25-8-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పయ్యెదన్ లాగు ధూర్తుని భామ మెచ్చె”
(లేదా...)
“పయ్యెద లాగు ధూర్తుని సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్”
ఉ.తియ్యగ నోటికింపయిన తీపి తినంగ సమీపమందు వా రొయ్యన వాహమున్ విడువ నుద్గత రౌద్ర సముద్భువ ప్రభల్ కయ్యము కూర్ప వే మగడు కందని శక్తిని చూపి కొట్టెడిన్ పయ్యెద లాగు ధూర్తుని, సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్ !
ప్రాంతపు చిఱుతలింటికి వచ్చిరనుచు ముదిత వండునపుడు నిప్పు ముట్టుకొనగచీర కొంగున మంటలు చెలయు చుండెపయ్యెదన్ లాగు ధూర్తుని భామ మెచ్చె
నాటక వేదికపై...తేటగీతిఅకట! ద్రౌపదీ వస్త్రాపహరణమనెడుఘట్టమున దుస్ససేనుడు గలికిఁ జేరికేలు సాచెడు వేళను దేలు ప్రాకబయ్యెదన్, లాగు ధూర్తుని భామ మెచ్చె!ఉత్పలమాలఅయ్యెదె ద్రౌపదిన్ నిలిపి యందరిముందర వల్వలూడ్చగన్గుయ్యను ఘట్టమున్ సభను గూర్చెడు వేళను దుస్ససేనుడున్రయ్యున గాంచి తేలొకటి ప్రాకుచు నుండగఁ జీరకొంగునన్బయ్యెద లాగు ధూర్తుని సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్!
ముద్దు మురిపాల సుతుడని ముద్దుసేసిపాన్పు బవళింప జేసెడి పాళమందుకొంటె తనమున చిన్నారి కొమరుడపుడుపయ్యెదన్ లాగు, ధూర్తుని భామ మెచ్చె.నెయ్యపు రాలు వచ్చె తన నెత్తురు గందును వెంటతెచ్చె, నాతొయ్యలి తోడముచ్చటలతో సమయమ్మది మీర పాపడే శయ్యను వీడి ప్రాకుతు ప్రసత్వరి జేరుచు పాలకోసమైపయ్యెద లాగు ధూర్తుని సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్.
తియ్యని తలపులందునఁ దేల్చినావు తొయ్యలి నినుగన మనసు తొందరించెశయ్యకు తరలి రమ్మని సఖిని వేడిపయ్యెదన్ లాగు ధూర్తుని భామ మెచ్చెతొయ్యలి నీదు సోయగము తొందర చేసెను నిన్ను జేరగాకయ్యపు మాటలేల సఖి కౌగిటఁ జేరి సుఖించు వేళలోశయ్యకు చేరుకొమ్మనుచు చక్కని తియ్యని భాషణంబుతోపయ్యెద లాగు ధూర్తుని సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్ధూర్తుడు = శఠుఁడు [శృంగార నాయకులలో ఒకఁడు]
ఈస డించిరి సభ యందు నెల్ల వారు పయ్యె దన్ లాగు ధూ ర్టుని :: భామ మెచ్చె వస్త్ర మొసగియు రక్షించు వాసు దేవు కేలు మో డ్చి యు మ్రొ క్కు చు కీర్తి సేసె
తొయ్యలి నొంటిగా గవిసి ధూర్తుడొకండు వికారచేష్టలన్శయ్యకు రమ్మురమ్మనుచు చయ్యన లాగఁగ నామె పయ్యెదన్సయ్యన నేగుదెంచియొక సద్గుణశీలుడు మార్కొనంగనాపయ్యెద లాగు ధూర్తుని, సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్
ఉ.
రిప్లయితొలగించండితియ్యగ నోటికింపయిన తీపి తినంగ సమీపమందు వా
రొయ్యన వాహమున్ విడువ నుద్గత రౌద్ర సముద్భువ ప్రభల్
కయ్యము కూర్ప వే మగడు కందని శక్తిని చూపి కొట్టెడిన్
పయ్యెద లాగు ధూర్తుని, సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్ !
ప్రాంతపు చిఱుతలింటికి వచ్చిరనుచు
రిప్లయితొలగించండిముదిత వండునపుడు నిప్పు ముట్టుకొనగ
చీర కొంగున మంటలు చెలయు చుండె
పయ్యెదన్ లాగు ధూర్తుని భామ మెచ్చె
నాటక వేదికపై...
రిప్లయితొలగించండితేటగీతి
అకట! ద్రౌపదీ వస్త్రాపహరణమనెడు
ఘట్టమున దుస్ససేనుడు గలికిఁ జేరి
కేలు సాచెడు వేళను దేలు ప్రాక
బయ్యెదన్, లాగు ధూర్తుని భామ మెచ్చె!
ఉత్పలమాల
అయ్యెదె ద్రౌపదిన్ నిలిపి యందరిముందర వల్వలూడ్చగన్
గుయ్యను ఘట్టమున్ సభను గూర్చెడు వేళను దుస్ససేనుడున్
రయ్యున గాంచి తేలొకటి ప్రాకుచు నుండగఁ జీరకొంగునన్
బయ్యెద లాగు ధూర్తుని సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్!
రిప్లయితొలగించండిముద్దు మురిపాల సుతుడని ముద్దుసేసి
పాన్పు బవళింప జేసెడి పాళమందు
కొంటె తనమున చిన్నారి కొమరుడపుడు
పయ్యెదన్ లాగు, ధూర్తుని భామ మెచ్చె.
నెయ్యపు రాలు వచ్చె తన నెత్తురు గందును వెంటతెచ్చె, నా
తొయ్యలి తోడముచ్చటలతో సమయమ్మది మీర పాపడే
శయ్యను వీడి ప్రాకుతు ప్రసత్వరి జేరుచు పాలకోసమై
పయ్యెద లాగు ధూర్తుని సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్.
తియ్యని తలపులందునఁ దేల్చినావు
రిప్లయితొలగించండితొయ్యలి నినుగన మనసు తొందరించె
శయ్యకు తరలి రమ్మని సఖిని వేడి
పయ్యెదన్ లాగు ధూర్తుని భామ మెచ్చె
తొయ్యలి నీదు సోయగము తొందర చేసెను నిన్ను జేరగా
కయ్యపు మాటలేల సఖి కౌగిటఁ జేరి సుఖించు వేళలో
శయ్యకు చేరుకొమ్మనుచు చక్కని తియ్యని భాషణంబుతో
పయ్యెద లాగు ధూర్తుని సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్
ధూర్తుడు = శఠుఁడు [శృంగార నాయకులలో ఒకఁడు]
ఈస డించిరి సభ యందు నెల్ల వారు
రిప్లయితొలగించండిపయ్యె దన్ లాగు ధూ ర్టుని :: భామ మెచ్చె
వస్త్ర మొసగియు రక్షించు వాసు దేవు
కేలు మో డ్చి యు మ్రొ క్కు చు కీర్తి సేసె
తొయ్యలి నొంటిగా గవిసి ధూర్తుడొకండు వికారచేష్టలన్
రిప్లయితొలగించండిశయ్యకు రమ్మురమ్మనుచు చయ్యన లాగఁగ నామె పయ్యెదన్
సయ్యన నేగుదెంచియొక సద్గుణశీలుడు మార్కొనంగనా
పయ్యెద లాగు ధూర్తుని, సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్