19-2-2024 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దేహ మున్నంత వఱకు సందేహముండు”(లేదా...)“దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్”(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)
మాయగప్పినజీవికిమరులుగలుగువలనుజిక్కినచేపయైవరలుచుండుమర్మమేరీతిదెలియునోమగతయందుదేహమున్నంతవఱకుసందేహముండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మోహంబందుచుసృష్టిలోజనుఁడు తామున్గున్గదాసౌఖ్యమున్ఆహాయంచునునాలిబిడ్డగని నయ్యాకాలసౌఖ్యంబుతోగ్రాహంబైజను కానడీబ్రదుకువేగాలంగకాలాగ్నిలోదేహంబుండెడిదాకనుండుగద సందేహంబులీదేహికిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములుగురువుగారు
నయ్యాకాలమైశ్వర్యమే
పుట్టినప్పటి నుండియు పుణ్యలోకప్రాప్తినొందగ దగునని పలుకుచుండమరణమొంద నేమగునని మానవులకుదేహ మున్నంత వఱకు సందేహముండు
జనన మరణాలు సహజమై చను న టంచుమనుజ జీవిత మొక రీతి మాయ యనుచుదేహ మున్నంత వ ఱ కు సందేహ ముండు తీరు మార్గము నెవ్వరు దెలుప గలరు?
చావు పుట్టుక సత్యము జగతిలోనఉన్నదా పునర్జన్మమీ యుర్విలోన?నౌన కాదను వారుల గనిన యపుడుదేహమున్నంత వరకు సందేహముండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వారల గనిన...'
పలువురు కలడనుచు చెప్పు ప్రాణయోనిపిలిచిన పలుకడయ్యెను వేదనలను మనవి జేయుటెట్టులయని మనుజులకిలదేహ మున్నంత వఱకు సందేహముండు,ఆహార్యమ్మును బట్టి యుండవిలలో వ్యక్తిత్వ మంచార్యులే సౌహార్ద్యమ్మున హెచ్చరించి రెపుడో సన్మిత్రులన్ నాడిలన్ స్నేహార్థుండ్రమటంచు చేరు జనులన్ నేనింక నమ్మేదెటుల్ దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తేటగీతిద్రోణగురునంది విద్యల రోసి మిగులకృష్ణమూర్తి సత్సాంగత్య దృష్టి మెదలిక్రీడి మోహమొందెను! బాపు గీతలేకదేహ మున్నంత వఱకు సందేహముండుశార్దూలవిక్రీడితమువ్యూహమ్ముల్ వివరించి విద్యలఁదగన్ బొందింప ద్రోణుండు, దాసోహమ్మౌచును శౌరికిన్ విజయుఁడే శోభించి రాణించినన్మోహమ్మొందె రణాన, గీత గెలువన్ బోధించె! లేకున్నచోదేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
శా.రాహిత్యమ్మె మదిన్ దురాశ, జనులన్ రక్షింప సన్మార్గమున్?దాహంబుం దనివిన్ విలాసిని మెయిన్ దక్కించునా జాయగా?మోహంబున్ భజనావృతంబు గుడులే ముక్తంబు గావించునా?*దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్!*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
దేహమొప్పుఁ జీవాత్మకు గేహమనగదాహమనివార్యమేకద దేహమునకుదేహమున్నంత వఱకు వ్యామోహముండుదేహ మున్నంత వఱకు సందేహముండుదేహంబొప్పును గేహమై కనుగొనన్ దీపించు జీవాత్మకున్దాహంబే నిరతంబు దేహికెపుడున్ దక్కించగా ప్రాణమున్మోహంబుండును గాదె మానవునికిన్ మోక్షంబునేకోరినన్దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్
ధన్యవాదాలు గురూజీ 🙏
ఆహా యెన్నివిచిత్రముల్ జగతిలో నాశ్చర్యమున్ గొల్పవేయూహాతీతము దైవచేష్టితములీ యుర్వీతలం బందునందాహారమ్ము నొసంగు దాటరికి తా నశ్మమ్ములో నుండగన్దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్
తే॥ మోక్షమార్గము వెదుకుట మోదమైనద్వైతమా లేక నరయ నద్వైతమగునఘనుఁడు రామానుజుల బోధఁ గనుట ముదమొదేహ మున్నంతవరకు సందేహముండుశా॥ సోహంబే తగు మోక్ష మార్గమగునో శోభస్కరంబౌనొ దాసోహంబే భువిలో మురారినిఁ గనన్ జొక్కంపు దారెద్దియోమోహంబున్ విడనాడ సాధ్య మగునో మోక్షంబు సిద్ధించునోదేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్
అశ్మమున కప్పకెవ్వఁడాహారమిచ్చుగర్భమందున్న శిశువును గాఁచునెవరుదేహ మున్నంత వఱకు సందేహముండుభవుని లీలలు తెలియగ నెవరి తరము
తే.గీ:దేహ మన దహ్యమే యని తెలియు గానిదాని యుద్భవమునకును,దాని మృతికినేది కారణమో, గమ్య మేదొ యనుచుదేహ మున్నంత వరకు సందేహ ముండు
ధన్యవాదం గురువు గారు!
