7, జూన్ 2026, ఆదివారం

సమస్య - 5491

8-6-2026 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్”

(లేదా...)

“శ్రీపతిఁ గాంచి యైదు పదిఁ జేతురు భక్తులు శాంతచిత్తులై”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

23 కామెంట్‌లు:

  1. కందం
    ఆపద మ్రొక్కుల వాడని
    చూపుచు కడు భక్తి తోడ స్తోత్రములందున్
    పాప వినాశకుడంచును
    శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్

    ఉత్పలమాల
    ఆపదలందు గాచునని యంబుజ నేత్రుని భక్తవత్సలున్
    జూపుచు భక్తితత్పరత స్తోత్రము చేయుచు వేయినామముల్
    పాపవినాశకున్ గృపను బంచెడు వాడని శేషశాయినిన్
    శ్రీపతిఁ గాంచి యైదు పదిఁ జేతురు భక్తులు శాంతచిత్తులై!

    రిప్లయితొలగించండి
  2. చూపుము నాపై కరుణను
    తాపము నుండి యతి వడిగ దప్పించినచో
    కోపు లయిదు యిడెదనని
    శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్

    రిప్లయితొలగించండి
  3. ఆపర మాత్మకు మ్రొక్కినఁ
    బాపములే తొలగుననుచు భావింతురుగా
    చేపడు సౌభాగ్యమనుచు
    శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్


    ఆపరమాత్మ ముందు సిసులందరు నిల్తురు కేలు మోడ్చుచున్
    బాపములన్ హరింపమని భక్తులు కోరుట సాజమే కదా
    శ్రీపతిఁ గాంచి యైదు పదిఁ జేతురు భక్తులు శాంతచిత్తులై
    చేపడు గాదె సౌఖ్యములు చేతులు రెంటిని జోడగించినన్

    రిప్లయితొలగించండి
  4. కం॥
    క్యూపాటోపగ లేకన్,
    చాపిన బేక్దర్శనమ్ము సైపగలేకన్,
    కోపమ్ముప్పిరిగొన్నన్-
    శ్రీపతిఁగని యైదుపదిగఁజేతురు భక్తుల్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దయచేసి రెండవ పాదములో "బ్రేక్దర్శనమ్ము" అని చదువుకొన ప్రార్థన. టైపాటు క్షమించండి

      తొలగించండి
  5. -
    పాపము నిలబడి నిలబడి
    శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్,
    యోపిక తగ్గిన శోషని
    తాపసులకు తగ్గనట్లు ధరణిని సుదతీ




    రిప్లయితొలగించండి
  6. ఆపద మొక్కులవాడా
    పాపవిమోచక తిరుమలవాసా మాకున్
    నీపదములె దిక్కనుచును
    శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్

    రిప్లయితొలగించండి
  7. ఆపద మొక్కులందుకొని యాప్తునివోలె సమాదరింపగన్,
    పాపవిమోచనార్థము, నివారణ సల్పఁగ దెప్పరమ్ములన్
    శ్రీపతి సన్నిధానమున చిత్తములందున భక్తి నిల్పి యా
    శ్రీపతిఁ గాంచి యైదు పదిఁ జేతురు భక్తులు శాంతచిత్తులై

    రిప్లయితొలగించండి
  8. ఆపరదైవముమహిమల్
    ఓపదివేమార్లుదలచి ఉత్సాహముగన్
    శ్రీపదదక్షిణరుసుమున
    శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్

    రిప్లయితొలగించండి
  9. కాపుగ‌ నిల్చు‌ దైవమును‌ కష్టము‌ నష్టము‌ తీర్చువేల్పుగా
    చూపును‌ మంచిమార్గమును‌ సూటిగ నమ్ముచు‌ కొల్చువారికిన్‌
    చాపుచు‌ చేతులన్‌ పరమ‌ శ్రద్ధగ‌ నమ్ముచు‌ కొండకెక్కుచున్‌
    శ్రీపతిఁ గాంచి యైదు పదిఁ జేతురు భక్తులు శాంతచిత్తులై”

