18, మే 2024, శనివారం

సమస్య - 4768

19-5-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాఘవుని నస్యమడిగెను రావణుండు”

(లేదా...)

“నస్యంబిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్”

16 కామెంట్‌లు:

  1. తేటగీతి
    రామ రావణ నాటక రంగమందు
    పాత్ర ధారులు యొకపరి వాదులాడి
    సొలసిపోయి యుండగ వారి సోయ మరువ
    రాఘవుని నస్యమడిగెను రావణుండు

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  2. నగరిలొ ప్రదర్శించెడు నాటకమున
    తెర వెనుక జరుగునది తెలుసుకొనగ
    ఇంగము కలుగె నప్పుడు, నేలననగ
    రాఘవుని నస్యమడిగెను రావణుండు

    రిప్లయితొలగించండి

  3. రామ రావణ పాత్రలన్ రమ్యముగను
    సతము ధరియించు నటులట సంబరమున
    జేరి మాటాడు సమయాన స్నేసితుడగు
    రాఘవుని నస్యమడిగెను రావణుండు.


    దస్యుండ్రై నటియింపనేమి గన నందంతుండ్రె వారిద్ధరున్
    లాస్యంబందున డస్సి చేరిరట విశ్రాంతమ్ముకై యచటన్
    హాస్యంబాడుచు చేయిచాచెను దురభ్యాసమ్మదే కావునన్
    నస్యంబిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్.

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. ॥ హాస్యమనఁగ నందరు మెచ్చి యవధరించి
      మోదమందుదు రంచును మెలకువఁ గని
      వీధి నాటకపు నడుమ భీమరమున
      రాఘవుని నస్యమడిగెను రావణుండు

      శా॥ హాస్యంబన్నను మోదమందుదురనిన్ హాస్యమ్ముఁ బండించఁగన్
      దస్యుండైనను వీధి నాటకమునన్ దౌష్ట్యమ్మునే చూపకన్
      హాస్యమ్మున్ గన భీమరమ్మునను విన్యాసమ్ములన్ జేయుచున్
      నస్యంబిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్

      తొలగించండి
  5. తేటగీతి
    శౌరి రాముడన్ సత్యము సతియె పల్కి
    లక్ష్మి సీతమ్మ యంచు వీడమనినఁ గడు
    మూర్ఖుఁడై యనిఁగొని వైమపూర్వకముగ
    రాఘవుని నస్యమడిగెను రావణుండు

    (వైమవస్యము=విమనోభావము, దుఃఖమునొందిన మనసుగలవాని తనము)


    శార్దూలవిక్రీడితము
    ఆస్యంబారసి లక్ష్మిగన్ గుజను దా నారాధ్యగానెంచి యా
    లస్యంబించుక సేయకుండ బనుపన్ లాభంబనన్ బూర్వ యే
    నస్యంబైన ప్రబోధమై వినక జన్యంబెంచుచున్ దా నమా
    నస్యంబిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్

    (అమానస్యము= దుఃఖము)

    రిప్లయితొలగించండి
  6. నస్యమును కడుపీల్చెడి నాయకుండు
    తెలుగు నాటక రంగాన వెలుగువాడు
    నాటకంబని మరచెనా నాడు చూడ
    రాఘవుని నస్యమడిగెను రావణుండు

    సస్యశ్యామలదేశమందు నొకడై సన్మార్గుడౌ శ్రేష్ఠుడే
    నస్యంబున్ గడుపీల్చు చుండెనకటా నవ్యాంధ్ర లోపౌరుడై
    హాస్యమ్మే యిది నాటకాన ఘటనే హాహాయనన్ బ్రేక్షకుల్
    నస్యంబిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్

    రిప్లయితొలగించండి
  7. నస్య మలవాటు గల్గిన నటులు వారు
    వీధి నాటక మం దున వింతగాను
    రాఘవుని నస్య మడిగెను రావణుండు జనులు కడుపుబ్బ నవ్విరి చకి తు లగుచు

