1, నవంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4930

2-11-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ననననానాననననానననననాన”

(లేదా...)

“నననానానననాననాననననానానాననానాననా”

19 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. తేటగీతి
      పద్యమున్ వ్రాయు విద్యను బడయనెంచి
      గురువు నాశ్రయింపన వారు కూర్మితోడ
      తేటగీతి నడక యని తెలిపె నిటుల,
      "ననన నానాన నననాన ననన నాన"


      మత్తేభవిక్రీడితము
      వినయమ్మొప్పగ జేరియున్ గురువునే వేడంగ పద్యానికై
      వినుమా నేర్పెద చక్కగన్ నడకనే ప్రీతిన్ విలోకించుమా!
      దినమున్ మీరలు నభ్యసింపుమని మత్తేభమ్మునిట్లాడెనే,
      "నననా నానన నాననా ననన నానానాన నానాననా"

      తొలగించండి
  2. అనగా నారాముడన దేవుడండ్రుగాదె
    వినగలేదుగ సీతమ్మవిన్నపంబు
    ధరణిపుత్రికయేరీతి తప్పు జేసెను
    ననననానాననననానననననాన

    రిప్లయితొలగించండి
  3. కనియెన్శూన్యము కావ్యమల్లగను తాగంటంబునేబూనగా
    కనగారావుగఛందమల్గతులునాకాశంబులోచుక్కలై
    వినగారానిదిఘోషయైవెడలెలేవేగంబునిట్టూర్పులన్
    నననానానననాననాననననానానాననానాననా

    రిప్లయితొలగించండి
  4. ననననానాననననానననననాన
    తేటగీతి పోకడ యిది తెలియుమయ్య
    దీని యర్ధమేమిటనుచు దేవవలదు
    శంకరార్యుని కౌడిది శంకయేల

    రిప్లయితొలగించండి
  5. ఘన విద్యాలయమంచు జేర్చితి సుతున్ గారాబమే మీరగన్
    ధనమే పెట్టితి వేలవేలు చదువే దర్శింప సున్నాయగున్
    వినగన్ గోరితి "నా" గుణింతమిటులన్ వేదించె పుత్రుండహో!
    నననానానననాననాననననానానాననానాననా!

    రిప్లయితొలగించండి
  6. నినుఁనా స్వప్నమునందు గాంచితిని నిన్నేకోరినా యూహలం
    దనయమ్మున్ దపియించితిన్ మనమునందంభోరుహాక్షీ నినున్
    గనినన్ నామది యుల్లసంబుననిటుల్ గానంబు సేయున్ గదే
    నననానానననాననాననననానానాననానాననా

    రిప్లయితొలగించండి
  7. కనులు మూసిన తెరచిన గానవచ్చి
    మగువ నగుమోము మదిలోన మరులుగొలుపు
    మధురగానము వినిపించు మంద్ర గతిని
    ననననానాననననానననననాన

    రిప్లయితొలగించండి
  8. అనితరమసాధ్యమిదియని జనులు పొగడు
    నద్భుతంబగు రాగమై యలరు గాదె
    ననననానాననననానననననాన
    వినిన యంతనే బులకించు జనుల మనసు

    వినినంతన్ మదిపుల్కరించి జగతిన్ విస్తారమౌ రావమే
    నననానానననాననాననననానానాననానాననా
    మనసారా జనులాదరించు స్వరమై మాధుర్య ముప్పొంగెనే
    జనబాహుళ్యము నిన్ను మెచ్చునుగదా సంగీత సామ్రాట్టుగా

    రిప్లయితొలగించండి

  9. పద్య రీతులవి యెఱుక పరచ మనుచు
    పండితుడనని యడుగగా పామరుండు
    తెలిపితిని గానమందిట్లు తేట గీతి
    ననన నానాన నననాన ననన నాన


    ఘనమౌ కీర్తిని బొందగా వలయు సత్కావ్యమ్మునే వ్రాసి యం
    చని ఛందో నియమమ్ములన్ దెలుప మంచాతండు నన్ గోరగా
    ఘన మత్తేభపు పద్య లక్షణమిటుల్ గానంబు నే జేసితిన్
    నననా నానన నాననాన ననన నానా నాననానా ననా

    రిప్లయితొలగించండి
  10. తేట గీతిని రాగాన దెలుపు మనుచు
    కోరె శిష్యుడు గురువును గోర్కె మీర
    గొంతు సవరించు కొని యిట్లు గురువు పలికె
    " నన న నా నాన నస నా న న న న నా న '

    రిప్లయితొలగించండి
  11. తే॥ వినరొ రాముని గాథను వీనులలర
    మనము మురియఁగ నంచును మధుర కంఠ
    నాద మటుల విప్పారఁగ నాలపించె
    ననన నానాననననానననననాన

    మ॥ వినరో రాముని గాథఁ బల్కెదను మీవీనుల్ రసోచ్చిష్టతా
    ఘన మాధుర్యము మానసమ్ములును సంస్కారమ్ముఁ బొందున్ గనన్
    వినరో యంచును గాత్ర సౌష్ఠవమటుల్ విప్పారఁగన్ బాడెనే
    నననానానననాననాననననానానాననానాననా

    రిప్లయితొలగించండి
  12. తే.గీ:"న" యను నక్షరమ్మున వచ్చు నాల్గు పదము
    లనర యన నేల నీ రీతి నందు వౌర
    ననననానాననననానననననాన
    యనుచు,నేను,నానీ,నూనె,యనవె నాన్న!

    రిప్లయితొలగించండి
  13. మ:ఘనుడౌ పృచ్ఛకు డేదొ ప్రశ్న నిడగా గానమ్ము లో నున్న గొ
    ప్పను వర్ణింప వధాని సత్వరముగా వర్ణింప లేకుండుటన్
    నననానానననాననాననననానానాననానాననా”
    యనె ధైర్యమ్ముగ భావమేదొ తుది లో నందించ నూహించుచున్.
    (అవధానిని ఒక పృచ్ఛకుడు సంగీతం లో గొప్పదనాన్ని వర్ణించమంటే వెంటనే పద్యం తట్టక పై పాదం ముందు ఆశువుగా అనేసాడు.భావం మిగిలిన పాదాలలో తేవచ్చులే అనేది ఆయన ధైర్యం.)

    రిప్లయితొలగించండి
  14. (3)మ:ఘన విద్వాంసుడు సంగతుల్ పలికి రాగ మ్మిట్లు సాగించెడిన్
    నననా నానన నాననా ననననా నానాన నానాననా”
    నన నానాన ననాననా ననన నానానాన నానాననా”
    నననానా నననాననా ననననా నానాన నానా ననా
    (ఒక గొప్ప విద్వాంసుడు మంచి సంగతులతో రాగం పాడితే ఇలా నానా రకాల ముక్కలు గా పాడతాడు.ఇలాంటి సమస్యని ఇలాంటి పూరణ కూడా ఒకటుండాలి.)

    రిప్లయితొలగించండి
  15. డెందము పులకరింపంగఁ జిందు లింపు
    గొల్ప నెల్లర కప్పుఁ డనల్ప భంగి
    రమణి తీసెఁ దియ్యని కూన రాగ మిట్లు
    ననన నానా ననన నానన నన నాన


    పనిలేకుండినఁ బోరు వెట్టితివిగా బాంధవ్యముం దల్పకే
    వినుమా నిక్కము పల్కుచుంటి నిపుడే బింబోష్ఠి నిన్నెన్నఁడున్
    వనజాక్షీ కన రాను నన్ననుపఁగా భాషింప రాకున్నచో
    నన నా నానన నా ననా ననన నా నా నాన నా నాననా

    [నన నాన్+ఆనన (సుమ మను ముఖము గలదానా), నా ననా (ఓ నా సుమమా), న న న నాన్ నాన్ నాన్+ఆన (న న న అని అని అనిన నొట్టు), నానా +ఆననా( అనేకము లగు నోళ్లు గలదానా)]

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వ్యాకరణమును బోధించుచు పండితుండు
    సులువుగా జ్ఞప్తి నుంచెడు సూత్రమనుచు
    తేటగీతికి గణములు తెలిపె నిటుల
    ననన నానాన నననాన ననన నాన.

    రిప్లయితొలగించండి