16-6-2024 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు”(లేదా...)“అసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో”
తేటగీతిబంటన నడుచు వెంట 'రాబర్టు కుక్కు'పిలుచు 'కుక్క' గ యజమాని, పలుకు బంటు!భావి సూచన విన్నట్టి ప్రభువు సెప్పె, "కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్క! గొడుగు"చంపకమాలమసలును 'జేమ్సు కుక్కు' యజమానికి బంటుగ మేటి నమ్రతన్విసుగది చూపకే సతము వెంట పరిభ్రమణమ్ము సల్పెడున్దిసలను వానరాకడకుఁ దెల్పగ సూచన పల్కె శంకతో,"నసదృశరీతిఁ గుక్క! గొడు కక్కరవచ్చును కుంభవృష్టిలో!"✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
కడు సమర్థుడు సారథిగాను లేకవిగ్రహమున కేగుటెటుల పేడి సూతుడైన నేమిచేతు నికను కానగ నికకుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు.పసగల వాడు సారథిగ వచ్చిన మేలగు భండనమ్ములో యసహనులన్ వధించి విజయమ్మును పొందగ వచ్చు పేడి పుల్కసుడగు వాడు సూతుడయె కాదన లేనిక నేమిచేతురాఅసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో.
ముసిరెనుమబ్బురాముహృదిమోయగసీతవియోగబాధనేపసజెడివానరంబులనుభావనఁజేసెగమిత్రులంచునున్విశదమునయ్యెకార్యమునువేగమరావణుసంహరించెగాఅసదృశరీతికుక్కగొడుగక్కరవచ్చునుకుంభవృష్టిలో
విపణికేగ లేకుంటిని విస్తృతమగుకుంభవృష్టిలోఁ ; గావలెఁ గుక్కగొడుగుకూర చేసుకొని తినుచు కుక్షినింప ,పెరటిలోనికి గమనించి వెదుక , దొరికె
గట్టికార్యంబుతలపెట్టికావుమనుచుకాళ్లుపట్టెనుగాడిదకంసుబావతప్పదీతఱితనదైనతాల్మిఁజూపకుంభవృష్టిలోగావలెకుక్కగొడుగు
నేల కొరిగెను పంటలు నిక్క ముగను కుంభ వృష్టికి :: గావలె కుక్క గొడుగు కూర వండగ నని గోరి కువ ల యాక్షి మగని గాంచియు దెమ్మ నె మక్కువ గను
తే॥ తలవని తలంపుగా వాన తారస పడిఘనము కాఁగ తడవకను గదులటకటుకుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగుపేరున లభించు ఛత్రము విషయమరయచం॥ మసలఁగ వాన యందటుల మక్కువ యందరికిం గనంగనౌనసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును కుంభవృష్టిలోముసరఁగ మేఘమాలలటు మోదము నొందుచుఁ గ్రీడ సల్పఁగన్వసమగు ఛత్రనామమది వాసియు ఖ్యాతినిఁ గాంచి యొప్పెడిన్ఛత్ర గొడుగు పుట్టగొడుగు రెండూనండి. నేను గొడుగు తీసుకున్నానండి
తేటగీతి వేపకాయంత వానికి వెర్రి ముదిరివదరు నీరీతి నోటికి వచ్చునటులనేతిబీరలో శ్రేష్ఠమౌ నేయి గలదుకుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు
చంపకమాల:కిసకిస నవ్వునొక్కపరి కిన్క వహించు నకారణమ్ముగాపొసగని రీతిగా బలుకు బుద్ధి విహీనునివోలె నిట్టులన్పసగల నేయి లభ్యమగు పన్నుగ జూచిన నేతిబీరలోనసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో
వాన లేతెంచు కాలమే వర్షఋతువువాన కురియగ తడిసెను ప్రాణులెల్లవిశదమాయెను వానలో మశకమునకుకుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగుపసగలవారు వండెదరు వంటలనన్నియు రుచ్యరీతినిన్విసుగును వీడనాడ నెఱవేర్చుట వీలగు నభ్యసమ్మునన్వసుధను సర్వభక్ష్యములు ప్రక్రమమేగద వంటయింటిలోనసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో
సందె చీకటిలో దృష్టి మందగించశునకమే కనులగు కృంగ దినకరుండు దారి దప్పక తడవక దరికి జేర కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్క, గొడుగుకంటి చూపు ఆనక కుక్క సహాయంతో నడచు వానికి వర్షంలో వెళ్ళడానికి కుక్క మరియు గొడుగు రెండూ అవసరం .
