19-6-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు”
(లేదా...)
“మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే”
ఆటవెలదిదేశమందు రైతు కాశలు దీర్చెడుపథకమొకటి నీటిపారుదలకుసాయమన నదులనుసంధానమైనచోవరద మేలొసంగుఁ బ్రజల కెపుడుఉత్పలమాలపాలకులెల్లరున్ నదులు భారతమందున మేళవించెడున్గీలక మైన కార్యమును క్లిష్టమునైనను పూర్తి చేసినన్జాలును నీటిపారుదల సాగును రైతుకు శ్రేయమెంచుచున్మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే
ఆ.వె.నీవె దెసయు గతియు నీలకంధర దేవ !నీవె మదిని నిలుచు భావమెపుడుభక్తి మీఱ మ్రొక్కి బాధ కూల కిరీటివరద ! మేలొసంగు ప్రజలకెపుడు !
సతము నిన్ను కొలుచు జనులను గావవేవరద ! మేలొసంగుఁ బ్రజల కెపుడుముక్తి గోరు కొనుచు బూజించు చుండిన ,యపుడె వారి కున్న యాద తొలగు
వసుధ రాలినట్టి వర్షపు చినుకులన్ నిలువ చేయదలచి కొలనులనటసిద్ధ పరచి నంత చింతింప పనియేల వరద మేలొసంగుఁ బ్రజల కెపుడునేలకు రాలు గోఘృతపు నీటిని తామిక సాగునీరుగాచేలకు పంపనెంచి హలజీవులు నింప జలాశయమ్మునేకాలువలెన్నొ త్రవ్వినను క్షత్రము కోసము ముందుచూపుతో మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కొన్ని రోజులుగా ప్రయాణాల కారణంగా పూరణలు ఇక్కడ ఉంచలేక పోయానండి
ఆ॥ భక్తి తనర నమ్మ ప్రార్థన నిరతముఁగనఁగ శిరము వంచి కలతఁ బాపుకనికరించి ప్రోచు కాత్యాయణి భువినివరద మేలొసంగుఁ బ్రజల కెపుడుఉ॥ పాలనఁ జేయు నమ్మ భవబాధల నిత్యముఁ బాపుచున్ గృపాహేలను ప్రోచు నమ్మ నిజ హేమపు ఛాయను పల్లవించెడున్మ్రోలను జేరి భక్తిఁగని మ్రొక్కినఁ జాలు దయాంతరంగయైమేలు నొసంగదే! వరద, మేదిని నెల్లరు సంతసిల్లరే!వరద దుర్గ
నిత్యదర్శనమిడు నింద్ర కీలాద్రిపైమనకు గోచరించు కనకదుర్గకోర్కె లన్ని దీరు కొండచూలికిఁ మ్రొక్కవరద మేలొసంగుఁ బ్రజల కెపుడుశైలజ కొల్వుదీరెనట చల్లని తల్లిగ నింద్రకీలమన్మేలినగంబుపై జనులు మెచ్చిన రీతిని కొండచూలిగాజాలిని చూపిభక్తులకు సాయమొసంగును భద్రకాళిగామేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే
పాడి పంట లెల్ల బాగుగా వృద్ధి యై కర్ష కాళి మిగుల హర్ష ముగను సేద్య మందు మునిగి జీవింప హేతు వై వరద మేలొ సంగు ప్రజల కెపుడు
తే.గీ:తగిన యంత వృష్టి ధరణికి నిడు మయ్యవరద మేలొసంగుఁ బ్రజల కెపుడు?వరద లిడక నిడుము వర్షమ్ము ప్రహ్లాదవరద! మే లొసంగు బ్రజల కెపుడు.
ఉ:చేలకు నీరు లేక తమ చింతల దీర్చెడు వేల్పు వంచు యాగాలను,జాతరల్ సలుపు కర్షక పాళిని మెచ్చి నీదు కేశాల వసించు గంగ నొక సారి భువిన్ బ్రవహింప జేయుటే మేలు నొసంగదే వరద? మేదిని నెల్లరు సంతసిల్లరే”?
