9, జులై 2025, బుధవారం

సమస్య - 5177

10-7-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష!”

(లేదా...)

“నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!”

26 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. తేటగీతి
      ఉర్వి, సర్వేజనాస్సుఖినోభవంతు
      యనెడు లక్ష్యాన బూజింప నంచితమగు
      లోకనాశమ్ము నెంచు నాలోచనముల
      నిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష

      మత్తేభవిక్రీడితము
      మనమందున్ జగమెల్ల మోదపడ సంభావించి యర్చించుచున్
      వినతిన్ జేసిన మెచ్చువాడవట సంప్రీతిన్ జగన్నాథ! ను
      ర్విని సంక్షోభము సంభవించు క్రియలన్ వెచ్చించి స్వార్థమ్ముతో
      నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!

      తొలగించండి
  2. పుణ్యగతులు ప్రాప్తించగ ముక్తి నొందు
    టజుని స్మరణ తోడనె సాధ్యమను దలపును
    తొలగజేయ సిద్ధపడిన దుష్ట మతులు
    నిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష

    రిప్లయితొలగించండి

  3. భయము తోగాదె నాతడు పాలకడలి
    యందు నాలితో పాటుగా నాయజగుడు
    దాగె ననుచు పరిహసించు దనుజు లెపుడు
    నిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష!


    ఘనుడౌ నీవని లోకరక్షకుడవున్ గాయస్థువున్ నీవనిన్
    వినయంబందున కొల్చువారికిల నీవే రక్షయై నిల్చు
    భూ
    జనివే నీవని చిత్తమందునను విశ్వాసమ్ము లేకుండగా
    నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!.

    రిప్లయితొలగించండి
  4. సర్వ హితమును గోరుచు సన్ను తించు
    పూజలను గై కొనె దవీవు మోహ నాంగ
    చెడు తలంపుల తోడుత చేయ బూని
    నిన్ను పూజింప వలదండ్రు నీరజాక్ష!

    రిప్లయితొలగించండి
  5. మ.
    ఘన శైవాగ్రణి రాజ్య సంభరిత విఖ్యాతాఢ్య సౌధంబునన్
    ఫణి రాట్భూషుని నెమ్మదిన్ దలిచె సంప్రాప్తింపఁ బుణ్యావళుల్
    చని లక్ష్మీశు గుడిం గనం గినిసి రాజ శ్రేష్టుడే పల్కె "నో
    నిను పూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా ! హరీ !"

    రిప్లయితొలగించండి
  6. అనిశంబున్ నినుఁగొల్చు భక్తులకు నీవానంద సంధాతవై
    ఘనమౌ నీప్సిత సిద్ధిఁగూర్చెదవుగా కారుణ్యసింధో! మదిన్
    క్షణికంబౌ సుఖసంపదల్ కలుగఁగా కాంక్షించి గార్ధ్యమ్ముతో
    నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!

    రిప్లయితొలగించండి
  7. తే॥ వినయ సంపదఁ బడయక వివిధ పాప
    కార్య చతురతను వరలు కడు కుటిలులు
    కామిత ఫలములొదవఁగఁ బ్రేమ నిడను
    నిన్నుఁ బూజింప వలదండ్రు నీరజాక్ష


    మ॥ తనయన్ భక్తిని సద్గుణమ్ములను సంధానించి సద్వర్తనన్
    గనుచున్ ధాత్రిని సర్వదా మదముగన్ గైవల్యమున్ బొందరో
    ధన గాంగేయములందు ప్రీతిఁ గని తద్భాగ్యాభిలాషా ధృతిన్
    నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా హరీ

    గాంగేయము బంగారు

    రిప్లయితొలగించండి
  8. నిన్ను గొలుచుట భక్తుల నిత్యకర్మ
    మొక్కులర్పింత్రు దాసులు మోదమలర
    పొదలుచును పాప కార్యాల మునిగితేలి
    నిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష

    నినుఁ బ్రార్ధింతురు భక్తకోటి సతమున్ నిశ్చింత చేకూరగా
    నిను దర్శింతురు మొక్కుతీర్చుకొనగా నిత్యంబుగా దాసులే
    నిను సేవించుచు పాపకార్యములనే నిస్సిగ్గుగా జేయుచున్
    నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!

