కావరమూని మెండు దశకంఠుడు సీతను తూలనాడగన్ పావనియైన సీత విని భగ్గున మండుచు గడ్డిపోచలన్ భావన జేసి భ్రాతగను పట్టగఁహస్తము నందు జూచి సం జీవప్రభుండు తల్చె తన చిత్తము నందున వ్రేకఁనిట్టులన్ రావణు గూల్చె సీత రఘురాముఁదలంచుచు గడ్డి పోచతో
(లక్ష్మణుడు ధర్భలతో గీత గీయగా సీత దాటవలసి వచ్చినందున ఆధర్భలు (గడ్డిపోచలు) రావణుని మృత్యువుకు ఒక రకంగా కారణ మైనాయనే అర్థంతో నండి)
తే॥ రక్షఁ గననట ధర్భతో లక్ష్మణుఁ డటు గీత గీయఁగన్ దాటఁగ సీత తుదకు దైత్యుఁడా విధిఁ జావుకు దగ్గరయ్యె రావణున్ గడ్డిపోచతో రమణి గూల్చె
ఉ॥ ఆ వని సీత రక్షఁగన నట్టుల ధర్భల గీత గీయఁగన్ బావని గీత దాటఁగను బంతముఁ బూనఁగ దైత్యుఁడప్పుడే చావుకు దగ్గరయ్యె కద జానకి శోకమె కాటు వేసెనే రావణుఁ గూల్చె సీత రఘురాముఁ దలంచుచు గడ్డి పోఁచతో
ఉ.
రిప్లయితొలగించండిదైవత ధట్ట కీర్తిత నితాంత మహోజ్జ్వల వైభవంబులం
జేవను జూపి గెల్చెనని చెప్పుచు ముంగిట గర్వ రూపుడై
లావును చూపు కాలమున రక్కసు లచ్చెరువొంద హృత్స్థలిన్
రావుణు గూల్చె సీత రఘురాము దలంచుచు గడ్డిపోచతో !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిపంకజాక్షుని రాముని వంకలెంచి
యంతిపురమున జానకి నందుదనఁగ
నలిపి తృణముగ పోల్చి, మానసికముగను
రావణున్ గడ్డిపోఁచతో రమణి గూల్చె
ఉత్పలమాల
కావరమందునన్ జెలఁగి కంజదళాక్షిని సీతఁ జేరుచున్
సేవకులెల్లరిన్ మలచి శీఘ్రమె యంతి పురమ్ము జేర్చు సం
భావన నిందలాడ పతి, మానసికమ్మగ క్రుంగఁ జూపుచున్
రావణుఁ గూల్చె సీత రఘురాముఁ దలంచుచు గడ్డిపోఁచతో
రిప్లయితొలగించండిమోహ పరవశు డైనట్టి మూర్ఖు డపుడు
వనము జేరి జానకి తోడ పలుక నెంచ
గడ్డి పరకను మధ్యన కలికి వేయ
నిది గని యంజనీసుతుడిట్లు తలచె
రావణున్ గడ్డిపోఁచతో రమణి గూల్చె.
పావని జేరి దానవుడు పాపపు మాటలు పల్కుచుండగా
తా విన లేనటంచు సతి తక్షణమే యొక గడ్డి పోచనే
రావణు ముందు వేయ గని రాముని బంటు దలంచె నిట్టలన్
రావణుఁ గూల్చె సీత రఘురాముఁ దలంచుచు గడ్డిపోఁచతో.
