శా:ఇంతో అంతయొ గ్రంథముల్ చదివి తా నే తత్త్వమున్ గూర్చియున్ చింతన్ జేయక వట్టి యర్థములనే చేబట్టి తా జ్ఞానినన్ భ్రాంతిం జెందెడు వాఁడె పండితుఁడు?సంభావింప యోగ్యుండగున్ స్వంతమ్మౌ నొక జ్ఞానమున్ గలిగి సంభాషించు నీ స్వామియే! (ఊరకే పుస్తకాలు నాలుగు చదివి అక్కడ కూడా ప్రతిపదార్థాలు మాత్రమే చెప్పి తాను జ్ఞాని ననుకునే ఆ వ్యక్తి పండితుడా?స్వయం గా జ్ఞానం పొందిన ఈ స్వామీజీ గౌరవింప దగిన వాడు.)
ఇంతకమునుపు పూరణలో 2వ పాదములో ప్రాస దోషమైనదండి. ఎవరు తెలిపినా నేను పిదప తిద్దుకోగలనండి. తెలిపిన వారికి ధన్యవాదాలు. దాంతము patience endurance నిఘంటువు సహాయము
ఆటవెలది
రిప్లయితొలగించండివేడ్కగాంచుచుండ ప్రేక్షకలోకమ్ము
నాశువుగ కవిత్వమలరఁ బలుక
రసహృదయుఁడగుచు నలంకారమొలికింప
భ్రాంతిఁ జెందువాఁడె పండితుండు!
శార్దూలవిక్రీడితము
చింతాక్రాంత వరూధినీలలన తా శృంగార వాంఛాళువై
కంతుండై ప్రవరుండు నూహలను దాకన్ నోపనిస్త్రాణయై
పంతంబందున కూడదన్న వరునిన్ ప్రార్థింప,వర్ణింపఁగన్
భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుండగున్
మూర్ఖుడనగ దానె ముఖ్యుడననుకొని
రిప్లయితొలగించండిభ్రాంతిఁ జెందువాఁడె ; పండితుండు
దనను మించు వారు దందడిగ తలచు
పరుల గొప్పతనము బరిగణించి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపేదవారిపట్ల పేరిమినే కల్గి
యాదరించి నేర్పి యక్షరముల
బడుగు జనుల సేవ పరమాత్మ సేవంచు
భ్రాంతిఁ జెందువాఁడె పండితుండు.
శాంతిన్ నిల్పుట కోసమై సతము తా శక్త్యాను సారమ్ముగా
చింతాక్రాంతుల జేరదీసి తగు సంశ్రేయమ్ము నేగూర్చగా
ప్రాంతమ్మందున భేదముండినను సద్భావంబు నావారనే
భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుండగున్.
ఇంతింతై తపమింతయై హరుని వీక్షింపన్ మతంబౌట ధీ
రిప్లయితొలగించండిమంతుండౌ గురుసన్నిధిన్ వరలుటై మాయాంతమై రూఢి వే
దాంతంబెల్ల నెఱింగి నేరిఁగన నౌరౌరా! పరంబ్రహ్మగాన్
భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుండగున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఇంతిన్ జూడగ చంద్ర బింబముగఁ గృష్ణేందిందిరంబౌ కురుల్
రిప్లయితొలగించండిదంతాచ్ఛాదముఁ జూడ దొండ ఫలమౌ దానిమ్మలౌ దంతముల్
వింతల్ గాగ వచించు కావ్యమున నుత్ప్రేక్షించి స్వాంతంబునన్
భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుండగున్!!
దంతాచ్ఛాదము = పెదవి
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅంతరంగమందు వింతైన తలపుల
రిప్లయితొలగించండికల్పనాజగతిని శిల్పియగుచు
కావ్య సృష్టిసలుప కావ్యంపు పాత్రగా
భ్రాంతిఁ జెందువాఁడె పండితుండు
స్వాంతంబొప్ప రచించుచుండు నెపుడున్ సత్కావ్యముల్ చూడనా
సాంతంబే రసరంజితంబులగు నిస్సందేహమౌ రీతినిన్
వింతేమున్నది యంతరంగమునఁ దా విస్పష్టమౌ పాత్రగా
భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుండగున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండితే.గె:ఎంతొ విద్య నేర్చి ఎన్నొ భాషణ లిచ్చి
రిప్లయితొలగించండినిగ్రహ మ్మనంగ నిర్వచించి
బిరుదు పొంద వచ్చు విఖ్యాతి ఘన మని
భ్రాంతిఁ జెందువాఁడె పండితుండు?
