27-3-2026 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రామ వివాహముఁ గనంగ రావణుఁ డేఁగెన్”(లేదా...)“సీతారాముల పెండ్లిఁ జూడఁ జనుదెంచెన్ రావణుం డొయ్యనన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంస్వామిని రామునిగ, రమనుకోమలి జానకి యనఁగ వికుంఠము దీర్చన్మేముంటి మని 'జయుఁడనన్'రామ వివాహముఁ గనంగ 'రావణుఁ' డేఁగెన్! శార్దూలవిక్రీడితముప్రాతఃకాలమునందు విష్ణువును శ్రీరాముండనన్ లక్ష్మినిన్సీతాదేవిగ నా వికుంఠపురినిన్ జేయంగ కల్యాణమున్బ్రీతిన్ గాంచ 'జయుండనన్' మురిసి యుద్వేగంబునుప్పొంగగన్సీతారాముల పెండ్లిఁ జూడఁ జనుదెంచెన్ 'రావణుం' డొయ్యనన్!
గోముగ లోకులు వెడలిరిరామ వివాహముఁ గనంగ ; రావణుం డేఁగెన్తామసమున లంకాపురి భామిని జానకి తనకిక బడయని కతనన్
హే మూర్ఖ వాగ బోకుము రామాయణ మెరుగ వేమొ రావణు డన్నన్ రామునకు శత్రు వెప్పుడు రామ వివాహముఁ గనంగ రావణుం డేఁగెన్?ప్రీతిన్ నాటక మందు రావణునిగా వేషంబునే వేయుచున్ ఖ్యాతిన్ బొందిన నర్తకుండనుచు నాహ్వానింపగా భక్తులే నాతిన్ జేగొని రాగ గాంచి జనులానందమ్ము తో పల్కిరే సీతారాముల పెండ్లిఁ జూడఁ జనుదెంచెన్ రావణుం డొయ్యనన్.
భూమిపతులెల్లరుచనిరి*“రామ వివాహముఁ గనంగ: రావణుడేఁగెన్”*భామనుచేపట్టదలచిసామర్థ్యమ్మదియులేక చతికిలబడియెన్
ఏమని వచియింతును శ్రీరామనవమినాడభినవ రావణుడనగాకాముకనేత గుడికరిగెరామ వివాహముఁ గనంగ రావణుఁ డేఁగెన్త్రేతాకాలపు రావణుండు సరళిన్ దేవాంతకుండాతడేభూతాలే భయమొందురీతి నతిగా మోసాలు గావించుచున్నేతై చేగొనివచ్చె రామనవమిన్ నీచాత్ముడే దుస్తులన్సీతారాముల పెండ్లిఁ జూడఁ జనుదెంచెన్ రావణుం డొయ్యనన్
క్రమాలంకారమండి కం॥ శా॥ రెండుకం॥ ప్రేమగ భద్రాచలమునరామ నవమిని జరుగునఁట, ప్రతినను గనుచున్భూమిజఁ జెర పట్టెదననిరామ వివాహముఁ గనంగ, రావణుఁ డేఁగెన్శా॥ భ్రాతిన్ వీడక నూఢి వైభవముగా భద్రాద్రిలోఁ జేయరేప్రీతిన్ వర్షము వర్షమెవ్వరిదయా, భిక్షార్థి రూపంబునన్నీతిన్ వీడుచు జానకిన్ జెరగొనన్ నీచుండు దుర్భుద్ధితో సీతా రాముల పెండ్లి జూడ, జనుదెంచెన్ రావణుం డొయ్యనన్భ్రాతి ప్రేమ ప్రీతి సంతోషము ఊఢి పెండ్లిశ్రీ శంకరయ్య గారి సూచనల మేరకు సవరించిన పద్యాలండి.
