24-2-2026 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా”(లేదా...)“పాడ్యమి పోయె పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా”
కందంకడ్యము నేనెంచ, సతియెయోడ్యాణనమెంచెఁ దానె. ,నూఢి దినమ్మీమౌఢ్యము దాటిన పిదపన్బాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా!ఉత్పలమాలకడ్యమునమ్మి నీ ఋణము కచ్చితమిచ్చెదనంచు నమ్మగన్గుడ్యముకట్టినట్టి పలుకుల్ తగ చెప్పితివయ్య! మీదటన్మౌఢ్యమి నాడు పాడ్యమికి మార్చితివయ్య! మరింత వేచితిన్. ,పాడ్యమి పోయె పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా!
వీడ్యము నందించి తెలిపె జాడ్యముతో ములుగు చున్న సధ్యంచునితో రేడ్య వివాహము వచ్చెడి పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా.కుడ్యము దాపునున్న నొక కోవెల కేగగ నర్చకుండటన్ జాడ్యము సోకినట్టి నను సాదరమందున స్వాగతించుచున్ మౌఢ్యము వచ్చె యందుననె మంచిము హూర్తము లెక్కడుండె నాపాడ్యమి పోయె, పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా.
పాడ్యమియన పల్కకిటుల"పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా”పాడ్యమి ప్రధమ తిథిగదా పాడ్యమివెంబడి విదియయె పంచమి యెటులౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వీడ్యముఁ దెచ్చిన రోజునుకుడ్యముపై వ్రాసి యుంటి, కూడిన పిదపన్జాడ్యపు దినములు నాలుగు పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖాజాడ్యము తగ్గిపోయినను జాప్యము నెంచగ నాల్గు రోజులేవీడ్యముఁ దెచ్చియిచ్చితిని విందుకు పోయిన తద్దినంబునన్గుడ్యము పై లిఖించితిని గొంచెముగా తిథులన్ గణించగాపాడ్యమి పోయె పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా
పాడ్యమినాటికిత్తునని పైకమునప్పుగ గొంటివీవు నీజాడ్యము మాపుచేయుటకు, జాలము సేయుట పాడియౌనొకోకుడ్యమువోలె మారితివి కూడదు నీవిటు మౌనమూనగన్పాడ్యమి పోయె పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా!
పాడ్యమి గడువుగ నిచ్చితిజాడ్యమునకు మందుకొరకు క్షత్త్రము నీకున్పాడ్యమి గతించె గడువికపాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా
సమస్య : “పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా”జాడ్యముచే స్రొక్కితివా ?కుడ్యమునకు తగిలి మెదడు కుంటుబడినదా ?మౌడ్యపు పలుకా ?, ఎట్టులపాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా ?
(మిత్రుడు తన భార్య పాడ్యమి తరువాత వస్తుందని తెలుపుట కం॥లో, వచ్చిన తరువాత ఆలస్యానికి కారణము తెలుపుట ఉ॥ లో, పంచమి పేరండి)కం॥ జాడ్యము లగునమ్మకములుఁ గుడ్యము వలె గట్టివి గద కూడదు చనఁగన్బాడ్యమి ముందని తెలిపిరొపాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖాఉ॥ కుడ్యము వోలె నమ్మకము కూడ ధరాతలమందు గట్టిదేజాడ్యమటంచుఁ దెల్సినను సర్యులు భీతిని దాటరెప్పుడున్బాడ్యమి ముందు పుట్టినిలు భావ్యము కాదని వీడ నందురేపాడ్యమి పోయె పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా
ఆఢ్యా కా దీ పంచమి కుడ్య మొకటి శేష ముండెఁ గ్రొత్తగ నింకన్ రాడ్యమలం బిటకు బహుళపాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా ఈడ్యపు బుద్ధి యున్న యెడ నిప్పుడె యప్పును దీర్పు s మయ్య యీజాడ్యము నీకు నేలనయ చైత్రపుఁబాడ్యమి నిత్తు నంటివే విడ్యము తోడఁ దప్ప కని బీరపుఁ బల్కులు పల్కి యుంటివే పాడ్యమి పోయెఁ బిమ్మటను బంచమి వచ్చెను నమ్ము మిత్రమా
మౌడ్య ము గా పలుక వలదు పాడ్యమి తరువాత వచ్చు పంచమి యె స ఖా యా డ్యు లు సూచించిన విధముపాడ్యమి మొ ద లై ద వది గ పంచమి యె గదా!
కందం
రిప్లయితొలగించండికడ్యము నేనెంచ, సతియె
యోడ్యాణనమెంచెఁ దానె. ,నూఢి దినమ్మీ
మౌఢ్యము దాటిన పిదపన్
బాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా!
