12, నవంబర్ 2024, మంగళవారం

సమస్య - 4941

13-11-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మూసీ జలమ్ములె తగు శివార్చనకును”
(లేదా...)
“శంకరునర్చనకై జలమ్ము మూసీనది నుండి తెమ్ము”
(ఛందో గోపనము - కటకం వేంకటరామ శర్మ గారికి ధన్యవాదాలతో)

12 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    గత చరిత్ర గనిన కడు పపవిత్రమ్ము
    మురుగునీరుకలిసె పురము పెరిగి!
    పుణ్యమొంద నెచటి మూసీ జలమ్ములె
    తగు శివార్చనకును ధన్యత గన?

    ఉత్పలమాల
    మానస యంచు పేరిడియు మార్చిరి 'మూసి' గ ముద్దుపేరనన్
    కోనకు కార్తికమ్మనుచు కూతురు కూడగ తల్లిదండ్రులీ
    శానుని గొల్వఁ బిల్చిరిటు, "శంకరు నర్చనకై జలమ్ము మూ
    సీ! నదినుండి తెమ్ము నభిషేకము ప్రీతికరమ్ము శూలికిన్"

    రిప్లయితొలగించండి
  2. తే||గీ||
    నిశ్చయముగనె నానది నిర్మలముగ
    గాగలదని దెలుప గొన్ని ఘస్రములను
    దాళు , మూసీ జ లమ్ములె తగు శివార్చ
    నకును , నేను జెప్పెడి దాని నమ్మనగును

    రిప్లయితొలగించండి
  3. మూసీనది పునరుజ్జీవనమైన తదుపరి కొన్నాళ్ళకు....

    ఘనముగతలపెట్టగ పునరుత్థానమై
    నిర్మలంబులయ్యె నీరమిచట
    ముచ్చట గొలుపుగద మూసీజ లమ్ములె
    తగు శివార్చనకును తర్పణకును

    నేనొక సూచనమ్మిడెద నీకది తప్పక మేలు గావుతన్
    మానని బ్రౌఢయత్నమున మారిన దీనది నిర్మలంబుగా
    స్నానము నాచరించి మరి శంకరు నర్చనకై జలమ్ము మూ
    సీనది నుండితెమ్ము కరసేవకు కృత్స్నము యోగ్యమైనదే

    రిప్లయితొలగించండి
  4. శుద్ద మనసులు గలిగిన సుజను లగుచు
    భక్తి శ్రద్దను జూపించి ముక్తి కొఱ కు
    భాగ్య నగర ము జెంతన పరగు నట్టి
    శివుని పూజకు దగు మూ సీ జలములు

    రిప్లయితొలగించండి
  5. కోనలలోన పుట్టినది కొబ్బరి నీళ్లన పేరునొందె గం
    గానది వోలె పావనము, కాలము మారెను మడ్డి మైలకున్
    స్థానముఁ గాగ పారెనిట, శంకరునర్చనకై జలమ్ము మూ
    సీనది నుండి తెమ్ము
    , నది చేరక ముందరె గండి పేటకున్!!

    రిప్లయితొలగించండి
  6. తే.గీ.
    గంగను తలపై దాల్చిన గరళ గళుని
    గొలువ కలుషితమైనట్టి కూలవతియె
    తగునె మూసీజలమ్ములె? తగు శివార్చ
    నకును పరమ పావనమైన నదుల జలము.


    ఉ.మా.
    బోనము సేయబోకుమిక మోక్షము నొందెడు కాంక్షతోడ కృ
    ష్ణానది తీరమేగి యొక చక్కని గుండిగ నిండ తెమ్మిటన్
    స్నానము నాచరించి మన శంకరునర్చనకై జలమ్ము మూ
    సీనది నుండి తెమ్ము పరిశీలనకై మను చిన్నపాత్రతో.

    రిప్లయితొలగించండి
  7. మురుగు పేరుకొనిన మూసీ జలమ్ములె
    తగు శివార్చనకును తగినరీతి
    శుద్ధపరుప నదిని గద్దెనెక్కిన దొరల్
    ప్రజల సేవజేయు పద్ధతిదియె

    రిప్లయితొలగించండి
  8. స్నానమునాచరించనట చక్కని నీరము లభ్యమౌనుమూ
    సీనది యందు పాలకులు సిద్ధముఁజేసిరి శుద్ధనీరమున్
    చానరొ పొమ్ము పొమ్మికను శంకరునర్చనకై జలమ్ము మూ
    సీనది నుండి తెమ్ముమన చింతిత కౌతుకముల్ ఫలించుతన్

    రిప్లయితొలగించండి
  9. జలములకుఁ గొదవే యీ విశాల భూ త
    లమునఁ బరికించి చూచిన నమిత కలుషి
    తములు మూసీ జలమ్ములె తగు శివార్చ
    నకును దగ వన నీవు వినవు గదయ్య


    మీన స మేష రాసులను మెండుగఁ దల్పక చిత్తశుద్ధితో
    నా నది లోఁ బవిత్రములె యప్పులు మౌని వరుల్ వచించు ప్ర
    స్థానము నెంచి డెందమున శంకరు నర్చనకై జలమ్ము మూ
    సీ నది నుండి తెమ్ము మును చేర నెఱుంగము కల్మషమ్ములన్

    [ప్రస్థానము = శాస్త్రము]

    రిప్లయితొలగించండి
  10. ఆ.వె:ద్వేష మధిక మౌట ప్రేలె ముస్లిం నేత
    లింగ పూజ కొరకు గంగ యేల?
    ముక్తి కోరుకొన్న మూసీ జలమ్ములె
    తగు శివార్చనకును తప్పు లేదు.

    రిప్లయితొలగించండి
  11. ఉ:హీనము కాగ మూసి నది నెంతయు శుభ్రత బా గొనర్చి,య
    ద్దానిని గొప్పగా దెలుపు దారిగ జెప్పెను నేత మానవుల్
    స్నానము జేయ వచ్చు నిక శంకరునర్చనకై జలమ్ము మూ
    సీనది నుండి తెమ్ముర విశేషఫలమ్ము నొసంగు తమ్ముడా!

    రిప్లయితొలగించండి