16-6-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్”
(లేదా...)
“గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్”
శా. బంగారంబగు మేనికాంతి లలనల్ భాసిల్లి వైకుంఠమున్ శృంగారాస్పద కృష్ణలీలలను వాసిం బాడు గాలంబునన్ రంగన్నీల మయూర బర్హమును ద్యోరాజాదులచ్చోట మూగంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్ !
కందంనింగి సురాపగ భువి జారంగ భగీరథుఁడు భక్తి త్ర్యక్షున్ ప్రార్థింపంగ, పితరుఁడై సూననుగంగన్ హరి, దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్శార్దూలవిక్రీడితమునింగిన్ జారు సురాపగన్ కరుణతో నిల్పంగ వేగమ్ము వేడంగన్ భక్తి భగీరథుండు సరి జూటాధీశు గౌరీశు ఖట్వాంగిన్, భూమికి శ్రేయమంచు మది సంభావించి దీవింపగన్గంగన్ శ్రీహరి, దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్
బంగరు దువ్వెన తోడనుముంగురులను దువ్వి మోదమున సితాపాంగపు పింఛమ్మును వే గంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్.సింగారింపగ నాటకమ్ము కొరకై శ్రీకృష్ణునిన్ బాత్ర కైబంగారాన్విత సంప్రసాధనములున్ వంశిన్ గరమ్మందునన్ పింగాశంపు సుమాలనే కురులలో, పింఛమ్ము నే పేర్మి వే గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్.
ఆంగన సత్య వలపునకుభంగము వాటిల్లకుండ భవనము కేగిఇంగముగ పదములను వేగంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్
చెంగున దూకెడు క్రేపులభంగిన్ బొంగారు గంగ భాగ్యంబనగాబంగరు పదముల తాకెనుగంగన్ హరి, దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్శృంగారాకృతి కల్గి యున్నదిగదా చిందించె విన్నాణమేసాంగత్యమ్మును కోరె శంతనుడటన్ సమ్మోహ సంరంభమున్బంగారంబన నొప్పు దీవెనలతో స్పర్శించె పాదాలతో గంగన్ శ్రీహరి, దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్
రంగండేగెను గాంచగా శివుని సంరంభంబుగా లచ్చితోగంగాధారి యొసంగ నాదరమునన్ గార్హస్థ్య ధర్మంబుగాగంగాతోయము నర్ఘ్యపాద్యములుగన్, కల్హారదామంబు, వేగంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్
గంగాధరునికడకు నేగంగన్ వైకుంఠవాసి గారవమున నీయంగన్ శిఖిపింఛము వేగంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్
పొంగిన నుత్సాహంబునముంగురు లను సర్దు కొనియు మురిపము తోడన్ రంగుల కిరీటమును వే గంగన్ హరి తల ను దా ల్చె గని శివు డొప్పె న్
కం:మంగళ పదముల దాల్చగగంగన్ హరి, దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్”సింగారమ్మని జగము, లభంగము గా గంగ సాగె పాప హరిణి యై.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
2)శా:రంగౌ పాదపు వెండి గజ్జెల వలెన్ రంజిల్లు రూపమ్ము తో గంగన్ శ్రీహరి దాల్చె, నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్సింగారమ్ముగ నుండె నంచు జగముల్ల్ జేజే లనన్ దాల్చె గా!భంగ మ్మౌ నఘసంఘ మట్టి నదియౌ భాగీరథిన్ దల్చినన్.(గంగ విష్ణుపాదోద్భవం.శివుడు శిరస్సున ధరించాడు.)