ఉత్పలమాల
కడ్యమునమ్మి నీ ఋణము కచ్చితమిచ్చెదనంచు నమ్మగన్
గుడ్యముకట్టినట్టి పలుకుల్ తగ చెప్పితివయ్య! మీదటన్
మౌఢ్యమి నాడు పాడ్యమికి మార్చితివయ్య! మరింత వేచితిన్. ,
పాడ్యమి పోయె పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా!
వీడ్యము నందించి తెలిపె
రిప్లయితొలగించండిజాడ్యముతో ములుగు చున్న సధ్యంచునితో
రేడ్య వివాహము వచ్చెడి
పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా.
కుడ్యము దాపునున్న నొక కోవెల కేగగ నర్చకుండటన్
జాడ్యము సోకినట్టి నను సాదరమందున స్వాగతించుచున్
మౌఢ్యము వచ్చె యందుననె మంచిము హూర్తము లెక్కడుండె నా
పాడ్యమి పోయె, పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా.
పాడ్యమియన పల్కకిటుల
రిప్లయితొలగించండి"పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా”
పాడ్యమి ప్రధమ తిథిగదా
పాడ్యమివెంబడి విదియయె పంచమి యెటులౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివీడ్యముఁ దెచ్చిన రోజును
రిప్లయితొలగించండికుడ్యముపై వ్రాసి యుంటి, కూడిన పిదపన్
జాడ్యపు దినములు నాలుగు
పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా
జాడ్యము తగ్గిపోయినను జాప్యము నెంచగ నాల్గు రోజులే
వీడ్యముఁ దెచ్చియిచ్చితిని విందుకు పోయిన తద్దినంబునన్
గుడ్యము పై లిఖించితిని గొంచెముగా తిథులన్ గణించగా
పాడ్యమి పోయె పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా
పాడ్యమినాటికిత్తునని పైకమునప్పుగ గొంటివీవు నీ
రిప్లయితొలగించండిజాడ్యము మాపుచేయుటకు, జాలము సేయుట పాడియౌనొకో
కుడ్యమువోలె మారితివి కూడదు నీవిటు మౌనమూనగన్
పాడ్యమి పోయె పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా!
పాడ్యమి గడువుగ నిచ్చితి
రిప్లయితొలగించండిజాడ్యమునకు మందుకొరకు క్షత్త్రము నీకున్
పాడ్యమి గతించె గడువిక
పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా
సమస్య : “పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా”
రిప్లయితొలగించండిజాడ్యముచే స్రొక్కితివా ?
కుడ్యమునకు తగిలి మెదడు కుంటుబడినదా ?
మౌడ్యపు పలుకా ?, ఎట్టుల
పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా ?
(మిత్రుడు తన భార్య పాడ్యమి తరువాత వస్తుందని తెలుపుట కం॥లో, వచ్చిన తరువాత ఆలస్యానికి కారణము తెలుపుట ఉ॥ లో, పంచమి పేరండి)
రిప్లయితొలగించండికం॥ జాడ్యము లగునమ్మకములుఁ
గుడ్యము వలె గట్టివి గద కూడదు చనఁగన్
బాడ్యమి ముందని తెలిపిరొ
పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా
ఉ॥ కుడ్యము వోలె నమ్మకము కూడ ధరాతలమందు గట్టిదే
జాడ్యమటంచుఁ దెల్సినను సర్యులు భీతిని దాటరెప్పుడున్
బాడ్యమి ముందు పుట్టినిలు భావ్యము కాదని వీడ నందురే
పాడ్యమి పోయె పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా
ఆఢ్యా కా దీ పంచమి
రిప్లయితొలగించండికుడ్య మొకటి శేష ముండెఁ గ్రొత్తగ నింకన్
రాడ్యమలం బిటకు బహుళ
పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా
ఈడ్యపు బుద్ధి యున్న యెడ నిప్పుడె యప్పును దీర్పు s మయ్య యీ
జాడ్యము నీకు నేలనయ చైత్రపుఁబాడ్యమి నిత్తు నంటివే
విడ్యము తోడఁ దప్ప కని బీరపుఁ బల్కులు పల్కి యుంటివే
పాడ్యమి పోయెఁ బిమ్మటను బంచమి వచ్చెను నమ్ము మిత్రమా
మౌడ్య ము గా పలుక వలదు
రిప్లయితొలగించండిపాడ్యమి తరువాత వచ్చు పంచమి యె స ఖా
యా డ్యు లు సూచించిన విధము
పాడ్యమి మొ ద లై ద వది గ పంచమి యె గదా!