8, నవంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4937

9-11-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చెన్నపురి గలదఁట సింహళమున”

(లేదా...)

“చెన్నపురంబుఁ జూడనగు సింహళదేశమునందు రూఢిగన్”

14 కామెంట్‌లు:

  1. పొట్టనింపుకొనగ పోయిరియరవలు
    లంక యందు వారు రాజు లైరి
    సంఖ్య లెక్క పెట్ట సంతతి నుందురు
    చెన్నపురి గలదై సింహళమున

    రిప్లయితొలగించండి
  2. చిన్న పిల్లవాని జెప్పుమని యడుగ
    చెన్నపురి గలదఁట సింహళమున
    ననుఛు పలుకుట విని యచ్చెరువొందితి
    యిట్టి యుత్తరమునకెవరి తప్పు?

    రిప్లయితొలగించండి
  3. కదలవేలర నూతిలో కప్పవోలె
    నిల్లె స్వర్గమని దలచుటేల నీవు
    పల్లెకెలె స్టేడియము గాంచ వదల వలయు
    చెన్నపురి, గలదఁట సింహళమున.


    ఎన్నడు లేని రీతినట హీనపరిస్థితులెన్నొజేర నా
    పన్నజనాలభాగ్యులు విపత్తును దాటక లేని వారివౌ
    కన్నుల లోన చెమ్మ గన కాంక్షయె యున్నను వేగ వీడుమీ
    జెన్నపురంబుఁ , జూడనగు సింహళదేశమునందు రూఢిగన్

    రిప్లయితొలగించండి
  4. చెన్నగు ప్రాంతముల్ మరియు చెన్నగు సంస్కృతి, పల్కుచుండగన్
    చెన్నగు భాష సొంపలరు, చెన్నగు ముత్యమె సంద్రమందునన్
    చెన్నది బాష్పబిందువుగ చెచ్చెర మారెను, లేక యుండినన్
    చెన్నపురంబుఁ జూడనగు సింహళదేశమునందు రూఢిగన్

    రిప్లయితొలగించండి
  5. నిన్ననె పోయి వచ్చితిమి నిక్కుచు నుండిన
    లంకనాడుకున్
    మిన్నగ నుండు గోరికన మేలుగ ద్రావిడు
    లందరొక్కటై
    పన్నురి వారు చక్కనగు ప్రాంతము నెంచగ
    నానివేశమే
    చెన్నపురంబుఁ ; జూడనగు సింహళదేశమునందు రూఢిగన్

    రిప్లయితొలగించండి
  6. ప్రశ్న వేసె భర్త భార్యను దానిట్లు
    చెన్న పురిని గూర్చి చెప్పు మని న
    ను త్త రమ్ము ని చ్చె నునికి ని గూర్చియు
    చెన్న పురి గల దట సింహ ళ మున

    రిప్లయితొలగించండి
  7. చెన్నుగ ద్రావిడుల్ బసను జేసిన దేశము సింహళమ్మెగా
    యెన్నడు లేనిరీతి యటనేర్పడె నార్ధికి మాంద్యమక్కటా
    మిన్నగ నెల్లరొక్కటయి మేలగు యోజనజేయ పెంపుకై
    చెన్నపురంబుఁ జూడనగు సింహళదేశమునందు రూఢిగన్

    రిప్లయితొలగించండి
  8. ఆ॥ మూడవ తరగతికి ముచ్చటైన పరీక్ష
    కనుఁగొనంగ నిజము-కాదు నిజము
    ప్రశ్నలందు నొకటి పరికించి తెలుపఁగఁ
    జెన్నపురి గలదఁట సింహళమున

    ఉ॥ వన్నెలుచిన్నెలున్ బకృతి భాషయు సంద్రపు ఘోష యెన్నియో
    సన్నుతి సేయఁగన్ దమిళు సంస్కృతి నిమ్ముగ నుత్తరమ్మునన్
    మిన్నఁగఁ దోఁచె నెందరికొ మిక్కిలి సామ్యముఁ గాంచి యెంచఁగన్
    జెన్నపురంబుఁ జూడనగు సింహళదేశమునందు రూఢిగన్

    రిప్లయితొలగించండి
  9. చెన్నపురికి మిగుల చేరువనున్నది
    సింహళమని జనులు చేరిరచట
    తరలియున్నజనుల తలపులందున సదా
    చెన్నపురి గలదఁట సింహళమున

    చెన్నపురంబు సింహళకు చేరువ నున్న ప్రదేశమే గదా
    చెన్నపురంబునుండి చని సింహళదేశ నివాసులౌ జనుల్
    చెన్నపురంబిదే యనెడు చిన్నని తానము నందు కూడగా
    చెన్నపురంబుఁ జూడనగు సింహళదేశమునందు రూఢిగన్

    రిప్లయితొలగించండి
  10. వలస వచ్చినారు విలసితమ్ముగ వారు
    సింహళమున గడుప జీవనమ్ము
    తమిళు లనట గాంచ తలఁపుకు వచ్చును
    చెన్నపురి గలదఁట సింహళమున

    రిప్లయితొలగించండి
  11. శ్రీ యుతమ్ము వెల్గు సింహళ దేశమ్ము
    భారతావనికి నదూరముగను
    రక్షిత నగరమ్ము వీక్షింపఁగ నపర
    చెన్నపురి గలదఁట సింహళమున


    మిన్నని రాజమార్గముల మెండుగ వెల్గెడు చత్వరమ్ములన్
    వన్నెకు నెక్క విశ్వమునఁ బన్నుగ నన్ని విధమ్ము లందు సం
    పన్నము మిక్కుటమ్ముగను బట్టణ రాజము నొంటిఁ బోలఁగాఁ
    జెన్నపురంబుఁ జూడ నగు సింహళ దేశము నందు రూఢిగన్

    రిప్లయితొలగించండి