చుక్క నీరు లేక శోకించు రైతుకువాన కురియ నదియె వరము గాదెవాన నీరు పారు వనరులు గూర్చినవరద మేలొసంగుఁ బ్రజల కెపుడు
కాలము కాటువేసినది కర్షక లోకము తల్లడిల్లగాచేలకు వానబొట్టయిన చేరక క్షామము పెచ్చరిల్లె, మేఘాలకు స్వాగతమ్మనుచు గంగను రమ్మన వానజల్లుగామేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే
తలఁపఁగ నుపకారములు మానవాళికి కలుగు నిజముగ నప కారములను మేఘ రాశి యప్రమేయ నిర్మల జల వరద మే లొసంగుఁ బ్రజల కెపుడు [జలవరదము +ఏల +ఒసంగు = జల వరద మేలొసంగు] కూలము గాంతురే జనులు కోరి భజించిన నిన్ను మాధవా! పాలన కాలవాల మగుఁ బావనుఁడా! త్వదపాంగ వీక్షయే నీల ఘనాభ వర్ణ తను! నీదు కృపారస వీక్షణమ్ము వే మేలు నొసంగదే వరద! మేదిని నెల్లరు సంతసిల్లరే
చాలును జేసి బీజముల చక్కగ నాటగ బీడువారెనే మేలును గల్గునంచు రయమే తమ పూజ ఫలింప వేడిరేజాలున జాలువారినట జాహ్నవి జారినదో యనంగ దా “మేలు నొసంగదే వరద, మేదిని నెల్లరు సంతసిల్లరే”చాలిక పచ్చపచ్చగను చక్కని పంటయె వంగ భారమున్ (వరద=దుర్గ)
సాలుకు సాలుకున్ బెరుగు జల్లుల వెల్లువ లెక్కువౌటచేచేలును నష్టమై మిగుల చింతలపాలవు చుండ్రి రైతులున్ మేలిమి యానకట్టలను మిక్కిలిగట్టి ప్రవాహమాపినన్ మేలు నొసంగదే వరద మేదినినెల్లరు సంతసించరే.
ఆటవెలది
రిప్లయితొలగించండిదేశమందు రైతు కాశలు దీర్చెడు
పథకమొకటి నీటిపారుదలకు
సాయమన నదులనుసంధానమైనచో
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు
ఉత్పలమాల
పాలకులెల్లరున్ నదులు భారతమందున మేళవించెడున్
గీలక మైన కార్యమును క్లిష్టమునైనను పూర్తి చేసినన్
జాలును నీటిపారుదల సాగును రైతుకు శ్రేయమెంచుచున్
మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే
ఆ.వె.
రిప్లయితొలగించండినీవె దెసయు గతియు నీలకంధర దేవ !
నీవె మదిని నిలుచు భావమెపుడు
భక్తి మీఱ మ్రొక్కి బాధ కూల కిరీటి
వరద ! మేలొసంగు ప్రజలకెపుడు !
సతము నిన్ను కొలుచు జనులను గావవే
రిప్లయితొలగించండివరద ! మేలొసంగుఁ బ్రజల కెపుడు
ముక్తి గోరు కొనుచు బూజించు చుండిన ,
యపుడె వారి కున్న యాద తొలగు
రిప్లయితొలగించండివసుధ రాలినట్టి వర్షపు చినుకులన్
నిలువ చేయదలచి కొలనులనట
సిద్ధ పరచి నంత చింతింప పనియేల
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు
నేలకు రాలు గోఘృతపు నీటిని తామిక సాగునీరుగా
చేలకు పంపనెంచి హలజీవులు నింప జలాశయమ్మునే
కాలువలెన్నొ త్రవ్వినను క్షత్రము కోసము ముందుచూపుతో
మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొన్ని రోజులుగా ప్రయాణాల కారణంగా పూరణలు ఇక్కడ ఉంచలేక పోయానండి
తొలగించండిఆ॥ భక్తి తనర నమ్మ ప్రార్థన నిరతముఁ
తొలగించండిగనఁగ శిరము వంచి కలతఁ బాపు
కనికరించి ప్రోచు కాత్యాయణి భువిని
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు
ఉ॥ పాలనఁ జేయు నమ్మ భవబాధల నిత్యముఁ బాపుచున్ గృపా
హేలను ప్రోచు నమ్మ నిజ హేమపు ఛాయను పల్లవించెడున్
మ్రోలను జేరి భక్తిఁగని మ్రొక్కినఁ జాలు దయాంతరంగయై
మేలు నొసంగదే! వరద, మేదిని నెల్లరు సంతసిల్లరే!