ముసురులు బట్టి వాన కడుభోరుననాగక నూరు ముంచు వే ళ సరకుజేయకేగిన యలౌక్యుని చేతుల పొట్లమాదులే పిసరును చెమ్మ జూడకనె వీటికి జేర్చగనవ్వి దాచగా నసదృశ రీతిఁ గుక్క గొడుగునక్కర వచ్చు గుంభవృష్టిలో
పాక శాస్త్ర ప్రవీణులు భద్రగతిని వేఁగఁ జేసి వండింతురు వెక్కసముగ వెచ్చగా నంజికొన సురం బ్రీతిఁ గొంచుఁ గుంభ వృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు ముసరెను మబ్బు లెల్లెడల ముంచు జగమ్మును వర్ష మిత్తఱిం గసరక యాత్మ రక్షణము గార్యము తత్క్షణ మెంచి చూడుమా విసువక విన్మ చెప్పినది వేగమ ఛత్రముఁ గొన్మ వాగ కిట్లసదృశ రీతిఁ గుక్క! గొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో
తే.గీ:వర్షమున కుక్కతో తాను బయట కరుగుబాలు డిట్లనె" గొడుగు లో పట్టు టెట్లుకుక్కయును, నేను,మరి యొక గొడుగు వలయుకుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు”(ఇక్కడ కుక్క గొడుగు అంటే కుక్క కోసం గొడుగు. )
చినిగి పోయెను బూర్తిగఁజేతి గొడుగు కుంభవృష్టిలోఁ ,గావలెఁ గుక్కగొడుగు మూత్ర వ్యాధిని వారించ పూర్తిగాను దీసికొనిరమ్ము వెంటనే కాసులమ్మ!
'ముసరగమేఘమాలికలుభోరునవర్షముకుమ్మరించగా పసగలకూరగామనకు పండుగ రోజున వంటకానికైయసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును ,కుంభవృష్టిలో” బసరములెన్నియో తడిసి పారుచు దిక్కులవెంబడించెనే
చం:విసుగు వహించనేల నిక వీడదు వర్ష మటంచు?మాను నీ నస, మథు పాత్ర నందెదము, నా కదె మోదము కార్య మున్నచో వెస నొక ఛత్రమున్ గొనుము వేగమె పోదము చింత యేలయా!అసదృశరీతిఁ గుక్క, గొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో(గుక్క=మద్యపు గుక్క. వర్షాకాలం లో మద్యపు గుక్క, గొడుగు రెండూ పనికొస్తాయి అని. )
తేటగీతి
రిప్లయితొలగించండిబంటన నడుచు వెంట 'రాబర్టు కుక్కు'
పిలుచు 'కుక్క' గ యజమాని, పలుకు బంటు!
భావి సూచన విన్నట్టి ప్రభువు సెప్పె,
"కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్క! గొడుగు"
చంపకమాల
మసలును 'జేమ్సు కుక్కు' యజమానికి బంటుగ మేటి నమ్రతన్
విసుగది చూపకే సతము వెంట పరిభ్రమణమ్ము సల్పెడున్
దిసలను వానరాకడకుఁ దెల్పగ సూచన పల్కె శంకతో,
"నసదృశరీతిఁ గుక్క! గొడు కక్కరవచ్చును కుంభవృష్టిలో!"
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
రిప్లయితొలగించండికడు సమర్థుడు సారథిగాను లేక
విగ్రహమున కేగుటెటుల పేడి సూతు
డైన నేమిచేతు నికను కానగ నిక
కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు.
పసగల వాడు సారథిగ వచ్చిన మేలగు భండనమ్ములో
యసహనులన్ వధించి విజయమ్మును పొందగ వచ్చు పేడి పు
ల్కసుడగు వాడు సూతుడయె కాదన లేనిక నేమిచేతురా
అసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో.