శా:"దేహం బెట్టుల బొందె నాత్మ? మరి ముక్తిన్ బొందు టెట్లో? అవిద్యాహంకారము లెట్లు గల్గె?తిరమౌ నానంద మెట్లంచు నీదేహం బుండెడి దాక నుండు గద సందేహమ్ము లీ దేహికిన్సోహం సాధన తోనె సత్య మెరుగన్ శోధించుమా మౌని వై.
తెలియక చిఱుత ప్రాయముఁ దెలియ గోరునెదుగు వేళనన్నిట బుద్ధినెదుగ గోరుముదిమిని వెదకు ఙ్ఞానమపూర్వ రీతిదేహమున్నంత వరకు సందేహముండు
జనన మాదిగా జనులకు జగతి యందుచింతనమ్ములుహెచ్చుచుజీవతమునకలుగుచుండునుతప్పకకడవరకునుదేహమున్నంత వరకు సందేహముండు.మోహానందములోనమున్గుచుసతంబున్మూఢులౌచున్జనుల్యాహాహాయనుచున్జనాళితిరుగన్ యాలోచనాశూన్యులైసోహమ్మంచునుమాటిమాటికిలలో శోచించుసత్సాధుకున్*“దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్”*
జగతి నడపించు నెవ్వండు సతము నంచు నెట్లు జీవ రాసులు జనియించె నంచు భూమి కున్నట్టి యాధార మేమి యనుచు దేహ మున్నంత వఱకు సందేహ ముండు ఆహా యాత్మకు స్వీయ కర్మ ఫల భోగానేక జన్మమ్ములే శ్రీహర్యాజ్ఞఁ జెలంగు చుండ నకటా చిత్రాతి చిత్రమ్ములై బాహాటమ్ముగ నగ్నిఁ గాల్చు దనుకన్ భద్రమ్ముగా ధాత్రినిన్ దేహం బుండెడి దాక నుండు గద సం దేహంబు లీ దేహికిన్ [దాక = తొట్టి (దాఁక = వఱకు): సం దేహములు = మంచి దేహములు]
ఎన్ని గ్రంధముల్ సదివిన నెన్ని వినినఁ ప్రాణ వాయుపు టునికిని బదిల పఱచుమార్గ మేదియో యెఱుఁగుట మానవునకు దేహ మున్నంత వఱకు సందేహముండు
దేహంబందున నుండు జీవుఁడునునాదేవాల యంబందునన్ బాహాటంబుగ నుండు దేవునిగఁదాపారంబులీయంగనౌ నాహా యేమిది సత్యమే యగునెపోనాశ్చర్యముంగల్గునా?దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. చదువు కొనెడు విద్యార్ధికి శంకలుండుసందియములుండు నెంతగా చదువుకున్నశాస్త్రముల్ జదివిన గాని శంకలుండుదేహమున్నంత వరకు సందేహముండు.
సమస్యని ఇలా ఇస్తే ఇంకా బాగుండేది.దేహమ్ముల్ పలు గల్గుచుండు గద యీ దేహమ్ము తో నుండగన్అప్పుడు పైన సం చేర్చుకొని పూరించాలి.లేక యథాతథం గా కూడా పూరించ వచ్చు.
