26-8-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్”
(లేదా...)
“పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్”
(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధాన సమస్య)
కందంవరలక్ష్మీనారాయణిసురభి మెరయు మందిరమున శోభిల్లంగన్సిరులందించ వెలయ శ్రీపురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్
చంపకమాలమెరయు సువర్ణమందిరము మెచ్చఁగ సర్వులు భక్తినింపుచున్హరిసతి మూల దేవతగ నద్భుత రీతిని గొల్వుఁదీరఁగన్వరములనిచ్చులక్ష్మి పరిపాలన జేసెడు క్షేత్రమైన శ్రీపురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్
సిరిగిరిపై కోవెలలోహరుడే వెలసెనట మల్లి కార్జున నామాంతరమున నామందిర గోపురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్.సిరిగిరి పైన ఖ్యాతిగల క్షేత్రమటంచును కాలకంఠుడౌ హరుడట మల్లికార్జునుడు నమ్మికయే భ్రమరాంబగా నటన్ స్థిరముగ గొల్వుదీరిన ప్రతీతపు మందిరమంచు దీని గోపురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్.
మరిమరి దర్శింతురుగదతిరుపతి వెంకన్న గుడిని దివ్యంబనుచున్సురుచిర సుందరమగు గోపురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్సురుచిరమైన దేవళము చూడగ వత్తురు భక్తులెల్లరున్దిరుపతి వేంకటేశ్వరుని దివ్య మనోహర మంగళాకృతిన్మరిమరి కాంచగా మిగుల మక్కువ కల్గును దేవళంపు గోపురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్
అరుదగు పదవి కలదనుచుఖరువును పొందుచునె యెంత ఖలమును జేయన్పురమున దేవాలయ గోపురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్
కరములు మోడిచి మదిలోహరినిఁదలచి శిరమువంచి యభివాదమ్మున్విరళిని సలుపుచు గుడిగోపురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్
కరములు మోడ్చి చిత్తమున కారణకారణమున్ దలంచుచున్స్థిరమగు భక్తి నెక్కొనగ శీర్షము వంచి నమస్కరించి శంకరుని కృపాకటాక్షములు కామితసిద్ధికి దేవళంపు గోపురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్
గిరి పై వెలసిన రుద్రుని తిరముగ సేవించి మిగుల దేదీ ప్య ము గా మెరిసె డి కోవెల దౌ గో పురమును గనినన్ జనులకు బుణ్యము గల్గు న్
స్థిరమగు చిత్తము తోడను నిరతమ్మా పరమశివుని నిలుపుచుమదిలోస్మరియించుచు చని కాశీ *“పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్”*మరచుచుమంచిచెడ్డలనుమానినితోచరియించుభక్తునిన్కరమనురక్తితోడనటగాంచుచుబుద్ధిని మార్చి పెద్దలన్నిరతముకొల్చురీతిగనునేర్పిన శ్రీహరియున్నపండరీ*“పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్”*
గిరిజా నాథుని గగనాంబరునిం బ్రేతగణ భూత పతినిం బరమేశ్వరుఁ గొల్చిన నటరా ణ్నూపురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్ త్వరపడు వేంకటేశ్వరుని దర్శన మొప్పును జేయఁ బిమ్మటందిరుమల ఱేనికిం బుడమిఁ దేర యొసంగెను వేంకటాద్రిలో గురు మహి మాన్వితుం డతఁడు గొప్ప వరాహపుఁ బేరి స్వామిఁ జూపుర మునుఁ గాంచినం గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్
వర శంకరార్య పీఠము వరలెను, కామాక్షి యమ్మవారును దయతో స్థిర శుభముల నిడు కాంచీపురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్నిరతము భక్తి మార్గమున నిశ్చలబుద్ధి సమన్వితుండునై హరు జప పూజనాదికము లంచిత శక్తి ఘటించుచున్ మహేశ్వరుని సుదర్శనార్థమయి సంతసమందుచు బోయి కాశికాపురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్
కం॥ పరిణితిఁ బడయుచు ధర్మముధరణిని విడువకఁ బరఁగుచుఁ దన్మయమొందఁగన్విరిసిన భక్తిని తిరుమలపురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్చం॥మరువక భక్తి శ్రద్ధలను మన్ననఁ జేయుచుఁ బాండు రంగనిన్ధరణినిఁ గొల్చి మ్రొక్కులిడి ధర్మముఁ దప్పక మోదమందుచున్నిరతము పాదదాసుఁడుగ నెమ్మినిఁ దత్పరుడౌచు పండరీపురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్
లోకులు పలుతీరులుగాదె!ఒక్కరైతుచెరువు నిండెనంచొక్కడు,నేడ్చె పంటపాడగుటగాంచినొక్కడు పరితపించెఒకనినేడ్పించె,మురిపించెనొకని వాన! By వేదుల గణపతి రావు
కందం
రిప్లయితొలగించండివరలక్ష్మీనారాయణి
సురభి మెరయు మందిరమున శోభిల్లంగన్
సిరులందించ వెలయ శ్రీ
పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్
చంపకమాల
తొలగించండిమెరయు సువర్ణమందిరము మెచ్చఁగ సర్వులు భక్తినింపుచున్
హరిసతి మూల దేవతగ నద్భుత రీతిని గొల్వుఁదీరఁగన్
వరములనిచ్చులక్ష్మి పరిపాలన జేసెడు క్షేత్రమైన శ్రీ
పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్
రిప్లయితొలగించండిసిరిగిరిపై కోవెలలో
హరుడే వెలసెనట మల్లి కార్జున నామాం
తరమున నామందిర గో
పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్.
