తే.గీ: బాలకా పిన్న వాడవై పద్యములను మధువు నే సిరా జేసుక మలచినావొ యనగ నీ చిన్ని కావ్యపు తెనుగదేమొ! పట్టినవి చీమలు దెలుఁగు పద్యమునకు (తేనెనే సిరా చేసుకు రాసావా? అని ఒక కవితాత్మక మైన పొగడ్త.యాదృచ్ఛికం గా చీమలు పడితే ఒక కవి దాన్ని ఇలా ఉత్ప్రేక్ష చేసాడు.తెనుగు అంటేనే తియ్యనిది కనుక ఆ పదం వాడాను.)
(2)ఉ:వట్టి గొప్పలు పోవు చుండును వాణి తా కవయిత్రి యై యెట్టి వ్యాకరణమ్ము జూడక నేడ్చుచుండును పూరణల్ గట్టిగా తిన మందలింపులు కమ్ర మైన ముఖమ్ము పై పట్టెఁ జీమలు దెల్గు పద్యపు వాణికిన్ గడు గొప్పగన్” (ఆమె పేరు వాణి.తెలుగు పద్యం వ్రాస్తుంది కనుక తెలుగు పద్యపు వాణి అన్నాను.ఆమె కవిత్వాన్ని వంక పెట్టే సరికి ఆ ముఖం మీద చీమలు పాకినట్టు చిన్న బోయింది.)
పట్టు తేనియవంటిదౌమనపద్దియమ్ములు చూడగా చుట్టుముట్టిరి బాలలెల్లరుసుందరమ్ముగనేర్వగన్ పట్టు బట్టు చువేడ్కమీరగవాసిగానటచేరుచున్ పట్టి చీమలు తెల్గు పద్యపు వాణికిన్ గడు గొప్పగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండితీపి యుండిన చీమలు తిరుగునచట
పద్యమాధుర్యమందించు ప్రకరమనఁగ
నేర్వరాగ చిన్నారులునిత్యమనఁగ
' పట్టినవి చీమలు దెలుఁగు పద్యమునకు'
మత్తకోకిల
చుట్టు చేరును తీపియుండిన చోట చీమలు నిత్యమున్
దిట్టలచ్చట పద్యమాధురి తీర్చి నేర్పు సమూహమై
పుట్టతేనియ గ్రోలురీతిగ మ్రోల నేర్వగ పిల్లలున్
పట్టెఁ జీమలు దెల్గు పద్యపు వాణికిన్ గడు గొప్పగన్
తెలుగుభాష నందున గల తీయదనము
రిప్లయితొలగించండిదాముకూడ జవిగొనుచు దనివి నొంద
పోతనకవి భాగవతపు పొత్తమొంటి
పట్టినవి చీమలు దెలుఁగు పద్యమునకు”
ఎచట తీపిగల్గిన చీమలచట జేరు
రిప్లయితొలగించండితీయ తేనియ లొలుకు నా తేటతెలుఁగు
పద్యమందలి మధువుపై బ్రాతితోడ
పట్టినవి చీమలు దెలుఁగు పద్యమునకు
కట్టి నారు తెలుంగుకు పట్టమిచట
రిప్లయితొలగించండివట్టి మాటలు విడనాడి వ్రాసినారు
దిట్ట కవులైన పలువురు తేనెలూర
పట్టినవి చీమలు దెలుఁగు పద్యమునకు
కట్టినారుగ పట్టమిచ్చట కావ్యమందునఁ దెల్గుకే
దిట్ట లిచ్చట తెల్గు మాధురి తేటతెల్లము చేయగా
వట్టి మాటలు కట్టి పెట్టిన వారు కూర్చిరి తేనియల్
పట్టెఁ జీమలు దెల్గు పద్యపు వాణికిన్ గడు గొప్పగన్
పట్టు తేనియ జాలువారెడు పద్యముల్ మన తెల్గునన్
రిప్లయితొలగించండిదిట్టలౌ కవివర్యులల్లిరి తీపులన్ వెదజల్లగా
నట్టి పద్యఁపు మాధురుల్ మనసార గ్రోలెడు నిచ్చతో
పట్టెఁ జీమలు దెల్గు పద్యపు వాణికిన్ గడు గొప్పగన్
తే॥పులిమి సంస్కృతాంధ్రపు తీపి పొరులు నటుల
రిప్లయితొలగించండివ్రాయ పోతన పడయఁగ భాగవతపు
ప్రతులు మనుజులు గుమిగూడ భ్రాంతి కలిగె
పట్టినవి చీములు దెలుఁగు పద్యమునకు
మత్త॥ అట్టి తీపిని రంగరించఁగ నార్ద్రతాఝరి పొంగఁగన్
బట్టుబట్టుచు వ్రాయ పోతన భవ్య భాగవతమ్మునున్
జుట్టుముట్టఁగఁ బుస్తకమ్ములఁ జూచి పొందఁగఁ దోఁచెనే
బట్టెఁ జీమలు దెల్గు పద్యపు వాణికిన్ గడు గొప్పగన్
పుస్తకాలు కొనేందుకు ఎగబడినందున చీమలలాగ అలాతోచిందని. పాత కాలానికి అతిశయోక్తి.
