10, ఆగస్టు 2024, శనివారం

సమస్య - 4848

11-8-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మాసిన చీరయె లలనకు మాన్యతఁ గూర్చున్”

(లేదా...)

“మాసిన చీర మానినికి మాన్యతఁ గూర్చును పెండ్లివిందులో”

20 కామెంట్‌లు:

  1. కందం
    కాసులు గలిగిన మేరకు
    వాసిగ శుభ్రంపుచీర పరువును నిల్పున్
    భాసిలు నీటను పిండిన
    మాసిన చీరయె, లలనకు మాన్యతఁ గూర్చున్

    ఉత్పలమాల
    కాసులుగల్గు మేరకు వికారము సూపక తాల్చ శుభ్రమై
    భాసిలు వల్వలన్ గనెడు వారలు చూడరె గౌరవంబుగన్
    వేసమె భూషణమ్మనఁగ వీడక పిండగనొప్పు పూర్తిగన్
    మాసిన చీర, మానినికి మాన్యత గూర్చును పెండ్లివిందులో

    రిప్లయితొలగించండి
  2. ఆసిగపూవునుకోల్పడి
    దూసిన కత్తిని సుమమునుతొయ్యలిపొందెన్
    వేసిన వేషము ఫల మిది
    మాసినచీరయెలలనకు మాన్యతగూర్చెన్

    రిప్లయితొలగించండి
  3. ఏ సిరులెందుకు కాంచగ
    వాసిగ సద్గుణములుండి ప్రశ్రయముమ కీ
    నాశులనభిమానించిన
    మాసిన చీరయె లలనకు మాన్యతఁ గూర్చున్.


    బైసియె లేకపోయినను భాగ్యవిహీనుల నాదరిం చుచున్
    వాసిగ కీర్తినందిన సువాసిని సద్గుణ శీలి దాల్చెడిన్
    వాసపు నిష్క్రయమ్మదియె పక్కళమైనను మేలె, వీడుచున్
    మాసిన చీర , మానినికి మాన్యతఁ గూర్చును పెండ్లివిందులో.

    రిప్లయితొలగించండి
  4. కం॥ వేసిన వేషము వేయకఁ
    జూసిన కన్నులు చెదిరెడు చోద్యపు రీతిన్
    భాసిల మనువున నెటులను
    మాసిన చీరయె లలనకు మాన్యత నిచ్చున్

    ఉ॥ చూసిన వారి నేత్రములు చోద్యమ టంచును బల్కురీతిగన్
    వేసిన వేషమంతయును బ్రీతిగ మార్చుచు వెనువెంటనే
    భాసిలరే వివాహమున భవ్యతఁ జాటఁగఁ దెల్పు మెట్టులన్
    మాసిన చీర మానినికి మాన్యతఁ గూర్చును బెండ్లివిందులో

    రిప్లయితొలగించండి
  5. బాసలనెన్నినేర్చినను బాధనుగూర్చునుమానసంబులో
    మాసినచీరమానినికి, మాన్యతగూర్చునుపెండ్లివిందులో
    దోసములెన్నియున్ననటతొయ్యలియందునువాయనంబులే
    వాసములక్ష్మిసేయుగదవస్త్రమునందునచంచలాత్మయై

    రిప్లయితొలగించండి
  6. మోసము జేయక బ్రతుకగ
    దాసిగ కష్టించు దాను దయనీయంబై
    నాసి రకంపు ముతక దౌ
    మాసిన చీర యె లలనకు మాన్యత గూర్చు న్

    రిప్లయితొలగించండి
  7. చూసెడి వారి పొగడ్తకు
    వాసిగ విలువైన చిన్న వలువ దొడగకన్
    వాసము నందున నుండిన
    మాసిన చీరయె లలనకు మాన్యతఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
  8. మాసికలున్న దుస్తులభిమానముగా ధరియించుటల్ రసా
    భాసముగా దుకూలములు వ్రయ్యలువాఱఁగజేసి కట్టుటల్
    వేసమునన్ వికారము లివేకద "ఫ్యాషను" లట్టులైననా
    మాసిన చీర మానినికి మాన్యతఁ గూర్చును పెండ్లివిందులో

    రిప్లయితొలగించండి
  9. చూసెడివారి మెప్పునకు చొప్పడురీతి దలంచ కుండగన్
    వాసిగ మూల్యమొందు చిరు వస్త్రము దాల్ఛెడు
    చింతనొందకన్
    వాసము నందు నెక్కొనిన బట్టల మూటన నుండి
    నట్టి యా
    మాసిన చీర మానినికి మాన్యతఁ గూర్చును పెండ్లివిందులో

