కం;బాపూ చూపిన మార్గము నే పాటించుచు, నఘముల నే రోయుచు, నా పాపముల వదల గోరుచు, పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్” (గాంధీ గారు దుర్మార్గాన్ని ద్వేషించండి కానీ దుర్మార్గుణ్ని ద్వేషించకండి అన్నారు.)
ఉ:పాపము చేయ లే డొకడు,భాగ్యము లేని దరిద్రు డౌటచే పాపము! దానధర్మములు వా డొనరించగ లేడు వాని లో లోప మదేమి? యీ ధరణి లో తులనాత్మక దృష్టి నెవ్వడో పాపముఁ జేయువానిఁ గని ,పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్” (ఒకడికి పాప మంటే భయం. వాదు పేద కనుక పుణ్యాలు కూదా చెయ్య లేడు.వాడిని పాపం చేసే వాడితో తులనాత్మకం గా చూసి పాపపుణ్యాలు రెండూ చెయ్యని వాణ్ని పావను డనే అంటారు. పాపం చేసే వాడితో పోలిస్తే పాపం,పుణ్యం రెండూ చెయ్యని వాడు పవిత్రుడే.)
ఉ.
రిప్లయితొలగించండిశాపము భూమి దుర్గుణ నిశామయ హృత్కలితుల్ ధనంబుతో
కోపముతోడి స్వైరులయి గొప్పలు వోవుచు నిల్చిరిప్డు వా
రే పొగరెక్కి యుండ నిజమెప్పు డురుంగును, ప్రాణభీతితో
పాపము జేయువాని గని పావనుడంచు నుతింత్రు సజ్జనుల్ !
మాపటి సమయము నందున
రిప్లయితొలగించండిపాప నిదురపోవ దోమ వ్రాలగ బోయెన్
ఓపక దానిని జంపిన
పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్
రిప్లయితొలగించండిదోపిడి తో నార్జించిన
పాపపు సొమ్ము నట బంచి పాలకు డైనన్
గోపతియొ యిందుడో యని
పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్.
దోపిడి చేసినట్టి యొక ధూర్తుడు సంపద కూడబెట్టి యా
పాపపు సొమ్ము లోకులకు పంచుచు నెన్నిక లందు నెగ్గుచున్
తా పరి పాలకుండయిన తప్పదటంచు సభాంతరమ్ము నన్
బాపముఁ జేయువానిఁ గని పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్
పాపపు కృత్యములు సలిపె
రిప్లయితొలగించండితాపసి శాపపు మహిమన తానేరకనే
పాపము శాపము వలనని
పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్
కోపము తోడ ఘోరమగు గోమున తాపసుడే శపించగా
శాపము నొంది దానిదగు శక్తికి లోబడి ప్రాతవేల్పుగా
పాపముఁ జేయువానిఁ గని పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్
పాపమెరుంగడెన్నడును పాపము శాపము వల్లనందురే
శ్రీపతి తూలికయై అం
రిప్లయితొలగించండిబాపతి కంఠముననలరు ప్రాలంబమ్మై
సౌపర్ణారి సుభగుడయె
పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్
పాపి : సర్పము
లోపము కానిరాని దిట
రిప్లయితొలగించండిలోకమునందున గాంచలేమె యా
లోపములన్ పరిష్కరణ
రూప మొసంగుచు మానవాళికిన్
దీప రువాణమౌచు నిల
దివ్య మహోన్నత మార్గమందు ని
ష్పాపముఁ జేయువానిఁ గని
పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్!
