జగడములో చెలంగి తన శక్తిని చూపిన వీరుడొందెనే ద్విగుణితమైన సంతసము వీరులనేకుల మెప్పులందగా స్వగృహము చేరి చిట్టడుగు భార్యయొడిన్ బవళించి యుండగా మగఁడు గుమారునిన్ గనె సుమా యని పల్కెను భార్య చేటితో
చం:పగ గొని స్వచ్ఛ బంధమున పాపపు నిందల వేసి "పుట్టెనా మగనికి పుత్రు?"డంచు నవమాన మొనర్చగ చేటి "పాతకీ ! మగనిని నీవె మార్చితివి,మత్పతి పోలిక లన్ని రాగ నా మగఁడు గుమారునిన్ గనె సుమా" యని పల్కెను భార్య చేటితో (నీ కొడుకు నీ భర్తకే పుట్టాడా? అని స్నేహితురాలు పగ తో నింద వేస్తే ఈ సాధ్వి సమాధానం చెప్పింది.)
భార్య ప్రసవించెనని తెల్సి భర్త వచ్చి పిల్ల వానిని ముద్దిడె ప్రేమతోడ తల్లి యడుగగ వచ్చెనా యల్లుడనుచు మగడు పుత్రునిఁ గనెనని మగువ దెలిపె. (గనెను=చూచెను అనే అర్థంలో...)
వృత్త సమస్య
రిప్లయితొలగించండిమగడు గుమారునిన్ గనెసుమా యని పల్కెను భార్య చేటితోై.
మోసపోయిన సతి పెళ్ళి వేదికపైని వధువుతో...
రిప్లయితొలగించండితేటగీతి
"పెళ్లి కూతురా! నా మాట వినిన శుభము!
మాయలన్ బన్నువాడన మరులుగొలిపి
నీకు కాబోయెడు వరుడు, నిజము నాదు
మగఁడు, పుత్రునిఁ గనె", నని మగువ దెలిపె!
చంపకమాల
"తగదు వివాహమాడ నిను దారుణరీతిని మోసగింపగన్
నిగుడుచు వచ్చె నీ వరుడు నిక్కము జెప్పెద," నంచు "మున్పు నన్
సొగసుల రాణివంచుగొని చొప్పడినంతట కౌతుకాన నీ
మగఁడు, గుమారునిన్ గనె సుమా!", యని పల్కెను భార్య చేటితో!
చదువుకొనుట కొరకు విదేశమున కేగి
రిప్లయితొలగించండిచాలయేండ్లు గడచియుండె , చదువు పూర్తి
యయినటుల దెలియుట జేత నచటికేగి
మగఁడు పుత్రునిఁ గనెనని మగువ దెలిపె
రిప్లయితొలగించండినీదు చెల్లెలి కెప్పుడో నెలలు నిండె
తెలియ కుండెను విషయంబు చెలియ తనకు
కాను పయిన తెలుపుమని కలికి నడుగ
మగఁడు , పుత్రునిఁ గనెనని మగువ దెలిపె.
జగతిని పూరుషుండ్రనగ జాజర కారులె విశ్వసించెడిన్
మగువల డాగురించగల మాయలమారులె సత్యమియ్యదే
నిగవుగ నున్న దంచు నొక నెచ్చెలి వంచన జేసి దిచ్చు నా
మగఁడు గుమారునిన్ గనెసు మా యని పల్కెను భార్య చేటితో.
చ.