సమస్య: గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్శార్దూలము:పొంగే కంట గజేంద్రుడే మొరలిడే పోయేను ప్రాణంబులన్ భంగంబున్నగునంచు నున్కి లయలే భవ్యంపు నుద్దీప్తులై సంగంబున్ స్థితులైన యీశ్వర, హరీ సంతాపమే బాప, యేగంగన్, శ్రీహరి దాల్చె నౌదల, నుమాకాంతుండు, మేల్మేలనన్
అంగన శచీ సతి యొసఁగ బంగరు కలశమున నింపి వారినిఁ దమి శ్రీరంగపతి పదములు కడిగి గంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్ భంగం బుండదు భావజాలమునకున్ భావింప నీరీతిఁ బాదాంగచ్ఛేదము నిట్లు సేయ వలె సత్యార్థమ్ము గంగా సతిన్ సింగారించిన దా సదాశివుఁడు గా శ్రీకాంతుఁడే మేలనెన్ గంగన్, శ్రీహరి, దాల్చె నౌదల నుమాకాంతుండు, మేల్మేలనన్
పొంగగ దాల్చెన్ పదములగంగన్ హరి, దలను దాల్చె గని శివుడొప్పన్సింగారమ్మగుచు నదియెఛెంగున దూకుచును జారె క్షితిపతి వేడన్/వెంటన్పొంగుల్వారుచుపాదమందునుదయమ్మెందంగదీవించుచున్*“గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్”*చెంగున్గెంతుచునెక్కెశంభుశిరమున్ శీఘ్రంబుగానచ్చటన్హంగున్జూపుచు సాగుచుండెనిలవయ్యారమ్ము చూపించుచున్
సమస్య: గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్శార్దూలము:భంగమ్మున్ బడి బూదిగా సగరులన్ భాగీరథుండే గనెన్ అంగల్ నేర్వని విష్ణుపాద జనితౌ యా గంగనే కోరగన్ భంగిన్ సేయ తపంబునెంచెనుగ యా భాగీరథుండే,విడెన్ గంగన్ శ్రీహరి, దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్
శా.
రిప్లయితొలగించండిబంగారంబగు మేనికాంతి లలనల్ భాసిల్లి వైకుంఠమున్
శృంగారాస్పద కృష్ణలీలలను వాసిం బాడు గాలంబునన్
రంగన్నీల మయూర బర్హమును ద్యోరాజాదులచ్చోట మూ
గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్ !
కందం
రిప్లయితొలగించండినింగి సురాపగ భువి జా
రంగ భగీరథుఁడు భక్తి త్ర్యక్షున్ ప్రార్థిం
పంగ, పితరుఁడై సూనను
గంగన్ హరి, దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్
శార్దూలవిక్రీడితము
నింగిన్ జారు సురాపగన్ కరుణతో నిల్పంగ వేగమ్ము వే
డంగన్ భక్తి భగీరథుండు సరి జూటాధీశు గౌరీశు ఖ
ట్వాంగిన్, భూమికి శ్రేయమంచు మది సంభావించి దీవింపగన్
గంగన్ శ్రీహరి, దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్
రిప్లయితొలగించండిబంగరు దువ్వెన తోడను
ముంగురులను దువ్వి మోదమున సితా
పాంగపు పింఛమ్మును వే
గంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్.
సింగారింపగ నాటకమ్ము కొరకై శ్రీకృష్ణునిన్ బాత్ర కై
బంగారాన్విత సంప్రసాధనములున్ వంశిన్ గరమ్మందునన్
పింగాశంపు సుమాలనే కురులలో, పింఛమ్ము నే పేర్మి వే
గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్.