సిరిగిరి పైన ఖ్యాతిగల క్షేత్రమటంచును కాలకంఠుడౌ
హరుడట మల్లికార్జునుడు నమ్మికయే భ్రమరాంబగా నటన్
స్థిరముగ గొల్వుదీరిన ప్రతీతపు మందిరమంచు దీని గో
పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్.
మరిమరి దర్శింతురుగద
రిప్లయితొలగించండితిరుపతి వెంకన్న గుడిని దివ్యంబనుచున్
సురుచిర సుందరమగు గో
పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్
సురుచిరమైన దేవళము చూడగ వత్తురు భక్తులెల్లరున్
దిరుపతి వేంకటేశ్వరుని దివ్య మనోహర మంగళాకృతిన్
మరిమరి కాంచగా మిగుల మక్కువ కల్గును దేవళంపు గో
పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్
అరుదగు పదవి కలదనుచు
రిప్లయితొలగించండిఖరువును పొందుచునె యెంత ఖలమును జేయన్
పురమున దేవాలయ గో
పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్
కరములు మోడిచి మదిలో
రిప్లయితొలగించండిహరినిఁదలచి శిరమువంచి యభివాదమ్మున్
విరళిని సలుపుచు గుడిగో
పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్
కరములు మోడ్చి చిత్తమున కారణకారణమున్ దలంచుచున్
రిప్లయితొలగించండిస్థిరమగు భక్తి నెక్కొనగ శీర్షము వంచి నమస్కరించి శం
కరుని కృపాకటాక్షములు కామితసిద్ధికి దేవళంపు గో
పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్
గిరి పై వెలసిన రుద్రుని
రిప్లయితొలగించండితిరముగ సేవించి మిగుల దేదీ ప్య ము గా
మెరిసె డి కోవెల దౌ గో
పురమును గనినన్ జనులకు బుణ్యము గల్గు న్
స్థిరమగు చిత్తము తోడను
రిప్లయితొలగించండినిరతమ్మా పరమశివుని నిలుపుచుమదిలో
స్మరియించుచు చని కాశీ
*“పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్”*
మరచుచుమంచిచెడ్డలనుమానినితోచరియించుభక్తునిన్
కరమనురక్తితోడనటగాంచుచుబుద్ధిని మార్చి పెద్దలన్
నిరతముకొల్చురీతిగనునేర్పిన శ్రీహరియున్నపండరీ
*“పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్”*
గిరిజా నాథుని గగనాం
రిప్లయితొలగించండిబరునిం బ్రేతగణ భూత పతినిం బరమే
శ్వరుఁ గొల్చిన నటరా ణ్నూ
పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్
త్వరపడు వేంకటేశ్వరుని దర్శన మొప్పును జేయఁ బిమ్మటం
దిరుమల ఱేనికిం బుడమిఁ దేర యొసంగెను వేంకటాద్రిలో
గురు మహి మాన్వితుం డతఁడు గొప్ప వరాహపుఁ బేరి స్వామిఁ జూ
పుర మునుఁ గాంచినం గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్
వర శంకరార్య పీఠము
రిప్లయితొలగించండివరలెను, కామాక్షి యమ్మవారును దయతో
స్థిర శుభముల నిడు కాంచీ
పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్
నిరతము భక్తి మార్గమున నిశ్చలబుద్ధి సమన్వితుండునై
హరు జప పూజనాదికము లంచిత శక్తి ఘటించుచున్ మహే
శ్వరుని సుదర్శనార్థమయి సంతసమందుచు బోయి కాశికా
పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్
కం॥ పరిణితిఁ బడయుచు ధర్మము
రిప్లయితొలగించండిధరణిని విడువకఁ బరఁగుచుఁ దన్మయమొందఁగన్
విరిసిన భక్తిని తిరుమల
పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్
చం॥మరువక భక్తి శ్రద్ధలను మన్ననఁ జేయుచుఁ బాండు రంగనిన్
ధరణినిఁ గొల్చి మ్రొక్కులిడి ధర్మముఁ దప్పక మోదమందుచున్
నిరతము పాదదాసుఁడుగ నెమ్మినిఁ దత్పరుడౌచు పండరీ
పురమునుఁ గాంచినన్ గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్
లోకులు పలుతీరులుగాదె!ఒక్కరైతు
రిప్లయితొలగించండిచెరువు నిండెనంచొక్కడు,నేడ్చె పంట
పాడగుటగాంచినొక్కడు పరితపించె
ఒకనినేడ్పించె,మురిపించెనొకని వాన!
By
వేదుల గణపతి రావు