తోడునీడగ గూడి రైతులు దున్ని భూములు పల్లెలన్ పాడిపంటల నందజేసిన బల్లిదమ్మగు దేశమే వాడవాడల రైతు జీవిక పాడిపంటలె, యెవ్విధిన్ పాడి పంటలు లేని పల్లెలు పట్టుగొమ్మ లుపాధికిన్
కొత్త నగరనిర్మాణము కోరుకొన్న వెదకి చూడుము నొకచోట వేగిరమున పూర్తిగా బీడు వారిన పొలములున్న పాడి పంటలు లేనట్టి పల్లె మేలు
పాడుబెట్టిన బీడు నేలల పంటలేవిధి పండురా కూడివచ్చిన రైతులందరు కొత్త పట్నము సాధ్యమౌ పాడిగా పలు చేతివృత్తుల భాగ్య మేర్పడి శీఘ్రమే పాడి పంటలు లేని పల్లెలు పట్టుగొమ్మ లుపాధికిన్
తే.గీ:కరవు సీమకు జెందు కుగ్రామ వాసి ఘనుడు సంజీవ రెడ్డి సాగరును దెచ్చె పాడి పంటలు లేనట్టి పల్లె మేలు చేయు నేత ప్రేరణ నొంద జేసె భళిర! (నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రావటం లో నీలం సంజీవ రెడ్డి పాత్ర ముఖ్య మైనది.కరవు సీమ ఐన రాయలసీమ గ్రామము మంచి చెయ్యటానికి ఒక నేతకి ప్రేరణ నిచ్చింది.)
మ.కో:పాడి పంటలు,వృత్తు లుండిన వచ్చునే అతివాదముల్? కూడు కాపర మెల్ల గూల్చగ క్రూరవిప్లవముల్ సదా కూడుచుండును పేద వారల కోపమే యొక శక్తి గా పాడి పంటలు లేని పల్లెలు పట్టుగొమ్మ లుపాధికిన్” (ఉపాధి సౌకర్యాలు లేని గ్రామాలు ఉగ్రవాద కార్యక్రమాలకి ఒక ఉపాథి గా మారతాయి.ఆ పేదరికం మీద విప్లవాలు నడుస్తాయి.)
త్రాగుటకును తినుటకును ధరణి యందు పశువులును మరి రైతులు వలసియుండ పాడి పంటలు లేనట్టి పల్లె మేలు ననుచు పలుకుట తగదంచు నరయు డయ్య
మ.కో: నేడు చూడగ నెల్లతావుల నీటి యెద్దడి హెచ్చగా తాడు బిందెకు కట్టి చేదెడు తంతుకానగ రాదుగా వీడులోని పొలమ్ము లన్నియు బీడు భూములు నయ్యెగా పాడిపంటలు లేని పల్లెలు పట్టు గొమ్మలుపాధికిన్
తేటగీతి
రిప్లయితొలగించండిరైతులెల్లరి యింటను ప్రీతిగొలుపు
గోవులెద్దులు బర్రెలు కూడియుండ
కరువు లేక వర్షములుండ, కొరతయనెడు
పాడి పంటలు లేనట్టి పల్లె మేలు
మత్తకోకిల
తొలగించండివాడవాడల గోవులెద్దులు బర్రెలుండుచు చాలగన్
చూడచక్కని యిల్లనిండుగ శోభగూర్చెడు గాదెలన్
బీడుభూములమాటలేకయె నిండ ధాన్యము, లోటుగన్
పాడి పంటలు లేని పల్లెలు పట్టుగొమ్మ లుపాధికిన్!
