కం:తమ వలె నస్పృశ్యులె యని గమనించని మాదిగ కడు కక్ష నిటులనెన్ మమత వలదు మాలలతో సుమ!మాలయె మృత్యువయ్యె శోకింప జనుల్” (హరిజనులలో కొద్ది కాలం గా మాలలకు మాదిగలకు మధ్య స్పర్థలు ఏర్పడ్డాయి.ఆ సందర్భం గా ఒక మాదిగ వ్యక్తి ఇలా అన్నాడు.)
మ;సమతావాది నటంచు,గ్రాంతి యని మాత్సర్యమ్ములన్ బెంచుచున్ మమతన్ ద్రుంచెడు గేయ కావ్యమును నీమమ్మట్లు గా వ్రాసి సం ఘమునన్ హింసల బెంచినావు కద! యీ చావుల్ శుభం మ్మిచ్చునే సుమమాలా! కృతి మృత్యువయ్యె ప్రజలన్ శోకంబునన్ ముంచుచున్. (సమానత్వం,విప్లవం అంటూ సుమమాల అనే కవయిత్రి వ్రాసిన గేయకావ్యం హింసకి,చావులకి కారణం మైంది. ఆ విషయాన్ని ఒక విమర్శకుడు ఆమెకి చెపుతున్నట్లు. )
కం: గమనించ రాము డొసగిన సుమమాలయె మృత్యువయ్యె, శోకింప జనుల్” తమ వాలి నిహతు డౌటన్ తమ సుగ్రీవుడు గెలిచియు తమ స్మృతి కదలన్. (వాలిసుగ్రీవుల యుద్ధం లో ఇరువురిని గుర్తు పట్టటానికి వీలు గా రాముడు సుగ్రీవునికి పూల మాల వేస్తే అదే వాలి మరణానికి కారణం మైంది. వానరులు తమ సుగ్రీవుడు గెలిచినందుకు సంతోషించినా వాలి కూడా తమ వాడే కనుక కాస్త బాధ పడ్డారు. ఇద్దరూ అన్నదమ్ములే కదా!)
కొమరుని గళముకు చక్కగ
రిప్లయితొలగించండినమరెడు సరమందొక యళి యణగుచు నుండన్
తిమిరమున వేయు చుండగ
సుమమాలయె మృత్యువయ్యె శోకింప జనుల్”
(స్వర్గీయ రాజీవ్ గాంధి హత్యోదంతము)
రిప్లయితొలగించండికం॥
కమరుచు రాజీవునిపై
గమకపు వైరమ్ముబూని కపటత్వముతోన్
తమిళీలమువారొసగిన
సుమమాలయె మృత్యువయ్యె శోకింప జనుల్
(కమరు: రగులు
గమకపు: ఎక్కువ)
సమయింపగ రాజీవుని
రిప్లయితొలగించండితమిళ పులులలో నొకర్తె తాదెచ్చెనుగా
సుమమాల వెంట బాంబును
సుమమాలయె మృత్యువయ్యె శోకింప జనుల్
తమకున్ వేరుగ రాజ్యమన్న తలపుల్ దావాగ్నులై లంకలో
తమిళుల్ బట్టిరి తీవ్రవాద పథమే తత్సేన రాజీవునిన్
సమయింపన్ సుమమాలతో నరగుచున్ సల్పెన్ మహాస్పోటమే
సుమమాలాకృతి మృత్యువయ్యె ప్రజలన్ శోకంబునన్ ముంచుచున్
కం:తమ వలె నస్పృశ్యులె యని
రిప్లయితొలగించండిగమనించని మాదిగ కడు కక్ష నిటులనెన్
మమత వలదు మాలలతో
సుమ!మాలయె మృత్యువయ్యె శోకింప జనుల్”
(హరిజనులలో కొద్ది కాలం గా మాలలకు మాదిగలకు మధ్య స్పర్థలు ఏర్పడ్డాయి.ఆ సందర్భం గా ఒక మాదిగ వ్యక్తి ఇలా అన్నాడు.)
