ఉ:మా తల పైన నే పిడుగు మారణ కాండను జూపునో యటం చా తరుణీమణుల్ బెదర నా జలదమ్ముల వర్ష గర్జలన్ చేతము నందు దోచ నది శ్రీకర మౌనని రైతు బిడ్డకున్ ప్రీతినిఁ గూర్చె నాదమది భీషణమై నినదింప నెల్లెడన్ (ఉరుములకి స్త్రీలు నెత్తిన పిడుగు పడుతుందని భయపడ్డారు.రైతు ఆ నాదానికి వర్షానికి సంతోషించాడు.)
ఆదరమున శ్రీరాముడు
రిప్లయితొలగించండిఛేదింపగనెంచె ధనువుఁ సీతకు వరుడై
కోదండము వ్రక్కలయిన
నాదము మోదమిడె భీషణమ్ముగ మ్రోగన్
సీతను పెండ్లియాడ నటఁ జేరిరి పెక్కురు రాజ పుత్రులే
చేతనిమిడ్చి విల్లుఁ దన చేవను చూపగ సూర్య వంశ సం
జాతుడు రాముడెక్కిడగ చాపము పెళ్ళున వ్రయ్యెలయ్యెగా
ప్రీతినిఁ గూర్చె నాదమది భీషణమై నినదింప నెల్లెడన్
కందం
రిప్లయితొలగించండివేదనఁ బడు ద్రౌపదికి వృ
కోదరుఁ డా దుస్ససేను గూల్చిన క్షణమే
రోదననసువులుఁ బాసెడు
నాదము మోదమిడె భీషణమ్ముగ మ్రోగన్!
ఉత్పలమాల
నాతిని ద్రౌపదిన్ సభను నల్వురి ముందర దుస్ససేనుడున్
నైతికమన్నదే మఱచి నవ్వుచు వల్వల నూడ్చి నంత నా
వాతసుతుండు యుద్ధమున వక్షము చీల్చియుఁ గ్రోల రక్తమున్
బ్రీతిని గూర్చె నాదమది భీషణమై నినదింప నెల్లెడన్!
కం॥ జూదముననోడి సైఁచిరి
రిప్లయితొలగించండివేదన యుద్ధము జరుగఁగ విక్రమమొప్పన్
మోఁదఁగఁ గూలెడు పగతుల
నాదము మోదమిడె భీషణమ్ముగ మ్రోగన్
ఉ॥ దూతగఁ జొచ్చి కృష్ణుఁడటు తోషము నొందెడి రీతిఁ దెల్పఁగన్
నీతినిఁ గౌరవాధములు నేమము వీడి తిరస్కరించఁగన్
ఘాతక శస్త్ర యుద్ధమున గౌరవ యోధులుఁ గూలుచుండఁగన్
బ్రీతినిఁ గూర్చె నాదమది భీషణమై నినదింప నెల్లెడన్
పేదముల పఠన సలిపెడువేళ వచ్చు
రిప్లయితొలగించండినాదము మోదమిడె ; భీషణమ్ముగ మ్రోగన్
పైదలిలందరు వీణా
నాదమునాపిరి చెవులకు నయముగ లేకన్
రిప్లయితొలగించండివాదన లేటికి రాఘవు
డీ దరమము తేలికంచు నెత్త విరుగగా
నా ధరణిజ కచ్చట యా
నాదము మోదమిడె భీషణమ్ముగ మ్రోగన్.
ఆతత సుందరుండు యతి యాగము గాచిన శౌర్యవంతుడా
ఖ్యాతి గడించినట్టి ముని కౌశికు డానతి తోడ నెత్తగా
ప్రాతధనుస్సు భీకరపు రావము తో విరుగంగ సీతకున్
ప్రీతినిఁ గూర్చె నాదమది భీషణమై నినదింప నెల్లెడన్.
భూతగణాధినాయకుని భూరి ధనుస్సును రామచంద్రుడే
రిప్లయితొలగించండిలేత కరమ్మునన్ నిలిపి లీలగ దానిని త్రెంచినంతటన్
ధాతకు దేవనేతకు సుధాకర భ్రాతకు నాతి సీతకున్
ప్రీతినిఁ గూర్చె నాదమది భీషణమై నినదింప నెల్లెడన్
(శివుడు చంద్రునికి తోడల్లుడు అవ్వటం చేత సుధాకరభ్రాత అయ్యాడు)
చేతనుబూని యస్త్రములు చేతమునందున నిల్పి మాధవున్
రిప్లయితొలగించండిభీతిలశత్రు సైన్యములు భీషణ శంఖము దేవదత్తమున్
భాతిగనూద ఫల్గుణుఁడు పాండవ పక్షములోని వారికిన్
ప్రీతినిఁ గూర్చె నాదమది భీషణమై నినదింప నెల్లెడన్
వాదము లేల రణమ్మున
రిప్లయితొలగించండినీదు పరాక్రమము సూపు నెగ్గఁ దలఁచినన్
నా దొడ్డ యెలుంగున నన
నాదము మోద మిడె భీషణమ్ముగ మ్రోఁగన్
వీత భయాంతరంగు లయి విశ్వ రణం బొడఁగూడు శంక నే
రీతిని లెక్క సేయక కురింప శతఘ్నులు నింగి నిర్దయన్
భీతి నొసంగి యెల్లరకుఁ బెల్లుగ రోతను, వీడి సాంతముం
బ్రీతినిఁ, గూర్చె నాద మది భీషణమై నినదింప నెల్లెడన్
వేదననొందఁగ శత్రువు
రిప్లయితొలగించండిసాదరముగశౌరినడుప స్యందనమునుతా
నూదగ శంఖము కృష్ణకు
నాదము మోదమిడె భీషణమ్ముగ మ్రోగన్
కాదన బో రె వ్వ రును
రిప్లయితొలగించండిపేదల పెన్నిధి గ వెలుంగు విఖ్యాతు గనుచున్
సాదర పూర్వ ప్ర శంస ని
నాదము మోద మి డె భీష ణ మ్ము గ మ్రో గన్
కం:ఖేదము నొందెను ద్రోణుం
రిప్లయితొలగించండిడా దరువుల తోడ పుత్రహతిని దలచి తా
నే దారి జూపిన హరికి
నాదము మోదమిడె భీషణమ్ముగ మ్రోగన్”
(అశ్వత్థామ హతః అంటూ దరువులు మ్రోగించగా ద్రోణుడు ఖేద మొందాడు.ఆ ఉపాయం చూపిన కృష్ణునికి అది నెరవేరుతుంటే సంతృప్తి నిచ్చింది.)
ఉ:మా తల పైన నే పిడుగు మారణ కాండను జూపునో యటం
రిప్లయితొలగించండిచా తరుణీమణుల్ బెదర నా జలదమ్ముల వర్ష గర్జలన్
చేతము నందు దోచ నది శ్రీకర మౌనని రైతు బిడ్డకున్
ప్రీతినిఁ గూర్చె నాదమది భీషణమై నినదింప నెల్లెడన్
(ఉరుములకి స్త్రీలు నెత్తిన పిడుగు పడుతుందని భయపడ్డారు.రైతు ఆ నాదానికి వర్షానికి సంతోషించాడు.)
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
మోదమున తాళి వేళను
నాదస్వరమునకు తోడు నలు దుందుభులున్
మోదగను నొక్క సారిగ
నాదము మోదమిడె భీషణమ్ముగ మ్రోగన్.
వాదనలేలవినుమనని
రిప్లయితొలగించండి*నాదము మోదమిడె భీషణమ్ముగ మ్రోగన్”*
వేదనలవితగ్గగమది
కేదారమునసంచరించుకేకియువోలెన్.
డా బల్లూరి ఉమాదేవి
నాతిని నిండు కొల్వునను న్యాయము వీడుచు కోక లాగగన్
నీతినిమాలినెల్లరును నివ్వెరబోయెడిరీతిచేయగా
వాతసుతుండు క్రోధుడయి వారిని చంపుదు నంచు పల్కగన్
*“ప్రీతినిఁ గూర్చె నాదమది భీషణమై నినదింప నెల్లెడన్”*