ద్వారకఁ జేరునప్పటికె తాను సుయోధనుడేగుదెంచె, నే జేరిన వెన్క మాధవుడు సేనను రెండుగఁ జేసినంత నే కోరితి నందనందనునిఁ గోమలి! పాండవ పక్షమౌను కం సారి యటంచు ఫల్గుణుఁడు సాధ్వి సుభద్రకుఁ జెప్పె నప్పుడున్!!
శా:"మీరలు చక్రబంధమును మిక్కిలి నేర్పున ద్రుంచు వార లా ధీరత యేదొ దెల్పు "డని ధీయుత యై పలుమార్లు కోర నీ కోరిక నేడు తీర నిదిగో వివరించెద వీరనారి !యీ సారి యటంచు ఫల్గుణుఁడు సాధ్వి సుభద్రకుఁ జెప్పె నప్పుడున్ (చక్రవ్యూహాన్ని ఎలా ఛేదిస్తారు? అని సుభద్ర అనేక మార్లు అడిగింది.ఈ సారి చెపుతా లే ! అని అర్జునుడు వివరించాడు.)
తేటగీతి
రిప్లయితొలగించండిసేవలెన్నియొ సల్పితె చిత్తమందు
భక్తిభావమ్ము దెలిసితి పల్లవాంగి
సొగసుకత్తియ! రక్తితో చూడు మొక్క
సారి యనెను సుభద్రతో సవ్యసాచి
ఉత్పలమాల
తొలగించండిసారెకు సారెకున్ దిరిగి చక్కఁగ సేవలు సేసినావె నీ
కూరిన భక్తి భావమును కొంచెము రక్తిగ మార్చి చూడ సం
సారిగ మారెదన్ దరుణి! సర్వము బావగఁ దీర్చె శౌరి, కం
సారి యటంచు ఫల్గుణుఁడు సాధ్వి సుభద్రకుఁ జెప్పె నప్పుడున్
మేలమాడుచుకృష్ణుడు మిత్రుడగును
రిప్లయితొలగించండికూలద్రోయునుగర్వంబు కోరు హితము
భారమెంచకతానుగా బంధువు నొక
సారియనెను సుభద్రలతో సవ్యసాచి
కోరికదీర్చెకృష్ణుడును కోమలి నిన్నును నాకు నిచ్చుచున్
రిప్లయితొలగించండికౌరవుతోడియుద్ధమునగాచెనుమమ్ముల రక్షకుడునైన
పారమునంటగీతపొలుపారగజెప్పెనుబోధకుండు కం
సారియటమచుఫల్గుణుడు సాధ్విసుభద్రకుఁజెప్పెనప్పుడున్
ఆదరణమునొసగి దమ యాలయమున
రిప్లయితొలగించండికల్లునిగ జేసుకొనుటకై యనుమతించు
యందరికిని నాయంజలి యనుచు మరొక
సారి యనెను సుభద్రతో సవ్యసాచి
సాధువలె జేరి సుదతితో సరసమాడి
రిప్లయితొలగించండిచెలువకు నిజరూపమెరుగ జేయనెంచి
గోమున తన కరము నందు కొమ్మనియొక
సారి యనెను సుభద్రతో సవ్యసాచి.
వీరుని విజయుని వలచి వేచినావు
రిప్లయితొలగించండివలజ నీదు మనసెరిగి వచ్చియుంటి
నొద్దిక కవుగిటనొదిగి ముద్దిడుమొక
సారి యనెను సు భద్రతో సవ్యసాచి
వీరుని పార్థునిన్ వలచి వేచిన నీదరిఁ జేర వచ్చితిన్
నీరజనేత్రి నీ కొఱకు నేనిట చాచితి ప్రేమ హస్తమున్
కోరిన వానికౌగిలికి గుట్టుగ చేరినఁ ముద్దులిత్తు నో
సారి యటంచు ఫల్గుణుఁడు సాధ్వి సుభద్రకుఁ జెప్పె నప్పుడున్
బావ యదువంశ సింహము పార్థ సఖుడు
రిప్లయితొలగించండిపుణ్యములరాశి కృష్ణుని బోయవాని
చిలుకు తగిలి పడంగ జూచితినట కడ
సారి యనెను సుభద్రతో సవ్యసాచి!!
ద్వారకఁ జేరునప్పటికె తాను సుయోధనుడేగుదెంచె, నే
రిప్లయితొలగించండిజేరిన వెన్క మాధవుడు సేనను రెండుగఁ జేసినంత నే
కోరితి నందనందనునిఁ గోమలి! పాండవ పక్షమౌను కం
సారి యటంచు ఫల్గుణుఁడు సాధ్వి సుభద్రకుఁ జెప్పె నప్పుడున్!!
