భావం : పూరిగుడిసెలో నివసిస్తున్నా, లేదా జీవిత గమనంలో కష్టాలనే భారములను మోస్తున్నా సరే, అదృష్టవశాత్తూ ప్రేమ గల వారు మనపై చూపే మమకారమే సుఖంగా జీవించడానికి కారణం అవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన ఉండి ప్రేమను పంచే మనుషులు ఉంటే, ఆ కష్టం కూడా సుఖంగానే తోస్తుంది.
ఉ:కోరగ నేల రూపముల? కూర్చగ వానిని ధ్యాన మందు ని స్సారపు పాట్లవేల? కడు శాంతి నొసంగెడు నక్షరమ్మె ఓం కారము, బ్రహ్మతత్త్వ మది కన్నుల మూసి స్మరించుచున్న నోం కారమె కారణం బగు సుఖప్రదజీవనశైలి కెప్పుడున్” (ఓ మి త్యేకాక్షరం బ్రహ్మ అని ఉపనిషద్వాక్యం.ఓంకార స్మరణ అన్ని రూపాల ధ్యానం కంటే ఉత్తమం.)
కందం
రిప్లయితొలగించండితీరగు నడవడిఁ బతిసతి
మీరక కర్తవ్యపరత మెలకువ కలుగన్
భారముల పరస్పర సహ
కారమె సుఖజీవనహితకారణ మగులే
ఉత్పలమాల
తీరగు వర్తనల్ గలిగి దివ్యమనోహరు నర్చనంబునన్
మీరక బాధ్యతల్ సతము మెచ్చగ నల్వురు సాగుచుండుచున్
దారయు భర్తయున్ విడక భారములన్నియు మోయనెంచు శ్రీ
కారమె కారణం బగు సుఖప్రదజీవనశైలి కెప్పుడున్
ఆరయగ దెలియు గాపుర
రిప్లయితొలగించండినీరధిని తరియుటకొరకు నిరవధికముగన్
నారీమణుల పయిన యధి
కారమె సుఖజీవనహితకారణ మగులే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅరయగ/తెలియు రెండూ ఒకటే కదా? 'కాపురపు నీరధి' అనడం సాధువు. "పయిన నధికారమె" అని ఉండాలి.
🙏
తొలగించండికారము లేని పచ్చడికి కాంక్షితమెక్కడ లోకమందు సం
రిప్లయితొలగించండిస్కారము లేని వానికిట సాధ్యముకానిది లక్ష్య సిద్ధి స్వీ
కారము లేకయున్నయెడ కాపురముండుట సంభవించునా?
కారమె కారణం బగు సుఖప్రదజీవనశైలి కెప్పుడున్
[కారము = ఒఱ్ఱ; సంస్కారము = సంకల్పము;
స్వీకారము = అంగీకారము; కారము = నిశ్చయము]
కారము రుచికరమే సం
స్కారముతో లక్ష్య సిద్ధి సాధ్యంబౌ స్వీ
కారమె పునాది మనువుకు
కారమె సుఖజీవనహితకారణ మగులే
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండి
రిప్లయితొలగించండివారలు వీరలటంచును
వేఱడమును విడుచుచు కడు పేరిమి తో నా
వారలె యందరనెడి మమ
కారమె సుఖజీవనహితకారణ మగులే.
సారమదెంత యుండినను స్వార్థము వీడుచు నించుకైన నా
సీరము జూపకుండ సహజీవుల శ్రేయము గోరుచున్ సదా
ధారుణి ధర్మమార్గమున తాచరియించెడి శ్రేష్ఠమైన సం
స్కారమె కారణం బగు సుఖప్రదజీవనశైలి కెప్పుడున్.
