కవిమిత్రులకు నమస్సులు
26-7-2008 నాడు నేను 'శంకరాభరణం' బ్లాగును ప్రారంభించాను. కాని 2-6-2010 నుండి సమస్యలను ఇవ్వడం ప్రారంభించాను.
ప్రారంభంలో వారంలో ఆరు రోజులు చిన్న సమస్యలు (జాత్యుపజాతులలో) ఇస్తూ, వారంతంలో (ఆదివారం నాడు) వృత్తసమస్యలిస్తూ ఉండేవాణ్ణి. 30-5-2016 నుండి ఒకే సంఖ్యతో రెండు సమస్యలు ఇవ్వడం ప్రారంభించాను. ఒకే భావంతో వృత్తంలో ఒక సమస్య... జాత్యుపజాతుల్లో ఒక సమస్య. ఉజ్జాయింపుగా లెక్క వేస్తే ఇప్పటికి దాదాపు 9000 సమస్యలు అయి ఉంటాయి.
ఈ సమస్యలలో నేను స్వయంగా సిద్ధం చేసినవి, మిత్రులు పంపినవి, వివిధ గ్రంథాలనుండి సేకరించినవి, అవధానాలలో ప్రాశ్నికులు అడిగినవి ఉన్నాయి. సాహితీ సమావేశాలకు వెళ్ళినప్పుడు కవిమిత్రులు తమ పుస్తకాలను ఇచ్చినప్పుడు వాటిని చదువుతూ వారి పద్యపాదాలలో నాకు సమస్యగా పనికి వచ్చేవి ఏమైన ఉన్నాయా అని వెదుక్కుంటూ ఉంటాను. వారి పద్యపాదాలలో ఒకటి, రెండు పదాలను మార్చి సమస్యలు సిద్ధం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
చాలా కాలంగా మిత్రులు శంకరాభరణం సమస్యలతో ఒక పుస్తకాన్ని ప్రచురించుమని ప్రోత్సహిస్తూనే ఉన్నారు.
1000 సమస్యలు పూర్తయినపుడు పేజీకి ఒక సమస్య - దానికి వచ్చిన పూరణలలో ఎన్నుకున్న నాలుగు పూరణలు (వ్రాసిన కవుల పేర్లతో) చొప్పున ఒక పుస్తకం ముద్రించాలనుకున్నాను. ఆ పని జరుగలేదు.
3000 సమస్యలు పూర్తయినపుడు ఒక్కొక్క సమస్య - దానికి వచ్చిన పూరణలలో ఎన్నుకున్న ఒక పూరణ చొప్పున ఒక పుస్తకం వెలువరిస్తే బాగుంటుందనుకున్నాను. అదీ జరుగలేదు.
ఇప్పుడు 5000 సమస్యలయ్యాయి. నేను పైన చెప్పిన విధంగా అన్ని సమస్యా పాదాలను లెక్కిస్తే దాదాపు 9000 అవుతాయి.
ఇప్పుడు కేవలం సమస్యలు మాత్రమే ముద్రించాలని సంకల్పం. ఛందస్సుల వారీగా, సమస్యలను అక్షరక్రమంలో ఇస్తాను. బ్లాగు మొదలు పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వాట్సప్ సమూహం వరకు పూరణలు వ్రాసిన వారి పట్టిక ఉంటుంది (ఒక్క పూరణ చెప్పినా, వేలాదిగా చెప్పినా అందరినీ అక్షరక్రమంలో అందులో ప్రకటిస్తాను), ఆటవెలది, తేటగీతి, కందం, ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం, ఇతర వృత్తాలు ఇలా ఛందాల వారీగా సమస్యలుంటాయి. అదికూడా అక్షరక్రమంలో.
ఇది 400 పైచిలుకు పేజీల పుస్తకం అవుతుంది. 500 పుస్తకాలు ముద్రించడానికి దాదాపు లక్ష రూపాయల వరకు కావచ్చు.
అయితే ఈ పుస్తకాన్ని వ్యక్తిగతంగా ముద్రించే స్తోమత నాకు లేదు. ఏదైనా సంస్థ పూనుకొని ముద్రిస్తే బాగుంటుంది కాని, ఏ సంస్థ ముందుకు వస్తుంది?
అందుకని శంకరాభరణం సభ్యుల నుండి, హితుల నుండి విరాళాలు సేకరించాలని మిత్రులు నిర్ణయించారు.
ఇది తప్పనిసరి కాదు. ఇష్టం ఉన్నవారు ఇవ్వవచ్చు, లేనివారు ఇవ్వకపోవచ్చు. బలవంతం లేదు... విజ్ఞాపన మాత్రమే.
ఇంత అని పరిమితి లేదు. ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత... క్రింద పేర్కొన్న వివరాల ప్రకారం మా ఆవిడ అకౌంటుకు పంపవచ్చు. (నేను మిత్రుల పుస్తకాల ముద్రణలో వారికీ, ప్రెస్సు వాళ్ళకూ లావాదేవీలు నా అకౌంటుతో చేస్తున్నందున ఈ డబ్బులు కూడ అందులో చేరితే గజిబిజిగా ఉంటుందన్న కారణంగా నా నెం. ఇవ్వడం లేదు)
15 సంవత్సరాలుగా తమ పద్యాలను పంపుతూ, ఇంత వృద్ధాప్యంలోనూ నాలో ఉత్సాహాన్ని నింపుతూ ప్రోత్సహిస్తున్న కవిమిత్రులకు, సాహితీప్రియులకు సర్వదా కృతజ్ఞుడను.
మీ
కంది శంకరయ్య
విరాళాలను పంపవలసిన అకౌంటు వివరాలు...
PhonePe/Gpay : Kandi Shanthi 7702121376
లేదా.... క్రింది అకౌంటుకు పంపవచ్చు.
Kandi Shanthi
Acc.No. 62463173690
S.B.I. Pochamma maidan Br. Warangal
IFSC : SBIN0021108
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి