30, జూన్ 2024, ఆదివారం

సమస్య - 4807

1-7-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తిక్కనను వరించితీవు తిక్కలపోరీ!”
(లేదా...)
“తిక్కననున్ వరించితివి తిక్కలపోరి! యిదేమి చిత్రమో”
(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

41 కామెంట్‌లు:

  1. చక్కనిచుక్కవునీవే
    పెక్కగుసుగుణములుగలిగిపెద్దగునటునిన్
    నిక్కముప్రతిభనుకలిగిన
    తిక్కననువరించితీవుతిక్కలపోరీ

    రిప్లయితొలగించండి
  2. మక్కువనెంచిభూతములమందకు తోడుగనుండువానినిన్
    నిక్కముపుఱ్ఱెభోజనమునేరమునెంచకనారగించుచున్
    స్రుక్కక భక్తకోటికటసూడిదలిచ్చెడివెఱ్ఱివానినిన్
    తిక్కననున్వరించితివితిక్కలపోరి యిదేమిచిత్రమో

    రిప్లయితొలగించండి
  3. పెక్కురు నీకై వేచిన
    చక్కని సుకుమారులుండ జక్కువచంటీ!
    ముక్కున వ్రేలిడునట్లుగ
    తిక్కనను వరించితీవు తిక్కలపోరీ!

    చక్కని చుక్కవంచు నిను సర్వులు కన్గొని సంస్తుతింతురే
    జక్కువచంటి! యెవ్విధిని జాతక చక్రము చంచలించెనో
    తిక్కననున్ వరించితివి తిక్కలపోరి! యిదేమి చిత్రమో
    ముక్కున వ్రేలు వైచిరిట మూర్ఖపు యెంపిక నీవుసల్పగా!

    రిప్లయితొలగించండి
  4. పరమేశ్వరుడు పార్వతితో....

    కందం
    ఎక్కుడు బక్కటి పుంగవ
    మక్కట! మైపూత బూది! యగమాభరణం
    బిక్కపు శ్మశాన వాసిగ
    తిక్క! నను వరించితీవు తిక్కలపోరీ!

    ఉత్పలమాల
    ఎక్కుడు పుంగవమ్మొకటె, యేలికఁ గాటికి, బూది పూత మై!
    యక్కట! నాగమాభరణమగ్ని త్రిలోచన మంబరాల్ దిశల్!
    చక్కనిచుక్కనున్ గలుపు సాధకుడా మరు నగ్నిఁ గాల్చెడున్
    దిక్క! ననున్ వరించితివి తిక్కలపోరి! యిదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  5. తిక్కన నామధేయమది తీరుగ సార్థకమయ్యె వానికిన్
    పెక్కురు పోవుమార్గమున వెళ్ళుట కెన్నఁడు నిచ్చగించకన్
    చిక్కుల పాలగున్ తుదకు, చీటికిమాటికి నల్గునట్టి యా
    తిక్కననున్ వరించితివి తిక్కలపోరి! యిదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వెళ్ళుట' అన్నది వ్యావహారికం. 'ఇచ్చగించక' అన్నది కళ. ద్రుతాంతం కాదు.

      తొలగించండి
    2. సవరిస్తాను గురువుగారూ🙏

      తిక్కన నామధేయమది తీరుగ సార్థకమయ్యె వానికిన్
      పెక్కురు పోవుమార్గమున బేరిమిఁ బోవుట కిచ్చగించకే
      చిక్కుల పాలగున్ తుదకు, చీటికిమాటికి నల్గునట్టి యా
      తిక్కననున్ వరించితివి తిక్కలపోరి! యిదేమి చిత్రమో

      తొలగించండి
  6. కం॥ చక్కని కవియని తెలిసెనొ!
    మక్కువఁ గొంటివొ! ధరణిని మానిని మదిలో
    నక్కిన విషయము తెలియునె!
    తిక్కనను వరించితీవు తిక్కల పోరీ

    ఉ॥ చక్కని కైతలన్ వినఁగ సాదర భావము నిండి గుండెలో
    మక్కువ హెచ్చెనో! యతఁడు మానస వీణను మీటెనో! కనన్
    నిక్కము సాధ్యమే! తెలియ నెచ్చెలి యెంపిక దుర్లభమ్మగున్
    దిక్కననున్ వరించితివి తిక్కలపోరి! యిదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  7. అక్కట యేమిటి మగువా
    పెక్కురు. మగ వార లుండ బేలగ నీవా
    టక్కు ల మారి గ నుండే
    తిక్కన వరించి తీవు తిక్కల పో రీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'టక్కులమారిగ నుండెడి' అనండి.

      తొలగించండి

  8. ఉక్కివుడవంచు బంధువు
    లొక్కండును పలకరింప రోరిమి తోడన్
    లెక్కింపక నాకున్ గల
    తిక్క, నను వరించితీవు తిక్కలపోరీ!


    పెక్కుగ శాస్త్రముల్ చదివి విజ్ఞత పొందితి నంచు హెచ్చుగా
    మొక్కలమందు మున్గితిని మూర్ఖుడ నైనను గాంచగా నిలన్
    చక్కని రూపమంచు పరిచర్యల తో సవరింతు నంచు నా
    తిక్క, ననున్ వరించితివి తిక్కలపోరి! యిదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  9. తిక్కన నామాఖ్యుఁడతఁడు
    చిక్కులఁ గొని దెచ్చుకొనును చేసెడి పనులన్
    మిక్కుటమగు నర్మిలితో
    తిక్కనను వరించితీవు తిక్కలపోరీ!

