ఉర్వినందు నిండుగ కీర్తి నొంద , గుప్త దానముం జేయఁ డెన్నఁడు , దాత యయ్యె తిండినిడి భుక్తినెరుగని దీనులకయి ,యశమునొంద కోరుకొనుట యంకమగునె
పేద వారల గుర్తించి పేర్మి తోడ ధనము దాన మొసంగుటె ధర్మ మంచు వ్యసన పరులు కోరిన నేమి యయ్య పాత్ర దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె.బోనము లేని పేదలకు భోజన మందగ జేయ నేమిరా మౌనమువీడనట్టి గుణ మాన్యుడు దాత నటంచు తా నిలన్ దీనుల కెల్ల వేళలను దిక్కుగ నిల్తునటంచు శుష్క వా గ్దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే
దాన ధర్మము లొనరించి వాని తాతతరగని యశము నార్జించె ధరణిపైనపలు విధముల దానమ్ములఁ బరపు రక్తదానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యెవాని పితామహుండు గనవచ్చును గాదె ప్రశంసనీయుడైతానెలకొల్పె గోష్ఠములఁ దద్దయుఁ బేర్మిని గాచె గోవులన్దానము లెన్ని చేసినను దక్షతతోడ మెలంగువాడు గోదానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే
Claude పూరణ :విత్తమిచ్చుట గాదయా వేఁడువారిచిత్తమందలి వేదన చెప్పకుండమెత్తని మాటలే చెప్పి మేలు చేయుదానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె॥
ఉ॥ కానల యందు చిక్కుకొని కాంచక దారులఁ గొందరావిధిన్దీనతఁ గాంచి యాఁకలికి దిక్కును దోఁచక నుండ రోయుచున్మానక వారి జాడఁ గని మన్ననఁ బొందఁగఁ బ్రాణ దాతయైదానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడేరోయు వెదకు (ఈమధ్య చిక్కమగుళూరు అడవులలో జరిగిన సంఘటన ఆధారంగా నండి, 4-5 రోజుల తరువాత ఆమెను కనుక్కున్నారు)
పేదసాదల పాలిటి పెన్నిధివలెకష్టముల నాదుకొను నెప్డు కరుణ జూపిధనముఁగలిగియున్నను గాని తా నపాత్రదానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె
తానొక ధర్మదాత సుపథమ్మును వీడక సంచరించుచున్దీనజనాళి రక్షణమె దీక్షగ బూను దయామయుండునైదానమొసంగు, నన్యుల కుదారత జూపఁడపాత్రమైనచోదానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే
తేటగీతిడేగ తరుమ కపోతము బేగివచ్చిశరణన నభయ మిడి 'శిబి చక్రవర్తి'తానె డేగ పాలైన కతనఁ, 'గొరతగదానముం జేయఁ డెన్నఁడు' !'దాత యయ్యె' !ఉత్పలమాలదీన కపోతమున్ దయను దీరిచి డేగకు తానె మాంసమైమానుగ నిలిచినవాడు శిబి మర్మము దానగుణంబె! యెప్పుడున్దా నభయమ్ము నిచ్చి బలిదానము నైనను చాలనట్లుగన్దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె! లుబ్ధుఁడే?
ప్రాణము కన్నమిన్నగను భావన జేయుచు పేదవారినన్దానము జేయు డబ్బులను దగ్గర దీయుచు వారినెప్పు భూదానము జేయకుండినను దాతగ గీర్తి గడించె లుబ్ధుడేదీనిని పట్టుకొల్పుదురె ధృత్వరి యందున నెవ్వరేనియున్
పేదవారినిన్
శంకరాభరణం గ్రూపు వారు ఇచ్చిన సమస్యలకు నా పూరణలు సహృదయమ్ము తో పరులకు సాయపడుచుకోరకమదిలో నైనను గొప్పదనముపనికిరాని చిన్నచితక వస్తువులను*“దానముం జేయఁ డెన్నఁడు, దాత యయ్యె”*హీనగుణుండుతానయిన హేయపు వర్తనచేతరోయుచున్మానము కూల్చునంచరసి మాటలుహెచ్చుగనాడకెల్లరున్మౌనముపూనియుండ ప్రజ మానసమందున లెక్కచేయడే*“దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే”*డా బల్లూరి ఉమాదేవి
ఆరితేఱెను భూదాన మందు మిగుల సుప్రసిద్ధ కనక దాన శోభితుండు కాని యక్కజముగ నొక్క కన్య నైన దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె దానము సేయఁ గశ్యపుఁడు ధారుణిఁ గొంటయె కాని నేరమే దానము నందుఁ గర్ణుఁ డల తద్ద ప్రసిద్ధి వహించె నింపుగా వానికిఁ దాత యౌట ముని వర్యుఁడు ధాత యభీష్ట మయ్యెనే దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే [ఎన్నఁడును+తాతగ=ఎన్నఁడును దాతగ] ఒక వింత: కశ్యపునకు నర్జునుఁడు మనుమఁడు, ధర్మరాజు మునిమనుమఁడు!
పేద సాదల యెడల తా పెన్ని ధి గను సర్వ వేళల వారికి సాయ పడుచు పాటు పడుచుండు కాని యపా త్ర మైన దాన ముం జేయ డెన్నడు దాత యయ్యె
ఉర్వినందు నిండుగ కీర్తి నొంద , గుప్త
రిప్లయితొలగించండిదానముం జేయఁ డెన్నఁడు , దాత యయ్యె
తిండినిడి భుక్తినెరుగని దీనులకయి ,
యశమునొంద కోరుకొనుట యంకమగునె
రిప్లయితొలగించండిపేద వారల గుర్తించి పేర్మి తోడ
ధనము దాన మొసంగుటె ధర్మ మంచు
వ్యసన పరులు కోరిన నేమి యయ్య పాత్ర
దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె.