ఆంగన సత్య వలపునకు
రిప్లయితొలగించండిభంగము వాటిల్లకుండ భవనము కేగి
ఇంగముగ పదములను వే
గంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్
చెంగున దూకెడు క్రేపుల
రిప్లయితొలగించండిభంగిన్ బొంగారు గంగ భాగ్యంబనగా
బంగరు పదముల తాకెను
గంగన్ హరి, దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్
శృంగారాకృతి కల్గి యున్నదిగదా చిందించె విన్నాణమే
సాంగత్యమ్మును కోరె శంతనుడటన్ సమ్మోహ సంరంభమున్
బంగారంబన నొప్పు దీవెనలతో స్పర్శించె పాదాలతో
గంగన్ శ్రీహరి, దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్
రంగండేగెను గాంచగా శివుని సంరంభంబుగా లచ్చితో
రిప్లయితొలగించండిగంగాధారి యొసంగ నాదరమునన్ గార్హస్థ్య ధర్మంబుగా
గంగాతోయము నర్ఘ్యపాద్యములుగన్, కల్హారదామంబు, వే
గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్
గంగాధరునికడకు నే
రిప్లయితొలగించండిగంగన్ వైకుంఠవాసి గారవమున నీ
యంగన్ శిఖిపింఛము వే
గంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్
పొంగిన నుత్సాహంబున
రిప్లయితొలగించండిముంగురు లను సర్దు కొనియు మురిపము తోడన్
రంగుల కిరీటమును వే
గంగన్ హరి తల ను దా ల్చె గని శివు డొప్పె న్
కం:మంగళ పదముల దాల్చగ
రిప్లయితొలగించండిగంగన్ హరి, దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్”
సింగారమ్మని జగము, ల
భంగము గా గంగ సాగె పాప హరిణి యై.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి2)శా:రంగౌ పాదపు వెండి గజ్జెల వలెన్ రంజిల్లు రూపమ్ము తో
రిప్లయితొలగించండిగంగన్ శ్రీహరి దాల్చె, నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్
సింగారమ్ముగ నుండె నంచు జగముల్ల్ జేజే లనన్ దాల్చె గా!
భంగ మ్మౌ నఘసంఘ మట్టి నదియౌ భాగీరథిన్ దల్చినన్.
(గంగ విష్ణుపాదోద్భవం.శివుడు శిరస్సున ధరించాడు.)
సమస్య:
రిప్లయితొలగించండిగంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్
శార్దూలము:
పొంగే కంట గజేంద్రుడే మొరలిడే పోయేను ప్రాణంబులన్
భంగంబున్నగునంచు నున్కి లయలే భవ్యంపు నుద్దీప్తులై
సంగంబున్ స్థితులైన యీశ్వర, హరీ సంతాపమే బాప, యే
గంగన్, శ్రీహరి దాల్చె నౌదల, నుమాకాంతుండు, మేల్మేలనన్
అంగన శచీ సతి యొసఁగ
రిప్లయితొలగించండిబంగరు కలశమున నింపి వారినిఁ దమి శ్రీ
రంగపతి పదములు కడిగి
గంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్
భంగం బుండదు భావజాలమునకున్ భావింప నీరీతిఁ బా
దాంగచ్ఛేదము నిట్లు సేయ వలె సత్యార్థమ్ము గంగా సతిన్
సింగారించిన దా సదాశివుఁడు గా శ్రీకాంతుఁడే మేలనెన్
గంగన్, శ్రీహరి, దాల్చె నౌదల నుమాకాంతుండు, మేల్మేలనన్
రిప్లయితొలగించండిపొంగగ దాల్చెన్ పదముల
గంగన్ హరి, దలను దాల్చె గని శివుడొప్పన్
సింగారమ్మగుచు నదియె
ఛెంగున దూకుచును జారె క్షితిపతి వేడన్/వెంటన్
పొంగుల్వారుచుపాదమందునుదయమ్మెందంగదీవించుచున్
*“గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్”*
చెంగున్గెంతుచునెక్కెశంభుశిరమున్ శీఘ్రంబుగానచ్చటన్
హంగున్జూపుచు సాగుచుండెనిలవయ్యారమ్ము చూపించుచున్
సమస్య:
రిప్లయితొలగించండిగంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్
శార్దూలము:
భంగమ్మున్ బడి బూదిగా సగరులన్ భాగీరథుండే గనెన్
అంగల్ నేర్వని విష్ణుపాద జనితౌ యా గంగనే కోరగన్
భంగిన్ సేయ తపంబునెంచెనుగ యా భాగీరథుండే,విడెన్
గంగన్ శ్రీహరి, దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్