16, అక్టోబర్ 2025, గురువారం

సమస్య - 5276

17-10-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాడలందుఁ దిరుగువాఁడు వేల్ప?”
(లేదా...)
“వాడల వాడలం దిరుగువాఁడగు చోరుఁడు దేవుఁ డెట్లగున్”

20 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    గోపకాంతలుండ గోపాల కృష్ణుండు
    పగలురేయివెంటపడెడు వాడు!
    నగ్రపూజకెటుల నాతఁడు యోగ్యుండు?
    వాడలందుఁ దిరుగువాఁడు వేల్ప?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      దూడల పాలనే పొదుగు దొంగగ గ్రోలెడు నల్లకృష్ణుఁడే!
      వీడడు గోపకాంతలను! వింతగ దోచును పాలువెన్నలన్ !
      కూడదు ధర్మజా! హరికిఁ గూర్చఁగనెంచెడు నగ్రపూజలున్
      వాడల వాడలం దిరుగువాఁడగు చోరుఁడు దేవుఁ డెట్లగున్?

      తొలగించండి
  2. (శిశుపాలుని మాటలు)

    ఉ.
    కూడిన రాజ సంఘముల కొండొక సేపు తలంపు ధర్మజా
    నేడిట నగ్ర పూజకు వినీల ఘనాఘన రూపుడైన యీ
    కీడొనరించి మాయలిడు కృష్ణు డనర్హడు దోచ వెన్నకై
    వాడల వాడలం దిరుగువాడగు చోరుడు దేవు డెట్లగున్!

    రిప్లయితొలగించండి
  3. ఆది భిక్షువయిన యగ్గి కనులవాడు
    వాడలందుఁ దిరుగువాఁడు వేల్ప?
    విత్తమర్జునముల విలసిల్లు వానిని
    గొలిచినంత దీరు గొసరులన్ని

    రిప్లయితొలగించండి

  4. స్నాన మాడు సఖుల శాటులెత్తిన వాడు
    పరుల యిండ్ల లోన పాలు వెన్న
    దొంగిలించ బూని తోటి వారల తోడ
    వాడలందుఁ దిరుగువాఁడు వేల్ప?


    వాడొక మూర్ఖుడై చెలగి పాలును వెన్నయు మ్రుచ్ఛ లింపగా
    వాడల లోని గొల్లల నివాసము లన్ నిశి వేళ జేరెడిన్
    వాడత డంచెఱుంగరె, వివాదము లేల యనర్హు డాతడా
    వాడల వాడలం దిరుగువాఁడగు చోరుఁడు, దేవుఁ డెట్లగున్.

    రిప్లయితొలగించండి
  5. చీర లెత్తు కెళ్ళి చీకాకు పరచు చు
    గొల్ల యిండ్ల పాలు గోరుచు వెన్న
    దొంగ యగుచు మెలగు దురి తుండు కృష్ణుండు
    వాడ లందు దిరుగు వాడు వేల్ప?
    శిశుపాలుని ఆరోపణ-----

    రిప్లయితొలగించండి
  6. శిశుపాలుడు ధర్మరాజుతో

    వాడొక దుష్టవర్తనుడు వత్సము లాను రసోత్తమంబులన్
    వీడక త్రాగుచున్ సతము వ్రేతల కోసము తోటివారితో
    కూడుచు నుద్భటంబుగను గోలలు చేయుచు తాపతాపకున్
    వాడల వాడలం దిరుగువాడగు చోరుడు దేవుడెట్లగున్

    రిప్లయితొలగించండి
  7. కొంటెచేష్టల సడిఁ గోరు విధంబున
    గోపికల వలువలు కొల్లగొట్టె
    వీడకుండనెపుడు వెన్నను దొంగిలఁ
    వాడలందుఁ దిరుగువాఁడు వేల్ప?

    వీడక కొల్లగొట్టుగద వెన్ననుఁ బాలను యిండ్ల లోపలన్
    వాడెగ వల్లవాంగనల వస్త్రములన్ గొని పోయెఁ జోరుడై
    వేడుకనూది వేణువును వేగమె దొంగిలె రాధ గుండెనే
    వాడల వాడలం దిరుగువాఁడగు చోరుఁడు దేవుఁ డెట్లగున్

    రిప్లయితొలగించండి
  8. ఆ॥ వడివడిగ నడుగిడి గడబిడ విడివడ
    నడవడి ముడివడఁగఁ దడబడక క
    డువడి దోఁచఁ గాను వివరించ నడయాడి
    వాడలందుఁ దిరుగు వాఁడు వేల్ప

    ఉ॥ చూడఁగ సంపదాదులను జూచి మనమ్మున లెక్కపెట్టుచున్
    గోడల కెట్లు దోఁచుటకు గుట్టుగఁ గన్నము వేయనొప్పునో
    జాడను గాంచి యెంచఁగను సాగుచు దీటుగ నెల్లవేళలన్
    వాడల వాడలం దిరుగు వాఁడగు చోరుఁడు దేవుఁ డెట్లగున్

    (ఆటవెలది కొంత హాస్యంగా ఉండాలని వ్రాసానండి. అంతే)

    రిప్లయితొలగించండి
  9. సమస్య:
    వాడల వాడలం దిరుగు వాడగు చోరుడు దేవుడెట్లగున్"

