరునె యిల్లు గూలినన్ గాపురమందు దానికిట గష్టము లబ్బుటగాదు హేతువుల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సెలవు దినమున పిల్లలు చెట్టు కిందచేరి మట్టి తీసుకువచ్చి చిందులేసికట్టుకున్నటి చక్కని మట్టి బొమ్మరిల్లు గూలిన కష్టము లేలఁ గలుగు🌷గొర్రె రాజేందర్🌷 🏡సిద్దిపేట🏡
పాప వినాశకుండు హరి పాదములన్ నెర నమ్మి యుండగాకాపురమందుఁ గష్టము లిఁకన్ దరిజేరునె, యిల్లు గూలినన్రూపగు గాదె చక్కనగు లోగిలి వేరుగ సానుకూలమై లోపము గల్గనీడెపుడు లోకహితుండు నిజాశ్రితాళికిన్
బంధముల నిండుగానున్న బ్రతుకునందుమోహపాశములకులొంగబోక సతముదేవుని దరికి చేరెడి దేహమనెడి*ఇల్లు గూలిన కష్టము లేలఁ గలుగు”*
ఆరుబయటనువిశ్రాంతిహానికాదు
రిప్లయితొలగించండిమంచిగాలికిరోగముమాయమగును
వేయివెలుగులఱేఁడులువెంటనుండ్రు
ఇల్లుగూలినకష్టములేలఁగలుగు
బాపురె! యేమి చెప్పుదును బాయక
తొలగించండివచ్చుచు నుండె బాధలున్
పాపుచు వచ్చుచున్న నవి పట్టియు
పీడ యొనర్చుచుండె నీ
చీకటి యెట్లు మాయమయి చింతలు
దీరు నటంచునెంచు నా
కాపురమందు కష్టములికన్ దరిజేరునే
యిల్లు గూలినన్.
రిప్లయితొలగించండినూతన గృహమున్ నిర్మింప పాతదైన
యింటినిక కూల్చ దలచుచు నిచ్ఛతోడ
కూలివాండ్రను పిలిపించి కూల్చి వేయ
నిల్లుగూలిన గష్టము లేల కలుగు.
రిప్లయితొలగించండిపాపపు కార్యముల్ సలుపు వారలు కారు పరస్పరమ్ము జా
యాపతు లిర్వురున్ గలిసి హాయిగ నుండెడి కాలమందునన్
శాపమదేమొ చేరె నగచాటులు వెల్లువ రూపమందునన్
గాపుర మందు కష్టమునికన్ జేరునె యిల్లుగూలినన్.
వాస్తు దోషము గలదని పండితు డన
రిప్లయితొలగించండిగ్రొత్త గృహమును నిర్మించు గోర్కె తోడ
పాత యింటిని పడగొట్ట వలసి నపుడు
నిల్లు గూలిన గష్టము లేల గలుగు?
తాపసులైనదంపతులుదైవముకోరగలేదుభాగ్యముల్
రిప్లయితొలగించండిఆపగపాపచింతలనుహంగులునడ్డమువచ్చునంచుగా
కోపములేకనత్రిమునికోమలిగూడునుకోరలేదులే
కాపురమందుఁగష్టములిఁకన్దరిణజేరునెయిల్లుగూలినన్
అత్రిమహాముని, అనసూయలుదైవమువరమిచ్చిననునివాసమునుకోరలేదు.
తపస్సునకుఇల్లుఆటంకమగుననివారిఅభిప్రాయము
కాపురమందుఁగష్టములిఁకన్దరిఁజేరునెయిల్
వానలతిగ కురియ నేలుబడి యిడిన
రిప్లయితొలగించండివరద హెచ్చరికల విని వసతి మార్చ ,
కొలది దినముల లోపల గ్రుంగు పాత
యిల్లు గూలిన , కష్టము లేలఁ గలుగు
ఎన్నికష్టములెదురైన నింటియందు
రిప్లయితొలగించండినందరొకటిగనున్నచో నదియె మేలు
కలతలన్నవి లేనట్టి కాపురమున
ఇల్లు గూలిన కష్టము లేలఁ గలుగు
గోపనమున్న గేహమున గూడి వశించును శాంతి సౌఖ్యముల్
రిప్లయితొలగించండికోపము తాపముల్విడచి కూరిమి మీరగ నెల్ల వేళలన్
ప్రాపుగనొండొరుల్మసల పండుగయేకద యింటియందు నా
కాపురమందుఁ గష్టము లిఁకన్ దరిజేరునె యిల్లు గూలినన్
సర్వసంగపరిత్యాగి సాధుజనుడు
రిప్లయితొలగించండిపూటకొకచోటబసచేయుపుంగవునకు
భిక్షపాత్రతో తారాడుభిక్షువునకు
ఇల్లు గూలిన కష్టము లేలఁ గలుగు
1.శకుని సుయోధనునితో....
రిప్లయితొలగించండితేటగీతి
పాండవుల తుదముట్టింప పన్నినట్టి
వ్యూహమన్నది రారాజ! పొల్లుపోక
కంబుధరుని కెరుకలేక కాలి లక్క
యిల్లు గూలిన కష్టము లేలఁ గలుగు?
2.రామాయణ పరంగా...
ఉత్పలమాల
చేపడి రామచంద్రునకు శ్రీహనుమంతుడు సీతజాడకై
కోపము నందు వ్యూహమనఁ గ్రుంగగ ముఖ్య గృహాల ద్రొక్కుచున్
పోపడ గాల్చినన్ బిదప పోరుకు నెంచుచుఁ జేరినంత లం
కాపురమందుఁ, గష్టము లిఁకన్ దరిజేరునె యిల్లు గూలినన్!
