25, మే 2026, సోమవారం

సమస్య - 5478

26-5-2026 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్”

(లేదా...)

“పావిత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్”

12 కామెంట్‌లు:


  1. ఆ త్ర్యక్షుని కోవెల పా
    విత్ర్యమ్మని పలుకగ విని వివరిణు డనె పా
    విత్ర్యమ్మన నెరుగక పా
    పావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్.


    ఆ త్ర్యక్షుండకు భక్తుడైన కడు వేశ్యా లోలుడా దేబె పా
    విత్ర్యమ్మందున నుంచు కోవెల ననన్ విద్యా విహీనుండు పా
    విత్ర్యమ్మన్న నదేమిటో యెఱుగకన్ బెండ్లాము తో జెప్పె పా
    విత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్.

    రిప్లయితొలగించండి
  2. ఆత్ర్యక్షుని నమ్మక , స్వా
    తంత్ర్యముగ దలంచ నేడు తనరిన జాలున్
    ఆ త్ర్యం కము లు ; జరుగు ఫా
    పావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్

    రిప్లయితొలగించండి

  3. ఆ త్ర్యక్షుని పూజ కొరకు
    నా త్ర్యక్షుడటంచు వేశ్య యట తన స్తనమే
    యా త్ర్యక్ష రూప మనె, పా
    పావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్.


    ఆ త్ర్యక్షుండకు భక్తుడైన కడు వేశ్యా లోలుడా రోజు నం
    దా త్ర్యక్షార్చన వేళ మీరెనని తానావేదనన్ చెంద గా
    నా త్ర్యక్షుండిదొ నాదు వక్షమని తానాచ్చాదమున్ దీసె, పా
    విత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్.

    రిప్లయితొలగించండి
  4. పిత్ర్యంబైన కలిమి వై
    చిత్ర్యంబనఁ మాయమగును చింతింపంగా
    మైత్ర్యానందములో పా
    విత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్

    పిత్ర్యంబైన సిరుల్ హరింతురు గదా వేశ్యాంగనల్ మేటి వై
    చిత్ర్యంబే మరి బిల్వమంగళునకున్ జింతామణీ నెయ్యమే
    మైత్ర్యానందముఁ గోరివచ్చు జనులన్ మైకంబులో ముంచ పా
    విత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్

    రిప్లయితొలగించండి
  5. శా॥ పాత్ర్యార్హుండుగఁ గాని వాఁడు పెనుచన్ బ్రారబ్ధమై యట్లు ప్రా
    విత్ర్యమ్మున్ భువిఁ గాచకుండఁగ నహో వేగంగ వేశ్యాంగనై
    ధాత్ర్యార్దమ్మగు రీతి భాధఁ గని సద్జ్ఞానమ్ముతో నొప్ప పా
    విత్ర్యమ్ముల్ సుజనాను మోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్

    పాత్ర్య+అర్హుడు ప్రాత్ర్యార్హుడు ధాత్రి+ఆర్దమ్ము+అగు ధాత్ర్యార్దమ్మగు (ఆర్ద్ర సంస్కృతమే కనుక) సత్+జ్ఞానము సద్జ్ఞానము

    (యోగ్యడైనవాడు పెంచకపోవడం చేత పవిత్రతలేని వేశ్యా వృత్తిలో జీవించి భూమియందు (కంట) తడి పెట్టించే బాధలెన్నో పడి మంచి జ్ఞానము పొందిన వేశ్య పలుకులు ఆమోదమే అనే అర్థమండి)

    రిప్లయితొలగించండి
  6. ఆ త్ర్యంబక భక్తుఁడు దై
    వత్ర్యము మదినూన్చి భక్త వరదుఁ గొలువ పా
    విత్ర్యము తన స్తనమనె, పా
    విత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్”

    రిప్లయితొలగించండి
  7. పాత్ర్యము లగునే పలుగులు
    మైత్ర్యపు భావము గణింప మానుమ యిఁక వై
    చిత్ర్యమ్ములు యెట్లగుఁ బా
    విత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్


    గోత్ర్యమ్ముల్ కన సద్గుణమ్ము లయినన్ ఘోరమ్ములౌఁ జేష్టలే
    సూత్ర్యమ్ముల్ వినిపింపఁ బండితుఁ డహో శుష్కోక్తులం జిత్రమే
    యో త్ర్యక్షప్రభు వింటివే నిగమశర్మోన్మాద వాక్యాలి బా
    విత్ర్యమ్ముల్ సుజనానుమోదము లగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్

    రిప్లయితొలగించండి
  8. ఆ త్ర్య o బ క నాధు ని వై
    చిత్ర్య o బు గ గొ ల్చు వే శ్య చిత్తం బలరన్
    ప్ర త్ర్యా రో పించ క పా
    వి త్ర్య మ్ము లు వేశ్య నుడులు విజ్ఞా న నిధుల్

    రిప్లయితొలగించండి
  9. ఆ త్ర్యక్షున్ మదినిల్పి భక్తిగదురన్ హర్షోత్కటంబొప్ప దై
    వత్ర్యమ్మౌ యభిషేకముం జరుప సంభావించఁగా రాజు వై
    చిత్ర్యంబౌవిధి జూపె వేశ్య కుచమున్ చేయంగ లింగార్చ, పా
    విత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్

    రిప్లయితొలగించండి
  10. కంది వారు సెలవులో వున్నారన్నమాట :)

    రిప్లయితొలగించండి
  11. పిత్ర్యమ్మైన నుడుల్ త్యజించి చెడుగై వేశ్యా రతిక్రీడలో
    మైత్ర్యమ్మున్ గొని నిత్యమున్ విటుడు తా మాన్యమ్ములర్పించ వై
    చిత్ర్యమ్మౌ గతి నాపె శౌరి దయతో చెడ్డన్ విసర్జింప, పా
    విత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్

    రిప్లయితొలగించండి