రిప్లయితొలగించండిపూరిగుడిసెలో నున్నను
భారములను మ్రోయుచున్న, భాగ్యవశమునన్
కూరిమిగలవారల మమ
కారమె సుఖజీవనహితకారణ మగులే
భావం : పూరిగుడిసెలో నివసిస్తున్నా, లేదా జీవిత గమనంలో కష్టాలనే భారములను మోస్తున్నా సరే, అదృష్టవశాత్తూ ప్రేమ గల వారు మనపై చూపే మమకారమే సుఖంగా జీవించడానికి కారణం అవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన ఉండి ప్రేమను పంచే మనుషులు ఉంటే, ఆ కష్టం కూడా సుఖంగానే తోస్తుంది.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికోరికలదుపున నుంచియు
రిప్లయితొలగించండినోరిమితో జీవనమ్ము నొగిఁ సలుపుచు నీ
భారము దేవునకిడు సం
స్కారమె సుఖజీవనహితకారణ మగులే
భారము దైవమందునుచి ప్రాగహరమ్మగు రీతి జీవికన్
తీరుగ తీర్చిదిద్దుకొని తృప్తి వహించిననాడు రూఢిగన్
కోరికలన్ జయించి వెలుగుల్ ప్రసరించుట తథ్యమట్టి సం
స్కారమె కారణం బగు సుఖప్రదజీవనశైలి కెప్పుడున్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికం॥ ధీరతఁ బెంచు మనుజులకు
రిప్లయితొలగించండితారణమై చనెడి తోడు ధాత్రినిఁ గనఁగన్
సారము నొందు బ్రదుకు సం
స్కారమె సుఖజీవన హితకారణ మగులే
ఉ॥ తారణమౌను గష్టముల దాపున నుండక రక్ష నొందఁగన్
ధీరతఁ బెంపు చేయుఁ గడు తేకువ తోడ సదా చరించఁగన్
గోరిన శక్తిఁ గాంచుటకుఁ గూర్చుచు స్తోమత సంతరించు సం
స్కారమె కారణంబగు సుఖప్రద జీవనశైలి కెప్పుడున్
తారణము దాటించు సాధనము
కం:ఊరక రుచి కై తినగా,
రిప్లయితొలగించండికారము రక్తంపు పోటు కడు హెచ్చగు నీ
యారోగ్యము చెడు, తక్కువ
కారమె సుఖజీవనహితకారణ మగులే”
ఉ:కోరగ నేల రూపముల? కూర్చగ వానిని ధ్యాన మందు ని
రిప్లయితొలగించండిస్సారపు పాట్లవేల? కడు శాంతి నొసంగెడు నక్షరమ్మె ఓం
కారము, బ్రహ్మతత్త్వ మది కన్నుల మూసి స్మరించుచున్న నోం
కారమె కారణం బగు సుఖప్రదజీవనశైలి కెప్పుడున్”
(ఓ మి త్యేకాక్షరం బ్రహ్మ అని ఉపనిషద్వాక్యం.ఓంకార స్మరణ అన్ని రూపాల ధ్యానం కంటే ఉత్తమం.)
కోరిక లన్నియు దీర్చు చు
రిప్లయితొలగించండిధీరత తో సాయ పడుచు దివ్యాత్ము లు నై
నేరుపు నను జూపెడు మమ
కార మె సుఖ వ న హితకారమగు లే
మూరినచోఁ బ్రభువుల యప
రిప్లయితొలగించండికారము సుఖ జీవన లయ కారణ మగులే
వారని పాలక జన సహ
కారమె సుఖ జీవన హిత కారణ మగులే
నీరము నిండుగాఁ దనరు నిండు ఘటమ్ము తొనంక దయ్య గం
భీరము వార్థి మధ్యమము భీషణ రావ విహీన మౌను సం
సారము నందు భాసిలెడు శాంతము నిత్యము వీడఁగా నహం
కారమె కారణం బగు సుఖప్రద జీవన శైలి కెప్పుడున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
తీరగు వర్తన తోడను
భారముగా తలచకుండ భార్యాభర్తల్
పేరిమి పంచుకొనుచు సహ
కారమె సుఖజీవన హితకారణ మగులే.
ధారుణి మెచ్చగన్ నడచి ధర్మము తప్పక శాంతిమార్గమున్
రిప్లయితొలగించండిగోరుచు నెల్లవారలకు గూర్మిని బంచుచు నాత్మశుద్ధితో
మూరుచు నిచ్చలున్ మదిని ముచ్చట నింపెడి సజ్జనత్వ సం
స్కారమె కారణంబగు సుఖప్రద జీవనశైలి కెప్పుడున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి