7-1-2025 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్”(లేదా...)“పురుషుం డొక్కఁడు పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా”
కందంపురుషత్వమ్మున వెల్గుచుమరులన్ గొల్పెడుఁ గతనన మారుతిఁ గనుచున్సరిజోడనెన్ హిడింబయెపురుషునిఁ, బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్మత్తేభవిక్రీడితముపురుషత్వమ్మున వెల్గుచున్ మిగుల సంపూర్ణాకృతిన్ యోధుఁడైమరులన్ గొల్పగ నా హిడింబ గనుచున్ మన్నించి కౌంతేయునిన్సరిజోడంచును కుంతితో కొసరుచున్ సాధింప, మన్వాడ నాపురుషుం డొక్కఁడు, పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా!
కందం లో రెండవ పాదమున 'గతనను' అని చదువుకొన మనవి.
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏 ధన్యోస్మి గురుదేవా!🙏
పరిణయమయి యేండ్లుగడువపరంపర లభించ లేని పరితాపమునన్తరలె గుడికి యచ్చోటనపురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."గుడికి నచ్చోటను"
తిరుమాళిగ లేక సఖునియిరవున కాపురమునుండ యింతియె తా వజ్జెరనూరికంపగా పరపురుషునిఁ , బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్.*(వజ్జెర= ఈపాయము, పురుషుడు= భర్త)*సరికాదందును నీవిటుల్ పడతి నీసధ్యంచునిన్ వీడుచున్ హరి సంతానము నిచ్చు వాడనుచునారీతి క్షేత్రమ్ములన్ తిరుగన్ సత్ఫలమీండబోదు పతియే దిక్కైన చాలంచనన్ బురుషుం డొక్కఁడు , పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా. *(సధ్యంచుడు=భర్త .......పూరుషుడు=భర్త)*
కం॥ ధరలో వైద్యుఁడు శాస్త్రపు సరళిని నడుపఁగఁ జికిత్స సంతునుఁ బడయన్సరసముగ సతి నుడివెఁ గదపురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్మ॥ధరలో హెచ్చిన శాస్త్ర విజ్ఞతయె సంతానమ్ముఁ గాంచంగ నాసర యయ్యెన్ నిజ వైద్యుఁడా పగిదిఁ బుంసత్వమ్ము నుద్ధించఁగన్వరమై సంతును బొందఁ బల్కె నిటులన్ భార్యా ముదమ్మొందుచున్బురుషుండొక్కఁడు పూరుషం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా!అతను తనలోపాన్ని సరిచేసుకోవడానికి ఒక పురుష వైద్యుని కలిసాడండి. నేటి యదార్థము
పురూషుం తప్పు వ్రాసానండి
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
అరుదగు శస్త్ర చికిత్స ను సరగున నొనరింప మారి జవ్వని యైనన్ నరుడా యింతిని మనువై పురుషుని పురుషుండు గలియ పుత్రుడు బుట్టె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తరుణీరత్నము పెళ్ళిచేసుకొని మోదంబందుచున్ వర్తిలెన్జిరకాలంబున సంతునొందని గతిన్ జింతిల్లి, దైవాజ్ఞగాన్స్థిరబుద్ధిన్ గులదైవతోత్తమునిఁ బ్రార్థింపన్ దయంగాంచ నాపురుషుం డొక్కఁడు, పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఒరయన్ శిష్యుల పాటవమ్ము మరి ప్రత్యుత్పత్తి పాఠంబునన్తరుచంగా గురుదేవులిట్లడిగె దుగ్ధంబెట్లు పాలిండ్లలోపరివేష్టించెననంగ, చట్టు గమిలో ప్రత్యుత్తరంబే యిడెన్బురుషుం డొక్కఁడు, "పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా"!
[ అయ్యప్ప జననం ]సురవైరులకున్ రేత్రముదరిచేర్చని మోహిని యన దైత్యారికదాపరమేశుని గూడిమెలగెపురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్సురవైరుల్ సుధనే గ్రహింప గలరా శోభించు పెన్మాయతోపురుషుండౌ తరిదాల్పు మోహిని యనన్ బూబోడిగా మారగాపరమేశుండొక పూరుషుండు కలిసెన్ వైకుంఠుడౌ పూరుషున్బురుషుం డొక్కఁడు పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా
ధన్యవాదాలు గురూజీ 🙏
పురుషుం డేవిధి పూరుషుం గలియఁగన్ బుత్రుండు జన్మించునోయరయంజాలగనైతి దైవమ భువిన్ యట్లౌట సాధ్యంబొకో!హరితా గూడగ నీశునిన్ గలిగెతా నయ్యప్ప యీరీతిగన్పురుషుం డొక్కఁడు పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా!
