11, జనవరి 2025, శనివారం

సమస్య - 5000

12-1-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వింతగను సమస్య లైదువేలయ్యె భళా”
(లేదా...)
“అవురా చూచుచునుండగా నయిదువేలయ్యెన్ సమస్యల్ భళా”
(నిజానికి ఒకే సమస్యను ఛందోవైవిధ్యంతో రెండు విధాలుగా ఇవ్వడం వల్ల పదివేలుగా లెక్కించాలి)

33 కామెంట్‌లు:

  1. ఇంతింతగసాగెజగత్తొ
    కింతయుకనరాదుగదరఖండనసేయన్
    అంతయుసందేహంబే
    వింతగసమస్యలైదువేలయ్యెభళా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవులైపాండితిజూపుచున్ కరమునిక్కంబంచురూపింపగా
      చవులూరించెడిభావనాపటిమ నేశంకల్గనన్లేముగా
      శివుడాశంకరుడాయనేవరలుగా తేజోవిలాసంబుతో
      అవురాజూచుచునుండగా నయిదువేలయ్యెన్సమస్యల్భళా

      తొలగించండి
    2. గురువుగారికిశుభాకాంక్షలతో

      తొలగించండి
  2. కందం
    సంతోషమ్మునఁ బలువురి
    స్వాంతమ్మున నిలువ కందిశంకర గురులిం
    తింతగ నంకితమై కా
    వింతగను సమస్య లైదువేలయ్యె భళా!


    మత్తేభవిక్రీడితము
    కవులన్ దీర్చగ నెంచెడున్ గతన సంకల్పంబు నేపారగన్
    జవులూరించెడు పద్య మాధురులనే సంధింప నుత్సాహులున్
    స్తవనీయంబగు 'శంకరాభరణ' మే సర్వోన్నతిన్ బొందగా
    నవురా చూచుచునుండగా నయిదువేలయ్యెన్ సమస్యల్ భళా!

    రిప్లయితొలగించండి
  3. కందం
    ఎంతోశ్రమతోడ, అవి
    శ్రాంత కృషీవలుడు కంది శంకర పండిట్
    శాంతముతో సాగించగ
    వింతగను సమస్య లైదువేలయ్యె భళా

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు

    రిప్లయితొలగించండి

  4. "శంకరాభరణం"ప్రస్థానంలో ఐదు వేల పద్య సమస్యా పాదములు అలంకరించుకున్న శుభతరుణాన.... మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి....కవి, పండితులందఱకు.... శుభాకాంక్షలు.... శుభాభినందనలు....!

    అంతయు వాణీకృపయే
    సుంతయు నతిశయములేక శోభిల్లనిటన్
    ఎంతయొ పులకింతనిడుచు
    వింతగను సమస్య లైదువేలయ్యె భళా!


    మరో పూరణము:

    ౘవులూరించెడు పద్యవిద్య కిట వి
    స్తారంపు సౌభాగ్యమై
    కవనాంతర్గతమౌ వధాన పరి యు
    క్తంబైన మార్గంబునన్
    అవలీలన్సృజనంబు నందినవి వి
    న్యాసంబు శోభిల్లగన్
    అవురా! చూచుచునుండగా నయిదు వే
    లయ్యెన్ సమస్యల్ భళా!

    రిప్లయితొలగించండి
  5. ఎవరూహించిరి బ్లాగులోకమున వెల్గీరీతి పద్యంబు, స
    త్కవిసాహస్రము వచ్చివ్రాయుదురు వాక్కాంతామణీపూజగాన్
    వివిధాంశంబుల మేటికైతలను వేవే లంచు నీవేదిపై?
    నవురా!చూచుచునుండగా నయిదువేలయ్యెన్ సమస్యల్ భళా!

