తే.గీ:తల్లి దండ్రులు కోపమ్ము దాల్చి నంత ప్రేమ లేదని బిడ్డకు విసుగు కలుగు సుంత జ్ఞానమ్ము గలిగిన సుతులు తప్ప తల్లిదండ్రుల నమ్మరు తనయులెల్ల” (తల్లిదండ్రులు కోప్పడ గానే పిల్లలు తమ మీద ప్రేమ లే దనుకుంటారు.కాస్త జ్ఞానం ఉన్న కొడుకు తప్ప అందరు కొడుకులూ ఆ సమయం లో మాత్రం తల్లిదండ్రులని నమ్మరు. )
చం:తనయుల ముందె దంపతులు తన్నుక జచ్చుచు, స్వార్థమూర్తులై మనముల నిండ నీర్ష్య గల మాటల నెల్లర గూర్చి పల్కుచున్ ఘన మగు ధర్మ బోధలను, గాధల జెప్పుచు నున్న సుంతయున్ తనయులు నమ్మరెన్నఁడును దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా! (వాళ్లు తప్పుడు మార్గం లో ఉండి కొడుకులకి ధర్మం చెపితే నమ్ముతారా!)
ఘనమగు విద్యగూర్చక సుఖమ్ముల దూరము చేసి నిత్యమున్ పనులకు పంపి యాయము న వారిత రీతిని ఖర్చు చేయుచున్ అనయము ధూషణమ్ములను స్వాగతమిచ్చి మెలంగు చుండగా తనయులు నమ్మరెన్నడును తల్లినిదండ్రిని న్యాయమేకదా! (మంగళగిరి లో మా ఇంటి దగ్గర ఒక ఫామిలీ ఉండేది. తల్లిదండ్రులు పనిచేయ కుండా పిల్లలిద్దరినీ హోటల్ లో పనికి పంపి వచ్చిన జీతంతో సినిమాలు షికారులని తిరుగుతూ ఉండేవారు)
సుఖములెల్ల విడిచితిమి సుతుల యొక్క
రిప్లయితొలగించండిసేమము కొరకయి యనుచు జెప్పగ , దమ
తల్లిదండ్రుల నమ్మరు తనయులెల్ల ,
యింతగ నుడివి మాకేమియిచ్చిరనుచు
రిప్లయితొలగించండిచదువొకటె చూపు నరులకు సత్పథమని
పుస్తకపు పురుగు వలెను భువిని చెలగ
వలయు నంచు నజశ్రము పలుకు నట్టి
తల్లిదండ్రుల నమ్మరు తనయులెల్ల.
అనిశము నీతి సూత్రముల నాపక చెప్పుచు తల్లి దండ్రులే
వినయము విజ్ఞతన్ విడక పెద్దల మాటల నాలకించుచున్
ఘనునిగ పేరు గాంచగను కాలము వ్యర్థము చేయ వద్దనన్
తనయులు నమ్మరెన్నఁడును దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా.
తల్లి దండ్రుల నమ్మని తనయులనుచు
రిప్లయితొలగించండివెదకిన లభింత్రు కొందరు విశ్వమందు;
వారు కని నదిలో పారవైచిన యెడఁ
దల్లిదండ్రుల నమ్మరు తనయులెల్ల
వినయముతో మెలంగు పలు బిడ్డలు నమ్మరె తల్లిదండ్రులన్?
గనుగొన వచ్చులోకమున కాదనకుందురు వారిమాటలే!
కని నదిలోకి నెట్టిరని కష్టములన్ భరియించు వారలౌ
తనయులు నమ్మరెన్నఁడును దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా
తేటగీతి
రిప్లయితొలగించండికష్టమన్నదెపుడు తమకిష్టమటుల
సంతు సేమమ్మునెంచుచు సాగెదరన
తమను నొప్పింపనొప్పక శ్రమనుదాచ
తల్లిదండ్రుల నమ్మరు తనయులెల్ల!
చంపకమాల
అనయము సంతు సేమమును నార్తిగ నెంచుచు కష్టమందునన్
దనియుచు నిష్టమన్నటుల దాచెదరన్నదెఱింగి, పెద్దలై
యనుభవమైనయున్ నలత హాయిగ నుంటిమటంచుఁ బల్కినన్
దనయులు నమ్మరెన్నఁడును దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా!
పరమ పూజ్యులు కోరరు ప్రతిఫలమ్ము
రిప్లయితొలగించండితమసుఖమ్ముల మరచెడు త్యాగధనులు
జీవితాంతము తనయుల క్షేమమరయు
తల్లిదండ్రుల నమ్మరు తనయులెల్ల
అనిశము కన్నబిడ్డలకు నాదరమొప్పఁగ జేసి సేవలన్
రిప్లయితొలగించండితనువుల సౌఖ్యమున్ మరచి దైన్యమునున్ వెతలన్ భరించుచున్
తనయుల మేలుగోరు తలిదండ్రులు, వారల త్యాగమెంచకన్
తనయులు నమ్మరెన్నఁడును దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా!