మూడవపాదంలో చిరుమార్పు:"హరిగూడన్ పరమేశునిన్ గలిగెతా నయ్యప్ప యీరీతిగన్"
హరిమోహిని రూపమ్మునహరునకు కలిగించమరులు యావేగమునన్హరిహరసుతుఁ డుదయించెనుపురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్
కం:కరవు గొని పుత్రు బడయగపరి పరి మ్రొక్కులను మ్రొక్క ఫలియించక నేర్పరి యగు వైద్యుండౌ సత్పురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్”
మ:పురుషాకారు డొకండు స్త్రీ గుణములన్ బొందెన్,సమాజమ్మునందరుదౌ శస్త్రచికిత్స తో మగువయై యానందమున్ బొందె నచ్చెరువౌ రీతిగ వాని నాలిగ గ్రహించెన్ సంఘసంస్కర్త యౌపురుషుం డొక్కఁడు పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా”
పరమాత్ముఁడు దయసేయగవరమ్ము నుతియింప భక్తి భార్యా మణినింబరమ ప్రీతిఁ గనుట కయి పురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్ [పురుషుని = మగవానిని; పురుషుండు = భర్త] తరుణీ రత్నము సంతసించెఁ గడు సంతానమ్ము వర్ధిల్లఁగా సరసీ జాత నిభాక్షి భక్తిమెయిఁ బూజల్ సేయ గొడ్రాలు తద్దురవస్థం గని జాలితో వరము సంతుష్టాత్ముఁ డీయన్ మహాపురుషుం డొక్కఁడు పూరుషుం గలియఁగం బుత్రుండు గల్గెం గదా
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.హరినే మోహిని రూపునహరుడున్ బరికించినంత హర్షము తోడన్సరగున తా కామించెనుపురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుడు గలిగెన్.
కందం
రిప్లయితొలగించండిపురుషత్వమ్మున వెల్గుచు
మరులన్ గొల్పెడుఁ గతనన మారుతిఁ గనుచున్
సరిజోడనెన్ హిడింబయె
పురుషునిఁ, బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్
మత్తేభవిక్రీడితము
పురుషత్వమ్మున వెల్గుచున్ మిగుల సంపూర్ణాకృతిన్ యోధుఁడై
మరులన్ గొల్పగ నా హిడింబ గనుచున్ మన్నించి కౌంతేయునిన్
సరిజోడంచును కుంతితో కొసరుచున్ సాధింప, మన్వాడ నా
పురుషుం డొక్కఁడు, పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా!
కందం లో రెండవ పాదమున 'గతనను' అని చదువుకొన మనవి.
తొలగించండిమీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏 ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిపరిణయమయి యేండ్లుగడువ
రిప్లయితొలగించండిపరంపర లభించ లేని పరితాపమునన్
తరలె గుడికి యచ్చోటన
పురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"గుడికి నచ్చోటను"
రిప్లయితొలగించండితిరుమాళిగ లేక సఖుని
యిరవున కాపురమునుండ యింతియె తా వ
జ్జెరనూరికంపగా పర
పురుషునిఁ , బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్.
*(వజ్జెర= ఈపాయము, పురుషుడు= భర్త)*
సరికాదందును నీవిటుల్ పడతి నీసధ్యంచునిన్ వీడుచున్
హరి సంతానము నిచ్చు వాడనుచునారీతి క్షేత్రమ్ములన్
తిరుగన్ సత్ఫలమీండబోదు పతియే దిక్కైన చాలంచనన్
బురుషుం డొక్కఁడు , పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా.
*(సధ్యంచుడు=భర్త .......పూరుషుడు=భర్త)*
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికం॥ ధరలో వైద్యుఁడు శాస్త్రపు
రిప్లయితొలగించండిసరళిని నడుపఁగఁ జికిత్స సంతునుఁ బడయన్
సరసముగ సతి నుడివెఁ గద
పురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్
మ॥ధరలో హెచ్చిన శాస్త్ర విజ్ఞతయె సంతానమ్ముఁ గాంచంగ నా
సర యయ్యెన్ నిజ వైద్యుఁడా పగిదిఁ బుంసత్వమ్ము నుద్ధించఁగన్
వరమై సంతును బొందఁ బల్కె నిటులన్ భార్యా ముదమ్మొందుచున్
బురుషుండొక్కఁడు పూరుషం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా!