చెరను బట్టగ జానకి కరము మ్రగ్గి
రిప్లయితొలగించండిబాధ పడు వేళ మగత గా బవ్వ ళించి
స్వప్న మున దాను గాంచి యు పరవ శించె
రావణు న్ గడ్డి పోచతో రమణి గూల్చె
లంక వనమందుఁ బలుకగ రావణుండు
రిప్లయితొలగించండిగడ్డిపోచనెంచి నడిమి నడ్డముంచెఁ
జానకి తృణమాత్రంబను సంజ్ఞ తోడఁ
రావణున్ గడ్డిపోఁచతో రమణి గూల్చె
కేవలమా సురద్విషునిఁ గీటునఁబుచ్చగ నిబ్బరంబునన్
బావని సీత చేతనపు భావనమందునఁ లంక సామియౌ
రావణుఁ గడ్డి పోచయను లాంఛన మేర్పడఁ జేసి బిట్టుగా
రావణుఁ గూల్చె సీత రఘురాముఁ దలంచుచు గడ్డిపోఁచతో
కావరమూని మెండు దశకంఠుడు సీతను తూలనాడగన్
రిప్లయితొలగించండిపావనియైన సీత విని భగ్గున మండుచు గడ్డిపోచలన్
భావన జేసి భ్రాతగను పట్టగఁహస్తము నందు జూచి సం
జీవప్రభుండు తల్చె తన చిత్తము నందున వ్రేకఁనిట్టులన్
రావణు గూల్చె సీత రఘురాముఁదలంచుచు గడ్డి పోచతో
(లక్ష్మణుడు ధర్భలతో గీత గీయగా సీత దాటవలసి వచ్చినందున ఆధర్భలు (గడ్డిపోచలు) రావణుని మృత్యువుకు ఒక రకంగా కారణ మైనాయనే అర్థంతో నండి)
రిప్లయితొలగించండితే॥ రక్షఁ గననట ధర్భతో లక్ష్మణుఁ డటు
గీత గీయఁగన్ దాటఁగ సీత తుదకు
దైత్యుఁడా విధిఁ జావుకు దగ్గరయ్యె
రావణున్ గడ్డిపోచతో రమణి గూల్చె
ఉ॥ ఆ వని సీత రక్షఁగన నట్టుల ధర్భల గీత గీయఁగన్
బావని గీత దాటఁగను బంతముఁ బూనఁగ దైత్యుఁడప్పుడే
చావుకు దగ్గరయ్యె కద జానకి శోకమె కాటు వేసెనే
రావణుఁ గూల్చె సీత రఘురాముఁ దలంచుచు గడ్డి పోఁచతో
తే.గీ:తలను పైకెత్తి చూడక,ధైర్య మొప్ప
రిప్లయితొలగించండినీవు దీనికి సమ మంచు నిలిపి యుంచి
రావణున్ గడ్డిపోఁచతో రమణి గూల్చె
నిస్తులావమానపు జలనిథిన భళిర!
(2)ఉ:"నీవొక గడ్డి పోచ" వని నేర్పుగ జెప్పుచు భాషణమ్మునన్
రిప్లయితొలగించండిభావము నందు రాఘవుడు వచ్చుట తథ్య మటంచు ధీర యై
రావణుఁ గూల్చె సీత రఘురాముఁ దలంచుచు, గడ్డిపోఁచతో
లేవగ రాని యట్టి కడలిం బలె దోచు నిరాశ యందునన్.
(నిరాశలో కూల్చింది.)
నిర్భయమ్ముగ బాధింప నేల పట్టి
రిప్లయితొలగించండిరాముఁ డస్త్రమ్ము సంధించి బ్రహ్మ శిరము
కంటి నలుకతో వీక్షించి కాకి నలఘు
రావణున్ గడ్డిపోఁచతో రమణి! గూల్చె
[అలఘు రావణుఁడు = పెద్ద యఱుపులు గలవాఁడు]
చేవను గాఱుకూఁతల నశేష విధమ్ముగఁ గూయుచుండఁగాఁ
బావని కోప తాపమున వారక పోల్చి సమస్త విశ్వ వి
శ్రావ ని జాసమాన బల సంప దవారిత వీర్య దర్పితున్
రావణుఁ గూల్చె సీత రఘురాముఁ దలంచుచు గడ్డిపోఁచతో