వరద దుర్గ
నిత్యదర్శనమిడు నింద్ర కీలాద్రిపై
రిప్లయితొలగించండిమనకు గోచరించు కనకదుర్గ
కోర్కె లన్ని దీరు కొండచూలికిఁ మ్రొక్క
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు
శైలజ కొల్వుదీరెనట చల్లని తల్లిగ నింద్రకీలమన్
మేలినగంబుపై జనులు మెచ్చిన రీతిని కొండచూలిగా
జాలిని చూపిభక్తులకు సాయమొసంగును భద్రకాళిగా
మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే
పాడి పంట లెల్ల బాగుగా వృద్ధి యై
రిప్లయితొలగించండికర్ష కాళి మిగుల హర్ష ముగను
సేద్య మందు మునిగి జీవింప హేతు వై
వరద మేలొ సంగు ప్రజల కెపుడు
తే.గీ:తగిన యంత వృష్టి ధరణికి నిడు మయ్య
రిప్లయితొలగించండివరద మేలొసంగుఁ బ్రజల కెపుడు?
వరద లిడక నిడుము వర్షమ్ము ప్రహ్లాద
వరద! మే లొసంగు బ్రజల కెపుడు.
ఉ:చేలకు నీరు లేక తమ చింతల దీర్చెడు వేల్పు వంచు యా
రిప్లయితొలగించండిగాలను,జాతరల్ సలుపు కర్షక పాళిని మెచ్చి నీదు కే
శాల వసించు గంగ నొక సారి భువిన్ బ్రవహింప జేయుటే
మేలు నొసంగదే వరద? మేదిని నెల్లరు సంతసిల్లరే”?
చుక్క నీరు లేక శోకించు రైతుకు
రిప్లయితొలగించండివాన కురియ నదియె వరము గాదె
వాన నీరు పారు వనరులు గూర్చిన
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు
కాలము కాటువేసినది కర్షక లోకము తల్లడిల్లగా
రిప్లయితొలగించండిచేలకు వానబొట్టయిన చేరక క్షామము పెచ్చరిల్లె, మే
ఘాలకు స్వాగతమ్మనుచు గంగను రమ్మన వానజల్లుగా
మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే
తలఁపఁగ నుపకారములు మానవాళికి
రిప్లయితొలగించండికలుగు నిజముగ నప కారములను
మేఘ రాశి యప్రమేయ నిర్మల జల
వరద మే లొసంగుఁ బ్రజల కెపుడు
[జలవరదము +ఏల +ఒసంగు = జల వరద మేలొసంగు]
కూలము గాంతురే జనులు కోరి భజించిన నిన్ను మాధవా!
పాలన కాలవాల మగుఁ బావనుఁడా! త్వదపాంగ వీక్షయే
నీల ఘనాభ వర్ణ తను! నీదు కృపారస వీక్షణమ్ము వే
మేలు నొసంగదే వరద! మేదిని నెల్లరు సంతసిల్లరే
చాలును జేసి బీజముల చక్కగ నాటగ బీడువారెనే
రిప్లయితొలగించండిమేలును గల్గునంచు రయమే తమ పూజ ఫలింప వేడిరే
జాలున జాలువారినట జాహ్నవి జారినదో యనంగ దా
“మేలు నొసంగదే వరద, మేదిని నెల్లరు సంతసిల్లరే”
చాలిక పచ్చపచ్చగను చక్కని పంటయె వంగ భారమున్
(వరద=దుర్గ)
సాలుకు సాలుకున్ బెరుగు
రిప్లయితొలగించండిజల్లుల వెల్లువ లెక్కువౌటచే
చేలును నష్టమై మిగుల చింతల
పాలవు చుండ్రి రైతులున్
మేలిమి యానకట్టలను మిక్కిలి
గట్టి ప్రవాహమాపినన్
మేలు నొసంగదే వరద మేదిని
నెల్లరు సంతసించరే.