    రిప్లయితొలగించండి
  10. అక్కరకు రాని వాడగు
    తిక్కనను వరించితీవు తిక్కలపోరీ ,
    కిక్కురువెట్టక మనవలె
    నిక్కడ , వాదన సలుపకు మెవ్వరి తోడన్

    రిప్లయితొలగించండి
  11. చక్కని వాడు నటంచును
    మక్కువ చూపుచును నీవు మనమున నన్నే
    నిక్కముగా నిలుపుచు నీ
    తిక్కనను వరించితీవు తిక్కల పోరీ

    రిప్లయితొలగించండి
  12. చక్కటి చుక్కవె యెన్నఁగ
    మిక్కుటముగఁ బద్దెములను మీఱి వచింపం
    బ్రక్కన నిలువంగఁ గలవె
    తిక్కనను వరించి తీవు తిక్కల పోఱీ!


    ఇక్కలి కాల మందుఁ గన నివ్విధి నుండక యెట్టు లుండు నీ
    మక్కువ నెంచి చూచినను మానిని హాస్య మెడంద రేఁగదే
    తిక్కకు తిక్క తో డగును దిన్నగ నేఁడిఁకఁ జంచలాంబకా
    తిక్కననున్ వరించితివి తిక్కల పోఱి! యిదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      మీ పూరణలను శంకరాభరణం వాట్సప్ సమూహంలో పోస్ట్ చేస్తున్నాను. అవి ఔత్సాహిక కవులకు మార్గదర్శకాలుగా ఉంటాయి.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. ధన్యుఁడ నండి. ఇప్పుడు నేను కె నడా లో మా కుమారుని యింటి వద్ద నున్నాను.

      తొలగించండి
  13. కం:ఎక్కువ తక్కువ జూడవు,
    చక్క దనము నాకు లేదు, చదు వైనను నీ
    కెక్కువ కాదే!యెంతటి
    తిక్క? నను వరించితీవు తిక్కలపోరీ!

    రిప్లయితొలగించండి
  14. ఉ:చక్కని విద్య లేదు ,సరసమ్మగు మాటల తీరు లేదు,"మీ
    కెక్కువ మా కులమ్మని సహింపరు పెద్ద" లటన్న "వారితో
    లెక్కయె లే" దటందువు ఫలింపని ప్రేమ యిదేల నీ కెదో
    తిక్క, ననున్ వరించితివి తిక్కలపోరి! యిదేమి చిత్రమో”
    (ఇక్కడ మే మెక్కువ కాబట్టి నీ ప్రేమ ఫలించదు అని.)

    రిప్లయితొలగించండి
  15. (3)ఉ:తక్కువ యేమి తిక్కనకు ధైర్యము,శౌర్యము? నేటి యాజి నే
    చిక్కులు కల్గెనో! గృహము జేరిన భర్తను రెచ్చగొట్టి నీ
    మక్కువ జంపి యర్జునసమానుని జంపితి వయ్యె! యేల మా
    తిక్కననున్ వరించితివి తిక్కలపోరి! యిదేమి చిత్రమో”
    (ఖడ్గ తిక్కన యుద్ధం నుంచి పారిపోయి వస్తే భార్య అతన్ని రెచ్చగొట్టి యుద్ధానికి పంపి ఆయన మృత్యువుకి కారణ మయింది. ఆమెను మనం వీరనారి అంటాము కానీ వారి బంధువులలో కొంద రైనా ఇలా బాధ పడే ఉంటారు కదా!అని.అసలు మా తిక్కనని దేనికిపెళ్లి చేసుకున్నావు?అంటారు.)

    రిప్లయితొలగించండి
  16. చక్కనికొల్వులేదుసిరిసంపదలున్కనరావటంచునన్
    లెక్కకుకూడరాడనుచు ప్రేమయ నింపదు కుక్షిమీకనన్
    మక్కువ తోడ కోరితివి మానస మందున నన్నునో చెలీ
    తిక్కననున్ వరించితివి తిక్కలపోరియిదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  17. మెక్కుచు భోజనమ్ము నినుమిక్కిలి నిద్రను పోవు చుందు నేన్
    చక్కని చుక్కలెప్డు జతసాగరు తల్చుచు పోకిరీనిగా
    మక్కువ జూపి నాపయిన మందుడ,ప్రల్లదకాడ , నేమి నీ
    తిక్క, ననున్ వరించితివి తిక్కల పోరి! యిదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  18. వెక్కలి చాన విప్లవమఁ బ్రేలునదాటుఁ బఠించె భారతం
    బక్కజమాయె నెల్లరికి నగ్రకవీతడ నెచ్చులాడెఁ బెన్
    మక్కవయైన కావ్యమ సమానము యెక్కుడు కావ్యకర్తయున్
    తిక్కననున్ వరించితివి తిక్కలపోరి యిదేమిచిత్రమో

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    చక్కని వాడనుకొంటివి
    తిక్కల వాడు,పని లేక తిరిగెడు వాడున్
    మిక్కిలి ప్రేమించితినని
    తిక్కనను వరించితీవు తిక్కల పోరీ!

    రిప్లయితొలగించండి