కోరి నిను పత్నిగా జేసికొనగ నేను
రిప్లయితొలగించండిమారు వేషాన వచ్చితి మౌనివోలె
నాదు ప్రేమను మన్నించు నారి యొక్క
సారి యనెను సుభద్రతో సవ్యసాచి
కోరివరించి వచ్చితిని కోమలి నా సతిగా నినున్ గొనన్
రిప్లయితొలగించండివీరుఁడనయ్యు మౌనివలె వేషముఁదాలిచి నిన్ను వొందగన్
జేరితినీ వనమ్మునకు చేడియ నీకయి వేచియుంటి వే
సారి యటంచు ఫల్గుణుఁడు సాధ్వి సుభద్రకుఁ జెప్పె నప్పుడున్
మాయా జూదము తరువాత ద్రౌపదిని యవమానించిన సమయమలో భీముని ప్రతిక్రియను అర్జునుడు సుభద్రకు వివరించుట
రిప్లయితొలగించండితే॥ భీముఁడుగ్ర రూపముఁ దాల్చి భీషణమగు
ప్రతినలను జేసె ద్రౌపది బాధఁ జూడఁ
జాలక నచట కౌరవ సభ విననొక
సారి యనెను సుభద్రతో సవ్యసాచి
ఉ॥ ఓరిమి వీడి భీముఁడటులోపక ద్రౌపది బాధఁ గాంచఁగన్
బోరునఁ ద్రుంచి త్రావెదను బొందుగ ఱొమ్మును చీల్చి రక్తమున్
భీరువ భీకరాకృతిని వీడన టంచును జేసె నాన వే
సారి యటంచు ఫల్గుణుడు సాధ్వి సుభద్రకుఁ జెప్పె నప్పుడున్
తే.గీ:"బావ కృష్ణుడే మనల వివాహమునకు
రిప్లయితొలగించండినండ యై నిల్చె నేదైన పండుగకును
నతని బిల్చి కాన్ క లిడ న్యాయమగు నొక్క
సారి యనెను సుభద్రతో సవ్యసాచి”
ముచ్చ టాడుచు పార్థుడు మురిప ముగను
రిప్లయితొలగించండిమాట లందున దొర్ల గా మరులు గ నొక
సారి యనెను సు భద్ర తో సవ్య సాచి
తమ్మి మొ గ్గ రంబు కు వెళ్ళు దారి గూర్చి
శా:"మీరలు చక్రబంధమును మిక్కిలి నేర్పున ద్రుంచు వార లా
రిప్లయితొలగించండిధీరత యేదొ దెల్పు "డని ధీయుత యై పలుమార్లు కోర నీ
కోరిక నేడు తీర నిదిగో వివరించెద వీరనారి !యీ
సారి యటంచు ఫల్గుణుఁడు సాధ్వి సుభద్రకుఁ జెప్పె నప్పుడున్
(చక్రవ్యూహాన్ని ఎలా ఛేదిస్తారు? అని సుభద్ర అనేక మార్లు అడిగింది.ఈ సారి చెపుతా లే ! అని అర్జునుడు వివరించాడు.)
శరణు కోరిన వారికిఁ జారు నేత్ర
రిప్లయితొలగించండియభయ మీయ కున్న దురిత మగు నటంచు
క్షత్రియాన్వయ సద్ధర్మ సంత తాను
సారి యనెను సుభద్రతో సవ్యసాచి
నేరక దోష మిచ్చితిని నే నభయమ్మును వేఁడి నంతటన్
శౌరికి వాసుదేవునకు శత్రువు నైతిని దైవికమ్ముగాఁ
దోరపు టాగ్రహానలముతో గయుఁ గాల్పఁ బ్రతిజ్ఞ సేసెఁ గం
సారి యటంచు ఫల్గుణుఁడు సాధ్వి సుభద్రకుఁ జెప్పె నప్పుడున్
రిప్లయితొలగించండితాపసిని కాదు నీపైన తగులమందు
నిట్టి వేషముంజేరితి నిదియె నిజము
నన్ను గాంచ నమ్రత వీడి నాతుక యొక
సారి యనెను సుభద్రతో సవ్యసాచి.
చేరుము చెంతకో పడతి సేవలజేసి యను గ్రహమ్మునే
కోరిన శ్రీకరమ్మగును కోపమదేలనె పేర్మితోడ నా
కోరిక దీర్చ పంపెనిటకున్ వ్రజ వల్లభు డాతడేను కం
సారి యటంచు ఫల్గుణుఁడు సాధ్వి సుభద్రకుఁ జెప్పె నప్పుడున్.
కపటయతిగనేతెంచిన కవ్వడచట
రిప్లయితొలగించండితనను గూర్చియడుగుచున్నతరుణినిగని
సుందర దర హాసము తోడ చూడుమొక్క
*“సారి యనెను సుభద్రతో సవ్యసాచి”*
చేరగ వచ్చితిన్ గనుచు చేకొను మోచెలి మారురూపునన్
నూరకబెట్టుచేయకనునొప్పుగ చేరగరమ్ముచెంతకున్
వారిజనేత్రుడైనహరిబావయు దారిని చూపెచూడుమో
*“సారి యటంచు ఫల్గుణుఁడు సాధ్వి సుభద్రకుఁ జెప్పె నప్పుడున్”*