కం॥ ఆపక నన్యులఁ ద్రుంచెడు
రిప్లయితొలగించండిపాపుల శిక్షించ నదియుఁ బాపమగునొకో
చూపుచుఁ దెగువ వారిఁ దునుము
పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్
ఉ॥ ఆపక నుగ్ర వాదమటు లన్యులఁ ద్రుంచుచుఁ కీడుఁ జేసెడున్
బాపులఁ జంపఁ దప్పగునొ పాపము కాదని పల్కవచ్చునో
ఓపక దుష్టకృత్యముల నుగ్రులఁ గాంచి వధించి సాగెడున్
బాపముఁ జేయు వానిఁగని పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్
పాపపు కృత్యములు సలుపు
రిప్లయితొలగించండిపాపియె పరి శుద్ధు డ గుచు పరివర్తన తో
పాపములు జేయ మానిన
పాపిని మెత్తురు సుజనులు పావను డనుచు న్
కం;బాపూ చూపిన మార్గము
రిప్లయితొలగించండినే పాటించుచు, నఘముల నే రోయుచు, నా
పాపముల వదల గోరుచు,
పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్”
(గాంధీ గారు దుర్మార్గాన్ని ద్వేషించండి కానీ దుర్మార్గుణ్ని ద్వేషించకండి అన్నారు.)
కోపం బూనక తా సం
రిప్లయితొలగించండితాపములం దెద వగవక తనరుచు నుండం
దాపస వరేణ్యుని విగత
పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్
తాప మొసంగుటం బ్రజకుఁ దా మది నేరక సుంత యేనియుం
జూపఱు లెల్ల వారికిని శుద్ధ మనస్కుని రీతిఁ గన్పడన్
రూపము మార్చి తా వసు పరుండయి కోట్లను గూడఁ బెట్టినం
బాపముఁ జేయువానిఁ గని పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్
కందం
రిప్లయితొలగించండిగోపికల వస్త్ర చోరునిఁ
జేపుచు నావులఁ దఱుపులు చింతిల జేయన్
ద్వాపర దైవమె? నిత్యము
పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్!
ఉత్పలమాల
చేపుచు నావులన్ బొదుగుఁ జిక్కఁగ త్రాగుచు దూడలేడ్వగన్
గోపికలెందరో వగచ కోకలు దోచిన కొంటె కృష్ణునిన్
ద్వాపరదైవమై తరుణిఁ దన్నుకు పోవుచు నిత్యమిట్టులన్
బాపముఁ జేయువానిఁ గని పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్
ఉ:పాపము చేయ లే డొకడు,భాగ్యము లేని దరిద్రు డౌటచే
రిప్లయితొలగించండిపాపము! దానధర్మములు వా డొనరించగ లేడు వాని లో
లోప మదేమి? యీ ధరణి లో తులనాత్మక దృష్టి నెవ్వడో
పాపముఁ జేయువానిఁ గని ,పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్”
(ఒకడికి పాప మంటే భయం. వాదు పేద కనుక పుణ్యాలు కూదా చెయ్య లేడు.వాడిని పాపం చేసే వాడితో తులనాత్మకం గా చూసి పాపపుణ్యాలు రెండూ చెయ్యని వాణ్ని పావను డనే అంటారు. పాపం చేసే వాడితో పోలిస్తే పాపం,పుణ్యం రెండూ చెయ్యని వాడు పవిత్రుడే.)
కం॥
రిప్లయితొలగించండిపాపమ్మందురు ప్రాణుల
కాపదతలపెట్టనెంచగాన్, తన జనులన్
కాపాడగ పామునడచు
"పాపిని" మెత్తురు సుజనులు పావనుడంచున్
పాపి యతం డనునిత్యము
రిప్లయితొలగించండిపాపములను బాపు కొరకు పవలును రేయిన్
గోపురములు దర్శించఁగ
పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్
పాపపు చింతనన్ మదిని పన్నుగ నిల్పి నిరంతరమ్ము దు
రిప్లయితొలగించండిర్వ్యాపకముల్ ఘటించి తన పాపములన్ శమియించ గోరుచున్
గోపురముల్ మఠమ్ముల నకుంఠిత దీక్షనుబూనిపోవ నా
పాపముఁ జేయువానిఁ గని పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కోపమ్మున నిందింతురు
పాపిని; మెత్తురు సుజనులు పావనుఁ
డనుచున్
శ్రీపతిని కొలుచుచు మదిన్
ఆ పరమేశుని స్తుతింతు రనయము భక్తిన్.