జగతి మెచ్చినట్టి సాకేత భౌముడు దశరథ నృప సుతుడు ధర్మ విభుడు రవికుల తిలకుండు రమ్యగాత్రుడు, కాడు రాఘవుఁడు శశి కుల రాజవరుఁడు.
ఏ ఘనుండట నెత్త త్రెళ్ళిన దేకపాత్తుని చాపమే? యాఘనంబగు రాజసూయము నందు పెద్దలు గాంచగా మేఘవర్ణుని పూజ్యుడంచును మెచ్చె ధర్మజు డెవ్వడో? రాఘవుండు, సుధాంశు వంశపు రాజు నా నుతి కెక్కెఁ జూ.
అద్రి వంశమందు నవతరించెనుగద
రిప్లయితొలగించండిరాఘవుఁడు ; శశి కుల రాజవరుఁడు
భరత చక్రవర్తి భారత దేశము
నేల , యతని పేరు నిడిరి నలిగ
శ్లాఘనీయము రామచంద్రుని శస్తమౌ ఘన శీలమే
రిప్లయితొలగించండిమేఘవర్ణుఁడు శాంతమూర్తి యమేయ సద్గుణధాముఁడా
రాఘవుండు, సుధాంశు వంశపు రాజు నా నుతి కెక్కెఁ జూ
యా ఘనుండగు ధర్మజుండు మహాద్భుతంబగు క్షాంతితో
శూరు డై వెలింగె సూర్య వంశము వాడు
రిప్లయితొలగించండిరాఘవుండు :: శశి కుల రాజ వరుడు
పార్థుడీ జగతిని భాసించె వీరుడై
శత్రు తతి యు మెచ్చ సాహ సమున
రిప్లయితొలగించండిజగతి మెచ్చినట్టి సాకేత భౌముడు
దశరథ నృప సుతుడు ధర్మ విభుడు
రవికుల తిలకుండు రమ్యగాత్రుడు, కాడు
రాఘవుఁడు శశి కుల రాజవరుఁడు.
ఏ ఘనుండట నెత్త త్రెళ్ళిన దేకపాత్తుని చాపమే?
యాఘనంబగు రాజసూయము నందు పెద్దలు గాంచగా
మేఘవర్ణుని పూజ్యుడంచును మెచ్చె ధర్మజు డెవ్వడో?
రాఘవుండు, సుధాంశు వంశపు రాజు నా నుతి కెక్కెఁ జూ.
రవికుల తిలకుండు రణధీరుఁడాతఁడు
రిప్లయితొలగించండిరాఘవుఁడు, శశి కుల రాజవరుఁడు
ధర్మనందనుండు ధరణినేలినయట్టి
శాంతచిత్తుడతఁడు సద్గుణుండు
శ్రీరామచంద్రుఁడు, చంద్రవంశపురాజయిన యుధిష్టిరుఁడు ఇరువురు అశ్వమేధయాగము చేసి శ్లాఘించబడిన కీర్తి కలవారై చిరస్థాయులైనారని..........
రిప్లయితొలగించండిహే! ఘనంబగౌ నశ్వమేధము హేలగా ఘటియించుచున్
లాఘవంబును జూపి రాజుల రాజ్యముల్ గెలుపొందుచున్
శ్లాఘ కీర్తి విజృంభణంబున శాశ్వతంబుగ నిల్చిరే
రాఘవుండు, సుధాంశు వంశపు రాజు, నా నుతి కెక్కెఁ జూ.
ఘనంబుగ
రిప్లయితొలగించండి