అకట!భూకంపములు “టీ.వి”యందుఁజూచి
రిప్లయితొలగించండిభయముఁజెందుచు పడుకొనె శయనమందు
వాని భీతికిఁదగినట్లు స్వప్న మందు
ఇల్లు కూలిన,కష్టము లేల కలుగు.
ప్రాపుగ నుండు నాయకుఁడె పాలనఁజేయుచు నుండెగాదె,యె
న్నో పథకాలు వెట్టుచు నొహో!యని పేదలు మెచ్చు నట్టు,ల
క్కా!పురమందు కష్టము లిఁకన్ దరిఁజేరునె?యిల్లు కూలినన్
బాపురె! కట్టియిచ్చునట!బాగుగ మెచ్చమె యీ ప్రభుత్వమున్ .
ఉత్పలమాల:
రిప్లయితొలగించండినాపతి కష్టజీవి తను నాలుగురాళ్ళను వెన్క వేసి యే
యాపద వచ్చినన్ సుతులు నాలియు దీనత చెందకుండ వీ
ధిన్ బడకుండ జేసె, మగధీరుడు దక్షుడు వానిమ్రొక్కెదన్.
“కాపురమందుఁ గష్టము లిఁకన్ దరిజేరునె యిల్లు గూలినన్”
--కటకం వేంకటరామశర్మ.
ఓపని వర్షమందు, చలి యుగ్గడువై యసియాడ, గ్రీష్మసం
రిప్లయితొలగించండితాపము లందు కుంది మొగి తాల్మి వహించుచు పూరిగీములో
ప్రాపు నొసంగు నీ నవనివాసము గట్టితిమట్లు నిప్పు, డా
కాపురమందుఁ గష్టము లికన్ దరిజేరునె యిల్లు గూలినన్.
కంజర్ల రామాచార్య.
తేటగీతి:
రిప్లయితొలగించండికల్లుద్రావుచు ముప్రొద్దు నిల్లు విడచి
నాలి పుస్తెలు సొమ్ముల నమ్మివేసి
వీధి యరుగుల దొర్లెడి 'బీరు'బలుని
“కిల్లు గూలిన కష్టము లేలఁ గలుగు”
--కటకం వేంకటరామశర్మ.
ఊపగ గాలివాన పెను యుప్పెన ముట్టిన కారణమ్ముతో
రిప్లయితొలగించండిరూపఱ నిల్లు గ్రామమున రోయుచు నుండ వసించు చోటుకై
చూపుచు ప్రేమమున్ ప్రభుత సుందర మైన గృహమ్మునియ్యగా
కాపురమందుఁ గష్టము లిఁకన్ దరిజేరునె యిల్లు గూలినన్
తేటగీతి
రిప్లయితొలగించండిచెల్లు చీటి నిచ్చి కుటుంబ జీవితముకు
కల్లు ముంతలు త్రాగుచు కైపు నూగు
వానికి వడగళ్ల వఱద బాఱి ముంచ
ఇల్లు గూలిన కష్టము లేల గలుగు.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
క్రొత్త భవనము లోనికి గూర్మి జేరి
రిప్లయితొలగించండిసుఖముగ బ్రదుకు సాగించు చుండ,పాత
యిల్లు గూలిన కష్టము లేల గలుగు
జింత జేయుడు సోదర శ్రేష్ఠులార!
నెమ్మి నుండుమ నీ వింక నిర్భయముగఁ
రిప్లయితొలగించండిగష్టములు తీరినవి నీకు దుష్టు వలన
నీకు నీ వారి కిప్పుడు నీ విరోధి
యిల్లు గూలిన కష్టము లేలఁ గలుగు
వే పుర మొండుఁ జేర వలెఁ బృథ్విని నవ్య గృహమ్ము నందఁగా
నాపెడు వారు లేక నిర తాతత దారుణ దుష్ట కృత్యముల్
పాపులు సేయు చుండఁ బరిపాటిగ నిత్యము వెక్కసమ్ముగం
గాపుర మందుఁ గష్టము లిఁకన్ దరిఁ జేరునె యిల్లు గూలినన్
[కా పురము = చెడ్డ పురము]
రేపులు మాపులున్ననక రెక్కలు ముక్కలు సేసిగట్టగా
రిప్లయితొలగించండిబ్రాపును నొంది బిట్టుగను భద్రత లేకను గూలిపోవగా
గాపురమందు గష్టములికన్ దరిజేరునె యిల్లు గూలినన్
గాపురమందు దానికిట గష్టము లబ్బుటగాదు హేతువుల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసెలవు దినమున పిల్లలు చెట్టు కింద
రిప్లయితొలగించండిచేరి మట్టి తీసుకువచ్చి చిందులేసి
కట్టుకున్నటి చక్కని మట్టి బొమ్మ
రిల్లు గూలిన కష్టము లేలఁ గలుగు
🌷గొర్రె రాజేందర్🌷
🏡సిద్దిపేట🏡
పాప వినాశకుండు హరి పాదములన్ నెర నమ్మి యుండగా
రిప్లయితొలగించండికాపురమందుఁ గష్టము లిఁకన్ దరిజేరునె, యిల్లు గూలినన్
రూపగు గాదె చక్కనగు లోగిలి వేరుగ సానుకూలమై
లోపము గల్గనీడెపుడు లోకహితుండు నిజాశ్రితాళికిన్
బంధముల నిండుగానున్న బ్రతుకునందు
రిప్లయితొలగించండిమోహపాశములకులొంగబోక సతము
దేవుని దరికి చేరెడి దేహమనెడి
*ఇల్లు గూలిన కష్టము లేలఁ గలుగు”*