19, అక్టోబర్ 2025, ఆదివారం

సమస్య - 5279

20-10-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చుట్టమ రమ్మనుచుఁ బిలిచి జుట్టును బీకెన్”
(లేదా...)
“చుట్టమ రమ్ము రమ్మనుచు జుట్టును బీకె నదేమి చోద్యమో”
(అనంతచ్ఛందం సమూహానికి ధన్యవాదాలతో...)

16 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      గుట్టుగ నిద్రించు సుతుల
      పొట్టనబెట్టుకొనఁగ గురు పుత్రున్, నరుడున్,
      గొట్టఁగన వలదను హరికి
      చుట్టమ? రమ్మనుచుఁ బిలిచి జుట్టును బీకెన్!

      ఉత్పలమాల
      పట్టుచు కోపమూని యుపపాండవులందరి పైన దాడితో
      బొట్టనబెట్టుకొన్న గురు పుత్రుని చంపగనెంచఁ గ్రీడియే
      గొట్టగ నొప్పకే శిరపు గుప్తమణిన్గొనఁ జెప్ప శౌరికిన్
      జుట్టమ? రమ్ము రమ్మనుచు జుట్టును బీకె! నదేమి చోద్యమో?

      తొలగించండి
  2. దట్టముగ బెరిగి నందున
    చిట్టడివగ గానవచ్చె , సిగను గనంగా !
    బట్టతల తెలివి సూచిక ,
    చుట్టమ ! రమ్మనుచుఁ బిలిచి జుట్టును బీకెన్”

    రిప్లయితొలగించండి

  3. తిట్టితి తమాష కోసము
    వట్టి జులాయివని వాని పనులను గనుచున్
    గట్టిగ, నా ముని మనుమని
    చుట్టమ, రమ్మనుచుఁ బిలిచి జుట్టును బీకెన్.


    ఎట్టుల నైన నేమి తన నింతియె కోరిక తీర్చ నెంచుచున్
    బెట్టును వీడి పిల్చెనని పేర్మిని నర్తన శాల లోనికై
    గుట్టుగ యంచు కీచకుడు కోరికతో నట కేగ నచ్చటన్
    చుట్టమ, రమ్ము రమ్మనుచు జుట్టును బీకె నదేమి చోద్యమో.

    రిప్లయితొలగించండి
  4. బిట్టగు కోపము మనమున
    దట్ట ముగా నలము కొన్న దరుణము నందు న్
    గుట్టుగ వానిని ప్రీతిగ
    చుట్టమ రమ్మనుచు బిలిచి జుట్టును బీ కె న్

    రిప్లయితొలగించండి
  5. బొట్టెడు పెంచ కేశములు మూర్ధము నందున షోకుమీరగన్
    బిట్టుగ క్రోధమూనుచును ప్రేమగ చూసెడు పెద్ద బావయే
    పెట్టియ లోని కత్తెరను వేగమె బైటకు తీసి పిల్చుచున్
    చుట్టమ రమ్ము రమ్మనచు జుట్టును బీకె నదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  6. పట్టిన శని కీచకుడే
    గుట్టుగ పాండవులు విరట కొల్వున నుండన్
    బిట్టున భీముడు విరటుని
    చుట్టమ రమ్మనుచుఁ బిలిచి జుట్టును బీకెన్

    గుట్టుగ పాండవుల్ విరట కొల్వున నుండగఁ గీచకుండటన్
    బట్టినపట్టు వీడనని పాండవ పత్నిని రచ్చ సేయగన్
    బిట్టున నీలపంకమున భీముడు వచ్చి విరాటరాజుకున్
    జుట్టమ రమ్ము రమ్మనుచు జుట్టును బీకె నదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  7. కట్టెదుటన్ ఖలుండొకఁడు కావరుఁడై యొక కన్నెపిల్లనున్
    తట్టము వెట్టుచుండనటఁ దారటలాడుచు నేడిపించుచున్
    నెట్టన నాపె సోదరుఁడు నివ్వెరవోవఁగ దుండగీఁడు నా
    చుట్టమ! రమ్ము! రమ్మనుచు జుట్టును బీకె నదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  8. కట్టెదుటనె దుష్టుడొకఁడు
    తట్టము వెట్టుచు నతివల తారటలాడన్
    నెట్టన వానిని యోరీ
    చుట్టమ! రమ్మనుచుఁ బిలిచి జుట్టును బీకెన్