    రిప్లయితొలగించండి
  6. ఇంతింతై నెదిగిన వటు
    డింతయినట్లు ప్రతిదినము డెందము నంతై
    సంతసమిచ్చెడి, నేటికి
    వింతగను సమస్య లైదువేలయ్యె భళా

    రిప్లయితొలగించండి
  7. ఎంతయు శ్రమ కోర్చి యొ సగ
    సంత స ముగ పూరణ ముల శంక రార్యు ల వి
    శ్రా o త పు సూచనలo దెను
    వింతగను సమస్యలైదు వేల య్యె భ ళా!

    రిప్లయితొలగించండి
  8. చింతించి యతడు పద్యం
    బంతము కాకూడదనెడి పంతము గల వి
    శ్రాంతబుధానుని బ్లాగున
    వింతగను సమస్య లైదువేలయ్యె భళా!


    అవమానమ్ముల లెక్కసేయకనె తానారంభమున్ జేసి తా
    నవిరామమ్ము శ్రమించె గాంచనది యత్యంతాద్భుతమ్మైనదై
    యవనిన్ నిల్చిన శంకరాభరణమే యానాటి రోహమ్ము నే
    డవురా చూచుచునుండగా నయిదువేలయ్యెన్ సమస్యల్ భళా!

    రిప్లయితొలగించండి
  9. ఎంత వెరగుగ ననిరిటుల
    వింతగను సమస్య లైదువేలయ్యె భళా !
    సుంతయు విరామమొందక
    పంతముగ నెరపగ పడిన పాట్ల నెరుగరే

    రిప్లయితొలగించండి
  10. [ గురువు గారికి శుభాభినందనలతో.....]

    సుంతయు నలసట నొందక
    స్వాంతము నడిపిన పథమున శంకరుడే మే
    ల్బంతిగ నలరుచు నుండగ
    వింతగను సమస్య లైదువేలయ్యె భళా

    వివరింపన్ దగునే విశిష్టముగదా ప్రేమానురాగాలతో
    కవితాశక్తిని బెంపుజేయు గురుడే కాలంబు లెక్కింపకే
    జవనాశ్వమ్మును బోలునట్టి పరుగుల్ సంప్రీతితో సల్పగా
    నవురా చూచుచునుండగా నయిదువేలయ్యెన్ సమస్యల్ భళా

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. కం॥ అంతయు భగవత్కృపయని
      సంతసముగ శంకరులిడఁ జవిగా సేయన్
      జింతించి పూరణలఁ గని
      వింతగను సమస్య లైదు వేలయ్యె భళా!

      మ॥ అవధానంబులఁ బూరణల్ సొబగుతో నానంద మందించఁగన్
      గవితా పాండితిఁ బెంచు భావుకత యాకాంక్షన్ గనన్ శంకరుల్
      చవితో పూటకు నొక్కటిన్ గవులకున్ సంధించఁగన్ నేటితో
      నవురా చూచుచు నుండగా నయిదువేలయ్యెన్ సమస్యల్ భళా

      తొలగించండి
    2. గవితా పాండితిఁ బెంచు భావుకత నాకాంక్షన్ గనన్ శంకరుల్
      రెండవ పాదమిలా సవరించానండి

      తొలగించండి
    3. 5000 మైలురాయిని తాకిన సందర్భంగా మరొక పూరణండి

      మ॥ చవితో వ్రాయఁగఁ బద్యముల్ మిగుల ప్రోత్సాహమ్మునిచ్చెన్ గదా
      స్తవనీయంబగు శంకరాభరణమున్ స్థాపించఁగన్ శంకరుల్
      కవులన్ దీరిచి దిద్దుచుండెడి బృహత్కార్యంబునన్ నేటితో
      నవురా చూచుచు నుండగా నయిదు వేలయ్యెన్ సమస్యల్ భళా

      తొలగించండి
  12. కం:ఎంతో కష్టపడగ భగ
    వంతుం డా "యైదు వేలు" పదమిడె యతికిన్
    పొంతన కుదరక,ప్రాసకు
    వింతగను సమస్య లైదువేలయ్యె భళా”
    ( పద్యం లో పదాలు వెతుకుతుంటే ఐదు వేలు అనే పదం దొరికింది కానీ దానితో గణాలు కుదిరిన యతి ప్రాసలు తప్పుతున్నాయి.)

    రిప్లయితొలగించండి
  13. మ:కవివర్యుండగు కంది శంకరుడు ప్రాఖ్యన్ గూర్చుచున్ తెల్గుకున్,
    జవి జూపించు సమస్య లీయ, కడు దీక్షన్ బూని యీనాటి తో
    నవురా చూచుచునుండగా నయిదువేలయ్యెన్ సమస్యల్ భళా!
    కవినౌ నే నొక వేయి పూరణములన్ గావించితే శ్రద్ధతో?
    (వారు ఐదు వేల సమస్య లిచ్చారు కానీ నేను శ్రద్ధగా ఒక వెయ్యి ఐనా పూరించానా? అని ఒక కవి అసంతృప్తి చెందినట్టు.
    గురువు గారి ప్రతిభకు,దీక్షకు హార్దికాభినందనలు.)

    రిప్లయితొలగించండి
  14. పంతమ్మున నేత యొకం
    డెంత పని పరిష్కరింప నీ యైదింటిం
    జింతింప నిట్టు లకటా
    వింతగను సమస్య లైదు వేలయ్యె భళా


    భువిలో లోకుల కున్న కష్టముల సంపూర్ణమ్ముగా నెన్నఁగా
    దివిజాధీశున కైన శక్య మగునే తీర్పంగ సుంతైనఁ బౌ
    ర వరుల్ సెప్పుకొనుండు మీ వగ లనం బ్రారంభముం జేయఁగా
    నవురా చూచుచు నుండఁగా నయిదు వేలయ్యెన్ సమస్యల్ భళా

    రిప్లయితొలగించండి
  15. అవురా చూచుచునుండగా నయిదువేలయ్యెన్ సమస్యల్ భళా
    యువ విద్యార్థులు పండితాగ్రణుల నిత్యోత్ప్రేరణా శక్తియై
    కవిలోకంబున శంకరాభరణ విఖ్యాతంబు దేదీప్యమౌ
    నవిరామంబుగ సాగగావలెను పద్యాభ్యాస సద్యజ్ఞమే

    రిప్లయితొలగించండి
  16. పంతమొకింతయు వీడక
    సంతత సృజనాత్మకతను శంకరవర్యుల్
    వంతుగ నిడ ననుదినమిదె
    వింతగను సమస్య లైదువేలయ్యె భళా

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సొంతముగ ప్రతి దినమ్మున
    చింతన చేయుచు కవులకు చిక్కులనిడగా
    పంతముతో పూరించగ
    వింతగను సమస్య లైదు వేలయ్యె భళా!

    రిప్లయితొలగించండి
  18. కం:ఎంతయు పండితుడ ననుచు
    పంతము తో నీ విడంగ వంద సమస్యల్
    సంతసమె!శంకరయ్యకు
    వింతగను సమస్య లైదువేలయ్యె భళా”
    (ఇదొక తమాషాకి.ఇంత పెద్ద పండితుణ్నని ను వ్విచ్చిన సమస్యలు వందేగా! శంకరయ్య గారు ఐదు వేలు ఇచ్చారు అని ఎవరో ఎవరినో రెచ్చగొట్టినట్టు.)

    రిప్లయితొలగించండి
  19. సంతసమునననుదినమును
    సుంతయు మనమున విసుగును చూపక నొసగన్
    చింతనమును చేయునవియు
    *వింతగనుసమస్యలైదువేలయ్యె భళా*

    అవురా భాగ్యమనంగ వచ్చు మనకత్యానందమున్కల్గెగా
    కవివర్యుండగుశంకరుండిచటనేకామ్యంబువాంఛింపకన్
    *నవురా చూచుచునుండగా నయిదువేలయ్యెన్సమస్యల్ భళా
    కవిలోకంబుననీసమూహమది ప్రఖ్యాతిన్వహించెన్గదా

    రిప్లయితొలగించండి