1, డిసెంబర్ 2025, సోమవారం

సమస్య - 5321

2-12-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మమ్ముఁ దప్పుపట్టి మాల వేసె”
(లేదా...)
“మమ్మును దప్పుపట్టి యొక మాలను వేసె సభాంతరమ్మునన్”

18 కామెంట్‌లు:

  1. సభ యలంకరణము జక్కగ లేదని
    మమ్ముఁ దప్పుపట్టి ; మాల వేసె
    నింతకంటె రోత నిడెడు దానిని జూసి .
    వింత గొలుపుచుండు విషయమిదియ

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    ఒప్పితినని క్రీడి నూర్వశి చేరఁగ
    వావి వరుసఁ జూపి పారుచుండ
    మగువ వలచిరాగ మరులు గొననను నీ
    మమ్ముఁ దప్పుపట్టి మాల వేసె!


    ఉత్పలమాల
    నెమ్మిని జూపి యూర్వశియె నిక్కెడు సోయగమొల్కి పార్థునిన్
    గమ్ముచు నుండగన్ వరుస కాదని దూరము పారుచుండఁగన్
    గొమ్మయె కోరివచ్చెననఁ గూడక సాకులు జెప్పు వావి నీ
    మమ్మును దప్పుపట్టి యొక మాలను వేసె సభాంతరమ్మునన్!

    రిప్లయితొలగించండి

  3. మా జనకుని మెచ్చి మాకుల శ్రేష్ఠలు
    వ్రేకదనము చేయు వేళ మంత్రి
    పిలువ లేదటంచు పేరిమితో నట
    మమ్ముఁ దప్పుపట్టి, మాల వేసె.



    కొమ్మల పైన గాథలను కొల్లలుగా రచియించి నట్టి మా
    తమ్ముని మెచ్చి వానికట దంబునొనర్చెడి నత్తరిన్ తనన్
    రమ్మని బిల్వ లేదనిచి రాకును జూపుచు మర్చి నందుకై
    మమ్మును దప్పుపట్టి, యొక మాలను వేసె సభాంతరమ్మునన్.

    రిప్లయితొలగించండి

  4. కొమ్మను గోరివచ్చితిని కూడదటంచు తిరస్కరింతువే
    నెమ్మిని యాదరించకను నీకిది భావ్యము కాదు నన్నిటుల్
    పొమ్మని తోయు చుండుటది మూర్ఖుపు చేష్ట యటంచు క్రీడి నే
    మమ్మును దప్పుపట్టి యొక మాలను వేసె సభాంతరమ్మునన్.

    రిప్లయితొలగించండి
  5. చిన్న బుచ్చె నంచు చెలియ యూర్వశి యెతా
    నలక బూనిన తరి యతిథి పలుకు
    పనికి మాలి నదని పార్థుడు చెప్పు నీ
    మమ్ము దప్పు పట్టి మాల వేసె.

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. ఉ.
      కమ్మని మాటలం మొనసి క్ష్మాసుత కాంతుని గాథ వేల కో
      ణమ్ములతోడ జెప్ప వడి‌ నం గని పండితుడప్డు నా ప్రసం
      గమ్మును మెచ్చి నీతులను గాదిలి వాక్కుల తెల్పి నాడధ
      ర్మమ్మును దప్పుపట్టి యొక మాలను వేసె సభాంతరంబునన్

      తొలగించండి
  7. ఆతడు సృజియించె నద్భుత రచనలు
    ముదముగూర్చు కావ్యములను వెల్వ
    రించునపుడు సంభవించు కించిద్విరా
    మమ్ముఁ దప్పుపట్టి మాల వేసె

    ఇమ్మహిలో ప్రసిద్ధమగు నీకృతులంచు వచించె నేలనో!
    యమ్మహనీయునే బొగిడి యాతని కావ్యములెల్ల చూడగా
    గమ్మని వంచుఁ బేర్కొనుచు కల్గిన కొంచెము కల్పనా విరా
    మమ్మును దప్పుపట్టి యొక మాలను వేసె సభాంతరమ్మునన్

    రిప్లయితొలగించండి
  8. ఆ.వె:చక్కగనె రచించ సన్మాన పద్యమ్ము
    "లన్ని యాట వెలదు లయ్యె, నొక్క
    వృత్త ముంచు" డనుచు వృద్ధ కవీంద్రుడు
    మమ్ముఁ దప్పుపట్టి మాల వేసె”
    (సన్మాన పద్యాలు మొత్తం ఆటవెలదుల తో ఉంటే గొప్పగా లేదని ఒక్కటైనా వృత్తం ఉండాలని ఆయన మాల వేసాడు.చంపక మాలని ఉత్పలమాలని మాలలు అనటం సంప్రదాయమే.)