మాయగప్పినజీవికిమరులుగలుగు
రిప్లయితొలగించండివలనుజిక్కినచేపయైవరలుచుండు
మర్మమేరీతిదెలియునోమగతయందు
దేహమున్నంతవఱకుసందేహముండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమోహంబందుచుసృష్టిలోజనుఁడు తామున్గున్గదాసౌఖ్యమున్
రిప్లయితొలగించండిఆహాయంచునునాలిబిడ్డగని నయ్యాకాలసౌఖ్యంబుతో
గ్రాహంబైజను కానడీబ్రదుకువేగాలంగకాలాగ్నిలో
దేహంబుండెడిదాకనుండుగద సందేహంబులీదేహికిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములుగురువుగారు
తొలగించండినయ్యాకాలమైశ్వర్యమే
రిప్లయితొలగించండిపుట్టినప్పటి నుండియు పుణ్యలోక
రిప్లయితొలగించండిప్రాప్తినొందగ దగునని పలుకుచుండ
మరణమొంద నేమగునని మానవులకు
దేహ మున్నంత వఱకు సందేహముండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజనన మరణాలు సహజమై చను న టంచు
రిప్లయితొలగించండిమనుజ జీవిత మొక రీతి మాయ యనుచు
దేహ మున్నంత వ ఱ కు సందేహ ముండు తీరు మార్గము నెవ్వరు దెలుప గలరు?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచావు పుట్టుక సత్యము జగతిలోన
రిప్లయితొలగించండిఉన్నదా పునర్జన్మమీ యుర్విలోన?
నౌన కాదను వారుల గనిన యపుడు
దేహమున్నంత వరకు సందేహముండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వారల గనిన...'
రిప్లయితొలగించండిపలువురు కలడనుచు చెప్పు ప్రాణయోని
పిలిచిన పలుకడయ్యెను వేదనలను
మనవి జేయుటెట్టులయని మనుజులకిల
దేహ మున్నంత వఱకు సందేహముండు,
ఆహార్యమ్మును బట్టి యుండవిలలో వ్యక్తిత్వ మంచార్యులే
సౌహార్ద్యమ్మున హెచ్చరించి రెపుడో సన్మిత్రులన్ నాడిలన్
స్నేహార్థుండ్రమటంచు చేరు జనులన్ నేనింక నమ్మేదెటుల్
దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిద్రోణగురునంది విద్యల రోసి మిగుల
కృష్ణమూర్తి సత్సాంగత్య దృష్టి మెదలి
క్రీడి మోహమొందెను! బాపు గీతలేక
దేహ మున్నంత వఱకు సందేహముండు
శార్దూలవిక్రీడితము
వ్యూహమ్ముల్ వివరించి విద్యలఁదగన్ బొందింప ద్రోణుండు, దా
సోహమ్మౌచును శౌరికిన్ విజయుఁడే శోభించి రాణించినన్
మోహమ్మొందె రణాన, గీత గెలువన్ బోధించె! లేకున్నచో
దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిశా.
రిప్లయితొలగించండిరాహిత్యమ్మె మదిన్ దురాశ, జనులన్ రక్షింప సన్మార్గమున్?
దాహంబుం దనివిన్ విలాసిని మెయిన్ దక్కించునా జాయగా?
మోహంబున్ భజనావృతంబు గుడులే ముక్తంబు గావించునా?
*దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్!*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదేహమొప్పుఁ జీవాత్మకు గేహమనగ
రిప్లయితొలగించండిదాహమనివార్యమేకద దేహమునకు
దేహమున్నంత వఱకు వ్యామోహముండు
దేహ మున్నంత వఱకు సందేహముండు
దేహంబొప్పును గేహమై కనుగొనన్ దీపించు జీవాత్మకున్
దాహంబే నిరతంబు దేహికెపుడున్ దక్కించగా ప్రాణమున్
మోహంబుండును గాదె మానవునికిన్ మోక్షంబునేకోరినన్
దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఆహా యెన్నివిచిత్రముల్ జగతిలో నాశ్చర్యమున్ గొల్పవే
రిప్లయితొలగించండియూహాతీతము దైవచేష్టితములీ యుర్వీతలం బందునం
దాహారమ్ము నొసంగు దాటరికి తా నశ్మమ్ములో నుండగన్
దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితే॥ మోక్షమార్గము వెదుకుట మోదమైన
రిప్లయితొలగించండిద్వైతమా లేక నరయ నద్వైతమగున
ఘనుఁడు రామానుజుల బోధఁ గనుట ముదమొ
దేహ మున్నంతవరకు సందేహముండు
శా॥ సోహంబే తగు మోక్ష మార్గమగునో శోభస్కరంబౌనొ దా
సోహంబే భువిలో మురారినిఁ గనన్ జొక్కంపు దారెద్దియో
మోహంబున్ విడనాడ సాధ్య మగునో మోక్షంబు సిద్ధించునో
దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఅశ్మమున కప్పకెవ్వఁడాహారమిచ్చు
రిప్లయితొలగించండిగర్భమందున్న శిశువును గాఁచునెవరు
దేహ మున్నంత వఱకు సందేహముండు
భవుని లీలలు తెలియగ నెవరి తరము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే.గీ:దేహ మన దహ్యమే యని తెలియు గాని
రిప్లయితొలగించండిదాని యుద్భవమునకును,దాని మృతికి
నేది కారణమో, గమ్య మేదొ యనుచు
దేహ మున్నంత వరకు సందేహ ముండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదం గురువు గారు!
