23, ఫిబ్రవరి 2026, సోమవారం

సమస్య - 5390

24-2-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా”
(లేదా...)
“పాడ్యమి పోయె పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా”

11 కామెంట్‌లు:

  1. కందం
    కడ్యము నేనెంచ, సతియె
    యోడ్యాణనమెంచెఁ దానె. ,నూఢి దినమ్మీ
    మౌఢ్యము దాటిన పిదపన్
    బాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా!

    ఉత్పలమాల
    కడ్యమునమ్మి నీ ఋణము కచ్చితమిచ్చెదనంచు నమ్మగన్
    గుడ్యముకట్టినట్టి పలుకుల్ తగ చెప్పితివయ్య! మీదటన్
    మౌఢ్యమి నాడు పాడ్యమికి మార్చితివయ్య! మరింత వేచితిన్. ,
    పాడ్యమి పోయె పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి
  2. వీడ్యము నందించి తెలిపె
    జాడ్యముతో ములుగు చున్న సధ్యంచునితో
    రేడ్య వివాహము వచ్చెడి
    పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా.


    కుడ్యము దాపునున్న నొక కోవెల కేగగ నర్చకుండటన్
    జాడ్యము సోకినట్టి నను సాదరమందున స్వాగతించుచున్
    మౌఢ్యము వచ్చె యందుననె మంచిము హూర్తము లెక్కడుండె నా
    పాడ్యమి పోయె, పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా.

    రిప్లయితొలగించండి
  3. పాడ్యమియన పల్కకిటుల
    "పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా”
    పాడ్యమి ప్రధమ తిథిగదా
    పాడ్యమివెంబడి విదియయె పంచమి యెటులౌ

    రిప్లయితొలగించండి
  4. వీడ్యముఁ దెచ్చిన రోజును
    కుడ్యముపై వ్రాసి యుంటి, కూడిన పిదపన్
    జాడ్యపు దినములు నాలుగు
    పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా

    జాడ్యము తగ్గిపోయినను జాప్యము నెంచగ నాల్గు రోజులే
    వీడ్యముఁ దెచ్చియిచ్చితిని విందుకు పోయిన తద్దినంబునన్
    గుడ్యము పై లిఖించితిని గొంచెముగా తిథులన్ గణించగా
    పాడ్యమి పోయె పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా

    రిప్లయితొలగించండి
  5. పాడ్యమినాటికిత్తునని పైకమునప్పుగ గొంటివీవు నీ
    జాడ్యము మాపుచేయుటకు, జాలము సేయుట పాడియౌనొకో
    కుడ్యమువోలె మారితివి కూడదు నీవిటు మౌనమూనగన్
    పాడ్యమి పోయె పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి
  6. పాడ్యమి గడువుగ నిచ్చితి
    జాడ్యమునకు మందుకొరకు క్షత్త్రము నీకున్
    పాడ్యమి గతించె గడువిక
    పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా

    రిప్లయితొలగించండి
  7. సమస్య : “పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా”

    జాడ్యముచే స్రొక్కితివా ?
    కుడ్యమునకు తగిలి మెదడు కుంటుబడినదా ?
    మౌడ్యపు పలుకా ?, ఎట్టుల
    పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా ?

    రిప్లయితొలగించండి
  8. (మిత్రుడు తన భార్య పాడ్యమి తరువాత వస్తుందని తెలుపుట కం॥లో, వచ్చిన తరువాత ఆలస్యానికి కారణము తెలుపుట ఉ॥ లో, పంచమి పేరండి)

    కం॥ జాడ్యము లగునమ్మకములుఁ
    గుడ్యము వలె గట్టివి గద కూడదు చనఁగన్
    బాడ్యమి ముందని తెలిపిరొ
    పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా

    ఉ॥ కుడ్యము వోలె నమ్మకము కూడ ధరాతలమందు గట్టిదే
    జాడ్యమటంచుఁ దెల్సినను సర్యులు భీతిని దాటరెప్పుడున్
    బాడ్యమి ముందు పుట్టినిలు భావ్యము కాదని వీడ నందురే
    పాడ్యమి పోయె పిమ్మటను పంచమి వచ్చెను నమ్ము మిత్రమా

    రిప్లయితొలగించండి
  9. ఆఢ్యా కా దీ పంచమి
    కుడ్య మొకటి శేష ముండెఁ గ్రొత్తగ నింకన్
    రాడ్యమలం బిటకు బహుళ
    పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా


    ఈడ్యపు బుద్ధి యున్న యెడ నిప్పుడె యప్పును దీర్పు s మయ్య యీ
    జాడ్యము నీకు నేలనయ చైత్రపుఁబాడ్యమి నిత్తు నంటివే
    విడ్యము తోడఁ దప్ప కని బీరపుఁ బల్కులు పల్కి యుంటివే
    పాడ్యమి పోయెఁ బిమ్మటను బంచమి వచ్చెను నమ్ము మిత్రమా

    రిప్లయితొలగించండి
  10. మౌడ్య ము గా పలుక వలదు
    పాడ్యమి తరువాత వచ్చు పంచమి యె స ఖా
    యా డ్యు లు సూచించిన విధము
    పాడ్యమి మొ ద లై ద వది గ పంచమి యె గదా!

    రిప్లయితొలగించండి