తోడునీడగ గూడి రైతులు దున్ని భూములు పల్లెలన్
రిప్లయితొలగించండిపాడిపంటల నందజేసిన బల్లిదమ్మగు దేశమే
వాడవాడల రైతు జీవిక పాడిపంటలె, యెవ్విధిన్
పాడి పంటలు లేని పల్లెలు పట్టుగొమ్మ లుపాధికిన్
రిప్లయితొలగించండిచేయుమిక పరిశ్రమకు భూసేకరణము
వెదక వలయు తగిన భూమి వేగిరమున
రాష్ట్ర సరిహద్దు లోనున్న ప్రాంత మగుచు
పాడి పంటలు లేనట్టి పల్లె మేలు.
కూడు బెట్టగ పేదవారికి కొల్వులిచ్చెడి శిక్షకై
వీడు నొక్కటి కట్టనెంచితి విద్యలెన్నియొ నేర్పగా
జాడగన్గొని చెప్పమంటి ప్రజాహితమ్మును గోరుచున్
పాడి పంటలు లేని పల్లెలు , పట్టుగొమ్మ లుపాధికిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ ఉచితములఁ మోజునఁ బనుల రుచి మరువఁగ
రిప్లయితొలగించండినేఁడు వ్యవసాయ మీవిధిఁ బాడుపడఁగ
లాభ మొదగక నెంచిరి రైతులిపుడు
పాడి పంటలు లేనట్టి పల్లె మేలు
మత్త॥ చూడ నేఁడటు సేద్యమొప్పకఁ జొచ్చఁగన్ నగరంబులన్
నీడఁ బొందఁ బ్రభుత్వ మీవిధి నెమ్మి తోడను బంచఁగన్
వీఁడు వాఁడను భేద మెంచక విత్త మెంతయొ యూరకే
పాడి పంటలు లేని పల్లెలు పట్టుగొమ్మ లుపాధికిన్
నాది Rural background అండి. ఈరోజు సమస్య వాస్తవమే నండి. నేడు అనంతపురం (ఉమ్మడి) జిల్లాలో వ్యవసాయం బాగా తగ్గింది. కారణాలు
1. వ్యవసాయం లాభసాటి కాదు. రైతు కూలీలు దొరకరు
2. ఉచితాల ప్రభావం. పల్లె వాసులందరూ పేదవారి క్రింద లెక్క.
3. రైతులకు పెళ్లి కావడం గగనం.
“పాడి పంటలు లేనట్టి పల్లె మేలు"
రిప్లయితొలగించండిగ తలపోసీ తెలుపుచుండె ఖలుడొకండు
అన్య వృత్థుల నచటి వారరయ రెపుడు
జీవనమెటుల కొనసాగి జితము నొందు
కొత్త నగరనిర్మాణము కోరుకొన్న
రిప్లయితొలగించండివెదకి చూడుము నొకచోట వేగిరమున
పూర్తిగా బీడు వారిన పొలములున్న
పాడి పంటలు లేనట్టి పల్లె మేలు
పాడుబెట్టిన బీడు నేలల పంటలేవిధి పండురా
కూడివచ్చిన రైతులందరు కొత్త పట్నము సాధ్యమౌ
పాడిగా పలు చేతివృత్తుల భాగ్య మేర్పడి శీఘ్రమే
పాడి పంటలు లేని పల్లెలు పట్టుగొమ్మ లుపాధికిన్
పాడి పంటలు గల్గిన పల్లెలందు
రిప్లయితొలగించండికరువు కాటకాలుండవు కర్షకులకు
పాడి పంటలు లేనట్టి పల్లె మేలు
యనుట సత్యవిదూరమౌ నరసిచూడ
పాడి పంటల వల్లనే పల్లె లందు
రిప్లయితొలగించండితాండ వించును మోదమ్ము మెండు గాను
సమ్మ తించుచు లోకాన నమ్మ రె ట్లు
పాడి పంటలు లేనట్టి పల్లె మేలు?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే.గీ:కరవు సీమకు జెందు కుగ్రామ వాసి
రిప్లయితొలగించండిఘనుడు సంజీవ రెడ్డి సాగరును దెచ్చె
పాడి పంటలు లేనట్టి పల్లె మేలు
చేయు నేత ప్రేరణ నొంద జేసె భళిర!
(నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రావటం లో నీలం సంజీవ రెడ్డి పాత్ర ముఖ్య మైనది.కరవు సీమ ఐన రాయలసీమ గ్రామము మంచి చెయ్యటానికి ఒక నేతకి ప్రేరణ నిచ్చింది.)
మ.కో:పాడి పంటలు,వృత్తు లుండిన వచ్చునే అతివాదముల్?
రిప్లయితొలగించండికూడు కాపర మెల్ల గూల్చగ క్రూరవిప్లవముల్ సదా
కూడుచుండును పేద వారల కోపమే యొక శక్తి గా
పాడి పంటలు లేని పల్లెలు పట్టుగొమ్మ లుపాధికిన్”
(ఉపాధి సౌకర్యాలు లేని గ్రామాలు ఉగ్రవాద కార్యక్రమాలకి ఒక ఉపాథి గా మారతాయి.ఆ పేదరికం మీద విప్లవాలు నడుస్తాయి.)
కడుపు నిండఁగ నక్కట కాసు లున్న
రిప్లయితొలగించండితిండి లేకుండ జను లెట్టు లుండఁ గలరు
తడయ కుండఁ దర్కమ్ముల విడిచి యుండఁ
బాఁడి పంటలు లేనట్టి పల్లె మేలు
వాఁడు వీఁడను భేద భావము వారి కుండదు సుంతయుం
దోడు నీడగ నుందు రెల్లరు దొడ్డ దుఃఖము కల్గినన్
వాడ వాడలఁ బొంగు హర్షము భార తావని లేవు సూ
పాఁడి పంటలు లేని పల్లెలు పట్టుగొమ్మ లుపాధికిన్
సమస్య-
రిప్లయితొలగించండిపాడిపంటలు లేని పల్లెలు పట్టుగొమ్మలుపాధికిన్
మ.కో.
పాడి నిండిన పట్టుకొమ్మలు పల్లెలందురు పూర్వమే
నేడుచూడగ కానరావుగ నేత్రపర్వపు క్షేత్రముల్
కూడుగుడ్డలు మెండుగుండని కూర్మినేగిరి పట్నముల్
మేడమిద్దెల పెంచుచుండిరి మేటి శాస్త్రపు కూరలన్
వాడవాడల యంత్ర ఘోషలు వాసికెక్కిన యూళ్లలో
పాడిపంటలు లేని పల్లెలు పట్టుగొమ్మలుపాధికిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పల్లెలు నెలవు గద పాడిపంటలకును
పట్టణముల కాధారము పల్లెలగును
పాడిపంటలు లేనట్టి పల్లె మేలు
గూర్చదు, పుడమి జనులకు కూడు లేదు
రైతులున్నట్టి పల్లెలే రాణకెక్కు.
పాడి పంటలు లేనట్టి పల్లె మేలు”
రిప్లయితొలగించండియనుట జగమున మూర్ఖులు మానవలెను,
ప్రజల క్షుత్తులు దీర్చును పల్లెలిలను,
పాడి పంటలు లేనట్టి భవిత లేదు.
సురేష్ కుమార్ రామోజు
త్రాగుటకును తినుటకును ధరణి యందు
రిప్లయితొలగించండిపశువులును మరి రైతులు వలసియుండ
పాడి పంటలు లేనట్టి పల్లె మేలు
ననుచు పలుకుట తగదంచు నరయు డయ్య
మ.కో:
నేడు చూడగ నెల్లతావుల నీటి యెద్దడి హెచ్చగా
తాడు బిందెకు కట్టి చేదెడు తంతుకానగ రాదుగా
వీడులోని పొలమ్ము లన్నియు బీడు భూములు నయ్యెగా
పాడిపంటలు లేని పల్లెలు పట్టు గొమ్మలుపాధికిన్