    ఉ.మా

    కోడలు నత్తకున్ దగవు గోరుచుఁబెట్టును వెన్న దొంగిలన్
    కూడుచు నాడె గోపికల కూరిమి శాపముఁ బాపయోగులన్
    వాడల వాడలం దిరుగు వాడగు చోరుడు దేవుడెట్లగున్"
    వేడుమ తప్పులెంచకను, వేదన బాపియు మోక్షమిచ్చులే

    రిప్లయితొలగించండి
  10. సమస్య:
    వాడల వాడలం దిరుగు వాడగు చోరుడు దేవుడెట్లగున్"

    ఉ.మా

    పాడియు నింటనున్న హరి పాలను, వెన్నను దొంగిలించెనే
    వాడల, వీధులన్ దిరిగి వారిజ నేత్రులఁనడ్డగించుచున్
    కూడుచు కాంతలన్ సరసు కూరిమి చీరల దాచి మ్రొక్కుడన్
    వాడల వాడలం దిరుగు వాడగు చోరుడు దేవుడెట్లగున్"
    వేడుక పుట్టె ధాత్రినిని వేసరు ధారుణి చింత దీర్చగన్

    రిప్లయితొలగించండి
  11. ఆ.వె: వాడలందుఁ దిరుగువాఁడు వేల్పగు నెట్లు?
    భాగవతము నందు వ్రాసి నంత?
    వాడు వెన్న దొంగ, వాడ వాడల పాలు,
    పెరుగు నమ్ము వాడె పెద్ద వేల్పు.
    (ఇదొక ఆక్షేపణ.వెన్నని దొంగిలించే వాడు దేవు డెట్లా అవుతాడు? నా కైతే పాలు,పెరుగు అమ్మటానికి తిరిగే కుర్రాడే పెద్ద దేవుడు.పొద్దున్నే వాడు పాలు వేస్తేనే కాఫీ పెట్టుకుంటాం.)

    రిప్లయితొలగించండి
  12. వెన్న మ్రుచ్చిలించె జిన్నతనమునందె
    గొల్లపిల్లవాండ్రఁ గూడి యతఁడు
    గోప మానవతుల కోకలు దొంగిలి
    వాడలందుఁ దిరుగువాఁడు వేల్ప?

    రిప్లయితొలగించండి
  13. వాడల వాడలం దిరుగువాఁడగు చోరుఁడు దేవుఁ డెట్లగున్?
    వేడుకగా ధరాధరము వేలితొనెత్తెను గోకులమ్మునన్
    చేడియ ద్రోవదీ సతికి చీరలొసంగెను మాన రక్షకై
    వాడలనున్ననేమి తనభక్తులఁ బ్రోచిన వేల్పు కాదొకో?

    రిప్లయితొలగించండి
  14. ఉ:వాడొక చిన్న బిడ్డ , తన బాల్యవిచేష్టగ వెన్న దొంగిలన్
    వాడల వాడలం దిరుగువాఁడగు చోరుఁడు దేవుఁ డెట్లగున్?
    వా డొక తత్త్వదర్శి యయి పార్థున కీయగ తత్త్వ బోధ నా
    నాదు కదా యతండు భువి నమ్మగ దైవమె యయ్యె మిత్రమా!
    (కృష్ణుడు చిన్న పిల్లవాడుగా ఉండి వాద వాడల తిరిగి వెన్న తినగానే దేవు డయ్యాడా? తత్త్వవేత్త గా గీతోపదేశం చేసిన నాడే దేవుడు. )

    రిప్లయితొలగించండి
  15. వనరు సీత నరయ వచ్చిన యట్టి వాఁ
    డగ్గి వెట్టఁ దోఁక కసురు లనుమఁ
    డన్న నిందుఁ గలది యన్న! వేల్వ యగునా
    వాడ లందుఁ దిరుగు వాఁడు వేల్ప?

    [వేల్చు = తగులఁబెట్టు; సమస్య లోనే ప్రశ్నాంక ముండుటచే వేల్పు పదముపైఁ గర్తకే యనుమాన మున్నదని భావించి చేసిన పూరణము. అగునా యన్నది ప్రశ్నాంకమునకు నిందు నన్వయించును.]


    వేడుక మీఱ బాల్యమున విశ్వ వినోది వినోద రక్తినిం
    దోడుగ నుండ నన్న ఘన దోర్బలుఁడౌ బలరాముఁ డండగా
    నాడిన యాటలం దిరిగి యాడక తా నవనీత చోరుఁడై
    వాడల వాడలం దిరుగు వాఁ డగుఁ జోరుఁడు దేవుఁ డెట్లగున్

    రిప్లయితొలగించండి
  16. ఆ॥వె
    కళకు చిందునట్టి కావివలువదాల్చి
    గారడించి సతము కాసు దోచి
    పైకి యోగిననుచు పాడుబుద్ధినిసాని
    వాడలందుఁ దిరుగువాడు వేల్ప?

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వెన్న దొంగ యనెడు పేరుబడిన వాడు
    స్త్రీల చీరలన్ని చెట్టుపైన
    పెట్టి వారి నేడిపించి, హితుల తోడ
    వాడలందుఁ దిరుగు వాడు వేల్ప?

    రిప్లయితొలగించండి