24, ఫిబ్రవరి 2026, మంగళవారం

సమస్య - 5391

25-2-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల”
(లేదా...)
“వ్రతముం జేయక వాయకనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్”

9 కామెంట్‌లు:

  1. తేటగీతి
    వలువలొసఁగి రక్షింపఁగఁ గొలువ సతము
    నన్నకేకాదశియె ముఖ్యమనఁగఁ గృష్ణ
    ప్రీతి ముత్తైదువులఁ బిల్చి, వీడగలఁదె
    వ్రతముఁ జేయక? యిడె నాతి వాయనముల

    మత్తేభవిక్రీడితము
    వెతలంజిక్కఁగ వల్వలిచ్చి వడిగన్ వేంచేసి శ్రీకృష్ణుడున్
    సతియా ద్రౌపదిఁ గావఁగన్, హరికినుత్సాహంబు గల్గించునన్
    మతితోఁ బిల్చియుఁ దా సువాసినుల సంభావింప, వారించునే
    వ్రతముం జేయక? వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్

    రిప్లయితొలగించండి
  2. అన్య దేశము నకుపోయి యదురుగడగ ;
    చెమ్మ చెక్కల నాడిన చిన్ననాటి
    సకియ వచ్చిన కతమున చక్కటి నెరి
    వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల

    రిప్లయితొలగించండి
  3. తాను బుణ్యకవ్రతమని దానమొసగె
    నల్లనయ్యను వైదేహి నారదునికి
    పుణ్యమును గోరి నేడిట పుణ్యకమను
    వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల

    వ్రతదీక్షా నియమంబులెర్గి విధిగా బాటింప భావించుచున్
    బతినే దానము సేసె నారదునికిన్ వైదర్భి సంప్రీతినిన్
    బతిలేకున్నను పూజ సల్పునెపుడున్ బద్మాక్షి తాఁ బుణ్యక
    వ్రతముం జేయక వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తేటగీతి రెందవ పాదము లో 'వైదర్భి ' గా చదువ గోరుచున్నాను

      తొలగించండి

  4. పండితులు చెప్పిరంచును వ్రతము నొకటి
    భర్త క్షేమంబు గోరుచు పడతి చేయ
    బూనినంతనె పెనిమిటి మూర్ఛబోవ
    వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల.


    పతిక్షేమంబును గోరి చేయదలచెన్ వారాహికిన్ బూజనా
    సతి శ్రావణమాసమందు విహితుల్ సద్బాంధవుల్ చూడగా
    వ్రతమారంభము జేయువేళ పతికిన్ స్వాస్థ్యంబదే పాడవన్
    వ్రతముం జేయక వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్.

    రిప్లయితొలగించండి
  5. చెలిమి మరువ క వచ్చిన కలికి గాంచి
    పడతి స్వాగ తమ్మును బ ల్కి పరవశించి
    వ్రతము జేయక యి డె వాయన ముల
    చూపి ప్రేమాద రమ్ముల సొంపు మీర

    రిప్లయితొలగించండి
  6. తే.గీ:శుక్రవారము నాడెంతొ శుచి వహించి
    శ్రద్ధగా బూజ జేసియు శాస్త్రవేత్త రీతి
    పుణ్య మగు నంచు లోభపు బుద్ధి గల్గు
    వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల”
    (లోభబుద్ధితో వ్రతం చెయ్యక సక్రమంగా గా చేసింది. )

    రిప్లయితొలగించండి
  7. వంత యేల తప్పున్నదె సుంత యేని
    యక్క వ్రత మొనర్పంగ నొక్కొక్కరికిని
    సాయ మొనరింపఁ దలఁచి తత్క్షణము దాను
    ‌వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల


    ఇతరాలోచన లెల్ల మాని మనమం దింతేనియున్ గౌరవా
    న్విత సద్భావము నూను మమ్మ యిఁక విద్వేషంబు త్యాజ్యం బగున్
    వ్రతముల్ నిష్ఠ నొనర్చి పెక్కిఁటిని సద్భక్తిన్ యథోక్తమ్ము కు
    వ్రతముం జేయక వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్

    రిప్లయితొలగించండి

  8. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వ్రతమునకు సకలము సిద్ధపరచె పడతి
    పిలిచి ముత్తైదులను తాను వేడ్క జరుప
    భర్త రాలేక నతి ముఖ్య పనుల వల్ల
    వ్రతము చేయక యిడె నాతి వాయనముల.

    రిప్లయితొలగించండి