16, మే 2026, శనివారం

సమస్య - 5469

17-5-2026 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రక్తపానమున్ జేయంగ రమ్ము సకియ”

(లేదా...)

“రక్తముఁ బీల్చఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో”

17 కామెంట్‌లు:

  1. ముంగిటను పాఱుచున్నది మురికి కాల్వ
    మునిసిపాలిటీ మరచెను మురుగుఁ దీయ
    మశకముల కమృతము గాదె మనుజు స్వజము
    రక్తపానమున్ జేయంగ రమ్ము సకియ

    రిప్లయితొలగించండి
  2. రక్తముఁ బీల్చుటన్న మది రంజిలు దోమకు ముర్కి కాల్వలన్
    సక్తముగా వసించి తన జాతిని వర్థిలఁజేయు నిచ్చలున్
    తిక్తము కాదు మానవుని తీయని రక్తము జాగు సేయకన్
    రక్తముఁ బీల్చఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో

    రిప్లయితొలగించండి

  3. పసిడి ఆభరణములను పట్టు చీర
    లెన్నొ తెప్పించి యిచ్చిన నించు కైన
    తృప్తి లేదయ్యె నీకు నతిఘ మదేల
    రక్తపానమున్ జేయంగ రమ్ము సకియ.


    రక్తిని జూపి నీకయి హిరణ్యపు మండము లెన్నొతెస్తి నా
    శక్తికి మించి గాదె యవి చాల వటంచు నమర్ష మేలనో
    యుక్తము కాదటంచు నట యుత్స్మయ మందున కన్ను గీటుచున్
    రక్తముఁ బీల్చఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో.

    రిప్లయితొలగించండి
  4. కావిరంగు ద్రవము గల కలశమొకటి
    జేతబట్టుకు జూపుచు చెలిని బిలచి ,
    "రక్తపానమున్ జేయంగ రమ్ము సకియ"
    యనుటను విని తోడునిడగ నామె వచ్చె

    రిప్లయితొలగించండి
  5. [ ప్రేయసీ ప్రియులైన నల్లుల సంబాషణలో భాగముగా.. ]

    రక్త పాయిగ జన్మించి బ్రతుకునపుడు
    శక్తి మేరకుఁ బీల్చుట సమ్మతమగు
    వ్యక్తు లెవరని పరికించ పాడిగాదు
    రక్తపానమున్ జేయంగ రమ్ము సకియ

    రక్తముఁ బీల్చుచుండునని రక్కసిగా వచియింపలేముగా
    శక్తికొలంది పీల్చి తన సత్తువ చాటును నల్లి శయ్యపై
    వ్యక్తుల మాఱుపాఱు గన వద్దని బల్కును తల్పకీటమే
    రక్తముఁ బీల్చఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో

    రిప్లయితొలగించండి
  6. భీముడు పాంచాలి తో -
    ప్రతిన నెరవేర్చ గా నేను భండ నము న
    దుష్ట దుర్యోధనునివేగ దునిమి వాని
    రక్త పాన మున్ జేయంగ రమ్ము స కి య
    కాంచు మయ్యది దృశ్యమ్ము కన్ను లార

    రిప్లయితొలగించండి
  7. తే.గీ:తెల్ల నగు బాలునిన్ గని ఉల్లసించి
    రక్తమున్ ద్రావ మగ దోమ వ్రాలి నంత
    "రక్తపానమున్ జేయంగ రమ్ము సకియ”
    యనెనొ మగ దోమ యన వ్రాలె నాడు దోమ.
    (దోమలు తెల్ల చర్మం వాళ్లని ఎక్కువ కుడతాయని శాస్త్రజ్ఞులు చెప్పారు. మగ దోమ వాలగానే పిలిచిందా? అన్నట్టు పక్కన ఆడ దోమ చేరింది. )

    రిప్లయితొలగించండి
  8. ఉ॥ యుక్తిగ నార్జనమ్ముఁ గని యోధుని వోలె ధనమ్ముఁ గూర్చుచున్
    శక్తిని మించి కోర్కెలను చక్కగఁ దీర్చిన భార్య మెచ్చకన్
    ద్యక్తముఁ జేసి భర్తనటు తప్పుల నెంచఁగ వ్యంగ్య రీతిగన్
    రక్తముఁ బీల్చఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో

    రిప్లయితొలగించండి
  9. (2)ఉ:రక్తపు రంగు గల్గినను రక్కసునిం బలె త్రాగు భర్త తో
    యుక్తము కాదటంచును హితోక్తుల జెప్పగ భార్య తద్రుచిన్
    సక్తుడు కాన దాను సరసమ్ముగ నా ద్రవమున్ గ్రహించి యా
    రక్తముఁ బీల్చఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో
    (ఈ మధ్యన ఎనర్జీ డ్రింక్ అనే పేరుతో ఒక కొత్త డ్రింక్ వచ్చింది. అది అచ్చం రక్తం లాగా ఎర్రగా ఉంటుంది.అది ఆరోగ్యానికి మంచిది కాదని భార్య చెపుతుంటే అది తాగమని భర్త సరసం గా పిలిచాడు. )

    రిప్లయితొలగించండి
  10. సమస్య : "రక్తపానమున్ జేయంగ రమ్ము సకియ"

    గీ. వెదకి కనుగొంటి నొకయిల్లు విందుకొరకు
    ముసుగుదన్ని సుషుప్తులై మునిగిరెల్ల
    రక్తపానమున్ జేయంగ రమ్ము సకియ
    యంచు మశకమాహ్వానించెననుఁగు సతిని

    రిప్లయితొలగించండి
  11. రక్తుడు రాత్రి వేళ ప్రియురాలు సులోచన తోడ కూడి యా
    సక్తిగ మాటలాడి మొగసాలను దాటుచు నుండ తాను యా
    నక్తము నందె గట్టిగను నల్లులు కుట్టుచు నోటితోడుతన్
    రక్తము బీల్చ బ్రేయసిని రమ్మని పిల్చె బ్రియుండు ప్రేమతో

    రిప్లయితొలగించండి
  12. యుక్తిని పెక్కు మాయలను నున్నతమౌ గతి చేసి, పెంచి యా
    సక్తిని, నిద్రజాలికుడు చక్కగ యిచ్చు ప్రదర్శనమ్ములన్
    శక్తిదయన్ ఘటిల్లు పెను శక్తిని పొందునెపమ్ముతోడుతన్
    రక్తముఁ బీల్చఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో

    రిప్లయితొలగించండి
  13. జాగు సేయంగఁ దగ దింకఁ జంచలాక్షి
    యన్నులన్ మిన్న క్షీరాన్న మున్న దిచట
    పాత్ర నిండుగా వెచ్చగఁ బాయ సాను
    రక్త పానమున్జేయంగ రమ్ము సకియ


    రక్తిని నేఁగి వేట కయి రక్కసుఁ డొక్కఁడు మాంస మందు నా
    సక్తిని సంచరించి వనిఁ జక్కఁగ నొక్కెడఁ గాంచి నంతనే
    శక్తిని వైచి చంపి నర సత్తము నొక్కని నైరృతుండు వే
    రక్తముఁ బీల్వఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు
    1. సమస్య - 5469
      17-5-2026 (ఆదివారం)

      కవిమిత్రులారా,

      ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

      “రక్తపానమున్ జేయంగ రమ్ము సకియ”
      (లేదా...)
      “రక్తముఁ బీల్చఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో”


      తేటగీతి
      ఇంటి దీపమగుచు మాకు నింపుసొంపు
      గూర్చి షట్కర్మలందున గూర్మి జూపి
      యలుగుటేలకో! సతి! నీరమైనను, నను
      రక్త! పానమున్ జేయంగ రమ్ము సకియ!


      ఉత్పలమాల
      రక్తినిఁ జేర నిన్ను ననురక్త! ప్రధానము బాధ్యతంచు నన్
      వ్యక్తిగ దీర్చి నావు, భగవంతుఁడు నిర్దయ నీకు నామమున్
      తిక్తమనంగ గూర్చె! నిదె దివ్యపుతైలము శుద్ధిఁజేసెడున్
      రక్తముఁ, బీల్చఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో

      తొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఒకరి నొకరము ప్రేమించి యున్నతముగ
    పెండ్లియున్ జేసికొంటిమి పెద్దలెదుట
    మొదటి రాతిరి మధువుతో ముందుగ అను
    రక్త పానమున్ జేయంగ రమ్ము సకియ.

    రిప్లయితొలగించండి