    రిప్లయితొలగించండి
  8. ఆస్యంబందున హావభావముల నుత్సాహంబుగా జూపుచున్
    హాస్యోక్తుల్ వెలయించుచున్ నటనమందభ్యాసముం జేయుచున్
    నస్యంబందు నమేయమౌ పిరముతో నానన్ దిగఁద్రావుచున్
    నస్యంబిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్

    రిప్లయితొలగించండి
  9. రామ రావణ పాత్రధారణమునందు
    మేటి నటులిర్వురికెవరు సాటిరారు
    నాటకము నభ్యసించు దినమ్మునందు
    రాఘవుని నస్యమడిగెను రావణుండు

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:యజ్ఞమున్ జేసె రాము నశ్యమ్ము కొరకు
    నశ్య మన బోవ తప్ప మంత్రమ్ము కూడ
    రాఘవుని నస్యమడిగెను రావణుండు”
    నస్యమే దక్కి రావణు నాశ మయ్య
    (రావణుడు యుద్ధం లో ఒక యాగ మైతే చేశాడు.అక్కడ రాముని నశ్యం అనగా నాశనం అడగ బోయి నస్యం అడిగాడు.అందుకే రాముడు నశించ లేదు.యజ్ఞం లో రావణుడికి ముక్కు పొడుం మాత్రమే దక్కింది.)

    రిప్లయితొలగించండి
  11. శా:హాస్య మ్ముండెడు తోలుబొమ్మ కథలం దాశ్చర్య మౌ రీతి,సా
    రస్య మ్మేర్పడ,రాక్షసాళిని వడిన్ రక్షింప గా భృత్యులన్
    నస్యంబిమ్మని రావణుం డడిగె ,విన్నాణంబుగా రామునిన్
    నస్య మ్మట్టుల నల్పు మార్గము గనంగా మేధకున్ క్లిష్టమై.
    (తోలుబొమ్మలాటల రామాయణాలలొ హాస్యం ఉంటుంది.తన సేనని రక్షించుకోటానికి,రాముణ్ని నస్యం లాగా నలిపెయ్యటానికి మార్గం తోచక కాస్త నస్యం ఇవ్వండి అని సేవకుల్ని అడిగాడు. ఆ అలవాటు ఉన్న వాడికి బుర్ర పనిచెయ్యనప్పుడు అది కావాలి.)

    రిప్లయితొలగించండి
  12. సస్యశ్యామలమా పురంబు కళలున్ సస్యంబులై యుండు మేల్
    సస్యంపుత్పతులేగు నల్దిశలకున్ సాగించు వ్యాపార మా
    లస్యంబూసులు లేక నాటకపు వేళందున్ రహస్యంబుగన్
    నస్యంబిమ్మని రావణుండడిగె విన్నాణంబుగా రామునిన్

    రిప్లయితొలగించండి
  13. అగ్రహారవాసు లిరువు రనుఁగు సఖులు
    వంత సెంద రన్నమ్మును బడయ కున్న
    ముక్కు లోనఁ బడక యున్న మూరు వంత
    రాఘవుని నస్య మడిగెను రావణుండు


    అంగద రాయబారమున రావణుఁడు పలికి నట్టుల నూహాజనితము:

    దాస్యం బీ వొనరింపు మింపుగ నెడందన్ సంధి నీవెంచినన్
    దస్యా రాఘవ వేఁడి వే శరణు ప్రాణమ్ముల్ వరింతేని యా
    లస్యం బింత యొనర్ప కెంచి నిజ కర్తవ్యమ్ము స్వీయానుజా
    నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్

    [నస్యము = నాసికకు సంబంధించిన ఖండము]

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    నస్యమలవాటు గల్గిన నటులిరువురు
    రామునిగను మరియొకడు రావణునిగ
    వేయుచును నాటకమునకు పిదప కలియ
    రాఘవుని నస్యమడిగెను రావణుండు.

    రిప్లయితొలగించండి