చిన్న వ్యాకరణ విశేషము: త్వరత్వరగా లో ర లఘువే యగును. త్వర యామ్రేడిత మైనది. త్వర తత్సమము చేయఁ బడినది కనుక. త్వరా: ఆ కారాంత స్త్రీ లింగ పదము. అది తెనుఁగున త్వర యయినది. సమస్త పదము చేసిన ‘అ’ కారాంత నపుంసక లింగము కాఁగలదు. స త్వరమ్ (సంస్కృతము) = సత్వరము (తెనుఁగు) వలె. త్వరాత్వరము = త్వర త్వర గా నున్నది. అప్పుడు రా సహజముగానే గురువు.
పతిరాకను విని ముదమున
రిప్లయితొలగించండిసతికి పరవశము కలుగగ సరస గతినితా
జత కూడదలచి రయమున్
వ్రతము ముగియ కుండ లేచె రమణి వడివడిన్
సత్యనారాయణ స్వామి వారి వ్తత కథలో ఐదవ ఆధ్యాయము కళావతి కధ. ఆధారముగా
రిప్లయితొలగించండిక్రతువుగ సప్తాహమ్మని
కృతిమతియే చెప్పుచుండ గేస్తుడు పిలువన్
ప్రతిరంభమించు నని భా
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్.
అతులంబగుదీక్షనపుడు
రిప్లయితొలగించండిసీతయదేవినికోలిచెనుతేజముతోడన్
పతిసుతులపోరువలనను
వ్రతమపముగియకుండలేచెరమణివడిన్
కందం
రిప్లయితొలగించండిజతగూడి జూదమునఁ బతి
సతతము నాలస్యమునకు సాకులు జెప్పన్
గుతగుతఁ జీపురుఁ గొని భా
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్!
చంపకమాల
జతఁగొని జూదమున్ వ్యసన ఛాయలఁ జిక్కుచు వీడి బాధ్యతల్
ప్రతిదినమల్లుచున్ కథలు భర్తయె సాకుల జెప్పుచుండ నా
చతురత జాలుచాలనుచు సత్యమెఱింగియు చీపురెత్తి భా
రతము ముగించకుండనె త్వరత్వరగా సతి లేచె నిమ్ములన్!
జత గూడియు సఖియలతో
రిప్లయితొలగించండిసుతి మెత్తని రీతి గాగ శోభించు కథన్
పతి వివరించెడు తరి భా
రతము ముగియ కుండ లేచె రమణి వడి వడి న్
రిప్లయితొలగించండివ్రతముగ నేడురోజులట పండుగ వేడ్కలొ భాగమంచు దు
ష్కృతములు తీరిపోవునని చెప్పుచు నింపుగ సుప్రలాపమున్
గృతిమతి చెప్పువేళ తన గేస్తుడు రమ్మని పిల్చినంత భా
రతము ముగించకుండనె త్వరత్వరగా సతి లేచె నిమ్ములన్.
కుతుకముగా హరికథవిన
రిప్లయితొలగించండినతివజనెను మందిరమునకంతట చినుకుల్
సతమత మొనరింపగ భా
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅతిగాప్రేమించినవా
రిప్లయితొలగించండినితో వివాహము మగువకు నిశ్చయమవగా
నతనిని పెండ్లాడగ మూ
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్
పతి సతతము బొంకెడు భా
రిప్లయితొలగించండిరతము ముగియకుండ , లేచె రమణి వడివడిన్
సుతునకు భోజన మమరుచు
తతంగ మింకను కలదను తలపు గలుగగన్
అతికుతుకంబుగా నతివ యాలయమందున చెప్పుచున్న భా
రిప్లయితొలగించండిరతమును భక్తితో మనమురంజిలగా విననేగె నింతలో
సతమతమొందగాజనులు సన్నగ వర్షము గుర్వజొచ్చె భా
రతము ముగించకుండనె త్వరత్వరగా సతి లేచె నిమ్ములన్
అతివలుఁజేరి యొక్కయెడ నచ్చట ముచ్చటలాడు వేళలో
రిప్లయితొలగించండివ్రతములు నోములున్ మఱియు వంటలు చీరలు టీ.సీరియల్స్
పతుల మనోగతంబులును వర్ణనఁజేయుచునుండ,చేటభా
రతము ముగించకుండనె త్వరత్వరగా సతిలేచెనిమ్ములన్.