గోముగ లాలించు సతము భామామణి సోదరి దశ వక్త్రుఁడు వెసఁ దా నేమఱక శూర్పనఖ యారామ వివాహముఁ గనంగ రావణుఁ డేఁగెన్ [రామ వివాహము = రామ యొక్క వివాహము, రామ= రమించు స్త్రీ] పాతివ్రత్యము నందు మిన్న సుమ విశ్వంబందు నిక్కమ్ముగా భీతిల్లుం గడు భర్త యన్న మదిలో భేదిల్ల దెన్నండనున్ మాతా చూచెద నంటివే చన వహో మందోదరీ నా ననెన్ సీతారాముల పెండ్లిఁ జూడఁ, జనుదెంచెన్ రావణుం డొయ్యనన్ [చూడను+చనుదెంచెన్ = చూడఁ జనుదెంచెన్]
కామారి ధనువు విరచినరాముని బెండ్లాడె సీత రంజిల జగముల్తామసమున మదినొల్లకరామ వివాహముఁ గనంగ, రావణుఁ డేఁగెన్సీతాదేవి స్వయంవరమ్మునకు వచ్చెన్ రాఘవుండంతటన్చేతన్బూని ధనుస్సు ఫెళ్ళుమని విచ్ఛిన్నంబు గావింపగన్చేతన్బూనగలేక భంగపడఁగన్ సిగ్గిల్లి, తా లంకకున్సీతారాముల పెండ్లిఁ జూడఁ, జనుదెంచెన్ రావణుం డొయ్యనన్
-శ్రీమతి ముర్మూ వెడలెన్రామ వివాహముఁ గనంగ ; రావణుఁ డే కెందామరపు రంగులమరు శుధామయపు పొదికిలి గాంచి యబ్బుర పడెగా
ఏమేమో వచియించుచు పామరు భంగగ నొక పరి పలుకుచు నిలలో తామసు డై యనియె నిటుల " రామ వివాహ ము గనంగ రావణు డేగెన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.భూమీశులంత వచ్చిరిరామ వివాహముఁ గనంగ; రావణుడేగెన్భూమిజనున్ జేపట్టగసామర్ధ్యము సన్నగిల్లి సంకట పడియెన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిస్వామిని రామునిగ, రమను
కోమలి జానకి యనఁగ వికుంఠము దీర్చన్
మేముంటి మని 'జయుఁడనన్'
రామ వివాహముఁ గనంగ 'రావణుఁ' డేఁగెన్!
శార్దూలవిక్రీడితము
ప్రాతఃకాలమునందు విష్ణువును శ్రీరాముండనన్ లక్ష్మినిన్
సీతాదేవిగ నా వికుంఠపురినిన్ జేయంగ కల్యాణమున్
బ్రీతిన్ గాంచ 'జయుండనన్' మురిసి యుద్వేగంబునుప్పొంగగన్
సీతారాముల పెండ్లిఁ జూడఁ జనుదెంచెన్ 'రావణుం' డొయ్యనన్!
గోముగ లోకులు వెడలిరి
రిప్లయితొలగించండిరామ వివాహముఁ గనంగ ; రావణుం డేఁగెన్
తామసమున లంకాపురి
భామిని జానకి తనకిక బడయని కతనన్
రిప్లయితొలగించండిహే మూర్ఖ వాగ బోకుము
రామాయణ మెరుగ వేమొ రావణు డన్నన్
రామునకు శత్రు వెప్పుడు
రామ వివాహముఁ గనంగ రావణుం డేఁగెన్?
ప్రీతిన్ నాటక మందు రావణునిగా వేషంబునే వేయుచున్
ఖ్యాతిన్ బొందిన నర్తకుండనుచు నాహ్వానింపగా భక్తులే
నాతిన్ జేగొని రాగ గాంచి జనులానందమ్ము తో పల్కిరే
సీతారాముల పెండ్లిఁ జూడఁ జనుదెంచెన్ రావణుం డొయ్యనన్.
