సొంత బిడ్డఁ వీడ చింతింప కుండెగా వింత నడత నొరసి కుంతి యనగ మేనక నరయంగ తానొక యభినయ కుంతి తల్లి యగు శకుంతలకును
కుంతల రాజపుత్రికను కుంతిగ పేర్కొను చుంద్రు సత్యమే సుంతయు జాలిలేక మరి సొంత కుమారుని వీడు భామనే కుంతియనంగ మేనకయె, కొందరు విజ్ఞులు పోల్చి చూడగా కుంతియె, తల్లి యయ్యెను శకుంతలకంచు వచింత్రు పండితుల్
ఆ.వె:భరత వంశగాధ వన్నె బెంచెడు తల్లి కుంతి తల్లి యగు, శకుంతలకును వారసత్వకీర్తి వర్థిల్ల జేసెడు శాంత మూర్తి కాదె కుంతి యనగ! (కుంతీ దేవిని గౌరవ సూచకం గా కుంతి తల్లి అన్నాను.కుంతి ఆదర్శప్రాయురా లైన తల్లి.శకుంతల యొక్క వంశపు కోడలు కనుక శకుంతలకు కీర్తి తెచ్చింది.) ఉ:"ఎంతటి ఘోరమో!ఒక నరేశుడె పెండిలి యాడి బిడ్డనున్ కాంతను కాదు పొమ్ననుట గాదె శకుంతల గాధలోన!భా స్వంతుని పుత్రునిన్ గనియు భానుదయన్, కడు బాధ లొందుటన్ కుంతియె తల్లి యయ్యెను శకుంతల "కంచు వచింత్రు పండితుల్. (భర్త,కొడుకు తో శకుంతల ఒక బాధ పడగా కుంతి సూర్యుడి తో కర్ణుని తో అంతకంటే బాధ పడింది.బాధలలో కుంతి శకుంతలకి తల్లి వంటిది.)
రిప్లయితొలగించండితల్లిదండ్రులచట తనయను విడనాడి
కఠిన హృదయులగుచు కదలి పోగ
గాంచి శిశువు నచట కాపాడి నట్టి శ
కుంతి తల్లి యగు శకుంతలకును.
(శకుంతి=పక్షి)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండికౌగిట బిగియింప కౌశికుడు భ్రమసె
వజ్రిపంపినట్టి వలపురాశి
పరిమళంపుపుట్ట తరుణిగ మేనక
కుంతి, తల్లి యగు శకుంతలకును
ఉత్పలమాల
పంతము పట్టి పంపనల వజ్రియె మేనక సోయగమ్మునం
దంతటి కౌశికుండు తపమాపుచు కౌగిట జిక్కి కేళిలో
సొంతము గాగ మేనకయె సూనను బొందఁగ సౌరభమ్మునన్
గుంతియె, తల్లియయ్యెను శకుంతలకంచు వచింత్రు పండితుల్!
(కుంతి = రేణుకయను గ్రంధద్రవ్యము)
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిమంత్రమహిమబుట్టె మా రాజు కర్ణుడు
రిప్లయితొలగించండికుంతితల్లియగుశకుంతలకును
మేనమాతయయ్యె మీరగాతపసియు
బిడ్డవీడిచనిరి వింతగాదె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిదుంతవయాళికానికి సుతుండగు ధర్మజు కన్నతల్లి యే
యింతియొ తెల్పుమంచు మరి యెవ్వరి కిన్ భరతుండు పుట్టెనో
పంతము వీడి చెప్పుమన భామయె యుత్తరమిచ్చె నిట్టులన్
కుంతియె తల్లి యయ్యెను , శకుంతలకంచు వచింత్రు పండితుల్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివింతగసూర్యుమంత్రమునబిడ్డడుకర్ణుడుజన్మనందగా
రిప్లయితొలగించండికుంతియెతల్లియయ్యెను, శకుంతలకంచువచింత్రుపండితుల్
వంతమిగిల్చెమేనకయువైనములేనిమహర్షిపొందుతో
చింతనులేనిమాతలుగచేకొనజాలరుమాతృప్రేమనే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములుగురువుగారు
తొలగించండిపంచపాండవులను పెంచిన పడఁతియె
రిప్లయితొలగించండికుంతి తల్లి యగు, శకుంతలకును
తల్లి మేనకయగు తండ్రి కౌశికుడగు,
భరతు గన్నతల్లి భవ్య చరిత.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆ॥ కమలధరుఁ గొలచిన కతన భానుజునకు
రిప్లయితొలగించండికుంతి తల్లి యగు, శకుంతలకును
బ్రాణము నిలిపెఁ గద పక్షులు రెక్కలఁ
గప్పి హింస్రకముల ముప్పుఁ బాపి
ఉ॥ వింతగ ముద్దు కన్యగనె వేడఁగ సూర్యుని జ్ఞానశూన్యతన్
గుంతియె తల్లి యయ్యెను. శకుంతలకంచు వచింత్రు పండితుల్
చెంతకుఁ జేరి రెక్కలను జిహ్వరదమ్ములె కప్పి కాచెనే
కొంతయుఁ గాంచనీయకను గ్రూరమృగమ్ములు రక్షసేయుచున్
కమలధరుడు సూర్యుడు
భానుజుడు కర్ణుడు
హింసక్రము క్రూరమృగము
జిహ్వరదము పక్షి
నిఘంటువు సహాయమండి
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిభారతమున గనగ పంచపాండవులకు
రిప్లయితొలగించండికుంతి తల్లి యగు ; శకుంతలకును
మేనక యగు మాత , మేఘవాహను కడ
నామె సుందరమగు యప్సరసయె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసొంత బిడ్డఁ వీడ చింతింప కుండెగా
తొలగించండివింత నడత నొరసి కుంతి యనగ
మేనక నరయంగ తానొక యభినయ
కుంతి తల్లి యగు శకుంతలకును
కుంతల రాజపుత్రికను కుంతిగ పేర్కొను చుంద్రు సత్యమే
సుంతయు జాలిలేక మరి సొంత కుమారుని వీడు భామనే
కుంతియనంగ మేనకయె, కొందరు విజ్ఞులు పోల్చి చూడగా
కుంతియె, తల్లి యయ్యెను శకుంతలకంచు వచింత్రు పండితుల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ🙏
తొలగించండిఆర్యా! పద్యములు బాగున్నవి.