పతి మద్యము సేవించియు
నతిగా మాటాడుచుండ నందఱు నవ్వన్
వెతనాయనర్ధమగు భా
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్.
పై పద్యము రెండవ పాదము చివర “టీ.వి.యని సవరించుకొన
రిప్లయితొలగించండిచదువ ప్రార్ధన.
కందం
రిప్లయితొలగించండిసతతము కార్యాలయ బా
ధ్యతన మునిగిన పడతికిని త్వరితగతిన జే
య తగ పని స్పురణ రాగ సు
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
సతతమ్ము పఠించుటలో
రిప్లయితొలగించండిరతి నూను నలిన దళాక్షి రయమున రాఁగన్
సుతుఁడు బడి నుండి యా భా
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్
అతుల పతివ్రతా మణికి నాత్మ ధవుండు సుదూర మేఁగఁగా
వితతము మీఱ డెందమున వెక్కసమై విరహమ్ము భర్తఁ గాం
చి తరుణి హర్ష మంది యెద శీఘ్రమ యప్పుడు చేయు చున్న యా
వ్రతము ముగింపకుండనె త్వరాత్వర మా సతి లేచె నిమ్ములన్
చిన్న వ్యాకరణ విశేషము:
తొలగించండిత్వరత్వరగా లో ర లఘువే యగును. త్వర యామ్రేడిత మైనది.
త్వర తత్సమము చేయఁ బడినది కనుక. త్వరా: ఆ కారాంత స్త్రీ లింగ పదము. అది తెనుఁగున త్వర యయినది.
సమస్త పదము చేసిన ‘అ’ కారాంత నపుంసక లింగము కాఁగలదు.
స త్వరమ్ (సంస్కృతము) = సత్వరము (తెనుఁగు) వలె.
త్వరాత్వరము = త్వర త్వర గా నున్నది.
అప్పుడు రా సహజముగానే గురువు.
గతిదప్పిన రాజామణి
రిప్లయితొలగించండిరతిలోనన్మునిగీ యుండి రంజిలు చుండన్
బతిదేవుని రాకను గని
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్
సుతులటులెరుగకనదటున
రిప్లయితొలగించండిపితరునెదిరి నిలిచిరంచు విని కలఁకువతో
నతిముఖ్యంబౌ దేవీ
వ్రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్
(సీతాదేవి రామ లవకుశ యుద్ధం నివారించేందుకు వెడలిన సందర్భం)
గతులను దప్పి నిత్యమును గామము దీర్చగ బ్రక్కవానితో
రిప్లయితొలగించండిరతమును జేయుచుండుచును రంజిలుచుండగ నొక్క రోజునన్
పతియగు రామభూపతి ప్రభాతము నందు రాక జూచుటన్
రతము ముగించకుండనె త్వరత్వరగా సతిలేచె నిమ్ములన్
పతి పరదేశంబేగ కు
రిప్లయితొలగించండిమతియై చెలికాని గూడ మంచముపై నుం
డ తలుపు చప్పుడు వినబడి
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్
సతతము భర్త సేవలను చక్కగ జేయుచు చిత్తశుద్ధితో
రిప్లయితొలగించండిస్తుతమతితో పఠించుచును చొక్కుచు కృష్ణుని లీలనానుచున్
మతి గడు మోదమున్ గొనెడి మానిని భర్త గృహమ్ము చేర భా
రతము ముగించకుండనె త్వరత్వరగా సతి లేచె నిమ్ములన్