అండ నొసఁగ నుండి యొండెద్ధి కోరక దండి భక్తి యొండు దక్క యెడఁద వసుథ లోనఁ గూర్మి వాసుదేవుండె గో పుండె నరుల కొసఁగుఁ బూర్ణ సుఖము
ఉండ ధనమ్ము లే దనుచు నోడకు మయ్య దరిద్ర దుఃఖముం జెండక చేయి చాఁపుదురె సిగ్గొక యింతయు లేక యేరు నీ కుండిన లేక యున్న ధృతి యుండఁగ నుండుమ యింటిపట్టునం బుండె కదా సమస్త సుఖముల్ గలిగించును మానవాళికిన్
ఉ:నిండుగ పాలు త్రావ కిటు నేలన మట్టిని తిందువా యనన్, దండుగ యుద్ధ మంచు కడు తాపము నందు కిరీటికిన్,కనుల్ రెండును లేని రాజునకు ప్రీతిగ సత్యము జూపు విశ్వ రూ పుండె కదా సమస్త సుఖముల్ గలిగించును మానవాళికిన్ (శ్రీ కృష్ణుడు విశ్వరూపాన్ని మూడు సార్లు చూపించాడు.)
ఆటవెలది
రిప్లయితొలగించండిమకరి పట్టు నుండి మాతంగమును గాచె
బలము లేదటంచు పాహి యనఁగ
శ్రీకరుండు శౌరి వైకుంఠ ధామాధి
పుండె నరుల కొసఁగుఁ బూర్ణసుఖము
ఉత్పలమాల
గండము వాపుమా! శరణు కంజదళాక్ష! కృపాకరా! యనన్
బండెను భక్తవత్సలుఁడు వారణమున్ వడిఁ జక్రి కాచెనే
గుండెల నింపి యార్తిగను గోరిన వచ్చి వికుంఠ ధామ భూ
పుండె కదా సమస్త సుఖముల్ గలిగించును మానవాళికిన్
తండ్రి, వలెనుగాచు తప్పులుఁజేయుచో
రిప్లయితొలగించండిపాలకుండునగుచు పరిఢవిల్లు
ప్రజలకడుపునింపు దైవమీరాజ్యాధి
పుండెనరులకొసగుపూరణసుఖము
ప్రజలకడుపునింపు నింపు ప్రభువును రాజ్యాధి
తొలగించండిపుండెనరులకొసగుపూర్తిసుఖము
ప్రతి వరుసము నందు ప్రతినగనె మకర
రిప్లయితొలగించండిసంక్రమణము ముందు సమయమందు
పంటకు చెదపురుగు పట్టకుండ దగు కా
పుండె నరుల కొసఁగుఁ బూర్ణసుఖము
నల్లనయ్యవాఁడు నవనీతచోరుఁడు
రిప్లయితొలగించండిగిరిని మోసినట్టి దొరయతండు
భక్త జనుల పాలి పరమాత్ముడతఁడు గో
పుండె నరుల కొసఁగుఁ బూర్ణసుఖము
అవని పైన జన్మ మానంద హేతువే
రిప్లయితొలగించండిబ్రతుకొసంగు హాయి ప్రతి నిమిషము
బ్రతుకు భారమైన వయిళము శమన రి
పుండె నరుల కొసఁగుఁ బూర్ణసుఖము
అండగనుండువాడు జగమంతయు నిండినవాడు దైత్యులన్
తొలగించండిజెండుచు సత్ప్రవర్తకుల చిత్తమునందున సంవసించుచున్
మెండుగ లోకరక్షణకు మేకొని బ్రోచుచు నుండు సర్వ రూ
పుండె కదా సమస్త సుఖముల్ గలిగించును మానవాళికిన్
రండనిబిల్చిదీనులకురాగలయాపద రక్షకుడునైన
రిప్లయితొలగించండిమెండుగకా, ితార్థములమిత్రునివోలెను ప్రేమనిచ్చుచున్
కొండలరాయడైబరఁగికుమ్మరిబ్రోచియనంతుడాప్రదీ
పుండెకదాసమస్తసుఖముల్ కలిగించును మానవాళికిన్
రక్షకుండునై
రిప్లయితొలగించండిమెండుగకామితార్థములమిత్రునివోలెనుప్రేమనిచ్చుచున్
రిప్లయితొలగించండిభక్తసులభుడంచు వాసిగాంచినవాడు
శరణు వేడినంత కరుణజూపు
భుజగ భూషణుండు పునుకతాలు పభిరూ
పుండె నరుల కొసఁగుఁ బూర్ణసుఖము.
(పునుకతాలుపు+ అభిరూపుడు)
మండలి భూషణమ్ముగను మర్కుని మెచ్చుచు శీర్షమందునన్
జండిక నర్ధదేహమున జక్కగ నిల్పిన యస్థి ధన్వుడే
దండిగ విశ్వసించు పద దాసుల బ్రోచెడి యంతరాత్మ, ద్రా
పుండె కదా, సమస్త సుఖముల్ గలిగించును మానవాళికిన్.
అండయతండె రామవిభుఁడార్తుల బ్రోచు దయామయుండు కో
రిప్లయితొలగించండిదండముఁ జేతబూని పలుదైత్యుల సంహరణంబొనర్చి వే
దండమునెక్కి భక్తులకు దర్శనమీయఁగ నేగుదెంచు భూ
పుండె కదా సమస్త సుఖముల్ గలిగించును మానవాళికిన్
భండన భీముడై భువన భాండములన్ ముఖమందుఁ జూపి యా
రిప్లయితొలగించండికొండను గోటనెత్తి మరి గోపకులమ్మును గాచు బాలుడే
గండర గండడై గరళ కాళియ మర్దన నీలవర్ణ రూ
పుండె కదా సమస్త సుఖముల్ గలిగించును మానవాళికిన్!!