    రిప్లయితొలగించండి
  9. పాటల పోటీలో న్యాయమూర్తి అన్యాయంగా ప్రవర్తిస్తే ఒక ప్రేక్షకుని స్పందన

    ఆ॥ గాన మాధురి విని కడు ముదముఁ గనిన
    న్యాయమూర్తి మిగుల మాయఁ జేసి
    బహుమతిఁ బ్రకటించఁ బరులకు నొకఁడు నే
    మమ్ముఁ దప్పుపట్టి మాల వేసె

    ఉ॥ నెమ్మినిఁ గాన మాధురిని నిశ్చల గాత్రముఁ గూర్చి పంచినన్
    గమ్మగ నాలకించి మరి ఘాటగు వాక్యల న్యాయమూర్తియే
    నెమ్మది వీడి తప్పుఁ గని నిందలు వేయఁగఁ బ్రేక్షకుండు నే
    మమ్మును దప్పుపట్టి యొక మాలను వేసె సభాంతరమ్మునన్

    నేమము కపటము

    రిప్లయితొలగించండి
  10. (కవి సన్మాన సభలో మా మిత్రబృందము కార్యకర్తలుగా ఉన్న సందర్భము:)

    ఆ॥వె
    హంగులేమిలేక యతిథి సభకు రాగ
    సరకు గొనక మేము యూరకుండ
    కార్యదర్శి యతని కాహ్వానమున్ బల్కి
    మమ్ము దప్పుబట్టి మాల వేసె!

    రిప్లయితొలగించండి
  11. ఉ:ఇమ్ముగ గార్యవర్గముగ నేవురి పేర్లను వ్రాయ "విప్ర నా
    మమ్ములె యన్ని యున్న"వని " మారరు మీ"రని,"మీది వర్ణత
    త్త్వ"మ్మని,"నేటి కాలమున ధర్మము కా"దని సభ్యు డెవ్వడో
    మమ్మును దప్పుపట్టి యొక మాలను వేసె సభాంతరమ్మునన్”
    (ఏదో సంఘం.కార్యవర్గం పేర్లు రాస్తే అన్నీ బ్రాహ్మణుల పేర్లే రాసుకున్నా రని ఒక సభ్యుదు తప్పు పట్టి దానిలో ఒక మాల కులస్తుని పేరు చేర్చాడు. )

    రిప్లయితొలగించండి
  12. సభకు వచ్చి నట్టి సభ్యుల గాంచియు
    నూ ర కుండి రనుచు నేర మనుచు
    వెడలి నొకడు నెక్కి వేదిక నపుడు నీ
    మమ్ము తప్పు బట్టి మాల వే సె

    రిప్లయితొలగించండి
  13. మంచి వానివోలె మసలుచు ప్రజలను
    మోసపుచ్చు వాని బూటకమును
    బట్టబయలు సేయ, నట్టిదౌ వానిఛ
    ద్మమ్ముఁ దప్పుపట్టి, మాల వేసె

    రిప్లయితొలగించండి
  14. ఉత్తమ కవి బిరుదు నొందిన పండితుఁ
    గాంచి సంతసమ్ము కదుర నెడఁదఁ
    గవి వరు మెడ లోనఁ గవన గణన నియ
    మమ్ముఁ దప్పుపట్టి మాల వేసె


    పమ్మిన శబ్ద లాఘవము పన్నుగ నచ్చఁగ నెల్ల వారికిం
    బిమ్మటఁ దన్మనోహర కవిత్వపు టుద్ధతి నుబ్బు నా ని జో
    రమ్మున, సత్కవీంద్రు నెద రంజిలి నట్టిది స్వీయ కీర్తి కా
    మమ్మును దప్పుపట్టి, యొక మాలను వేసె సభాంతరమ్మునన్

    రిప్లయితొలగించండి
  15. ఇమ్మహి నాయకాగ్రణుల నెన్నఁడు నమ్మఁగరాదు బాహ్యమం
    దిమ్ముగ నెల్లవారలకు నీప్సితముల్ నెరవేర్తునంచు తా
    కమ్మని మాటలాడుచు నకారణ వైరముఁ బూను వాని నే
    మమ్మును దప్పుపట్టి యొక మాలను వేసె సభాంతరమ్మునన్

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కులము తక్కువనుచు కొందరు పెద్దలు
    మమ్ముఁ దప్పు పట్టి; మాల వేసె
    పెద్ద కులము వారు వద్దని యన్నను
    నిర్వహించు వారు నియతి వీడి.

    రిప్లయితొలగించండి