తే.గీ:కాల మెంతయో మారెను గాన నీకు సంప్రదాయమ్ము బలుకక శక్తి కొలది వైదికమ్మును,బురుషుల,బ్రాహ్మణులను “తిట్టుటయె మేలు సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ (ఆధునిక కాలం లో ఒక కల్చరల్ ఫ్యాషన్ హిందూమతాన్ని నిందించే హేతువాదం,పురుషులని తిట్టే ఫెమినిజం,బ్రాహ్మణులని తిట్టే సమతావాదము. ఈ దేశం లో పురుషాధిక్యత,బ్రాహ్మణాధిపత్యం రెండూ పోవా లనేది ప్రసిద్ధ మైన వాదమే.)
ఉ:వట్టిగ నీ ప్రణాళికల బట్టుక భాషణ నీయ జాల,ది ప్పట్టున పోరి గెల్వ ప్రతిపక్షము బట్టుక వారి నేతలన్, బట్టుక నీతి బాహ్యులని పల్కుచు, వారి గతంపు పాలనన్ దిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిం దలపోసెడివాఁడె విజ్ఞుఁడౌ” (నీ ప్రభుత్వం చేసే మంచి చెప్పినంత మాత్రాన ఈ రోజుల్లో గెలవవు.ఇంతకు ముందు పరిపాలించిన వాణ్ని తిడుతూ ఉంటే గెలుస్తావు.అదే ఇప్పుదు తెలివైన పని.)
తేటగీతి
రిప్లయితొలగించండిరాజకీయమునందున రచ్చకెక్కి
వార్తలందున నిత్యము వరలనెంచ
వైరిపక్షము వారల చోరులంచు
తిట్టుటయె మేలు సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ!
సమకాలీన రాజకీయ రంగంలో నడిచే సరళి:
తొలగించండిఉత్పలమాల
రట్టొనరించి సర్వమును రాణకు నెక్కుటె రాజకీయమై
గిట్టని వైరిపక్షమును గిల్లుచు గీరుచు వార్తలందునన్
దిట్టగ నిత్యమున్ వరలు ధ్యేయమె స్ఫూర్తిగ నేరగాళ్లుగన్
తిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిం దలపోసెడివాఁడె విజ్ఞుఁడౌ
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
ఎన్నిక ల యందు వ్యతిరేక మున్న వారి
రిప్లయితొలగించండిలోటు పాట్లను చెప్పుచు ఘాటు గాగ
సల్పు విమర్శ యోట్లకు సహ క రింప
తిట్టుట యె మేలు సభల ప్రతి ష్ట గొన గ
మట్టిని నమ్మి బీజములు మాటుగ నేలన నాటినంతటన్
రిప్లయితొలగించండిపొట్టను చీల్చి పైరుగను భూమి ఫలంబును జూపు కాపుకున్
పొట్టలు నింపు వాడుగద భూతలమందున సాగు జేయు రై
తిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిం దలపోసెడివాఁడె విజ్ఞుఁడౌ!!
రైతు + ఇట్టి = రైతిట్టి
ఉ.
రిప్లయితొలగించండిఎట్టి క్షణంబు నిశ్చలత నెన్నడు వీడని వాడు ధీరుడౌ
బిట్టు మదోద్ధతిం జనుచు బేరిమి నెంచని వాడు ధూర్తుడై
గిట్టును, దుష్ట బుద్ధులను గెంటిన పాపము సేరదూరిలో
దిట్టి, ప్రతిష్ఠ గైకొన మదిం దలపోసెడి వాడు విజ్ఞుడౌ !
దూరదర్శుల సభలోన దుష్ట కవుల
రిప్లయితొలగించండిదిట్టుటయె మేలు ; సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ
నట్టివారిని దొలగించ ననుగుణమగు
చీడనెన్నడు దాపుకు జేర్చదగదు
రిప్లయితొలగించండితీవ్ర వాదము పేరుతో దేశ మందు
రక్త పాతమ్ము సృజియించు రక్కసులను
అవఘలించగ లేనట్టి అధిపతులను
తిట్టుటయె మేలు సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ
ముట్టడి జేసి చంపుటయె మోదమటంచును దల్చు వారలే
పిట్టల గాల్చి నట్టు నిల బేలల జంపెడి తీవ్రవాదులన్
కట్టడి సేయలేని యధికారులదౌ యసమర్థతన్ సదా
తిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిం దలపోసెడివాఁడె విజ్ఞుఁడౌ
చట్టముననుసరింపక సాగు జనులఁ
రిప్లయితొలగించండిగట్టడింపగ ప్రవచన కర్త యగుచు
దుష్ట కార్యాలను తెగడి దుండగీలఁ
దిట్టుటయె మేలు సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ
చట్టముఁ గౌరవింపక విచక్షణ చూపని వెర్రివారలన్
గట్టడి చేయనెంచి పరికల్పన చేతురు పండితోత్తముల్
తొట్టరులైనవారి పలుదుష్కృతముల్ పరిమార్చి దుష్టులన్
దిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిం దలపోసెడివాఁడె విజ్ఞుఁడౌ
చట్టము నాదరించకను స్వార్థపరత్వము తోడ నేతలున్
రిప్లయితొలగించండిగుట్టుగ దోచి విత్తమును గొబ్బున పెట్టెల దాచుచుండ యా
తొట్టరి నీచ మానవులు దోచిన దంతయు గుంజి గట్టిగన్
తిట్టి ప్రతిష్ట గైకొన మదిందలపోసెడి వాడె విజ్ఞుడౌ
తే॥ రాజకీయపు నిజ చతురతఁ దెలిపెద
రిప్లయితొలగించండివినరొ జనులార విహితము వివరముగను
విశదపరతు నెదుటి వారి భీతిఁ గనకఁ
దిట్టుటయె మేలు సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ
ఉ॥ చుట్టము రాజకీయమునఁ జూడఁగ మిత్రులు లేరు స్వార్థమే
పట్టము గట్టదా యెదుటి వారలఁ దక్కువ చేయ నెంచుచున్
గుట్టును దెల్పు వానివలె గొంతును బెంచుచుఁ గాంచ నెల్లరున్
దిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిందలపోసెడి వాఁడె విజ్ఞుఁడౌ
తిట్టు నిందించు
పరుల ఘనతను మెచ్చని పాలసుండు
రిప్లయితొలగించండితానె గొప్పవానిగ నెప్డు దలచుచుండు
అట్టి ధూర్తుని గర్వము నణచ వానిఁ
తిట్టుటయె మేలు సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ
ఎట్టి కవీశ్వరుండయిన నెన్నఁడు మెచ్చడు సాటి సత్కవిన్
రిప్లయితొలగించండినెట్టన దప్పులన్ వెదుక నిత్యముబూనును వాని వ్రాతలం
దట్టి విపక్షునిన్మదిని యాతత భావన గల్గునివ్విధిన్
తిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిం దలపోసెడివాఁడె విజ్ఞుఁడౌ
తే॥గీ
రిప్లయితొలగించండితిట్టుటయను దినుసులేని దెట్టి చర్చ?
తిట్టుట యొక తిరుగులేని మిట్టకోల!
తిట్టుటయె మేలు సభలఁ బ్రతిష్టఁ గొనఁగ
తిట్టు గద్దె నెక్కుటనయ్యొ- యెట్టి పట్టు!!
(మిట్టకోల: బాణము
పట్టు: కాలము)
తే.గీ:కాల మెంతయో మారెను గాన నీకు
రిప్లయితొలగించండిసంప్రదాయమ్ము బలుకక శక్తి కొలది
వైదికమ్మును,బురుషుల,బ్రాహ్మణులను
“తిట్టుటయె మేలు సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ
(ఆధునిక కాలం లో ఒక కల్చరల్ ఫ్యాషన్ హిందూమతాన్ని నిందించే హేతువాదం,పురుషులని తిట్టే ఫెమినిజం,బ్రాహ్మణులని తిట్టే సమతావాదము. ఈ దేశం లో పురుషాధిక్యత,బ్రాహ్మణాధిపత్యం రెండూ పోవా లనేది ప్రసిద్ధ మైన వాదమే.)
ఉ:వట్టిగ నీ ప్రణాళికల బట్టుక భాషణ నీయ జాల,ది
రిప్లయితొలగించండిప్పట్టున పోరి గెల్వ ప్రతిపక్షము బట్టుక వారి నేతలన్,
బట్టుక నీతి బాహ్యులని పల్కుచు, వారి గతంపు పాలనన్
దిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిం దలపోసెడివాఁడె విజ్ఞుఁడౌ”
(నీ ప్రభుత్వం చేసే మంచి చెప్పినంత మాత్రాన ఈ రోజుల్లో గెలవవు.ఇంతకు ముందు పరిపాలించిన వాణ్ని తిడుతూ ఉంటే గెలుస్తావు.అదే ఇప్పుదు తెలివైన పని.)
పరుల నొప్పింపక తనదు గిరల సుంత
రిప్లయితొలగించండియెంత కవ్వించిన నితరు లింత యేని
యెడఁదఁ దలపోయ కున్నచో నెన్నఁ డేని
తిట్టుటయె మేలు సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ
బిట్టుగఁ గీర్తి నా సతిని బెట్టును గట్టిగఁ బట్టఁ బట్టు ని
ప్పట్టున నెట్టి నెట్టన విపక్షుల నర్కుని పట్టి యింటికిన్
దిట్టతనమ్మునం జెలఁగి ధీరత చూపిన నీ వెడంద నెం
తిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిం దలపోసెడి వాఁడె విజ్ఞుఁడౌ
[బెట్టు = గౌరవము; పట్టును = చెల్లును; ఎంతు+ఇట్టి = ఎంతిట్టి, ఎంతు విట్టి]
రిప్లయితొలగించండి
చెడ్డ పనులను సతతము చేయుచున్న
రిప్లయితొలగించండి*"తిట్టుటయె మేలు :సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ”*
మంచి మాటల నాడుచు మాను గాను
సభికుల మది గెలువవలె సంఘమందు