జగతి మెచ్చినట్టి సాకేత భౌముడు దశరథ నృప సుతుడు ధర్మ విభుడు రవికుల తిలకుండు రమ్యగాత్రుడు, కాడు రాఘవుఁడు శశి కుల రాజవరుఁడు.
ఏ ఘనుండట నెత్త త్రెళ్ళిన దేకపాత్తుని చాపమే? యాఘనంబగు రాజసూయము నందు పెద్దలు గాంచగా మేఘవర్ణుని పూజ్యుడంచును మెచ్చె ధర్మజు డెవ్వడో? రాఘవుండు, సుధాంశు వంశపు రాజు నా నుతి కెక్కెఁ జూ.
ఆ.వె:రామచంద్రుడనెడు ప్రాఖ్య రంజిలె నని "రాఘవుఁడు శశి కుల రాజవరుఁడు” నాకు తెలియు" ననకు నాయనా రాముడు సూర్యవంశజుండు సుమ్ము వినుము. (రాముడిది చంద్ర వంశం అని పిల్ల వాడు అడ్డగోలుగా అనుకోక రామచంద్రుడనే పేరు చూసి అనుకున్నట్లు ఒక సమర్ధన.)
మ.కో:రాఘవుండు బ్రసిద్ధి చెందెను రామచంద్రుగ, నందుచే రాఘవుండు సుధాంశు వంశపు రాజు నా నుతి కెక్కెఁ జూ! నీ ఘనమ్మగు శిష్య కోటిన, నేర్పుమో గురువర్య యా రాఘవుం డొక సూర్యవంశపు రా జటం చితిహాసమున్. (మీ విద్యార్థులు రాముడు చంద్రవంశం వా డంటున్నారు.వారికి విషయం చెప్పమని టీచర్ తో అన్నట్టు? ఎవ రంటారు? స్కూల్ ఇన్స్పెక్టర్ కావచ్చు.విద్యార్థి యొక్క తండ్రి కావచ్చు.)
అద్రి వంశమందు నవతరించెనుగద
రిప్లయితొలగించండిరాఘవుఁడు ; శశి కుల రాజవరుఁడు
భరత చక్రవర్తి భారత దేశము
నేల , యతని పేరు నిడిరి నలిగ
శ్లాఘనీయము రామచంద్రుని శస్తమౌ ఘన శీలమే
రిప్లయితొలగించండిమేఘవర్ణుఁడు శాంతమూర్తి యమేయ సద్గుణధాముఁడా
రాఘవుండు, సుధాంశు వంశపు రాజు నా నుతి కెక్కెఁ జూ
యా ఘనుండగు ధర్మజుండు మహాద్భుతంబగు క్షాంతితో
శూరు డై వెలింగె సూర్య వంశము వాడు
రిప్లయితొలగించండిరాఘవుండు :: శశి కుల రాజ వరుడు
పార్థుడీ జగతిని భాసించె వీరుడై
శత్రు తతి యు మెచ్చ సాహ సమున
రిప్లయితొలగించండిజగతి మెచ్చినట్టి సాకేత భౌముడు
దశరథ నృప సుతుడు ధర్మ విభుడు
రవికుల తిలకుండు రమ్యగాత్రుడు, కాడు
రాఘవుఁడు శశి కుల రాజవరుఁడు.
ఏ ఘనుండట నెత్త త్రెళ్ళిన దేకపాత్తుని చాపమే?
యాఘనంబగు రాజసూయము నందు పెద్దలు గాంచగా
మేఘవర్ణుని పూజ్యుడంచును మెచ్చె ధర్మజు డెవ్వడో?
రాఘవుండు, సుధాంశు వంశపు రాజు నా నుతి కెక్కెఁ జూ.
రవికుల తిలకుండు రణధీరుఁడాతఁడు
రిప్లయితొలగించండిరాఘవుఁడు, శశి కుల రాజవరుఁడు
ధర్మనందనుండు ధరణినేలినయట్టి
శాంతచిత్తుడతఁడు సద్గుణుండు
శ్రీరామచంద్రుఁడు, చంద్రవంశపురాజయిన యుధిష్టిరుఁడు ఇరువురు అశ్వమేధయాగము చేసి శ్లాఘించబడిన కీర్తి కలవారై చిరస్థాయులైనారని..........
రిప్లయితొలగించండిహే! ఘనంబగౌ నశ్వమేధము హేలగా ఘటియించుచున్
లాఘవంబును జూపి రాజుల రాజ్యముల్ గెలుపొందుచున్
శ్లాఘ కీర్తి విజృంభణంబున శాశ్వతంబుగ నిల్చిరే
రాఘవుండు, సుధాంశు వంశపు రాజు, నా నుతి కెక్కెఁ జూ.
ఘనంబుగ
రిప్లయితొలగించండిరాజ్యమేలెనుగద రమణీయమౌరీతి
రిప్లయితొలగించండిరామరాజ్యమనుచు ప్రస్తుతించ
సూర్యవంశ విభుడు సుందరాంగుడు, కాడు
రాఘవుఁడు శశి కుల రాజవరుఁడు
ఆఘనుండసమాన సుందరు డాత్మభూతుడు చూడగా
లాఘవంబుగ రాజ్యమేలెడు రాజ వంశపు వీరుడే
శ్లాఘనీయుడు సద్గుణేంద్రుడు శక్తినెంచిన సాటియౌ
రాఘవుండు, సుధాంశు వంశపు రాజు నా నుతి కెక్కెఁ జూ
ఆ.వె:రామచంద్రుడనెడు ప్రాఖ్య రంజిలె నని
రిప్లయితొలగించండి"రాఘవుఁడు శశి కుల రాజవరుఁడు”
నాకు తెలియు" ననకు నాయనా రాముడు
సూర్యవంశజుండు సుమ్ము వినుము.
(రాముడిది చంద్ర వంశం అని పిల్ల వాడు అడ్డగోలుగా అనుకోక రామచంద్రుడనే పేరు చూసి అనుకున్నట్లు ఒక సమర్ధన.)
మ.కో:రాఘవుండు బ్రసిద్ధి చెందెను రామచంద్రుగ, నందుచే
రిప్లయితొలగించండిరాఘవుండు సుధాంశు వంశపు రాజు నా నుతి కెక్కెఁ జూ!
నీ ఘనమ్మగు శిష్య కోటిన, నేర్పుమో గురువర్య యా
రాఘవుం డొక సూర్యవంశపు రా జటం చితిహాసమున్.
(మీ విద్యార్థులు రాముడు చంద్రవంశం వా డంటున్నారు.వారికి విషయం చెప్పమని టీచర్ తో అన్నట్టు? ఎవ రంటారు? స్కూల్ ఇన్స్పెక్టర్ కావచ్చు.విద్యార్థి యొక్క తండ్రి కావచ్చు.)