బోనము లేని పేదలకు భోజన మందగ జేయ నేమిరా
మౌనమువీడనట్టి గుణ మాన్యుడు దాత నటంచు తా నిలన్
దీనుల కెల్ల వేళలను దిక్కుగ నిల్తునటంచు శుష్క వా
గ్దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే
దాన ధర్మము లొనరించి వాని తాత
రిప్లయితొలగించండితరగని యశము నార్జించె ధరణిపైన
పలు విధముల దానమ్ములఁ బరపు రక్త
దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె
వాని పితామహుండు గనవచ్చును గాదె ప్రశంసనీయుడై
తానెలకొల్పె గోష్ఠములఁ దద్దయుఁ బేర్మిని గాచె గోవులన్
దానము లెన్ని చేసినను దక్షతతోడ మెలంగువాడు గో
దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే
Claude పూరణ :
రిప్లయితొలగించండివిత్తమిచ్చుట గాదయా వేఁడువారి
చిత్తమందలి వేదన చెప్పకుండ
మెత్తని మాటలే చెప్పి మేలు చేయు
దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె॥
ఉ॥ కానల యందు చిక్కుకొని కాంచక దారులఁ గొందరావిధిన్
రిప్లయితొలగించండిదీనతఁ గాంచి యాఁకలికి దిక్కును దోఁచక నుండ రోయుచున్
మానక వారి జాడఁ గని మన్ననఁ బొందఁగఁ బ్రాణ దాతయై
దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే
రోయు వెదకు
(ఈమధ్య చిక్కమగుళూరు అడవులలో జరిగిన సంఘటన ఆధారంగా నండి, 4-5 రోజుల తరువాత ఆమెను కనుక్కున్నారు)
పేదసాదల పాలిటి పెన్నిధివలె
రిప్లయితొలగించండికష్టముల నాదుకొను నెప్డు కరుణ జూపి
ధనముఁగలిగియున్నను గాని తా నపాత్ర
దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె
తానొక ధర్మదాత సుపథమ్మును వీడక సంచరించుచున్
రిప్లయితొలగించండిదీనజనాళి రక్షణమె దీక్షగ బూను దయామయుండునై
దానమొసంగు, నన్యుల కుదారత జూపఁడపాత్రమైనచో
దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే
తేటగీతి
రిప్లయితొలగించండిడేగ తరుమ కపోతము బేగివచ్చి
శరణన నభయ మిడి 'శిబి చక్రవర్తి'
తానె డేగ పాలైన కతనఁ, 'గొరతగ
దానముం జేయఁ డెన్నఁడు' !'దాత యయ్యె' !
ఉత్పలమాల
దీన కపోతమున్ దయను దీరిచి డేగకు తానె మాంసమై
మానుగ నిలిచినవాడు శిబి మర్మము దానగుణంబె! యెప్పుడున్
దా నభయమ్ము నిచ్చి బలిదానము నైనను చాలనట్లుగన్
దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె! లుబ్ధుఁడే?
ప్రాణము కన్నమిన్నగను భావన జేయుచు పేదవారినన్
రిప్లయితొలగించండిదానము జేయు డబ్బులను దగ్గర దీయుచు వారినెప్పు భూ
దానము జేయకుండినను దాతగ గీర్తి గడించె లుబ్ధుడే
దీనిని పట్టుకొల్పుదురె ధృత్వరి యందున నెవ్వరేనియున్
పేదవారినిన్
రిప్లయితొలగించండిశంకరాభరణం గ్రూపు వారు ఇచ్చిన సమస్యలకు నా పూరణలు
రిప్లయితొలగించండిసహృదయమ్ము తో పరులకు సాయపడుచు
కోరకమదిలో నైనను గొప్పదనము
పనికిరాని చిన్నచితక వస్తువులను
*“దానముం జేయఁ డెన్నఁడు, దాత యయ్యె”*
హీనగుణుండుతానయిన హేయపు వర్తనచేతరోయుచున్
మానము కూల్చునంచరసి మాటలుహెచ్చుగనాడకెల్లరున్
మౌనముపూనియుండ ప్రజ మానసమందున లెక్కచేయడే
*“దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే”*
డా బల్లూరి ఉమాదేవి
ఆరితేఱెను భూదాన మందు మిగుల
రిప్లయితొలగించండిసుప్రసిద్ధ కనక దాన శోభితుండు
కాని యక్కజముగ నొక్క కన్య నైన
దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె
దానము సేయఁ గశ్యపుఁడు ధారుణిఁ గొంటయె కాని నేరమే
దానము నందుఁ గర్ణుఁ డల తద్ద ప్రసిద్ధి వహించె నింపుగా
వానికిఁ దాత యౌట ముని వర్యుఁడు ధాత యభీష్ట మయ్యెనే
దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే
[ఎన్నఁడును+తాతగ=ఎన్నఁడును దాతగ]
ఒక వింత: కశ్యపునకు నర్జునుఁడు మనుమఁడు, ధర్మరాజు మునిమనుమఁడు!
పేద సాదల యెడల తా పెన్ని ధి గను
రిప్లయితొలగించండిసర్వ వేళల వారికి సాయ పడుచు
పాటు పడుచుండు కాని యపా త్ర మైన
దాన ముం జేయ డెన్నడు దాత యయ్యె