మరొక పూరణ అండి తెలుగు పద్య ప్రాభమము తగ్గదను భావముతో
తొలగించండిమత్త ॥ పట్టెఁ జీమలు దెల్గు పద్యపు వాణికిని గడు గొప్పగన్
పట్టుగా నవధాన మియ్యెడ భవ్య భాసుర హేలయౌ
గట్టి పద్యపు భాషకీగతిఁ గాంచ శక్యమె కల్లలన్
జట్టుకట్టుచుఁ బల్కుచుండఁగ సత్యమందువొ హాస్యమో
ఏదైనా పతనమైతేనే చీమలు పట్టగలవన్న భావనతో నండి
తేనె లొల్కె డి చవి గల్గి దివ్య మగుచు
రిప్లయితొలగించండిమిగుల భాసించి భాష లన్ మిన్న గాగ
సొంపు లింపు లు గ ల్గ గ జూడ రుచి ని
పట్టి నవి చీమలు తెలుగు పద్య మునకు
రిప్లయితొలగించండిబుధుడు పద్యాలు వ్రాసిన పొత్తమందు
నాలుగేళ్ళ పుత్రుండు లడ్డూల దాచె
చూడగను మరునాడింక చోద్యమేమి?
పట్టినవి చీమలు దెలుఁగు పద్యమునకు
కొట్టునుండియె తండ్రితెచ్చెను కోవబిళ్ళలు కోరగా
బోట్టెకీయక దాచిపెట్టగ పోతనాఖ్యుని పొత్తమున్
గుట్టుగా నవి దొంగలించుకు కొడ్కుదాచిన వెంటనే
పట్టెఁ జీమలు దెల్గు పద్యపు వాణికిన్ గడు గొప్పగన్.
తట్ట బెల్లము నూగు జీడులు తాటి తాండ్రల రీతిగన్
రిప్లయితొలగించండిబుట్ట బూరెలు బూంది లడ్డులు పూత రేకుల తీరుగన్
పట్టు తేనియ కజ్జి కాయలు పాయసంబుల పోలికన్
పట్టెఁ జీమలు దెల్గు పద్యపు వాణికిన్ గడు గొప్పగన్!!
తే.గీ: బాలకా పిన్న వాడవై పద్యములను
రిప్లయితొలగించండిమధువు నే సిరా జేసుక మలచినావొ
యనగ నీ చిన్ని కావ్యపు తెనుగదేమొ!
