24, జులై 2024, బుధవారం

సమస్య - 4831

25-7-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కూఁతురువొ కోడలివొ పౌత్రివో తెలుపుము”
(లేదా...)
“కూఁతురువయ్యెదో యనుఁగుఁ గోడలివయ్యెదొ పౌత్రివయ్యెదో”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

44 కామెంట్‌లు:

  1. చిత్రదర్శకుడు మేటి నటీమణి తో:

    తేటగీతి
    మూడు పాత్రలు చిత్రాన ముఖ్యమమ్మ
    నిపుణత గలుగంగ కళాభినేత్రివీవు
    భావి నటజీవితము నెంచి పాత్రలందు
    కూఁతురువొ? కోడలివొ? పౌత్రివో? తెలుపుము

    ఉత్పలమాల
    రీతిఁ గలుంగు నైపుణిని ప్రేక్షకులెంచ కళాభినేత్రివై
    జోతలనందుకొంటివన చొక్కపుపాత్రలు చిత్రమందునన్
    ప్రీతిగ మూడె నున్నవి తరింపగఁ జేయుననంగ నెంచుమా!
    కూఁతురువయ్యెదో? యనుఁగుఁ గోడలివయ్యెదొ? పౌత్రివయ్యెదో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా!🙏 వృత్తము మూడవ పాదములో 'మూడె యున్నవి' అని సవరణ

      తొలగించండి
  2. కవితబుట్టెనువాణియైకవియుబ్రహ్మ
    కవికిబ్రహ్మంబుకొడుకునైకళనుబొందె
    కవియునింద్రుడుగాగనుకాచెజగము
    కూతురువొకోడలివొపౌత్రివోతెలుపుము

    రిప్లయితొలగించండి
  3. వయసు మీరిన వానికి పద్య ములను
    గుంఫనమెటుల యనునది కుదురునటుల
    నేర్పెదనని వచ్చి తివిగా నీవతనికి
    కూఁతురువొ కోడలివొ పౌత్రివో తెలుపుము

    రిప్లయితొలగించండి
  4. భూతలమందుబ్రహ్మగనుభావనకావ్యముసృష్టిచేసెగా
    చేతనవిష్ణువైకవియుజేరెనురాజులపీఠమేతగన్
    పాతముగానిసంపదగవాణినిబొందెతరాలుమెచ్చగన్
    కూతురువయ్యెదోయనుగుకోడలివయ్యెదొపౌత్రివయ్యెదో

    రిప్లయితొలగించండి
  5. నీకు చిత్రమ్ములో పాత్ర నీయ నేను
    దలచితిని నీదు కోరిక దాచకుండ
    కూతురువొకోడలివొపౌత్రివోతెలుపుము
    నీవనియు దర్శకుడడిగె నేర్పుతోను

    రిప్లయితొలగించండి

  6. మేన మామను పెండ్లాడు దానవంచు
    పేర్మి తోడనడుగు చుంటి వినవె బాల
    తల్లి తల్లిని నాపైన దయను జూప
    కూఁతురువొ, కోడలివొ పౌత్రివో తెలుపుము.


    నా తనయుండు మెచ్చెతన నారిగ జేకొన సిద్ధమయ్యెనో
    నాతుక చెప్పమందునిది నందన పుత్రిక వీవు గాన నీ
    వాతని పత్నివైన నది యబ్బురమే యిక ప్రేమ పంచుచున్
    కూఁతురువయ్యెదో యనుఁగుఁ గోడలివయ్యెదొ పౌత్రివయ్యెదో.

    రిప్లయితొలగించండి
  7. తే॥ వయసు ముదిరి జ్ఞాపక శక్తి నయముఁ గాని
    జబ్బు వలన నశించఁగ జనుల గుర్తు
    పట్ట తరము గాదు దరికి వచ్చిన కొమ
    కూఁతురువొ కోడలివొ పౌత్రివొ తెలుపుము

    ఉ॥ చేతన మెల్ల వైదొలఁగె చెల్లని నాణెము నైతి నేనిటుల్
    యాతన నొంది వృద్ధుఁడుగ నద్భుత జ్ఞాపక శక్తి మాయమీ
    రీతిగ జబ్బు క్రమ్మఁగను లీలగఁ గన్పడు నీవు నెవ్వరో
    కూఁతుకు వయ్యెదో యనుఁగుఁ గోడలి వయ్యెదొ పౌత్రివయ్యెదో

    Alzheimer’s ప్రభావమండి. మా బెంగుళూరులో 2-3 మార్లు News paper లో కూడ వచ్చినదండి. ఇంటి దారి గుర్తు రాక!