    రిప్లయితొలగించండి
  9. కం:గట్టుకు పంపు మనంగా
    గట్టిగ వద్దనక వేడుకగ నా భార్యన్
    జట్టిడ గొరిగించె తలను
    చుట్టమ రమ్మనుచుఁ బిలిచి జుట్టును బీకెన్
    (దేవుని గట్టుకు పంప మంటే పోనీలే అని జట్టు గా భార్యను పంపితే ఆమె అక్కడ తల గొరిగించింది.చుట్టమ=చుట్టమే.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:పట్టుక రుక్మినిన్ దలను వంచుచు బాణము నొండు చేతి తో
    బట్టి శిరోజముల్ గొరుగ పాపము రుక్మిణి యిట్లు దల్చె "ని
    ప్పట్టున నన్న జంపు నని బాధను బొందితి కృష్ణు డేలనో
    చుట్టమ ! రమ్ము రమ్మనుచు జుట్టును బీకె నదేమి చోద్యమో!"
    (శ్రీ కృష్ణుడు తన అన్న రుక్మి ని చంపుతాడేమో అని భయపడ్డ రుక్మిణి ఆ కృష్ణుడు ఊరికే జుట్టు గొరగటం చూసి ఆశ్చర్య పడింది.)

    రిప్లయితొలగించండి
  11. కం॥ గుట్టుగ నుండదె వర్తన
    తట్టదు కొందరి నడవడి త్రచ్చిన సఖుఁడా
    యెట్టుల తెల్పుదుఁ బ్రీతిగ
    చుట్టమ రమ్మనుచుఁ బిలిచి జుట్టును బీకెన్

    ఉ॥ తట్టదు కారణమ్మటులఁ ద్రచ్చుచు యోచనఁ జేసి చూచినన్
    దిట్టగు బంధు మిత్రులని తీరుగఁ దల్చిన వారి వర్తనల్
    గుట్టుగ నుండుఁ గష్టమగుఁ గొంతయు నర్థము గాదు చూడుమా!
    చుట్టమ రమ్ము రమ్మనుచు జుట్టును బీకె నదేమి చోద్యమో!

    జుట్టును పీకె ను figurative గా తీసుకోవాలండి. పిలిచి నిర్దయగా చూసినారని

    రిప్లయితొలగించండి
  12. నెట్టెదవదేల వదినా
    బెట్టితి నేముందు నీటిబిందెను వరుసన్
    ఒట్టిదె విడువను నేనిను
    చుట్టమ రమ్మనుచుఁ బిలిచి జుట్టును బీకెన్

    (ఈ నడుమ కనుమరుగైన ) నీటి కుళాయి వద్ద దృశ్యం.

    రిప్లయితొలగించండి
  13. కట్టెదుటం దగఁ గూర్చొని
    దట్టము సరి చేసికొంచుఁ దన సరసం గ
    న్పట్టఁగ జడ వేయ వెసం
    జుట్టమ రమ్మనుచుఁ బిలిచి జుట్టును బీఁకెన్


    పుట్టిన యింటి బందుగులు ముద్దియ కెప్పుడు ప్రీతిపాత్రులే
    మెట్టిన యింట మోదమున మీనవిలోచన పట్టి కోడినిం
    బుట్టము చక్కఁ బెట్టి పువుఁ బోడి తలంచుచుఁ గూర వండఁగాఁ
    జుట్టమ రమ్ము రమ్మనుచు జుట్టును బీఁకె నదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పెట్టుకొని యింట వ్రతమును
    చుట్టమ!రమ్మనుచుఁ బిలిచి;జుట్టును బీకెన్
    కొట్టిన కొబ్బరి కాయల
    బుట్టెడు ముక్కలను పంచె మోదం బలరన్.

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.
    (సవరణతో.....)

    పెట్టుకొని యింట వ్రతమును
    చుట్టమ!రమ్మనుచుఁ బిలిచి;జుట్టును బీకెన్
    కొట్టిన కొబ్బరి కాయల
    బుట్టెడు ముక్కలను పంచె పూజలు
    ముగియన్.

    రిప్లయితొలగించండి