ముసిరెనుమబ్బురాముహృదిమోయగసీతవియోగబాధనే
రిప్లయితొలగించండిపసజెడివానరంబులనుభావనఁజేసెగమిత్రులంచునున్
విశదమునయ్యెకార్యమునువేగమరావణుసంహరించెగా
అసదృశరీతికుక్కగొడుగక్కరవచ్చునుకుంభవృష్టిలో
విపణికేగ లేకుంటిని విస్తృతమగు
రిప్లయితొలగించండికుంభవృష్టిలోఁ ; గావలెఁ గుక్కగొడుగు
కూర చేసుకొని తినుచు కుక్షినింప ,
పెరటిలోనికి గమనించి వెదుక , దొరికె
గట్టికార్యంబుతలపెట్టికావుమనుచు
రిప్లయితొలగించండికాళ్లుపట్టెనుగాడిదకంసుబావ
తప్పదీతఱితనదైనతాల్మిఁజూప
కుంభవృష్టిలోగావలెకుక్కగొడుగు
నేల కొరిగెను పంటలు నిక్క ముగను
రిప్లయితొలగించండికుంభ వృష్టికి :: గావలె కుక్క గొడుగు
కూర వండగ నని గోరి కువ ల యాక్షి
మగని గాంచియు దెమ్మ నె మక్కువ గను
తే॥ తలవని తలంపుగా వాన తారస పడి
రిప్లయితొలగించండిఘనము కాఁగ తడవకను గదులటకటు
కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు
పేరున లభించు ఛత్రము విషయమరయ
చం॥ మసలఁగ వాన యందటుల మక్కువ యందరికిం గనంగనౌ
నసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో
ముసరఁగ మేఘమాలలటు మోదము నొందుచుఁ గ్రీడ సల్పఁగన్
వసమగు ఛత్రనామమది వాసియు ఖ్యాతినిఁ గాంచి యొప్పెడిన్
ఛత్ర గొడుగు పుట్టగొడుగు రెండూనండి. నేను గొడుగు తీసుకున్నానండి
తేటగీతి
రిప్లయితొలగించండివేపకాయంత వానికి వెర్రి ముదిరి
వదరు నీరీతి నోటికి వచ్చునటుల
నేతిబీరలో శ్రేష్ఠమౌ నేయి గలదు
కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు
చంపకమాల:
రిప్లయితొలగించండికిసకిస నవ్వునొక్కపరి కిన్క వహించు నకారణమ్ముగా
పొసగని రీతిగా బలుకు బుద్ధి విహీనునివోలె నిట్టులన్
పసగల నేయి లభ్యమగు పన్నుగ జూచిన నేతిబీరలో
నసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో
వాన లేతెంచు కాలమే వర్షఋతువు
రిప్లయితొలగించండివాన కురియగ తడిసెను ప్రాణులెల్ల
విశదమాయెను వానలో మశకమునకు
కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు
పసగలవారు వండెదరు వంటలనన్నియు రుచ్యరీతినిన్
విసుగును వీడనాడ నెఱవేర్చుట వీలగు నభ్యసమ్మునన్
వసుధను సర్వభక్ష్యములు ప్రక్రమమేగద వంటయింటిలో
నసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో
సందె చీకటిలో దృష్టి మందగించ
రిప్లయితొలగించండిశునకమే కనులగు కృంగ దినకరుండు
దారి దప్పక తడవక దరికి జేర
కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్క, గొడుగు
కంటి చూపు ఆనక కుక్క సహాయంతో నడచు వానికి వర్షంలో వెళ్ళడానికి కుక్క మరియు గొడుగు రెండూ అవసరం .
ముసురులు బట్టి వాన కడుభోరుననాగక నూరు ముంచు వే
రిప్లయితొలగించండిళ సరకుజేయకేగిన యలౌక్యుని చేతుల పొట్లమాదులే
పిసరును చెమ్మ జూడకనె వీటికి జేర్చగనవ్వి దాచగా
నసదృశ రీతిఁ గుక్క గొడుగునక్కర వచ్చు గుంభవృష్టిలో
పాక శాస్త్ర ప్రవీణులు భద్రగతిని
రిప్లయితొలగించండివేఁగఁ జేసి వండింతురు వెక్కసముగ
వెచ్చగా నంజికొన సురం బ్రీతిఁ గొంచుఁ
గుంభ వృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు
ముసరెను మబ్బు లెల్లెడల ముంచు జగమ్మును వర్ష మిత్తఱిం
గసరక యాత్మ రక్షణము గార్యము తత్క్షణ మెంచి చూడుమా
విసువక విన్మ చెప్పినది వేగమ ఛత్రముఁ గొన్మ వాగ కి
ట్లసదృశ రీతిఁ గుక్క! గొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో
తే.గీ:వర్షమున కుక్కతో తాను బయట కరుగు
రిప్లయితొలగించండిబాలు డిట్లనె" గొడుగు లో పట్టు టెట్లు
కుక్కయును, నేను,మరి యొక గొడుగు వలయు
కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు”
(ఇక్కడ కుక్క గొడుగు అంటే కుక్క కోసం గొడుగు. )
చినిగి పోయెను బూర్తిగఁజేతి గొడుగు
రిప్లయితొలగించండికుంభవృష్టిలోఁ ,గావలెఁ గుక్కగొడుగు
మూత్ర వ్యాధిని వారించ పూర్తిగాను
దీసికొనిరమ్ము వెంటనే కాసులమ్మ!
'ముసరగమేఘమాలికలుభోరునవర్షముకుమ్మరించగా
రిప్లయితొలగించండిపసగలకూరగామనకు పండుగ రోజున వంటకానికై
యసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును ,కుంభవృష్టిలో”
బసరములెన్నియో తడిసి పారుచు దిక్కులవెంబడించెనే
చం:విసుగు వహించనేల నిక వీడదు వర్ష మటంచు?మాను నీ
రిప్లయితొలగించండినస, మథు పాత్ర నందెదము, నా కదె మోదము కార్య మున్నచో
వెస నొక ఛత్రమున్ గొనుము వేగమె పోదము చింత యేలయా!
అసదృశరీతిఁ గుక్క, గొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో
(గుక్క=మద్యపు గుక్క. వర్షాకాలం లో మద్యపు గుక్క, గొడుగు రెండూ పనికొస్తాయి అని. )