4, జనవరి 2025, శనివారం

సమస్య - 4993

5-1-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఫలముఁ గోరువాఁడె పండితుండు”
(లేదా...)
“ఫలమునుఁ గోరువాఁడె కద పండితుఁడున్ సదసద్వివేకియున్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

29 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    పెక్కురుగ్మతలవె పెల్లుబుక జగతి
    శాంతిసౌఖ్యమడఁగె వంతలెగసి
    మాన్యత రచనల సమాజహితఁపు ప్రతి
    ఫలముఁ గోరువాఁడె పండితుండు

    చంపకమాల
    విలయము గూర్చెడున్ గతన వెర్రులు వేయఁగఁ గ్రొత్త పోకడల్
    గలతల శాంతి సౌఖ్యములు గందరగోళ పరిస్థుతుల్ గనన్
    విలువలు పెంచు కావ్యములు వెల్వడి సంఘహితంబునెంచు స
    త్ఫలమునుఁ గోరువాఁడె కద పండితుఁడున్ సదసద్వివేకియున్

    రిప్లయితొలగించండి
  2. ఎన్నడైన గాని యెంచి జూడగ ప్రతి
    ఫలము కొరకు కాక , పరుల యందు
    దాను చెప్పెడి కవిత లనుకొన్నటుల స
    ఫలముఁ గోరువాఁడె పండితుండు

    రిప్లయితొలగించండి

  3. చెంత జేరి నట్టి శిష్యకోటి కతడు
    శిక్షణ నిడు విద్య శ్రేష్ఠమగుచు
    వారియున్నతి కదె వారధి యనెడీ స
    త్ఫలముఁ గోరువాఁడె పండితుండు.


    నిలకడ లేనవారలగు నీచగుణాత్ములు శిష్యులైనచో
    పలువిధ బోధనల్ సలిపి వారిని సద్గుణ శీలులట్లుగా
    మలచి వివేకవంతులగు మంచి ప్రవర్తన పొందిన చాలునట్టి స
    త్ఫలమునుఁ గోరువాఁడె కద పండితుఁడున్ సదసద్వివేకియున్.

    రిప్లయితొలగించండి
  4. అరటి పండు జూడ నందమైయుండును
    తొక్క తీసి తిన్న చక్కగుండు
    నిక్కమిదియె వినర తొక్కను పడవేసి
    ఫలముఁ గోరువాఁడె పండితుండు!!

    రిప్లయితొలగించండి
  5. సత్ప థ o బు జూపి సమత మమత పెంచ
    కవిత లల్లు గొప్ప కవి వరుండు
    జనుల యందు. మార్పు జాగృ తి యును. బ్రతి
    ఫలముగోరు వాడె పండితుండు

    రిప్లయితొలగించండి
  6. సులభముగాను జేయు వరసూర్యనమస్సులు, మూడుపూటలున్
    సలెపిడి సంధ్య,తర్పణలు,సాంబశివార్చనముల్, శివాజ్ఞగాన్
    దలచుచు భక్తితోడ శివదైవతమున్ గొనుమంచు దక్కనౌ
    ఫలమునుఁ, గోరువాఁడె కద పండితుఁడున్ సదసద్వివేకియున్!

    రిప్లయితొలగించండి
  7. ॥ఆట॥
    ఇష్టకామ్యమునకు యేదగు పూజైన
    ఆగమము తెలిపిన యా విధమ్ము
    పూజ పూర్తి చేసి పుణ్యమిడు నటుల
    "ఫలముఁ గోరువాఁడె పండితుండు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కామ్యమునకు నేదగు'

      తొలగించండి
    2. ॥ఆ.వె.॥
      ఇష్టకామ్యమునకు నేదగు పూజైన
      ఆగమము తెలిపిన యా విధమ్ము
      పూజ పూర్తి చేసి పుణ్యమిడు నటుల
      "ఫలముఁ గోరువాఁడె పండితుండు"

      తొలగించండి
  8. ॥ఆ.వె.॥
    లక్షలున్ననేమి భిక్ష చేయగనేమి
    రమ్యముగను పండ రంభ ఫలము
    తీపిదైన నేమి తినగ తోలు విడిచి
    ఫలముఁ గోరువాఁడె పండితుండు

    రంభ:అరటి
    2వ పాదంలో పండ కి బదులుగా మ్రగ్గ అనికూడా అనవచ్చు

    రిప్లయితొలగించండి
  9. లలితములైన భావములు లావణికమ్మగు కావ్య వర్ణనల్
    విలువలు నేర్పి ఛాత్రుల వివేకము బెంచెడురీతి బోధనల్
    సలిపెడువాడె దేశికుడు సర్వుల యున్నతి వాంఛ జేసి స
    త్ఫలమునుఁ గోరువాఁడె కద పండితుఁడున్ సదసద్వివేకియున్

