26, మార్చి 2026, గురువారం

సమస్య - 5420

27-3-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామ వివాహముఁ గనంగ రావణుఁ డేఁగెన్”
(లేదా...)
“సీతారాముల పెండ్లిఁ జూడఁ జనుదెంచెన్ రావణుం డొయ్యనన్”

12 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      స్వామిని రామునిగ, రమను
      కోమలి జానకి యనఁగ వికుంఠము దీర్చన్
      మేముంటి మని 'జయుఁడనన్'
      రామ వివాహముఁ గనంగ 'రావణుఁ' డేఁగెన్!

      శార్దూలవిక్రీడితము
      ప్రాతఃకాలమునందు విష్ణువును శ్రీరాముండనన్ లక్ష్మినిన్
      సీతాదేవిగ నా వికుంఠపురినిన్ జేయంగ కల్యాణమున్
      బ్రీతిన్ గాంచ 'జయుండనన్' మురిసి యుద్వేగంబునుప్పొంగగన్
      సీతారాముల పెండ్లిఁ జూడఁ జనుదెంచెన్ 'రావణుం' డొయ్యనన్!

      తొలగించండి
  2. గోముగ లోకులు వెడలిరి
    రామ వివాహముఁ గనంగ ; రావణుం డేఁగెన్
    తామసమున లంకాపురి
    భామిని జానకి తనకిక బడయని కతనన్

    రిప్లయితొలగించండి

  3. హే మూర్ఖ వాగ బోకుము
    రామాయణ మెరుగ వేమొ రావణు డన్నన్
    రామునకు శత్రు వెప్పుడు
    రామ వివాహముఁ గనంగ రావణుం డేఁగెన్?


    ప్రీతిన్ నాటక మందు రావణునిగా వేషంబునే వేయుచున్
    ఖ్యాతిన్ బొందిన నర్తకుండనుచు నాహ్వానింపగా భక్తులే
    నాతిన్ జేగొని రాగ గాంచి జనులానందమ్ము తో పల్కిరే
    సీతారాముల పెండ్లిఁ జూడఁ జనుదెంచెన్ రావణుం డొయ్యనన్.

    రిప్లయితొలగించండి
  4. భూమిపతులెల్లరుచనిరి
    *“రామ వివాహముఁ గనంగ: రావణుడేఁగెన్”*
    భామనుచేపట్టదలచి
    సామర్థ్యమ్మదియులేక చతికిలబడియెన్

    రిప్లయితొలగించండి
  5. ఏమని వచియింతును శ్రీ
    రామనవమినాడభినవ రావణుడనగా
    కాముకనేత గుడికరిగె
    రామ వివాహముఁ గనంగ రావణుఁ డేఁగెన్

    త్రేతాకాలపు రావణుండు సరళిన్ దేవాంతకుండాతడే
    భూతాలే భయమొందురీతి నతిగా మోసాలు గావించుచున్
    నేతై చేగొనివచ్చె రామనవమిన్ నీచాత్ముడే దుస్తులన్
    సీతారాముల పెండ్లిఁ జూడఁ జనుదెంచెన్ రావణుం డొయ్యనన్

    రిప్లయితొలగించండి
  6. క్రమాలంకారమండి కం॥ శా॥ రెండు

    కం॥ ప్రేమగ భద్రాచలమున
    రామ నవమిని జరుగునఁట, ప్రతినను గనుచున్
    భూమిజఁ జెర పట్టెదనని
    రామ వివాహముఁ గనంగ, రావణుఁ డేఁగెన్

    శా॥ భ్రాతిన్ వీడక నూఢి వైభవముగా భద్రాద్రిలోఁ జేయరే
    ప్రీతిన్ వర్షము వర్షమెవ్వరిదయా, భిక్షార్థి రూపంబునన్
    నీతిన్ వీడుచు జానకిన్ జెరగొనన్ నీచుండు దుర్భుద్ధితో
    సీతా రాముల పెండ్లి జూడ, జనుదెంచెన్ రావణుం డొయ్యనన్

    భ్రాతి ప్రేమ ప్రీతి సంతోషము ఊఢి పెండ్లి
    శ్రీ శంకరయ్య గారి సూచనల మేరకు సవరించిన పద్యాలండి.

    రిప్లయితొలగించండి
  7. గోముగ లాలించు సతము
    భామామణి సోదరి దశ వక్త్రుఁడు వెసఁ దా
    నేమఱక శూర్పనఖ యా
    రామ వివాహముఁ గనంగ రావణుఁ డేఁగెన్

    [రామ వివాహము = రామ యొక్క వివాహము, రామ= రమించు స్త్రీ]


    పాతివ్రత్యము నందు మిన్న సుమ విశ్వంబందు నిక్కమ్ముగా
    భీతిల్లుం గడు భర్త యన్న మదిలో భేదిల్ల దెన్నండనున్
    మాతా చూచెద నంటివే చన వహో మందోదరీ నా ననెన్
    సీతారాముల పెండ్లిఁ జూడఁ, జనుదెంచెన్ రావణుం డొయ్యనన్

    [చూడను+చనుదెంచెన్ = చూడఁ జనుదెంచెన్]

    రిప్లయితొలగించండి
  8. కామారి ధనువు విరచిన
    రాముని బెండ్లాడె సీత రంజిల జగముల్
    తామసమున మదినొల్లక
    రామ వివాహముఁ గనంగ, రావణుఁ డేఁగెన్

    సీతాదేవి స్వయంవరమ్మునకు వచ్చెన్ రాఘవుండంతటన్
    చేతన్బూని ధనుస్సు ఫెళ్ళుమని విచ్ఛిన్నంబు గావింపగన్
    చేతన్బూనగలేక భంగపడఁగన్ సిగ్గిల్లి, తా లంకకున్
    సీతారాముల పెండ్లిఁ జూడఁ, జనుదెంచెన్ రావణుం డొయ్యనన్

    రిప్లయితొలగించండి
  9. -
    శ్రీమతి ముర్మూ వెడలెన్
    రామ వివాహముఁ గనంగ ; రావణుఁ డే కెం
    దామరపు రంగులమరు శు
    ధామయపు పొదికిలి గాంచి యబ్బుర పడెగా




    రిప్లయితొలగించండి
  10. ఏమేమో వచియించుచు
    పామరు భంగగ నొక పరి పలుకుచు నిలలో
    తామసు డై యనియె నిటుల
    " రామ వివాహ ము గనంగ రావణు డేగెన్

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    భూమీశులంత వచ్చిరి
    రామ వివాహముఁ గనంగ; రావణుడేగెన్
    భూమిజనున్ జేపట్టగ
    సామర్ధ్యము సన్నగిల్లి సంకట పడియెన్.

    రిప్లయితొలగించండి