    రిప్లయితొలగించండి
  8. యాతన తోడ మేనదియు హాయని కేకల నార్తితోనిడన్
    ప్రీతిగ చెంత చేరుచును వేదనబాపిడి మాటలాడుచున్
    చేతిని బట్టి సేవలనుశీఘ్రమెచేయగ వృద్ధుడిట్లనెన్
    *“కూఁతురువయ్యెదో యనుఁగుఁ గోడలివయ్యెదొ పౌత్రివయ్యెదో”*

    రిప్లయితొలగించండి
  9. ఆగమించిన జనులకు స్వాగతమ్ము
    కోరి కోరి బంధువులకు దూరమైతి
    నిన్ను గుర్తింప గాలేను నీరజాక్షి
    కూఁతురువొ కోడలివొ పౌత్రివో తెలుపుము

    తాతల నాడు మమ్మువిడి తామొక దేశము చేరి యుంటిరే
    పాతిక వత్సరంబులయె బంధువు లెవ్వరు నన్ను చూడకే
    ప్రీతిగ నన్నుజూచుటకు రెక్కలు గట్టుకు వచ్చియుంటివే
    కూఁతురువయ్యెదో యనుఁగుఁ గోడలివయ్యెదొ పౌత్రివయ్యెదో

    రిప్లయితొలగించండి
  10. పూతవిశుద్ధశుక్లరుచి పున్నమచంద్రుని బోలు చానరో
    చాతురి మాటలాడెదవు సంస్కృత భాషను, నెట్లుజేరినా
    వీతలమున్? మహాజలధికీవు, రమేశునకున్, విధాతకున్
    గూఁతురువయ్యెదో, యనుఁగుఁ గోడలివయ్యెదొ, పౌత్రివయ్యెదో!

    [
    1) క్రమము;
    2) సంస్కృత భాష అంటే గీర్వాణమని కాక సంస్కరించబడినది అనే అర్థములో వాడినానండీ
    3) విధాత మానసపుత్రుడు దక్షుడు, దక్షుని కూతురు పౌత్రి]

    రిప్లయితొలగించండి
  11. నాతి! గణింప నీదు పిత నా చినతండ్రి సుతుండు జూడగన్
    ప్రీతిగ నీదు తల్లి మరి పిన్ని కుమార్తెయె నాకు చుట్టమౌ
    నీతిగనత్తకుందనయ నీదు పితామహి నాకు,నీవికన్
    కూఁతురువయ్యెదో! యనుఁగుఁ గోడలివయ్యెదొ! పౌత్రివయ్యెదో!!

    1.తండ్రి వైపు బంధుత్వం >> బాబాయి కొడుకు కూతురు అవ్వటం చేత >> కూతురు
    2. తల్లి వైపు బంధుత్వం >> తన తల్లి చెల్లి కూతురి కూతురవ్వటం చేత >> కోడలు
    3. మేనత్త తరుపు బంధుత్వం >> తన బాబాయి చేసుకుంది అక్క కూతుర్ని, అంటే పిల్ల నాయనమ్మ తనకు మేన వదిన, కాబట్టి వదిన మనమరాలు తనకు పౌత్రి అవుతుంది.

    రిప్లయితొలగించండి
  12. ప్రీతిగ మా కుమారునకు పేరిమి పత్నివి స్వాగతమ్మిదే
    నాతి జనించలేదు గత నాల్గు తరమ్ములు మా గృహమ్మునన్
    కూఁతురు లేని లోటునిక కోడలి రూపునఁ దీరు మాకికన్
    కూఁతురువయ్యెదో యనుఁగుఁ గోడలివయ్యెదొ పౌత్రివయ్యెదో

    రిప్లయితొలగించండి
  13. నటుడు వేష ము దరియిo చి నాటకమున
    దర్శకుడు దెల్పిన కరణి దాను బలికె
    నెదుట నున్నట్టి నటి తోడ ని వ్వి ధ మున
    " కూ తురు వొ కోడలి వొ పౌత్రి వొ తెలుపు ము? "