    రిప్లయితొలగించండి
  10. కం:ఆ పరమేశ్వరు కొరకై
    ఏ పసిడిని, సొమ్ము లీయ రే! లింగముపై
    నే పాలు పోసి, నగలను
    శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్”

    రిప్లయితొలగించండి
  11. (2)ఉ:ఆ పరమేశ్వరుండు కొలు వైనను దగ్గర కాళహస్తిలో,
    నే పది లక్షలో యిడగ నేరికి ప్రాణము లొప్పవయ్యె ,యా
    తాపసి నెత్తిపైన జలధారయె చాలని భూషణమ్ములన్
    శ్రీపతిఁ గాంచి యైదు పదిఁ జేతురు భక్తులు శాంతచిత్తులై
    (తిరుపతికి దగ్గర లోనే శ్రీకాళహస్తి ఉంది కానీ ఆ శివుడికి జనం పెద్దగా సొమ్ములు నగలు ఇవ్వరు. వైభవ మంతా తిరుపతి వేంకటేశ్వరునికే.శివునికి అభిషేకం చాలు అనుకుంటారు.)

    రిప్లయితొలగించండి
  12. దీపమ్ములు సద్భక్తిని
    ధూపమ్ములఁ జూపి యతి మృదు మధుర సరణిం
    బాపక్షయ కీర్తనములు
    శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేయరె భక్తుల్


    తాపము వీడి నిగ్రహము తద్దయు నిష్ఠ వహించి యాత్మలోఁ
    బాప వినాశ నార్థ మిల భక్తినిఁ బన్నుగఁ జేయ నొప్పు నో
    పాప దశోపచారములు పంచ మహాగ్నులు సంతతమ్మునున్
    శ్రీపతిఁ గాంచి యైదు పదిఁ జేయరె భక్తులు శాంతచిత్తులై

    రిప్లయితొలగించండి
  13. ప్రాపు గ నుండీయు మాదగు
    నాపద బో ద్రో లు మంచు నార్తి గ వేడ న్
    దాపుకు జేరియు మ్రొ క్కుచు
    శ్రీపతి గని యైదు పదిగ జేతు రు భక్తుల్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఆపదల గాచు దొరవని
    నీ పద పద్మముల పూజ నిరతము చేయన్
    పాపములను బాపుమనుచు
    శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్.

    రిప్లయితొలగించండి
  15. (నిన్న పొరపాటున కం॥ 3వ పాదము తప్పు వ్రాసానండి. అది తిద్ది మరలా పెడుతున్నాను)

    కం॥ ఓపిక మీరఁగఁ జేయఁగ
    నాపద మ్రొక్కుల మనుజులు ననిశము చనరే!
    తాపముఁ దీర్చునని తలఁచి
    శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేయరె భక్తుల్

    ఉ॥ ఆపద మ్రొక్కులన్ మిగుల హార్దము మీరఁగఁ జేయనెంచఁగా
    నోపిక మీర వేడరొకొ యోర్మినిఁ జూపి గణింతురే జనుల్!
    తాపముఁ దీర్చు వాని కడ ధన్యత నొందఁగఁ దత్పరాఢ్యులై
    శ్రీపతిఁ గాంచి యైదు పదిఁ జేయరె భక్తులు శాంతచిత్తులై

    క్షమించాలి కొందరు నాకు చేతు ప్రయోగము సాధువు కాదని తెలిపినందున చేయు చేసానండి. సాధు ప్రయోగము ఔనో కాదో తెలియ జేయ వినతి.

    రిప్లయితొలగించండి
  16. ఆపద మ్రొక్కులవానిని
    బాపుము దుఃఖముల టంచు ప్రార్థన చేయన్
    నాపదలు తొలగ మ్రొక్కులు
    *శ్రీపతి గని యైదు పదిగజేతురు భక్తుల్*

    దీపము నింటపెట్టచును దేవుని కెల్లరు మ్రొక్కుచున్సదా
    యాపకకీర్తనమ్ములనుహర్షముతోడనునాలపించుచున్
    తాపములెల్లబాపి వడిదారినిచూపుమటంచుభక్తితో
    *శ్రీపతి గాంచి రైదుపది జేతురు భక్తులు శాంతచిత్తులై*

    రిప్లయితొలగించండి