    రిప్లయితొలగించండి
  10. ఆ.వె:పండితుడవు నీవు భాగవతము జెప్పు
    మనుచు పేద వార లడిగి నంత
    తృణమొ ఫలమొ యిడగ తృప్తి జెందక లక్ష
    ఫలముఁ గోరువాఁడె ?పండితుండు”

    రిప్లయితొలగించండి
  11. చం:తెలిసిన తత్త్వ విద్య గురు దేవుల భిక్షగ నెంచి ,శ్రీ యశ
    స్సులె ఫలితమ్ము లం చనక,శుద్ధ మనస్కుడు సాధకుండు ని
    శ్చలమతి యొక్క శిష్యుడె నిజ మ్మగు సత్ఫల మంచు నెంచి యా
    ఫలమునుఁ గోరువాఁడె కద పండితుఁడున్ సదసద్వివేకియున్
    (తాత్త్వికత బోధించే నిజ మైన మహనీయులు,సన్యాసులు కేవలం డబ్బు,కీర్తి ఫలం గా భావించరు. ఎంత మంది జనం విన్నా పై లక్షణాలు గల ఒక్క శిష్యుడు చా లనుకుంటారు.)

    రిప్లయితొలగించండి
  12. ఆ॥ కావ్యమధురిమఁ గని భవ్యమని జనులు
    మెచ్చి హారతులిడ మేటియంచు
    జన్మ ధన్యమంచు సర్వదా తలపడె
    ఫలముఁ గోరు వాఁడె పండితుండు

    చం॥ విలసిత కావ్యమాధురినిఁ బ్రేమగఁ గ్రోలి జనాళి మెచ్చఁగన్
    సలలితభావ సంపదలు సన్నుతిఁ బొందఁగ మోద మందుచున్
    దలపడె జన్మధన్యమని తర్పణమొందుచుఁ దాను యోగ్యతా
    ఫలమునుఁ గోరు వాఁడె కద పండితుఁడున్ సదసద్వివేకియున్

    రిప్లయితొలగించండి
  13. ॥ఆ.వె.॥
    కవులుయెందరున్న, కవనలుయెన్నున్న
    కవనమందు వెలయు, కథగ హితము
    లోక యితవు నెపుడు లోతుగ నుడివి, స
    త్ఫలముఁ గోరువాఁడె పండితుండు

    రిప్లయితొలగించండి
  14. వితత విరచిత బహు వృత్త కావ్య పఠన
    ఫలము సుంత గాక పరగణింప
    వితత విరచి తావివేక కావ్యపఠన
    ఫలముఁ గోరువాఁడె పండితుండు ?


    తెలిసిన సర్వ శాస్త్రములు దిన్నని వృత్తము జీవితమ్ము నం
    దలవడ మంచిచెడ్డల నిజాత్మ నెఱింగినఁ గర్మ సంచయ
    మ్ముల నొనరింప, నెంచు చొక పోలిక నాత్మను నిష్ఫలమ్మునున్
    ఫలమునుఁ, గోరువాఁడె కద పండితుఁడున్ సదసద్వివేకియున్

    రిప్లయితొలగించండి
  15. కలిమినిఁజూడడాతఁడును కావ్యమునందునరాముతోడిదే,
    చెలువముఁజేయుపోతనయు జెప్పెనుభాగవతమ్ము రమ్యమై
    వెలసెగనుత్తమంబుగను వేయివెలుంగులపుణ్యగ్రంథమా
    ఫలమునుగోరువాఁడెగద పండితుడున్సదసద్వివేకియున్

    రిప్లయితొలగించండి
  16. లలితమైన సరణి లావణికమ్ముగా
    కావ్యరచన సలిపి ఘనతనొందు
    వాడెకవియనంగ బాయక నొరులస
    త్ఫలముఁ గోరువాఁడె పండితుండు

    రిప్లయితొలగించండి
  17. నిలయము విద్యనేర్పుటకు నిత్యము నచ్చట సాధనంబునై
    కలలనుఁగన్నవారికిని కమ్మని బోనము నందజేయగా,
    నిలుపగ స్వామిభక్తినట నిష్ఠగ నిల్చిన వారలిచ్చెడిన్
    ఫలమునుఁ గోరువాఁడె కద పండితుఁడున్ సదసద్వివేకియున్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    అంతమొంద జేయ నజ్ఞాన తిమిరముఁ
    చేరు వారికెల్ల శిక్షణ నిడి
    జాగృత మొనరించి ఛాత్రులకున్ జ్ఞాన
    ఫలముఁ గోరువాడె పండితుండు.

    రిప్లయితొలగించండి
  19. విద్య లెల్ల నేర్పి విజ్ఞాన సుధపంచి
    శిష్యతతికిమంచి శిక్షణ నిడి
    తగిన సమయ మందుతచ్ఛిష్య వరులచే
    *“ఫలముఁ గోరువాఁడె పండితుండు”*

    రిప్లయితొలగించండి