భూమిపతులెల్లరుచనిరి
రిప్లయితొలగించండి*“రామ వివాహముఁ గనంగ: రావణుడేఁగెన్”*
భామనుచేపట్టదలచి
సామర్థ్యమ్మదియులేక చతికిలబడియెన్
ఏమని వచియింతును శ్రీ
రిప్లయితొలగించండిరామనవమినాడభినవ రావణుడనగా
కాముకనేత గుడికరిగె
రామ వివాహముఁ గనంగ రావణుఁ డేఁగెన్
త్రేతాకాలపు రావణుండు సరళిన్ దేవాంతకుండాతడే
భూతాలే భయమొందురీతి నతిగా మోసాలు గావించుచున్
నేతై చేగొనివచ్చె రామనవమిన్ నీచాత్ముడే దుస్తులన్
సీతారాముల పెండ్లిఁ జూడఁ జనుదెంచెన్ రావణుం డొయ్యనన్
క్రమాలంకారమండి కం॥ శా॥ రెండు
రిప్లయితొలగించండికం॥ ప్రేమగ భద్రాచలమున
రామ నవమిని జరుగునఁట, ప్రతినను గనుచున్
భూమిజఁ జెర పట్టెదనని
రామ వివాహముఁ గనంగ, రావణుఁ డేఁగెన్
శా॥ భ్రాతిన్ వీడక నూఢి వైభవముగా భద్రాద్రిలోఁ జేయరే
ప్రీతిన్ వర్షము వర్షమెవ్వరిదయా, భిక్షార్థి రూపంబునన్
నీతిన్ వీడుచు జానకిన్ జెరగొనన్ నీచుండు దుర్భుద్ధితో
సీతా రాముల పెండ్లి జూడ, జనుదెంచెన్ రావణుం డొయ్యనన్
భ్రాతి ప్రేమ ప్రీతి సంతోషము ఊఢి పెండ్లి
శ్రీ శంకరయ్య గారి సూచనల మేరకు సవరించిన పద్యాలండి.
గోముగ లాలించు సతము
రిప్లయితొలగించండిభామామణి సోదరి దశ వక్త్రుఁడు వెసఁ దా
నేమఱక శూర్పనఖ యా
రామ వివాహముఁ గనంగ రావణుఁ డేఁగెన్
[రామ వివాహము = రామ యొక్క వివాహము, రామ= రమించు స్త్రీ]
పాతివ్రత్యము నందు మిన్న సుమ విశ్వంబందు నిక్కమ్ముగా
భీతిల్లుం గడు భర్త యన్న మదిలో భేదిల్ల దెన్నండనున్
మాతా చూచెద నంటివే చన వహో మందోదరీ నా ననెన్
సీతారాముల పెండ్లిఁ జూడఁ, జనుదెంచెన్ రావణుం డొయ్యనన్
[చూడను+చనుదెంచెన్ = చూడఁ జనుదెంచెన్]
కామారి ధనువు విరచిన
రిప్లయితొలగించండిరాముని బెండ్లాడె సీత రంజిల జగముల్
తామసమున మదినొల్లక
రామ వివాహముఁ గనంగ, రావణుఁ డేఁగెన్
సీతాదేవి స్వయంవరమ్మునకు వచ్చెన్ రాఘవుండంతటన్
చేతన్బూని ధనుస్సు ఫెళ్ళుమని విచ్ఛిన్నంబు గావింపగన్
చేతన్బూనగలేక భంగపడఁగన్ సిగ్గిల్లి, తా లంకకున్
సీతారాముల పెండ్లిఁ జూడఁ, జనుదెంచెన్ రావణుం డొయ్యనన్
-
రిప్లయితొలగించండిశ్రీమతి ముర్మూ వెడలెన్
రామ వివాహముఁ గనంగ ; రావణుఁ డే కెం
దామరపు రంగులమరు శు
ధామయపు పొదికిలి గాంచి యబ్బుర పడెగా
ఏమేమో వచియించుచు
రిప్లయితొలగించండిపామరు భంగగ నొక పరి పలుకుచు నిలలో
తామసు డై యనియె నిటుల
" రామ వివాహ ము గనంగ రావణు డేగెన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
భూమీశులంత వచ్చిరి
రామ వివాహముఁ గనంగ; రావణుడేగెన్
భూమిజనున్ జేపట్టగ
సామర్ధ్యము సన్నగిల్లి సంకట పడియెన్.