రిప్లయితొలగించండిముగిసిన క్రీడయందు జయమొంది ప్రశంసల జల్లులోన పా
తిగ బడి గొప్పదౌ బహుమతిన్ గురువుల్లసిలి యందఁ జేయఁ జి
ర్నగవులు విచ్చి యాత్రమున నంబరమంటెడి హ్లాదమంది నా
మగడు గుమారునిన్ గనె సుమా యని పల్కెను భార్య చేటితో !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసంగ రంబున చెలరేగి జయమునొంది
రిప్లయితొలగించండియెల్లరి ప్రశంసల నడుమ నిల్లు జేర
వచ్చి పసిబిడ్డ తనయొడి పవ్వళించ
మగఁడు పుత్రునిఁ గనెనని మగువ దెలిపె
జగడములో చెలంగి తన శక్తిని చూపిన వీరుడొందెనే
ద్విగుణితమైన సంతసము వీరులనేకుల మెప్పులందగా
స్వగృహము చేరి చిట్టడుగు భార్యయొడిన్ బవళించి యుండగా
మగఁడు గుమారునిన్ గనె సుమా యని పల్కెను భార్య చేటితో
[కను = చూచు]
గొప్ప యు ద్యో గమును జేయు కోర్కె తోడ
రిప్లయితొలగించండివెడలి ఛాలకా ల మైన పిదప వచ్చి
మగడు పుత్రుని గనె నని మగువ దెలి పె
ముదము తోడుత పొరుగింటి ముదిత కపుడు
తే.గీ:పుత్రుడను బ్రేమనే గాక బుడమి యందు
రిప్లయితొలగించండివంశకీర్తిని నిలిపెడు పండితుడని,
సకలశాస్త్ర కోవిదుడని సంతసమున
మగఁడు పుత్రునిఁ గనెనని మగువ దెలిపె
(ఇక్కడ కనెను అంటే ఆ విధంగా చూసాడు అనే అర్థం లో.)
చం:పగ గొని స్వచ్ఛ బంధమున పాపపు నిందల వేసి "పుట్టెనా
రిప్లయితొలగించండిమగనికి పుత్రు?"డంచు నవమాన మొనర్చగ చేటి "పాతకీ !
మగనిని నీవె మార్చితివి,మత్పతి పోలిక లన్ని రాగ నా
మగఁడు గుమారునిన్ గనె సుమా" యని పల్కెను భార్య చేటితో
(నీ కొడుకు నీ భర్తకే పుట్టాడా? అని స్నేహితురాలు పగ తో నింద వేస్తే ఈ సాధ్వి సమాధానం చెప్పింది.)
ముదము నొసఁగదె యేరికిఁ బుత్ర సంభ
రిప్లయితొలగించండివమ్ము మీఁదు మిక్కిలి ప్రథమమ్ము పుడమి
వార్త వినినంత వేవేగ వచ్చి నాదు
మగఁడు పుత్రునిఁ గనె నని మగువ దెలిపె
విగత విచార రాజ దలివేణి సులోచన సంతసమ్మునన్
వగవక సుంత భీతిలక పంతము నూని కరమ్ము నాత్మలో
జగతిఁ జరించి యొక్క దివసమ్మునఁ గన్పడ కుండఁ బోవ నా
మగఁడు కుమారునిం గనెఁ జుమా యని పల్కెను భార్య చేటితో
పగలును రాత్రియున్ జదువు పైననె ధ్యాసను నిల్పి మేటియై
రిప్లయితొలగించండిసుగుణ గుణాభిరాముడని జోతలు పల్కగ లోకులెల్లరున్
ప్రగతి పథంబునన్ జనుచు ప్రాభవమందగ ప్రేమ మీరగా
మగఁడు గుమారునిన్ గనె సుమా యని పల్కెను భార్య చేటితో
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
భార్య ప్రసవించెనని తెల్సి భర్త వచ్చి
పిల్ల వానిని ముద్దిడె ప్రేమతోడ
తల్లి యడుగగ వచ్చెనా యల్లుడనుచు
మగడు పుత్రునిఁ గనెనని మగువ దెలిపె.
(గనెను=చూచెను అనే అర్థంలో...)
రిప్లయితొలగించండిప్రసవ వేదన తోచేర వైద్య శాల
గంట వ్యవధిలోనెసుతుడుకలుగతొలుత
*“మగఁడు పుత్రునిఁ గనెనని మగువ దెలిపె”*
సన్నిహితులకెల్లనుసంతసమ్ముతోడ.