చం॥ కనుమయ నేఁడు మోహమునఁ గాంక్షల మత్తున స్వంత సౌఖ్యమే
రిప్లయితొలగించండిమనమునఁ దాల్చి సంతునకు మక్కువఁ దీర్చెడు స్ఫూర్తి తగ్గఁగన్
జనఁగను నామ మాత్రముగ శ్రద్ధను గాంచుచు మూర్ఖ చిత్తులై
తనయులు నమ్మరెన్నడును దల్లినిఁ దండ్రిని న్యాయమేకదా!
(అక్కడక్కడ దురదృష్ట వశాత్తు జరుగుతున్న చింతించదగ్గ విషయమండి)
తే.గీ:తల్లి దండ్రులు కోపమ్ము దాల్చి నంత
రిప్లయితొలగించండిప్రేమ లేదని బిడ్డకు విసుగు కలుగు
సుంత జ్ఞానమ్ము గలిగిన సుతులు తప్ప
తల్లిదండ్రుల నమ్మరు తనయులెల్ల”
(తల్లిదండ్రులు కోప్పడ గానే పిల్లలు తమ మీద ప్రేమ లే దనుకుంటారు.కాస్త జ్ఞానం ఉన్న కొడుకు తప్ప అందరు కొడుకులూ ఆ సమయం లో మాత్రం తల్లిదండ్రులని నమ్మరు. )
చం:తనయుల ముందె దంపతులు తన్నుక జచ్చుచు, స్వార్థమూర్తులై
రిప్లయితొలగించండిమనముల నిండ నీర్ష్య గల మాటల నెల్లర గూర్చి పల్కుచున్
ఘన మగు ధర్మ బోధలను, గాధల జెప్పుచు నున్న సుంతయున్
తనయులు నమ్మరెన్నఁడును దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా!
(వాళ్లు తప్పుడు మార్గం లో ఉండి కొడుకులకి ధర్మం చెపితే నమ్ముతారా!)
కనునకు రెప్పరీతిగను కాచుచు పిల్లల వారి వృద్ధికై
రిప్లయితొలగించండిఅనిషము పాటులన్ పడుచు హాయి నెరుంగక తల్లి దండ్రులా
ధనమును దార వోసెదరు దాచక సుంతయు మూఢ చిత్తులౌ
తనయులు నమ్మరెన్నడును దల్లిని దండ్రిని న్యాయమే కదా
కాల పరిణామ మది యే మొ బేల లగుచు
రిప్లయితొలగించండితల్లి దండ్రుల నమ్మరు తనయులెల్ల
జన్మ నిచ్చిన వారల జగతి యందు
చులకన గ జూచు టే లకో చోద్య ముగను
కాచి రక్షింప సమయమ్ము గాన రాక
రిప్లయితొలగించండివ్యయమునకు నింత యేనియు బాధపడక
యుదరి వృద్ధాశ్రమమ్ముల నుంత్రు గాని
తల్లిదండ్రుల నమ్మరు తనయు లెల్ల
[అమ్మరు]
అనయము విత్త మందు మది యత్యధికమ్ముగఁ గాఁగ లగ్నమే
ధన విషయమ్ము నందుఁ గనఁ దథ్యము నమ్మరు తల్లిదండ్రులన్
వినయము భక్తి గౌరవము వృద్ధి వహింప సతమ్ము కూఁతులుం
దనయులు నమ్మ రెన్నఁడును దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా
[తనయులును+అమ్మరు = తనయులు నమ్మరు]
ఘనమగు విద్యగూర్చక సుఖమ్ముల దూరము చేసి నిత్యమున్
రిప్లయితొలగించండిపనులకు పంపి యాయము న వారిత రీతిని ఖర్చు చేయుచున్
అనయము ధూషణమ్ములను స్వాగతమిచ్చి మెలంగు చుండగా
తనయులు నమ్మరెన్నడును తల్లినిదండ్రిని న్యాయమేకదా!
(మంగళగిరి లో మా ఇంటి దగ్గర ఒక ఫామిలీ ఉండేది. తల్లిదండ్రులు పనిచేయ కుండా పిల్లలిద్దరినీ హోటల్ లో పనికి పంపి వచ్చిన జీతంతో సినిమాలు షికారులని తిరుగుతూ ఉండేవారు)
సమస్య:
రిప్లయితొలగించండితనయులు నమ్మరెన్నఁడును దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా!
చం.మా :
అనయము దల్లితండ్రులకు నార్తిని బాపగఁ జూచుఁ బుత్రికన్
తనయకు నీయ రూప్యమది తప్పని నెంచెడు యన్నదమ్ములున్
మనసు దలంపరే తమ సమంబుగ పెర్గిన యాడబిడ్డలున్
నెనరును జూపి, కోరరుగ నెన్నడు భాగపు యాస్తిపాస్తులన్
దనయులు నమ్మరెన్నఁడును, దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
మాట విననట్టి పిల్లల మాయ బుచ్చ
పట్టి బూచికిచ్చెదనని భయము పెట్ట
మాట వట్టిదని తెలిసి మరొక తడవ
తల్లిదండ్రుల నమ్మరు తనయు లెల్ల.