మ॥ తమితో శాంతి వహించ నెల్ల జనులన్ దానంత ప్రార్థించినన్
రిప్లయితొలగించండిసమ యౌచిత్యముఁ గాంచి గాంధి తగు విస్తారమ్ముగా నెల్లెడల్
గమనమ్మొందక మాలవేయుచు నహో గాడ్సే యటుల్ కాల్చఁగన్
సుమమాలాకృతి మృత్యువయ్యె ప్రజలన్ శోకంబునన్ ముంచుచున్
(గాడ్సే గారు గాంధి గారికి నమస్కరించి కాల్పులు జరుపుతాడు కదండి, దాని బదులు మాలవేసి కాల్చినట్టు వ్రాసాను. గాంధి గారు శాంతి అని అందరికీ బోధ చేస్తారు)
మ;సమతావాది నటంచు,గ్రాంతి యని మాత్సర్యమ్ములన్ బెంచుచున్
రిప్లయితొలగించండిమమతన్ ద్రుంచెడు గేయ కావ్యమును నీమమ్మట్లు గా వ్రాసి సం
ఘమునన్ హింసల బెంచినావు కద! యీ చావుల్ శుభం మ్మిచ్చునే
సుమమాలా! కృతి మృత్యువయ్యె ప్రజలన్ శోకంబునన్ ముంచుచున్.
(సమానత్వం,విప్లవం అంటూ సుమమాల అనే కవయిత్రి వ్రాసిన గేయకావ్యం హింసకి,చావులకి కారణం మైంది. ఆ విషయాన్ని ఒక విమర్శకుడు ఆమెకి చెపుతున్నట్లు. )
కం: గమనించ రాము డొసగిన
రిప్లయితొలగించండిసుమమాలయె మృత్యువయ్యె, శోకింప జనుల్”
తమ వాలి నిహతు డౌటన్
తమ సుగ్రీవుడు గెలిచియు తమ స్మృతి కదలన్.
(వాలిసుగ్రీవుల యుద్ధం లో ఇరువురిని గుర్తు పట్టటానికి వీలు గా రాముడు సుగ్రీవునికి పూల మాల వేస్తే అదే వాలి మరణానికి కారణం మైంది. వానరులు తమ సుగ్రీవుడు గెలిచినందుకు సంతోషించినా వాలి కూడా తమ వాడే కనుక కాస్త బాధ పడ్డారు. ఇద్దరూ అన్నదమ్ములే కదా!)
విమతులు కుతంత్ర యుతులై
రిప్లయితొలగించండిసుమ మాలను బాంబు నుంచి చోద్యము గాగన్
ప్రమ దంబున వేయంగా
సుమ మాల యె మృత్యువ య్యె శోకింప. జనుల్
సుమమాలన్ పరిపంథి జేకొనెను విస్ఫోటమ్ము గల్పించ నా
రిప్లయితొలగించండిసుమమాలందుననుంచె బాంబొకటి సంక్షోభమ్ము ధ్యేయమ్ముగా
విమలాత్ముండగు నేతకంఠమునకున్ వేయంగ పూదండనా
సుమమాలాకృతి మృత్యువయ్యె ప్రజలన్ శోకంబునన్ ముంచుచున్
విమల హరిశ్చంద్రునకు వ
రిప్లయితొలగించండినములోఁ గన్యా ద్వయము కనంబడ నేలా
రమణులు కోరుట యాఱడి
సుమ మాలయె మృత్యు వయ్యె శోకింప జనుల్
సమముల్కత్తికి సత్కవీశ్వరు గిరల్ సత్యమ్ము వీక్షింపఁ బా
దమునం దత్తఱిఁ దప్త మానసుఁ డహో తా పెట్టి యాఱింటఁ గ్రు
ద్ధ మతిన్ వేములవాడ భీమ కవి సంధానింపఁగా శాప వా
క్సుమమాలా కృతి మృత్యు వయ్యెఁ బ్రజలన్ శోకంబునన్ ముంచుచున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
సమమౌ రూపము కలిగిన
రుమ పతి, వాలియు నెవరెవరో తెలియదనన్
రుమ పతి యన్నకు వేసిన
సుమ మాలయె మృత్యువయ్యె శోకింప
జనుల్.