10-7-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష!”
(లేదా...)
“నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!”
తేటగీతిఉర్వి, సర్వేజనాసుఖినోభవంతుయనెడు లక్ష్యాన బూజింప నంచితమగులోకనాశమ్ము నెంచు నాలోచనములనిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష!
మత్తేభవిక్రీడితముమనమందున్ జగమెల్ల మోదపడ సంభావించి యర్చించుచున్వినతిన్ జేసిన మెచ్చువాడవట సంప్రీతిన్ జగన్నాథ! నర్విని సంక్షోభము సంభవించు క్రియలన్ వెచ్చించి స్వార్థమ్ముతోనినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!
పుణ్యగతులు ప్రాప్తించగ ముక్తి నొందుటజుని స్మరణ తోడనె సాధ్యమను దలపునుతొలగజేయ సిద్ధపడిన దుష్ట మతులునిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష
భయము తోగాదె నాతడు పాలకడలియందు నాలితో పాటుగా నాయజగుడుదాగె ననుచు పరిహసించు దనుజు లెపుడునిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష!ఘనుడౌ నీవని లోకరక్షకుడవున్ గాయస్థువున్ నీవనిన్ వినయంబందున కొల్చువారికిల నీవే రక్షయై నిల్చుభూజనివే నీవని చిత్తమందునను విశ్వాసమ్ము లేకుండగానినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!.
సర్వ హితమును గోరుచు సన్ను తించు పూజలను గై కొనె దవీవు మోహ నాంగచెడు తలంపుల తోడుత చేయ బూని నిన్ను పూజింప వలదండ్రు నీరజాక్ష!
మ.ఘన శైవాగ్రణి రాజ్య సంభరిత విఖ్యాతాఢ్య సౌధంబునన్ ఫణి రాట్భూషుని నెమ్మదిన్ దలిచె సంప్రాప్తింపఁ బుణ్యావళుల్ చని లక్ష్మీశు గుడిం గనం గినిసి రాజ శ్రేష్టుడే పల్కె "నో నిను పూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా ! హరీ !"
అనిశంబున్ నినుఁగొల్చు భక్తులకు నీవానంద సంధాతవైఘనమౌ నీప్సిత సిద్ధిఁగూర్చెదవుగా కారుణ్యసింధో! మదిన్క్షణికంబౌ సుఖసంపదల్ కలుగఁగా కాంక్షించి గార్ధ్యమ్ముతోనినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!
తే॥ వినయ సంపదఁ బడయక వివిధ పాపకార్య చతురతను వరలు కడు కుటిలులుకామిత ఫలములొదవఁగఁ బ్రేమ నిడను నిన్నుఁ బూజింప వలదండ్రు నీరజాక్షమ॥ తనయన్ భక్తిని సద్గుణమ్ములను సంధానించి సద్వర్తనన్గనుచున్ ధాత్రిని సర్వదా మదముగన్ గైవల్యమున్ బొందరోధన గాంగేయములందు ప్రీతిఁ గని తద్భాగ్యాభిలాషా ధృతిన్నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా హరీగాంగేయము బంగారు
నిన్ను గొలుచుట భక్తుల నిత్యకర్మమొక్కులర్పింత్రు దాసులు మోదమలరపొదలుచును పాప కార్యాల మునిగితేలినిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్షనినుఁ బ్రార్ధింతురు భక్తకోటి సతమున్ నిశ్చింత చేకూరగానిను దర్శింతురు మొక్కుతీర్చుకొనగా నిత్యంబుగా దాసులేనిను సేవించుచు పాపకార్యములనే నిస్సిగ్గుగా జేయుచున్నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!
ఆది మధ్యాంత రహితుడ వంచు నీవె హరుడవు విధాత వీవె యీ ధరను బ్రోవు జియ్య వీవె యనుచు విశ్వసించ కున్న నిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష!వినతానందుడు వాహ్యమై చెలగెడిన్ పీతాం బరుండా తడేధనలక్ష్మిన్ హృదయమ్మునన్ నిలిపి సద్ధర్మమ్మునే కాచు భూజనియంచాతడె రక్షకుండనుచు విశ్వాసమ్ము లేకుండగానినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!.
తేటగీతి
రిప్లయితొలగించండిఉర్వి, సర్వేజనాసుఖినోభవంతు
యనెడు లక్ష్యాన బూజింప నంచితమగు
లోకనాశమ్ము నెంచు నాలోచనముల
నిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష!