    రిప్లయితొలగించండి

  9. ఆది మధ్యాంత రహితుడ వంచు నీవె
    హరుడవు విధాత వీవె యీ ధరను బ్రోవు
    జియ్య వీవె యనుచు విశ్వసించ కున్న
    నిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష!


    వినతానందుడు వాహ్యమై చెలగెడిన్ పీతాం బరుండా తడే
    ధనలక్ష్మిన్ హృదయమ్మునన్ నిలిపి సద్ధర్మమ్మునే కాచు భూ
    జనియంచాతడె రక్షకుండనుచు విశ్వాసమ్ము లేకుండగా
    నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!.

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:నీవె పరమసత్యమ్మని,నిఖిల జగతి
    నీదు రూపమే యనుటయె నే నెరుగుదు
    నిన్ను బూజించ రా దంద్రు నీరజాక్ష
    యీ గురువులని ప్రహ్లాదు డేడ్చి పలికె

    రిప్లయితొలగించండి
  11. మ:ఘనులౌ కొందరు వైష్ణవోత్తములు నినున్ గాంచన్ నిరాసక్తులై
    నిను బూజించుట వ్యర్థమందురు కదా నీ శత్రు లౌచున్ హరా!
    ఘనుడౌ దైవము శంకరుండనుచు నిన్ గానంగ లే రేలనో
    నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!”
    (శివద్వేషుల గూర్చి విష్ణుద్వేషుల గూర్చి ఒకే సారి బాధ పడుతున్నాడు ఈ భక్తుడు.మరి బుధులు అన్నా డెందుకు? అంటే వాళ్లు మహా పండితులే కానీ అలా ప్రవర్తిస్తున్నారు అని.పాదాలు ఒకరకం గా ఉండి కొంత తేడా ఉండే ఈ అలంకారాన్ని కించిత్ భేద సామ్యం అంటా రని గుర్తు.)

    రిప్లయితొలగించండి
  12. పన్నుగా పద్యములనల్లు వలను దెలిపి
    మిన్నయౌ విద్య మము దీర్చు మేటి యొజ్జ
    నెన్నికౌ రీతి తొల్త స్మరించి గాని
    నిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష!

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. కను విందౌ హరి రూపమే గనరులే కర్మంబు బోకే జనుల్
      వినగా సాధ్యమ నామమే యరయకే వీనుల్ నలంకారమే
      తనువే చెల్లున శ్రీహరీ ! శరణనే త్రాణంబునే కోరకన్ !
      నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!”

      తొలగించండి
  14. ఆర్య వరులెల్ల సతతమ్ము హరినిఁ బోలె
    నన్యు లెవ్వరి నైనను నవని లోన
    రాజ్య మెల్లను నేలెడి రాజు వైన
    నిన్నుఁ బూజింప వల దండ్రు నీరజాక్ష!


    ధనధాన్యమ్ముల నీయ నేర్తు రిలలో దైవమ్ము లర్చింప ము
    క్తిని నీయంగను మానవావలికి శక్తిక్షీణులే వారు వం
    చను గొల్వుండిన యన్య దేవ చయమున్, సద్భక్తి నర్చింపఁగా
    నినుఁ, బూజించుట వ్యర్థ మందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!

    రిప్లయితొలగించండి
  15. భక్తి పెంపార మదిలోన ముక్తిఁ వడయ
    సక్తచిత్తుఁడనై యనిశంబు నిన్ను
    గొలువఁ గావలె నన్యథా తెలివి మాలి
    నిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు
      ముక్తి తరువాత అరసున్న అవసరం లేదు

      తొలగించండి