తొలగించండిశా:"దేహం బెట్టుల బొందె నాత్మ? మరి ముక్తిన్ బొందు టెట్లో? అవి
రిప్లయితొలగించండిద్యాహంకారము లెట్లు గల్గె?తిరమౌ నానంద మెట్లంచు నీ
దేహం బుండెడి దాక నుండు గద సందేహమ్ము లీ దేహికిన్
సోహం సాధన తోనె సత్య మెరుగన్ శోధించుమా మౌని వై.
తెలియక చిఱుత ప్రాయముఁ దెలియ గోరు
రిప్లయితొలగించండినెదుగు వేళనన్నిట బుద్ధినెదుగ గోరు
ముదిమిని వెదకు ఙ్ఞానమపూర్వ రీతి
దేహమున్నంత వరకు సందేహముండు
జనన మాదిగా జనులకు జగతి యందు
రిప్లయితొలగించండిచింతనమ్ములుహెచ్చుచుజీవతమున
కలుగుచుండునుతప్పకకడవరకును
దేహమున్నంత వరకు సందేహముండు.
మోహానందములోనమున్గుచుసతంబున్మూఢులౌచున్జనుల్
యాహాహాయనుచున్జనాళితిరుగన్ యాలోచనాశూన్యులై
సోహమ్మంచునుమాటిమాటికిలలో శోచించుసత్సాధుకున్
*“దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్”*
జగతి నడపించు నెవ్వండు సతము నంచు
రిప్లయితొలగించండినెట్లు జీవ రాసులు జనియించె నంచు
భూమి కున్నట్టి యాధార మేమి యనుచు
దేహ మున్నంత వఱకు సందేహ ముండు
ఆహా యాత్మకు స్వీయ కర్మ ఫల భోగానేక జన్మమ్ములే
శ్రీహర్యాజ్ఞఁ జెలంగు చుండ నకటా చిత్రాతి చిత్రమ్ములై
బాహాటమ్ముగ నగ్నిఁ గాల్చు దనుకన్ భద్రమ్ముగా ధాత్రినిన్
దేహం బుండెడి దాక నుండు గద సం దేహంబు లీ దేహికిన్
[దాక = తొట్టి (దాఁక = వఱకు): సం దేహములు = మంచి దేహములు]
ఎన్ని గ్రంధముల్ సదివిన నెన్ని వినినఁ
రిప్లయితొలగించండిప్రాణ వాయుపు టునికిని బదిల పఱచు
మార్గ మేదియో యెఱుఁగుట మానవునకు
దేహ మున్నంత వఱకు సందేహముండు
రిప్లయితొలగించండిదేహంబందున నుండు జీవుఁడునునాదేవాల యంబందునన్
బాహాటంబుగ నుండు దేవునిగఁదాపారంబులీయంగనౌ
నాహా యేమిది సత్యమే యగునెపోనాశ్చర్యముంగల్గునా?
దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
చదువు కొనెడు విద్యార్ధికి శంకలుండు
సందియములుండు నెంతగా చదువుకున్న
శాస్త్రముల్ జదివిన గాని శంకలుండు
దేహమున్నంత వరకు సందేహముండు.
సమస్యని ఇలా ఇస్తే ఇంకా బాగుండేది.
రిప్లయితొలగించండిదేహమ్ముల్ పలు గల్గుచుండు గద యీ దేహమ్ము తో నుండగన్
అప్పుడు పైన సం చేర్చుకొని పూరించాలి.లేక యథాతథం గా కూడా పూరించ వచ్చు.