మత్తేభవిక్రీడితము
తొలగించండిమనమందున్ జగమెల్ల మోదపడ సంభావించి యర్చించుచున్
వినతిన్ జేసిన మెచ్చువాడవట సంప్రీతిన్ జగన్నాథ! న
ర్విని సంక్షోభము సంభవించు క్రియలన్ వెచ్చించి స్వార్థమ్ముతో
నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!
పుణ్యగతులు ప్రాప్తించగ ముక్తి నొందు
రిప్లయితొలగించండిటజుని స్మరణ తోడనె సాధ్యమను దలపును
తొలగజేయ సిద్ధపడిన దుష్ట మతులు
నిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష
రిప్లయితొలగించండిభయము తోగాదె నాతడు పాలకడలి
యందు నాలితో పాటుగా నాయజగుడు
దాగె ననుచు పరిహసించు దనుజు లెపుడు
నిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష!
ఘనుడౌ నీవని లోకరక్షకుడవున్ గాయస్థువున్ నీవనిన్
వినయంబందున కొల్చువారికిల నీవే రక్షయై నిల్చు
భూ
జనివే నీవని చిత్తమందునను విశ్వాసమ్ము లేకుండగా
నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!.
సర్వ హితమును గోరుచు సన్ను తించు
రిప్లయితొలగించండిపూజలను గై కొనె దవీవు మోహ నాంగ
చెడు తలంపుల తోడుత చేయ బూని
నిన్ను పూజింప వలదండ్రు నీరజాక్ష!
మ.
రిప్లయితొలగించండిఘన శైవాగ్రణి రాజ్య సంభరిత విఖ్యాతాఢ్య సౌధంబునన్
ఫణి రాట్భూషుని నెమ్మదిన్ దలిచె సంప్రాప్తింపఁ బుణ్యావళుల్
చని లక్ష్మీశు గుడిం గనం గినిసి రాజ శ్రేష్టుడే పల్కె "నో
నిను పూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా ! హరీ !"
అనిశంబున్ నినుఁగొల్చు భక్తులకు నీవానంద సంధాతవై
రిప్లయితొలగించండిఘనమౌ నీప్సిత సిద్ధిఁగూర్చెదవుగా కారుణ్యసింధో! మదిన్
క్షణికంబౌ సుఖసంపదల్ కలుగఁగా కాంక్షించి గార్ధ్యమ్ముతో
నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!
తే॥ వినయ సంపదఁ బడయక వివిధ పాప
రిప్లయితొలగించండికార్య చతురతను వరలు కడు కుటిలులు
కామిత ఫలములొదవఁగఁ బ్రేమ నిడను
నిన్నుఁ బూజింప వలదండ్రు నీరజాక్ష
మ॥ తనయన్ భక్తిని సద్గుణమ్ములను సంధానించి సద్వర్తనన్
గనుచున్ ధాత్రిని సర్వదా మదముగన్ గైవల్యమున్ బొందరో
ధన గాంగేయములందు ప్రీతిఁ గని తద్భాగ్యాభిలాషా ధృతిన్
నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా హరీ
గాంగేయము బంగారు
నిన్ను గొలుచుట భక్తుల నిత్యకర్మ
రిప్లయితొలగించండిమొక్కులర్పింత్రు దాసులు మోదమలర
పొదలుచును పాప కార్యాల మునిగితేలి
నిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష
నినుఁ బ్రార్ధింతురు భక్తకోటి సతమున్ నిశ్చింత చేకూరగా
నిను దర్శింతురు మొక్కుతీర్చుకొనగా నిత్యంబుగా దాసులే
నిను సేవించుచు పాపకార్యములనే నిస్సిగ్గుగా జేయుచున్
నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!
రిప్లయితొలగించండిఆది మధ్యాంత రహితుడ వంచు నీవె
హరుడవు విధాత వీవె యీ ధరను బ్రోవు
జియ్య వీవె యనుచు విశ్వసించ కున్న
నిన్నుఁ బూజింపవలదండ్రు నీరజాక్ష!
వినతానందుడు వాహ్యమై చెలగెడిన్ పీతాం బరుండా తడే
ధనలక్ష్మిన్ హృదయమ్మునన్ నిలిపి సద్ధర్మమ్మునే కాచు భూ
జనియంచాతడె రక్షకుండనుచు విశ్వాసమ్ము లేకుండగా
నినుఁ బూజించుట వ్యర్థమందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ!.