అతను తనలోపాన్ని సరిచేసుకోవడానికి ఒక పురుష వైద్యుని కలిసాడండి. నేటి యదార్థము
పురూషుం తప్పు వ్రాసానండి
తొలగించండిమీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఅరుదగు శస్త్ర చికిత్స ను
రిప్లయితొలగించండిసరగున నొనరింప మారి జవ్వని యైనన్
నరుడా యింతిని మనువై
పురుషుని పురుషుండు గలియ పుత్రుడు బుట్టె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితరుణీరత్నము పెళ్ళిచేసుకొని మోదంబందుచున్ వర్తిలెన్
రిప్లయితొలగించండిజిరకాలంబున సంతునొందని గతిన్ జింతిల్లి, దైవాజ్ఞగాన్
స్థిరబుద్ధిన్ గులదైవతోత్తమునిఁ బ్రార్థింపన్ దయంగాంచ నా
పురుషుం డొక్కఁడు, పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఒరయన్ శిష్యుల పాటవమ్ము మరి ప్రత్యుత్పత్తి పాఠంబునన్
రిప్లయితొలగించండితరుచంగా గురుదేవులిట్లడిగె దుగ్ధంబెట్లు పాలిండ్లలో
పరివేష్టించెననంగ, చట్టు గమిలో ప్రత్యుత్తరంబే యిడెన్
బురుషుం డొక్కఁడు, "పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా"!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి[ అయ్యప్ప జననం ]
రిప్లయితొలగించండిసురవైరులకున్ రేత్రము
దరిచేర్చని మోహిని యన దైత్యారికదా
పరమేశుని గూడిమెలగె
పురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్
సురవైరుల్ సుధనే గ్రహింప గలరా శోభించు పెన్మాయతో
పురుషుండౌ తరిదాల్పు మోహిని యనన్ బూబోడిగా మారగా
పరమేశుండొక పూరుషుండు కలిసెన్ వైకుంఠుడౌ పూరుషున్
బురుషుం డొక్కఁడు పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిపురుషుం డేవిధి పూరుషుం గలియఁగన్ బుత్రుండు జన్మించునో
రిప్లయితొలగించండియరయంజాలగనైతి దైవమ భువిన్ యట్లౌట సాధ్యంబొకో!
హరితా గూడగ నీశునిన్ గలిగెతా నయ్యప్ప యీరీతిగన్
పురుషుం డొక్కఁడు పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా!
మూడవపాదంలో చిరుమార్పు:
తొలగించండి"హరిగూడన్ పరమేశునిన్ గలిగెతా నయ్యప్ప యీరీతిగన్"
హరిమోహిని రూపమ్మున
రిప్లయితొలగించండిహరునకు కలిగించమరులు యావేగమునన్
హరిహరసుతుఁ డుదయించెను
పురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం:కరవు గొని పుత్రు బడయగ
రిప్లయితొలగించండిపరి పరి మ్రొక్కులను మ్రొక్క ఫలియించక నే
ర్పరి యగు వైద్యుండౌ స
త్పురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్”
మ:పురుషాకారు డొకండు స్త్రీ గుణములన్ బొందెన్,సమాజమ్మునం
రిప్లయితొలగించండిదరుదౌ శస్త్రచికిత్స తో మగువయై యానందమున్ బొందె న
చ్చెరువౌ రీతిగ వాని నాలిగ గ్రహించెన్ సంఘసంస్కర్త యౌ
పురుషుం డొక్కఁడు పూరుషుం గలియఁగన్ బుత్రుండు గల్గెన్ గదా”
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపరమాత్ముఁడు దయసేయగ
రిప్లయితొలగించండివరమ్ము నుతియింప భక్తి భార్యా మణినిం
బరమ ప్రీతిఁ గనుట కయి
పురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్
[పురుషుని = మగవానిని; పురుషుండు = భర్త]
తరుణీ రత్నము సంతసించెఁ గడు సంతానమ్ము వర్ధిల్లఁగా
సరసీ జాత నిభాక్షి భక్తిమెయిఁ బూజల్ సేయ గొడ్రాలు త
ద్దురవస్థం గని జాలితో వరము సంతుష్టాత్ముఁ డీయన్ మహా
పురుషుం డొక్కఁడు పూరుషుం గలియఁగం బుత్రుండు గల్గెం గదా
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
హరినే మోహిని రూపున
హరుడున్ బరికించినంత హర్షము తోడన్
సరగున తా కామించెను
పురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుడు
గలిగెన్.