    రిప్లయితొలగించండి
  10. వేసము గొల్పు వికారము
    మాసికలే వసనములకు మండనమౌరా
    భాసముగాలేకున్నను
    మాసిన చీరయె లలనకు మాన్యతఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
  11. వాసశ్శ్రేష్ఠ మయినచో
    నే సిన్న దయినను గాంచ నిటు లెంతేనిన్
    వాసిగ ధరియించిన విను
    మా సిన చీరయె లలనకు మాన్యతఁ గూర్చున్


    నీ సరి యెవ్వరంచు నలినీదళ లోచన లెల్ల రివ్విధిన్
    భాసిల నేర్తు రెవ్వ రని పన్నుగఁ గీర్తన సేయఁ గోరుచోన్
    వేసర కాత్మఁ గట్టుకొని వెండి జరీ పొడఁ గట్టకున్నచో
    మాసిన చీర మానినికి మాన్యతఁ గూర్చును బెండ్లివిందులో

    రిప్లయితొలగించండి
  12. ఉ:"మాసిన చీర గట్టితివి,మంచిది లేదె?" యటంచు,బ్రశ్నలన్
    మేసెడు స్త్రీలు వేయగనె" మీరు మడుల్ విడినారు కాని నే
    జేసెద భోజనమ్ము మడి చీర ధరించుక" యన్న జాలు నా
    మాసిన చీర మానినికి మాన్యతఁ గూర్చును పెండ్లివిందులో
    (మాసిన చీర కట్టుకున్నావే? అంటే అది మడిచీర అంటే చాలు.మాసినా సరే మడి బట్ట కట్టుకున్నదని గౌరవిస్తారు.)

    రిప్లయితొలగించండి
  13. 1)కం:చేసిన సత్కార్యమ్ముల
    నే సాధ్వికి నైన గలుగదే గౌరవమే?
    ఆ సతి మిత్రులు తలలకు
    మాసిన, చీరయె లలనకు మాన్యతఁ గూర్చున్”
    (సత్కార్యాల వలన స్త్రీకి గౌరవం లభిస్తుంది కానీ ఆమె మిత్రులు తలకి మాసిన వాళ్లైతే చీరని బట్టి గౌరవిస్తారు.)

    రిప్లయితొలగించండి
  14. కీసర గుట్టన యిచ్చిరి
    మాసిన చీరయె లలనకు, మాన్యతఁ గూర్చున్
    వాసిగ భక్తిన్ గొలిచిన
    నాశివునామంబుమనకు ననిశము భువిలో

    రిప్లయితొలగించండి
  15. వాసితనంబుఁబోవుగద భామిను లందరి యొద్ద చుల్కనౌ
    మాసిన చీర మానినికి, మాన్యతఁ గూర్చును పెండ్లివిందులో
    భాసిలు రాళ్ళయుంగరము బంగరు దామము కంఠహారమున్
    కాసులదండలున్ మురియు కంకణమాదిగ వస్తుజాలముల్

    రిప్లయితొలగించండి
  16. వాసిగఁ దలంచి యిలలో
    భాసిల్లగ కట్టు చుంద్రు పట్టును వనితల్
    వాసన గల్గు సుమంబులు
    మాసిన చీరయె లలనకు మాన్యతఁ గూర్చున్

    వాసిని గూర్చు పట్టనుచు వారిజలోచనలెంచి మెండుగా
    భాసిలు చుంద్రుగాదె యిల వాడని పూలపరీమళంబునన్
    చేసినచాలు సాపనుచు చేడియలెందరొ మొగ్గుచూపగా
    మాసిన చీర మానినికి మాన్యతఁ గూర్చును పెండ్లివిందులో

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    దాసిగ నొకరింట పనిని
    చేసెడు సమయాన క్రొత్త చేలములేలా?
    వాసిగ తాను ధరించిన
    మాసిన చీరయె లలనకు మాన్యత గూర్చున్.

    రిప్లయితొలగించండి

  18. దాసివలె పనినిచేయుచు
    వేసారక సతతమింట వేగిర పడుచున్
    వాసిగ తాకట్టిన యా
    మాసిన చీరయెలలనకు మాన్యత గూర్చన్

    పూసెనురంగుమోమునకు భూరిగ చిత్రమునందుపాత్రగా
    సేసలతోడబంధువులచేతనుపొందినకోకకట్టకన్
    వాసిగ పేరునందగనుపట్టువరాసినిగాకకట్టగా
    *“మాసిన చీర మానినికి మాన్యతఁ గూర్చును పెండ్లి విందులో”*

    రిప్లయితొలగించండి