పట్టినవి చీమలు దెలుఁగు పద్యమునకు
(తేనెనే సిరా చేసుకు రాసావా? అని ఒక కవితాత్మక మైన పొగడ్త.యాదృచ్ఛికం గా చీమలు పడితే ఒక కవి దాన్ని ఇలా ఉత్ప్రేక్ష చేసాడు.తెనుగు అంటేనే తియ్యనిది కనుక ఆ పదం వాడాను.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి(2)ఉ:వట్టి గొప్పలు పోవు చుండును వాణి తా కవయిత్రి యై
రిప్లయితొలగించండియెట్టి వ్యాకరణమ్ము జూడక నేడ్చుచుండును పూరణల్
గట్టిగా తిన మందలింపులు కమ్ర మైన ముఖమ్ము పై
పట్టెఁ జీమలు దెల్గు పద్యపు వాణికిన్ గడు గొప్పగన్”
(ఆమె పేరు వాణి.తెలుగు పద్యం వ్రాస్తుంది కనుక తెలుగు పద్యపు వాణి అన్నాను.ఆమె కవిత్వాన్ని వంక పెట్టే సరికి ఆ ముఖం మీద చీమలు పాకినట్టు చిన్న బోయింది.)
వట్టి వోవఁగ నెల్లెడ వ్యాకరణము
రిప్లయితొలగించండికట్టి యరసున్నలను మూట పెట్టఁ జెఱను
వట్టి మాటలు సెలరేఁగఁ దుట్టెలుగను
బట్టినవి చీమలు దెలుఁగు పద్యమునకు
వృషభగతి రగడ.
బెట్టిదమ్ముగఁ దియ్యఁదనమే విరిసి యుండఁగ గిరల కంతటఁ
బట్టెఁ జీమలు దెలుఁగు పద్యపు వాణికిం గడు గొప్పగన్గట
( మొదట నేను జూచినప్పుడు "పట్టెఁ జీమలు దెలుఁగు పద్యపు వాణికిన్ గడు గొప్పగన్" - అనియే యున్నదండి. )
వట్టి మాటలుకావు తేనియవంటి
రిప్లయితొలగించండితెల్గును పిల్లలున్
పట్టు వట్టియు నేర్వసాగిరి పాడు
చుండిరి నేర్పతో
నిట్టి తీయని తెల్గు తేనె గడింపు
తోడ గ్రహించగా
పట్టె చీమలు తెల్గు పద్యపు వాణికిన్
గడు గొప్పగా
సమస్య:
రిప్లయితొలగించండిపట్టెఁ జీమలు దెల్గు పద్యపు వాణికిన్ గడు గొప్పగన్!
ఉత్పలమాల(లు) :
1 కట్ట వీలిక లేనిదే కద కావ్య సొంపుల కన్యకన్
చెట్టపట్టగ సంచరించెను చేతి ఘంటపు నర్తకై
చుట్టి దాచిన తాళపత్రపు సూదిబెజ్జపు రంధ్రమున్
పట్టెఁ జీమలు దెల్గు పద్యపు వాణికిన్ గడు గొప్పగన్!
2 గుట్టుచప్పుడు లేక నాంగ్లము గూడె చాపల నీరుగన్
పొట్టకూటికి తప్పదంచును బోయి నేర్చిరి పొందికన్
కట్టమూటగ చందమైనది కానజాలని తెన్గుకున్
పట్టెఁ జీమలు దెల్గు పద్యపు వాణికిన్ గడు గొప్పగన్!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
తేనె లొలుకుచు నుండును తెలుగు భాష
తెలుగు భాషలో పద్యము తియ్యగుండు
నట్టి తీపిని పసిగట్టి తుట్టియలుగ
పట్టినవి చీమలు తెలుగు పద్యమునకు.
తీపియుండిన తావున తిరుగు చుండు
రిప్లయితొలగించండిచీమ లనెడి మాటసహజ సిధ్ధ మునుట
వాస్తవమ్ము గావున తీపి పద్యము దరి
పట్టినవి చీమలు తెలుగు పద్యమునకు
పట్టు తేనియవంటిదౌమనపద్దియమ్ములు చూడగా
చుట్టుముట్టిరి బాలలెల్లరుసుందరమ్ముగనేర్వగన్
పట్టు బట్టు చువేడ్కమీరగవాసిగానటచేరుచున్
పట్టి చీమలు తెల్గు పద్యపు వాణికిన్ గడు గొప్పగన్