భ్రాంతిం జెందును తోయజాక్షి ముఖమున్ భాసంతుగానెంచి దా
రిప్లయితొలగించండిభ్రాంతిం జెందును భామ నేత్రముగనన్ వైసారిణమ్మంచు వి
భ్రాంతిం జెందును మేనిలోని మెరుపుల్ పర్జన్యు భాసంబుగా
భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుండగున్
మోముఁజూచి చందమామగా భ్రమియించు
రిప్లయితొలగించండికనుల బోల్చుచుండు కలువలనుచు
మేనిమెరుపుఁజూచి మెరుపుతీగనుకొను
భ్రాంతిఁ జెందువాఁడె పండితుండు
శా:ఇంతో అంతయొ గ్రంథముల్ చదివి తా నే తత్త్వమున్ గూర్చియున్
రిప్లయితొలగించండిచింతన్ జేయక వట్టి యర్థములనే చేబట్టి తా జ్ఞానినన్
భ్రాంతిం జెందెడు వాఁడె పండితుఁడు?సంభావింప యోగ్యుండగున్
స్వంతమ్మౌ నొక జ్ఞానమున్ గలిగి సంభాషించు నీ స్వామియే!
(ఊరకే పుస్తకాలు నాలుగు చదివి అక్కడ కూడా ప్రతిపదార్థాలు మాత్రమే చెప్పి తాను జ్ఞాని ననుకునే ఆ వ్యక్తి పండితుడా?స్వయం గా జ్ఞానం పొందిన ఈ స్వామీజీ గౌరవింప దగిన వాడు.)
తానె గొప్ప యనుచు తలపోయు భువి లోన
రిప్లయితొలగించండిభ్రాంతి పడె డు వాడు :+ పండితుండు
చక్క నైన భావ జాలమ్ము గల్గిన
పద్య రచన జేసి ప రిఢ విల్లు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ॥ కవి నిరతము భావ వివరణపు సొగసు
తొలగించండివెలయ నూహ పెంచి పులుమ రంగు
లెన్నొ యవధులఁ గన నెంచక వరలడె
భ్రాంతిఁ జెందు వాఁడె పండితుండు
శా॥ శ్రాంతంబొందక యోచనా పటిమతో సారించి యూహించుచున్
దాంతమ్ముం విడకుండ వర్ణనల నర్థాలంకృతా భాసమై
సాంతమ్మట్లువిరాజిలంగఁ దమితో సాధించరే పండితుల్
భ్రాంతింజెందెడు వాఁడె పండితుడు సంభావింప యోగ్యుండగున్
ఇంతకమునుపు పూరణలో 2వ పాదములో ప్రాస దోషమైనదండి. ఎవరు తెలిపినా నేను పిదప తిద్దుకోగలనండి. తెలిపిన వారికి ధన్యవాదాలు.
దాంతము patience endurance నిఘంటువు సహాయము
స్మృతి భ్రాంతి సందేహాలంకారాలు అర్థాలంకారాలు కదండి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపలుక నేల వేయి వాని పాండిత్యంపుఁ
రిప్లయితొలగించండిజొప్పు మే మెఱుఁగమె గొప్ప లెల్లఁ
జెప్పఁ దలఁతు వేల తప్పొప్పులు గణింప
భ్రాంతిఁ జెందు వాఁడె పండితుండు?
అంతేవాసుల సందియమ్ములను సద్యస్స్ఫూర్తి దీపింపఁగా
సంతోషమ్మునఁ దీర్పఁ గల్గు ఘనమౌ సామర్థ్య మేపారఁగా
వింతల్ శంకలు దోఁపఁ గావ్యరచనా విస్ఫూర్తిఁ గాకున్నచో
భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుం డగున్
పొత్త మొకటి పట్టి బుద్ధిశాలి ననుచు
రిప్లయితొలగించండి*"భ్రాంతిఁ జెందు వాఁడె పండితుండు”*
ననుచు భ్రమను మునుగ నంతకు మించిన
పిచ్చి తనము గలదె వెదికి చూడ.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పద్య కావ్యమొకటి వ్రాయ రమ్యముగను
చదివినట్టి వారు చాల మెచ్చ
తలచనంత పేరు తనకు వచ్చినను వి
భ్రాంతిఁ జెందు వాడె పండితుండు.