పాహి పాహి యనుచు పడతి మొరలి డంగ
రిప్లయితొలగించండివలువ లొసగి కాచె వాసి గాను
శిష్టజనులకాచు శ్రీనరసింహరూ
*"పుండె నరుల కొసఁగుఁ బూర్ణ సుఖము”*
డా బల్లూరి ఉమాదేవి
అండగ నుండు చెల్లపుడు నాపద లందున కాపు కాయుచున్
నుండక నొక్కతావుననె నొప్పుగ నార్తుల నాదరించుచున్
మెండుగ భోగభాగ్యముల మేదినియందు నొసంగు చిత్రరూ
*“పుండె కదా సమస్త సుఖముల్ గలిగించును మానవాళికిన్”*
గండరగండడై నిలచి కార్యములందునఁ బ్రజ్ఞ జూపుచున్
రిప్లయితొలగించండిభండన మందునన్ జెలగి వైరులు చెచ్చెర మట్టుపెట్టుచున్
అండనొసంగుచున్ బ్రజకు హ్లాదము నిచ్చుచు నుండు నట్టి భూ
పుండె కదా సమస్త సుఖముల్ గలిగించును మానవాళికిన్
కోసలాధిపుండు కోదండ రాముండు
రిప్లయితొలగించండిజానకీ ప్రియుండు జనవరుండు
దైత్యమర్దనుండు ధైర్య రఘుకులాధి
పుండె నరుల కొసఁగుఁ బూర్ణసుఖము!!
ప్రజల బాగు గోరు పాలనా దక్షుడై
రిప్లయితొలగించండిసతము పాటు పడెడు పావనుండు
ప్రజల మెప్పు నంది భాసించెడి నరా ధి
పుండె నరుల కొసగు పూర్ణ సుఖము
రెండవ పాదంలో సతము పాటు పడె డు సత్య శీలి అని సవరణ చేయడమైనది
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ॥ కష్టనష్టములిలఁ గ్రమ్మఁగ నధికమై
తొలగించండిదుఃఖభాజనంపు దుగ్ధ హెచ్చ
సాధనఁగనఁ గృష్ణు సంసేవఁ జేసి గో
పుండె నరులకొసఁగుఁ బూర్ణ సుఖము
ఉ॥ దండుగఁ గష్టనష్టములు ధాత్రినిఁ గ్రమ్మఁగ దిక్కుఁ దోఁచకే
నిండఁగ దుఃఖసాగరము నేమముఁ దప్పక భక్తినిష్ఠలన్
మెండుగఁ గృష్ణుఁగొల్చుచుచు మిక్కిలి సాధనఁ జేయఁ నల్లగో
పుండె కదా సమస్తసుఖముల్ గలిగించును మానవాళికిన్
ఉరికే భక్తి నిష్ఠలుంటే చాలవు వాటితో పాటు శ్రమ సాధన అవసరమనేది నాభావన అండి
తోచక కళ అని నాకు తెలియదండి. మిత్రులు తెలిపిన తరువాత సవరించాను
ఆ.వె:ధర్మమార్గ మెపుడు దప్పక చరియించు,
రిప్లయితొలగించండిదేశ వృద్ధి కొరకు దీక్ష బూను,
ప్రజలు బిడ్డ లంచు బాలించు దేశాది
పుండె నరుల కొసగు పూర్ణసుఖము.
ఉ:పండితు డయ్యు,సాధుజన బాంధవు డయ్యును,విక్రమాన మా
రిప్లయితొలగించండిర్తాండుడు నయ్యు సత్కవన ధారల బెంచెడు,కృష్ణరాయతు
ల్యుండగు విజ్ఞుడౌ నృపతి యొక్కడు నుండిన నట్టి జ్ఞానదీ
పుండె కదా సమస్త సుఖముల్ గలిగించును మానవాళికిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅండ నొసఁగ నుండి యొండెద్ధి కోరక
రిప్లయితొలగించండిదండి భక్తి యొండు దక్క యెడఁద
వసుథ లోనఁ గూర్మి వాసుదేవుండె గో
పుండె నరుల కొసఁగుఁ బూర్ణ సుఖము
ఉండ ధనమ్ము లే దనుచు నోడకు మయ్య దరిద్ర దుఃఖముం
జెండక చేయి చాఁపుదురె సిగ్గొక యింతయు లేక యేరు నీ
కుండిన లేక యున్న ధృతి యుండఁగ నుండుమ యింటిపట్టునం
బుండె కదా సమస్త సుఖముల్ గలిగించును మానవాళికిన్
[పుండు = గుట్టు]
ఉ:నిండుగ పాలు త్రావ కిటు నేలన మట్టిని తిందువా యనన్,
రిప్లయితొలగించండిదండుగ యుద్ధ మంచు కడు తాపము నందు కిరీటికిన్,కనుల్
రెండును లేని రాజునకు ప్రీతిగ సత్యము జూపు విశ్వ రూ
పుండె కదా సమస్త సుఖముల్ గలిగించును మానవాళికిన్
(శ్రీ కృష్ణుడు విశ్వరూపాన్ని మూడు సార్లు చూపించాడు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి