ఉ:తారలు జల్లు లో తడిసి దగ్గర యై యొక పాట పాడుటే కోరుచు జూచినాము కవి కోకిల చక్కగ వ్రాయ నాడి రా తారలు, చిన్నబోయె జలధారలఁ గాంచుచుఁ జిత్రమేమొకో” తారల పంక్తి నేడు తమ ధాన్యపు పంటలు నాశ మొందుటన్ (పూర్వం ఒక సినిమాలో జల్లు కురుస్తుంటే చిటపట చినుకులు పాడుతూ ఉంటే అనే పాట ఉంది.ఇదేమి సినిమానో కానీ అధికవర్షం వల్ల తమ పంట పాడౌతోందని తారకా పంక్తి చిన్న బోయింది.)
కందం
రిప్లయితొలగించండికోరియుఁ దాతల ముక్తి భ
గీరథుడు తపించి భక్తిఁ గేల్మోడ్చ హరుం
డోరుచ జార సురాపగ
తారలు చినబోయెను జలధారలఁ గనుచున్!
ఉత్పలమాల
కోరియు ముక్తి తాతలకు క్రుంగక మ్రొక్కి భగీరథుండుఁ గే
దారుని నిల్వనొప్పగని దల్చ సురాపగ నేల దింపఁగన్
జారగ నింగి దారులను శంకరుజూటము చేరువేళలో
తారలు చిన్నబోయె జలధారలఁ గాంచుచుఁ జిత్రమేమొకో!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥తీరుగ వేకువ పరఁగఁగఁ
రిప్లయితొలగించండిదోరపు కాంతుల వెలయఁగ తోయపు ధారల్
శూరుని ప్రభను మణులవలెఁ
దారలు చినబోయెను జలధారలఁ గనుచున్
ఉ॥ తూరుపు తెల్లవారఁగను దోరపు వెల్గులఁ జిమ్ముచుండఁగన్
బారువు కాంతి యట్లు పరివర్తనఁ దోయపు ధారలందునన్
తీరుగఁ జెందుచుండఁగను దీటుగ ముత్యములట్లు దీపిలన్
దారలు చిన్నబోయె జలధారలఁ గాంచుచుఁ జిత్రమేమొకో
శూరుడు పారువు సూర్యుడు దీపిలు ప్రకాశించు(నిఘంటువు సహాయమండి)
పరివర్తన refraction (of light)
పేరువు పైవెల్లివిరిసి
రిప్లయితొలగించండిజారెడు జలపాతమందు శక్రధనువులే
తీరుగనేర్పడ జూచిన
తారలు చినబోయెను జలధారలఁ గనుచున్
కోరిక తీర గాంచితిని కొండలలో ప్రవహించు నీటినే
పేరువు నుండి దూకు జలవేగము తోచె మనోహరమ్ముగా
జారెడు నీటిబిందువుల శక్రధనుస్సులు సంభవించగా
తారలు చిన్నబోయె జలధారలఁ గాంచుచుఁ జిత్రమేమొకో
శారదరాత్రమందు సువిశాల నభమ్మున చందమామతో
రిప్లయితొలగించండితారలు గూడి ముచ్చటగ తారటలాడుచునుండ నత్తరిన్
నీరదముల్ విశాలమగు నింగిని గ్రమ్మెను, వానచిన్కులై
ధారుణిపైన రాలగనె ధారలుగా గగనమ్మునుండి యా
తారలు చిన్నబోయె జలధారలఁ గాంచుచుఁ జిత్రమేమొకో
శారదరాత్రమునందున
రిప్లయితొలగించండితారలు చందురుని గూడి తారటలాడన్
నీరదములు వర్షించెను
తారలు చినబోయెను జలధారలఁ గనుచున్
తీరిక నొందక నభినయ
రిప్లయితొలగించండిధారణ తోడ నధికముగ దాంతి నొందన్
భారూపుని గన గదలగ
తారలు చినబోయెను జలధారలఁ గనుచున్
రిప్లయితొలగించండిచారిమముల గాంచుటకై
సారంగమునందు తిరుగు స్వాతంత్ర్యంబే
యారటులకేదని సినీ
తారలు చినబోయెను జలధారలఁ గనుచున్.
చారిమమైన దృశ్యము కృశాశ్వుల మొంటరిగాను గాంచగా
స్వైరము లేని వారలము పంజర మందు ఫలాశనమ్ములా
ధారుణి జీవనమ్మనుచు తాపము నంది మనమ్ములో సినీ
తారలు చిన్నబోయె జలధారలఁ గాంచుచుఁ జిత్రమేమొకో.
వాలి భార్య తార, వాలి కన్నీటిని చూసి; బృహస్పతి భార్య తార, చంద్రుని కన్నీటి ధారలు చూసి చిన్నబోయారు:-
రిప్లయితొలగించండితారుని పట్టి రాము సెల దాకిన వాలి ముఖంబు జూడగన్
సార విహీన చంద్రుఁడిని శాపముచే క్షయమొందు చుండగన్
చారణ సంఘ బోధకుని చామ గనెన్ నయనంబులందునన్
తారలు చిన్నబోయె జలధారలఁ గాంచుచుఁ జిత్రమేమొకో!!
కం:తీరుగ రాగా చిత్రపు
రిప్లయితొలగించండితారలు, చినబోయెను జలధారలఁ గనుచున్”
ఘోరపు టెండకు కుందెడు
నూరి వగపు జూప నెంచు నొక దర్శకుడే.
(షూటింగ్ కి తార లంతా వచ్చి కూర్చున్నారు.దర్శకుడు ఎండలని చిత్రించ దలిస్తే ఆ రోజు వాన పడి చిన్న బోయాడు.)
ఉ:తారలు జల్లు లో తడిసి దగ్గర యై యొక పాట పాడుటే
రిప్లయితొలగించండికోరుచు జూచినాము కవి కోకిల చక్కగ వ్రాయ నాడి రా
తారలు, చిన్నబోయె జలధారలఁ గాంచుచుఁ జిత్రమేమొకో”
తారల పంక్తి నేడు తమ ధాన్యపు పంటలు నాశ మొందుటన్
(పూర్వం ఒక సినిమాలో జల్లు కురుస్తుంటే చిటపట చినుకులు పాడుతూ ఉంటే అనే పాట ఉంది.ఇదేమి సినిమానో కానీ అధికవర్షం వల్ల తమ పంట పాడౌతోందని తారకా పంక్తి చిన్న బోయింది.)
పారగవరదలు మెండుగ
రిప్లయితొలగించండిచేరెను నీరములు గిరిని చెలువము గాగన్
జోరుగ దూకగ జూచియు
తారలు చిన బోయె ను జల ధారలు గనుచు న్
తారాపథమునఁ గన నె
రిప్లయితొలగించండివ్వారికి శక్యమ్ము గాని పగిది ననంగం
దోరపు మేఘావృతమునఁ
దారలు చినబోయెను జలధారలఁ గనుచున్
వారక కాఱుచుండఁగ నపారము వక్త్రము వస్త్రరాజముల్
తోరము గాఁగఁ గ్లిన్నములు దుర్భర తాప నిమిత్త మత్తఱిన్
సార విచార సంయుత విసారిత చక్షు నభస్స్థ సంచర
త్తారలు చిన్నబోయె జలధారలఁ గాంచుచుఁ జిత్ర మేమొకో
కోరగనె భగీరథునకు
రిప్లయితొలగించండిమారరిపుడు విడచినంత మహికిన్ వడిగా
జారెడి గంగను గనుచును
*తారలు చినబోయెను జలధారలఁ గనుచున్”*