    రిప్లయితొలగించండి
  14. మాకు కోడలిగా వచ్చు నీకు నిదియె
    స్వాగతము రమ్ము మాయింట ప్రభలు నింప
    ఆడబిడ్డలు లేనిమా యవసధమున
    “కూఁతురువొ కోడలివొ పౌత్రివో తెలుపుము”

    రిప్లయితొలగించండి
  15. కూఁతురివి యన్న దాతృత్వ గుణము లేదు
    కోడలి వన గాంభీర్యము కొఱత నీకు
    పౌత్రి వయిన నీ రెంటినిఁ బడయ లేదు
    కూఁతురువొ కోడలివొ పౌత్రివో తెలుపుము


    దాతల యందు నుత్తమపు దాత ధరాతల మందు నెన్నఁగా
    నేతల లోన నున్నతపు నేత వసుంధరలో గణింపఁ నా
    తాతకు నేమి యౌదు వనితామణిరో వచియింపు మింపుగాఁ
    గూఁతురు వయ్యెదో యనుఁగుఁ గోడలి వయ్యెదొ పౌత్రి వయ్యెదో

    రిప్లయితొలగించండి
  16. తే.గీ:సరకు లప్పిచ్చి యారు మాసమ్ము లయ్యె
    పైస జమ వేసి నట్టి పాపమ్ము లేదు
    నీకు సరకు నూరక నీయ నీవు నాకు
    గూతురవొ కోడలివొ పౌత్రివో తెలుపుము”

    రిప్లయితొలగించండి
  17. ఉ:ఈ తరుణమ్మునన్ గనగ నెవ్వరు నాకిట?నాశ్రమాన నీ
    చేతుల సేవ లన్నిటిని జేసితి వీవొక బంధ మౌచు నే
    జీతము లేక పుణ్యమున సేవిక వై మరు జన్మ మున్న నా
    కూఁతురువయ్యెదో యనుఁగుఁ గోడలివయ్యెదొ పౌత్రివయ్యెదో”
    (తన కెవరూ సాయ పడక ఒక వృద్ధాశ్రమం లో సేవిక ఐన యామె చేసిన సేవకి వృద్ధురాలు తెలిపిన కృతజ్ఞత.)

    రిప్లయితొలగించండి



  18. అతిథిగనరుదెంచి యతడు నతివను గని
    నాదరమ్మును చూపుచు నడిగి నిటుల
    నందరి యభిమానమునందినట్టి నీవు
    *కూతురువొ కోడలివొ పౌత్రివో తెలుపుము*

    రిప్లయితొలగించండి
  19. పెళ్ళి వారింటఁ జూచితి బేల!నిన్ను
    నెవరి పక్షాన వచ్చితివిచటకిపుడు
    కూఁతురువొ కోడలివొ పౌత్రివో తెలుపుము
    తెలియఁగోరుదు బంధము తెలుపుమమ్మ

    రిప్లయితొలగించండి
  20. కాతర భావమున్విడిచి కావ్యకు చెప్పుము బంధమెట్టిదో
    కూఁతురువయ్యెదో యనుఁగుఁ గోడలివయ్యెదొ పౌత్రివయ్యెదో
    చేతనముల్లసిల్లగను జెప్పుమ యయ్యది తేటతెల్లమౌ
    రీతిని,యట్లుగానియెడ రేపటి పొద్దున నేగగావలెన్

    రిప్లయితొలగించండి


  21. ఉత్పల మాల:

    ప్రీతిగప్రక్కనే నిలిచి పెండ్లి గృహంబున సేవ జేసె న
    జ్ఞాతమతల్లి తానెవరొ సత్కృప తో బధిరాంధురాలికిన్
    చేతికి చిక్క నయ్యతివ చెక్కిలి ముద్ధిడి చెప్పవే యనెన్
    కూఁతురువయ్యెదో యనుఁగుఁ గోడలివయ్యెదొ పౌత్రివయ్యెదో

    డా.గాదిరాజు మధు సూదన రాజు

    రిప్లయితొలగించండి

  22. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పిలువ శుభకార్యమున కేగి పెండ్లిలోన
    కూరుచుండగ నొక కన్య చేర దరికి
    పోల్చ లేక నడిగితిని పోఱి నీవు
    కూతురువొ కోడలివొ పౌత్రివో తెలుపుము.

    రిప్లయితొలగించండి