తొలగించండిచిన్న సందేహము:
శకుంతల, కుంతిలలో ఎవరు ముందు? ఎవరు తర్వాత?
పై పద్యము క్రింది పద్యములలో విభిన్నత?
ఆర్యా! నమస్కారం. కుంతి, శకుంతలలో ఎవరు ముందో నాకూ తెలియదు.
తొలగించండిఏ పద్యానికా పద్యాన్ని మాత్రమే పరిగణించి వ్రాసినవి. ధన్యవాదాలు.
శాంతుఁడు ధర్మజున్ గనిన సద్గుణవల్లియు దాన కర్ణునిన్
రిప్లయితొలగించండిసంతుగ పొందినట్టి ఘన సచ్చరితెవ్వరు? విశ్వమిత్రుడే
యింతికి జన్మనిచ్చె నతఁడేర్పడ గూడఁగ నప్సరాంగనన్?
కుంతియె తల్లి యయ్యెను, శకుంతలకంచు వచింత్రు పండితుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసూర్య పుత్రు డైన సూత కర్ణునకును
రిప్లయితొలగించండికుంతి తల్లి యగు :: శకుంతల కును
భరతు డే సుతు o డు భారత మున కాత o
డ య్యె మూల మందు రార్యులు గద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆ.వె:భరత వంశగాధ వన్నె బెంచెడు తల్లి
రిప్లయితొలగించండికుంతి తల్లి యగు, శకుంతలకును
వారసత్వకీర్తి వర్థిల్ల జేసెడు
శాంత మూర్తి కాదె కుంతి యనగ!
(కుంతీ దేవిని గౌరవ సూచకం గా కుంతి తల్లి అన్నాను.కుంతి ఆదర్శప్రాయురా లైన తల్లి.శకుంతల యొక్క వంశపు కోడలు కనుక శకుంతలకు కీర్తి తెచ్చింది.)
ఉ:"ఎంతటి ఘోరమో!ఒక నరేశుడె పెండిలి యాడి బిడ్డనున్
కాంతను కాదు పొమ్ననుట గాదె శకుంతల గాధలోన!భా
స్వంతుని పుత్రునిన్ గనియు భానుదయన్, కడు బాధ లొందుటన్
కుంతియె తల్లి యయ్యెను శకుంతల "కంచు వచింత్రు పండితుల్.
(భర్త,కొడుకు తో శకుంతల ఒక బాధ పడగా కుంతి సూర్యుడి తో కర్ణుని తో అంతకంటే బాధ పడింది.బాధలలో కుంతి శకుంతలకి తల్లి వంటిది.)
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఇంతు లిద్ద ఱచట సంతస మేపార
రిప్లయితొలగించండిమాట లాడుచుండ్రి బోటి యొకతె
కుంతి రెండవది శకుంతల వీక్షింపఁ
గుంతి తల్లి యగు శకుంతలకును
ఇంతుల లోన సుందరి మునీశ్వరు మోహితుఁ జేసి తాపసిన్
సంతు నొసంగెఁ గాపురము సల్పి చిరమ్ము వనాంతరమ్ములం
గంతుని కోడఁ జేసి తగఁ గౌశికు మేనక గాత్ర లిప్త స
త్కుంతియె తల్లి యయ్యెను శకుంతల కంచు వచింత్రు పండితుల్
[కుంతి = ఒక గంధ ద్రవ్యము]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఎంచి చూడగాను పంచ పాండవులకు
కుంతి తల్లి యగు; శకుంతలకును
తల్లి మేనక యగు,తండ్రి కౌశికుడయ్యె
పెంచి కణ్వ మునియె పెద్ద చేసె.
తపముభంగపరచుతలపుతో నచ్చర
రిప్లయితొలగించండికాంత యరుగు దెంచి కౌశికుదరి
తళుకు బెళకుచూపి తల్లియై వీడ శ
*కుంతి తల్లి యగు శకుంతలకును*
వరము నొసగ మునియు భానుచే కన్యగా
*కుంతి తల్లి యగు, శకుంతలకును*
కణ్వు డనెడి మునియు కన్న తండ్రి వలెను
ప్రేమ తోడ పెంచి పెద్ద చేసె
చెంతకుచేరుచున్వడిగచేతము దోచగ వచ్చె కాంత తా
సుంతయుచింతచేయకనుచూపుచు ప్రేమను మౌనిపైసదా
కంతుడువేయగాశరముకౌశికుచేసుతకల్గవీడశా
*కుంతియెతల్లియయ్యెను శకుంతల కంచు వచింత్రు పండితుల్*